నిర్వహణలో పాలుపంచుకోవడం ప్రారంభించాక అధికారి మొదటిసారిగా అధికారపు రుచిని తెలుసుకుంటాడు. దాంతోపాటు ఆ అధికారం ఎలా వస్తుంది అన్నదీ కనుక్కుంటాడు. ఇంకా ఇంకా అధికారానికి వాడి మనసు ఉవ్విళ్ళూరుతుంది. అందుకోసం తనను తాను మార్చుకుంటూ పోతాడు. కొన్నేళ్ళలో వాడు అధికార వ్యవస్థలో ఉండి మిగిలినవాళ్ళలాగా మూసలోకి సరిపడేలా మారిపోతాడు. వాడు ఎంతో కాలంగా కలలుగని తెచ్చుకున్న లక్ష్యాలన్నీ ఎక్కడో తప్పిపోతాయి.

భయం పుట్టింది. నాన్న గురించి నేను మాట్లాడ్డం! ఏం మాట్లాడాలి? ఏం పొగడాలి? హడావిడిగా పైకి లేచాను. బాత్రూమ్ వైపు‌ నడిచాను. ఒంట్లో వణుకు తగ్గట్లేదు. ఓ సిగరెట్ త్వరగా‌ రెండు పఫ్స్ తీస్కోని పడేశాను. వాష్ బేసిన్‌ దగ్గర మొహం కడుక్కొని ఇంకో పాకెట్లో ఉన్న చిన్న బాటిల్ కోసం వెతికాను. అది దొరకలేదు. టెన్షన్ ఎక్కువైంది. “ఎక్కడైనా పడేశానా? ఇంట్లో వాడాను, పాకెట్లో పెట్టుకున్నట్టే గుర్తు. బైటికెళ్ళి వెతికే టైం లేదు. అది లేకపోతే…”

భయ్యావత్ సంగతేమోకాని, చూస్తున్న మాకు చిరుచెమటలు పడుతున్నాయి. ఆ పని మేం చెయ్యనందుకు ఒక రకంగా అవమానంగానూ ఉంది. ఈ పీపీ రేపట్నుంచీ పోజు కొట్టచ్చు. అసలే కొంత పొగరున్న యూపీ ‘జాట్’. ఉన్నట్టుండి మోకు ‘చిరచిర’మంది. మరుక్షణం పుటుక్కున తెగింది. మేమూ, మాతోబాటు భయ్యావత్ కూడా ఫ్రీజ్! మొహంలో భయం – ముప్ఫయ్ అడుగుల ఎత్తునుంచి పీపీ సింగ్ పిండి బస్తాలా పడిపోతున్నాడు, చేతులు గాల్లో నిరర్ధకంగా ఆడిస్తూ.

“ఈ గీరమనిషికి నా కూతురినిచ్చి పెళ్ళి చేస్తాననుకుంటున్నట్టుంది. దీని ఆశ మండిపోనూ! ఈసారి మళ్ళా రెండేళ్ళయేసరికి మనల్ని ఉద్ధరించడానికి వేంచేస్తుందిగా మహారాణీగారు! అప్పుడు చెప్పేస్తా. మా అమ్మాయి ఇంకా చదువుకుంటోందీ, అప్పుడే పెళ్ళేఁవిటీ? మా ఆయన దానికి పెద్ద పెద్ద చదువులు చదివిపిస్తా మంటున్నారూ అని చెప్పేస్తా!” అంది.

ఆమె దృష్టిలో తను పెళ్ళికి, పిల్లల్ని పెంచడానికీ పుట్టిన స్త్రీ కాదు. తనకు ఇంకా ఏదో కావాలి. అదేమిటో ఆమెకీ తెలీదు. భర్తను వివాహం చేసుకున్నపుడు అతనితో ప్రేమగానే ఉంది. కానీ అది తన కర్తవ్యంలో భాగం. అందులో ఎలాంటి ఉద్వేగం లేదు. తన సంచలనం ఆమెకు అర్థం కాకపోయినా తనలో ఏదో మార్పు వచ్చిందని గ్రహిస్తుంది.

ఒకే ఒక్కరోజులో మేమంతా నాగరికత నిండిన మరాకేష్‌ నుంచి గంటన్నర దూరం ప్రయాణించి నగరంతో ఏ మాత్రం పోలికలేని కొండచరియల్లో వేలాడే బెర్బర్‌ గ్రామాలను, సారవంతమైన లోయలను, హిమ శిఖరాలను, నిర్జీవపుటెడారులనూ చూడగలిగామన్నది విస్మయ పరిచే విషయం.

రావణుడు కోరినట్టే, వారిద్దరూ, అతని అతిథిగా కొన్ని దినాలపాటు రాజమందిరాలలో ఉన్నారు. కరువుతీరా సంగీత కళ, సంగీత శాస్త్రము, ఇతర శాస్త్రములు, సముద్రంపై వారధులు ఎలా నిర్మించటం, ఎక్కువమంది ఎక్కగలిగే ఓడలు, విమానాలెలా తయారు చెయ్యటం, సంహిత వంటి సంగీత, సందేశ సాధనాలు ఇంకా చిత్ర శక్తులతో అందరికీ ఎలా అందించటం, అంతరిక్షం లోని గ్రహాలలోకి జనుల ప్రయాణాల వంటి -విషయచర్చలు రోజూ జరిగాయి.

మా యజమాని తన స్వహస్తాలతో ఒక ఉద్యోగికి ఉద్వాసన చెప్పే అవకాశం పోయినందుకు తెగ విచారించి, తనకు తానై తన పత్రిక నుండి ఒక మనిషి అలా వెళ్ళిపోగలిగే స్వతంత్రాన్ని భరించలేక, నా కోసం కబురు పంపి బోలెడంత భవిష్యత్తు ఉన్న నేను అంత మూర్ఖంగా ఉండకూడదని నచ్చచెప్పడానికి ఎంతగానో ప్రయత్నించాడు.

ఆకాశంలో నిదానంగా తేలియాడుతున్న పక్షిలా
నా ముందు కదలాడే వాడు.
వాడు-కొబ్బరికాయలోని తీయటి నీటిలా
తాటికాయలోని తెల్లని ముంజలా
మొగలి పొదలోని లేత మొవ్వులా
నన్ను మృదువుగా స్పృశించేవాడు.

పిట్ట పుల్లలేరుకుని గూడు చేసినట్టు
పద్యాన్ని అల్లుకుంటాను

సోకైన వాక్యాలు
పగలన్నా దొరుకుతాయి
చీమూ నెత్తురున్న వాక్యాల కోసం 
రాత్రులను కాల్చుకుతింటాను

లైట్స్!
బట్ లైట్స్ నెవర్ గైడ్ యు హోమ్.
చీకటితో కాదు ఇబ్బంది
వెలుగుని వీపునేసుకుని వీచేదే కనుక.
ఇబ్బందంతా
నీకు-నాకు మధ్యన.

చెట్టుపైకి వొంగి, చెమ్మగిల్లిన నింగి –
రాలిపోతున్న పసుపు
వేపాకులు. పాలిపోయిన ఆ కాంతిలో

చెట్టు బెరడుని గీకుతూ, గుర్రుమనే పిల్లులు –
కంపించే నీడలు –
అక్కడక్కడా పిల్లలు వొదిలి వేసిన

పగిలిన బొమ్మలు. అద్దం పెంకులూ –

ఏ ఔషధీ అరణ్యాల నుండో
తనని తాను నింపుకొచ్చి
కొన్ని ఊపిరుల స్పర్శ కోసం
అన్ని అస్తిత్వాల సాంద్రతని నింపుకుని
తనని తాను ఉగ్గబట్టుకుంటూ
ఈ గాలి చేసే జాగరణ ఉంది చూశావూ…

ఊరికే రావా జీవితంలోకి
సీతాకోకలా, ఉదయపు నీరెండలా,
నక్షత్రాల కాంతిలా, ఉత్తప్రేమలా

వచ్చి, వెళ్ళవా నాలోకి
వానగాలిలా, పసినవ్వులా

తీసుకుపోవా ఊరికే నీ లోకానికి

మొదటిసారి
వాడిని చూశాను

పూలను సీతాకోకలను
వెన్నెలను నక్షత్రాలను
కళ్ళలోకి ఒంపుకుంటూ
కేరింతలు కొడుతున్నాడు

నాగరిక సమాజంలో పిల్లలతో సహా అందరి నోటిలో నానే మాటలని సందర్భానికి తగ్గట్టు ఒడుపుగా వాడుకుని తన పరవశ సంకలనంలో మానస, పాతమాటల్నే హైకూలంత పొదుపుగా వాడుకుని నది వెంట నేను సంకలనంలో వసుధారాణీ చక్కని కవిత్వాన్ని అందించారు.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: