దొస్తోయెవ్‍స్కీ ప్రధానజీవితదర్శనం బాధ్యతారహితనిశ్చేష్టతను, హేతువాదస్వర్గాన్ని, వ్యతిరేకిస్తుంది. రెండు రెళ్ళు నాలుగే. నిజమే. కాని రెండు రెళ్ళు అయిదు అనే స్వేచ్ఛ నీకు లేదని ఎందుకు అనుకుంటావు? విధినిర్ణయం జరిగిపోయింది. నిజమే, కాని దాని అర్థం నీ బాధ్యత లేదని కాదు.
ఫిబ్రవరి 2025
డిసెంబరు జనవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో జరిగే పుస్తక ప్రదర్శనలు తెలుగు సాహిత్యలోకానికి అతి ముఖ్యమైన సందర్భాలుగా పరిణమిస్తున్నాయి. ఈ ప్రదర్శనలే లక్ష్యంగా పుస్తకాల చుట్టూ చర్చలు, పోటీలు, ఆవిష్కరణలు, అమ్మకాలు అక్టోబరు నుండి ఊపందుకుంటున్నాయి. వీటి తీరు ఎలా ఉందో సోషల్ మీడియా చూపెడుతూనే ఉంది. ఈ ఏడు స్పష్టంగా కనపడ్డ ఒక పోకడ – సమీక్షలను, విమర్శలను వెనకకు తోసి ముందుమాటలు, బ్లర్బ్లు పుస్తక ప్రచారంలో ముందుకు రావడం. కథలు, కవిత్వాలు, వ్యాసాలు – సాహిత్య ప్రక్రియ ఏదైనా వాటి నిండా ప్రచారమే లక్ష్యంగా రాయించుకున్న వెగటొచ్చే పొగడ్తల గుమ్మరింపు. ఆ లక్ష్యమూ వికటించి ప్రమాదకరంగా మారిన సంఘటనలూ ఇటీవల కొన్ని చోటు చేసుకున్నాయి. దీనివల్ల ప్రధానంగా కొన్ని సమస్యలు కనపడుతున్నాయి. ఒకటి, విమర్శకులు ఈ అనవసర పొగడ్తలతో వాళ్ళ మీది నమ్మకాన్ని, గౌరవాన్నీ పోగొట్టుకోవడం. రెండు, రచనలు అర్హతతో నిమిత్తం లేకుండా పొగడబడి, రచయితలకు వాళ్ళ రచన స్థాయి అర్థం కాకుండా పోవడం. మూడవది, అతి ముఖ్యమైనది, వీటివల్ల పాఠకులు మోసపోవడం. సాహిత్యం ఈ చిన్న చిన్న విషయాలుగా కనపడే చర్యలతో ఎంత కలుషితం అవుతోందన్నది వీటన్నిటికంటే పెద్ద చర్చ. సాహిత్యం సృజన, కానీ పుస్తకం వస్తువు కాబట్టి అమ్ముడుపోయేందుకు కొంత ప్రచారం తప్పనిసరి. కాని, రచయితలు తమ సాహిత్య స్థాయి, లేమి తెలుసుకోకుండా, తమ వ్యాసంగాన్ని మెరుగుపరుచుకోవడం పట్ల కనీస దృష్టి లేకుండా – తమను ఆకాశానికెత్తి, పాఠకులను పెడదోవ పెట్టించే బ్లర్బ్లు, ముందుమాటల కోసమే తాపత్రయపడటం మంచి ధోరణి కాదు. చేతిలో కొన్ని డబ్బులు, ప్రచురణకు అవసరమైన వనరులు, స్నేహాలు, ఆవిష్కరణకు కావలసిన హంగులు – ఈ అర్హతలతో మాత్రమే పుస్తకాలు వస్తూండడం చాలా నిరాశాజనకమైన వాస్తవం. కాస్త డబ్బుంటే చాలు, ఒక పుస్తకం ఒకరి పేరు మీద అచ్చోసుకొని బయటకు వస్తుంది. దానికదే గర్వపడాల్సిన విషయం కాదు. ఏ ప్రత్యేకతా లేని ఏ రాతలనైనా సాహిత్యమనే పేరు పెట్టి పుస్తక ప్రదర్శనల్లోకి తెస్తే, కాదనేందుకూ ఏమీ లేదు. అవి ఎంత అసంబద్ధంగా ఉన్నా, జవాబుదారీతనం లేని మనుషుల మధ్యలో అవలా గిరికీలు కొడతాయే తప్ప ఆగిపోవు. వీటన్నిటికీ ‘గుర్తింపు’ అనే సామాజిక అవసరమే మూలకారణం. కవి, రచయితలుగా పేరు తెచ్చుకోవాలన్న కోరిక, ఆ రకంగా ఏదో ఒక బృందంలో చేరిక, పరస్పర పొగడ్తలు – కనీసార్హతను ఆశించే ఇతర కళలు ఇందుకు ఈ స్థాయిలో ఆస్కారం ఇవ్వవు కాబట్టి, సాహిత్యం. అక్షరాలకు నోరుండదు. మాకిలా ఉండటం ఇష్టం లేదని అవి చెప్పలేవు. రచయితకు పుస్తక ప్రచురణ అభిలాష మాత్రమే కాకూడదు, అదొక బాధ్యత. రచనను నిరాపేక్షగా బేరీజు వేసుకోవలసిన బాధ్యత. ‘నాదైన అనుభూతి నాదిగాన’ అనుకునే ముందు, ఆ అనుభూతిని తనదైన త్రాసులోనైనా ఒక్కసారైనా తరచి చూసుకోవలసిన బాధ్యత. తన పుస్తకం పట్ల నిజాయితీతో కూడిన నలుగురి అభిప్రాయాలను ఏ అడ్డూ చెప్పకుండా స్వీకరించి నేర్చుకోవలసిన బాధ్యత. సమాజంలో ఏదో ఒకరకంగా గుర్తింపు మాత్రమే ఆశించే రచయితలు స్తుతివాక్యాలు కాక విమర్శ ఎలా తీసుకోగలరు? సాహిత్య నాణ్యతతో మాత్రమే తమ పుస్తకాన్ని ఎలా అమ్ముకోగలరు? పాఠకులను మెప్పించగలరు? లేరు. ఈ సాహిత్యవంచనలో మోసపోకుండా ఉండాలంటే ఇప్పుడు పాఠకలోకానికి ఉన్నవి రెండే మార్గాలు: ఒకటి, కొత్త పుస్తకాలను కొనుక్కొనే ముందు, కవి రచయితలు కాని సాటి పాఠకుల నిజాయితీ సమీక్షలకోసం చూడటం. రెండు, ఒకవేళ కొంటే ఎవ్వరి అభిప్రాయాల మీదా ఆధారపడకుండా తమకు తామే పుస్తకం చదివేదాకా పుస్తకం పట్ల ఏ అంచనాలూ లేకుండా జాగ్రత్తపడటం.
బాల్యం గురించి ‘నా చిన్నప్పుడు’ అని ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నాకు బహుశా అది ‘నిస్సహాయత’గా వినిపిస్తుంది. యవ్వనపు రోజుల్ని తలచుకుంటే మోసిన బరువులు, ఈదేసిన బాధ్యతలు మాత్రమే జ్ఞప్తికి వస్తాయి. ‘ఆ రోజులే వేరు’ అని ఏ రోజు గురించీ అనుకోబుద్ది కాదు. ఇన్ని మైలురాళ్ళూ దాటాక సాధించిన విజయం ఏమిటంటే ‘అబ్బా, ఇదంతా ఈ క్షణంలో ముగిసిపోతే బావుండు’ అనిపించకపోవడం.
నిత్యజీవితంలో మనం చూసేదీ పాల్గొనేదీ ఎడతెగని పరుగుల ప్రక్రియలో. చేయవలసిన పనులు, వాటి గడువులు, టార్గెట్లు, ఎపాయింట్‌మెంట్లు – పరుగులే పరుగులు. ఇష్టమున్నా లేకపోయిన ఆ బాణీ కార్యకలాపాలలోకి అడుగు పెట్టినపుడు మన సమయం మన చేతుల్లోంచి జారిపోతుంది. నిలబడి, స్థిరంగా ఆలోచించి ముందుకు సాగే అవకాశం కోల్పోతాం.
ఓ పెద్ద ఇంటి ముందు ఆపింది నీరూ తన ఆడీ కార్‌ని. ఆ ఇంటి గేటు మూసుంది. దానికో మూలగా ఉన్న బల్ల మీద కూర్చుని తల మొబైల్లో దూర్చి తనలోతను నవ్వుకుంటున్నాడా ఇంటి వాచ్‍మన్. నీరూ గేటుకెదురుగా ఉందని గమనించే పరిస్థితిలో లేడు. హారన్ కొట్టింది గట్టిగా. ఉలిక్కిపడి పైకి లేచాడు. ఓ చేత్తో సెల్యూట్ పెడుతూ, ఇంకో చేత్తో తలుపు నెట్టుకుంటూ మరో పక్కకి పోయాడు. వాడిని కళ్ళతోనే కాల్చేస్తూ లోపలికెళ్ళింది నీరూ.
ఆశ్రమానికి చెందిన ఒక పెద్దాయన వచ్చి యువరాజ్ భుజాలను తాకి, “రాజా సార్” అని పిలిచారు. యువరాజ్ మేల్కొని లేచి, ఏమీ అర్థం కానివాడిలా ఆయన్ను, రమణుల చిత్రపటాన్ని చూశారు. దీర్ఘ నిశ్వాసంతో తన కళ్ళను, చెంపలను తుడుచుకొంటూ, పైకి లేచి తన జుబ్బాను కిందకు లాగి సర్దుకున్నారు. ఆయన ముఖం తేటపడింది. రమణులను చూసినప్పుడు ఆయన ముఖంలో సన్నని చిరునవ్వు మొలకెత్తింది.
మొన్నటికి మొన్న, రెండు నెలలైనా తిరగలేదు, వాళ్ళు దయ్యాల గురించి మాటలాడుకున్నారు. సాధారణంగా సమావేశాల్లో బంకు బాబు నోరు విప్పేవాడు కాదు. ఆ రోజు ఏమయిందోగాని, నోరు తెరిచి ‘నాకు దయ్యాలంటే భయం లేదు’ అన్నాడు. అంతే! అది చాలు, తక్కిన వాళ్ళకి బంగారం లాంటి అవకాశం దొరికింది. రాత్రి అతను ఇంటికి తిరిగి వెళుతుంటే అతని మీద ఒక దయ్యం దాడి చేసింది. పాపం అతనికి గాయాలయ్యాయి.
ఈ సందర్భంలో గతంలో జరిగిన ఒక హృదయ విదారకమైన సంఘటనని మన దృష్టికోణంలో పెట్టుకోవడం అప్రస్తుతం కాదు. వేవిళ్ళతో బాధపడే గర్భిణులకి ఉపశమనం కలిగించడానికి 1950, 1960 దశకాలలో థాలిడొమైడ్ అనే మందు వాడడం వల్ల దరిదాపు 10,000 మంది పిల్లలు వికలాంగులుగా పుట్టేరు.
భావనాబలం, సంకల్పం ఉంటే హిందూ జాతి గొప్పదిగా అవతరిస్తుoది అని గోల్వాల్కర్ అంటాడు. అదే భావనాబలంతో క్రైస్తవులు ముస్లింలు తమ జాతి గొప్పదని చాటుకోవచ్చు కదా అని నిలదీస్తాడు కరపాత్ర స్వామి. హిందుత్వకి అనుగుణంగా భారతీయ తత్వాన్ని ఆలోచనలని వక్రీకరించడాన్నీ తీవ్రంగా ఖండిస్తాడు. నిత్య అనిత్య వస్తు వివేకం అనే శంకర అద్వైత భావనని హిందూ సమాజ పరంగా అన్వయిస్తాడు గోల్వాల్కర్.
కర్రలకి నిలేసిన వేట తుపాకీ.
నిప్పుల్లో కాల్చుకునే, కాచుకునే, కాళ్ళు.
తుపాకి, గుహ, కొండ, అడవి, జత.
వెలవెల పోయిన కంబళ్ళు, వదిలేసిన టోపీలు, రెండు తోలు బూట్ల జతలు.
మంచి చలిలో…
ఇంటినానుకొని ఉన్న చెట్టు
ఇంటితో గుసగుసగా
ఇలా చెప్పింది
“ఇద్దరు మనుషులు కలిసినప్పుడు
ఆత్మీయంగా మాట్లాడుకునే మాటల్లోంచి
నాకు సంగీతం వినిపిస్తుంది. మరి నీకు?”
జ్ఞాపకాల కొమ్మపై
సీతాకోక చిలుక
బరువుగా ఊగుతోంది
పాడుబడిన గోడలపై
బల్లి ఎగర్లేక,
నిస్సత్తువగా డేకుతోంది
మధ్యాహ్నం ఎండలో కమిలిన నిన్ను పైటచెంగుతో తుడిచి గ్లాసుడు నీళ్ళిచ్చే ఆదరువు. ఎడా పెడా తుఫాన్ల బారినపడే నీ ఒంటిని తడిమి నిన్ను తిరిగి మనిషిని చేసే భరోసా. దిగంతాల కలగా చెదిరిన నాన్నను కంట్లో దాచుకుని నీ తలపై గొడుగులా అల్లుకున్న కాంతి. అక్కడే కథలు కథలుగా ఆమె నీ పూర్వీకులను గానం చేసింది. నీ అడుగులు అక్కడే మొలిచాయి. నీ ప్రాణం అక్కడే కప్పబడి ఉంది.
నన్ను నేనెరుగనప్పుడు
నీవెక్కడుంటివో చెప్పవయ్యా!
స్వర్ణములోని వర్ణమువోలె
నాలోనే నీవుంటివిగాదా?
కంటికి పెట్టుకున్న కాటుక
ఎర్రగా ఉంటుంది
పెట్టుకున్న ఎర్ర తిలకం
నల్లగా ఉంటుంది
కుట్టేసిన పెదాలు
కిటికీలేని ఇంటిలా
మాటలు రాని సృష్టికర్తకు
తనేంటో తెలుసుకోవడానికి
నీ కడుపులో పుట్టడం వినా
మరో మార్గం లేదని!
కాంతా! నీకో రహస్యం చెప్పనా?
గుట్టు రట్టు చేయనా!
దేహాన్ని సాది
వెలిగించుకున్న చెమట దీపాన్ని
ఆర్పినా భరించాలి.
చిల్లరతో కట్టిన కోటలో
లంకె బిందెలు మొలిస్తే
రహస్యాన్ని గౌరవించాలి.
నేలమీద రాలుపూల కొలాజ్‍పై
దిష్టిచుక్కలా పడ్డ నీడ
మిణుగురు సైన్యం రాకతో
వెలుతురు నదిలా మారిన లోయ
నశ్యం పీల్చిన మబ్బుతునక తుమ్ముకి
నేల రాలిన దారిచూపే చుక్క
నాడు-
ఎందుకిలా?
అడిగిందా ఇల్లాలు
నేడు-
ఎందుకిలా?
అడిగాడతడు
నాలోలోపల నైరూప్యచిత్రంలా
మగతలో ఊపిరి కూడదీసుకుంటున్న కల
ఒంటరిపాటుకి
తేనెతుట్టెను వేలాడదీసిపోతావు
కావలి కాస్తూ కాస్తూ మైమరుపులో
వాలిపోతా నీ భుజం మీద
తెలుగు లోకం నిండా సాహిత్యం పొంగి పొర్లుతోంది. పుస్తకాలు పుట్టగొడుగుల్లా లేస్తున్నాయి ప్రతి రోజూ. రచయితలందరూ డయల్ 100 కంటే ఎక్కువగా పాఠకులకు అందుబాటులో ఉంటున్నారు. చూస్తుంటే రచయితలకు మంచి రోజులొచ్చినట్టే పైకి అనిపిస్తుంది. పాఠకుడికి గ్రహస్థితి మాత్రం బాలేదనే సంగతి మరుగున పడిపోయింది.
శిఖర, జలపాతాల వెంట తెచ్చుకున్న తాళ్ళ సాయం తప్ప సాయం లేని ప్రమాదకర ప్రాంతాల్లో సాగటం ఎలా? అందుకనే అక్కడ నిత్య ‘ట్రెకింగ్ వీరుడు’, ‘జలపాత స్వాప్నికుడు’ యక్షుడిలాగ డాక్టర్ ప్రసాద్ వంటివారు సిద్ధంగా ఉంటారట. కాలిబాటల్లో, లోయల లోతుల్లో రెల్లుపొదల స్పర్శ ‘అమ్మ తల నిమిరినట్ట’నిపి
పెళ్ళిళ్ళ నిర్ణయాలలోను, దాంపత్య జీవితాలలోను, పిల్లల పెంపకంలోనూ తరాల పరిక్రమణలో వచ్చే మార్పులు, భారతదేశంలో ఎలా వస్తున్నాయో విదేశాలలోని భారతీయ కుటుంబాలలోను అదేవిధంగా వస్తున్నాయనేది నిరూపించే ప్రయత్నం ఈ నవలలో రచయిత్రి చేసింది. కుటుంబపరమైనదే కాకుండా సాహిత్యంలో, సభలూ సమావేశాలలో, సాహితీవేత్తల మనోభావాలలోని మార్పుల్ని కూడా పట్టిచూపించే ప్రయత్నం ఉంది.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: