కార్తహేన పాతపట్నపు సందుగొందుల్లో మనసుతీరా తిరుగుతున్నప్పుడు ఓ పందిరి బాట, దిగువన బారులు తీరి ఉన్న చిరుదుకాణాలు కనిపించాయి. అందులో ఒక దానిలో కొకాదాస్ బ్లాంకాస్ అన్న మిఠాయిని అమ్ముతున్నారు. తురిమిన కొబ్బరిని రంగురంగుల తియ్యటి పాకంలో ఉడికించి చేస్తోన్న మిఠాయి అది.

రాత్రి పడుకున్నప్పుడు మంచాలను ఎత్తి, అందరూ కిందే చాపలు పరుచుకుని పడుకున్నారు. ఉన్న ఒంటి పరుపును మాత్రం ఒకవైపు వేశారు. ఆ సాకుగా బుజ్జిదీ, పిల్లాడూ అందులో పడుకునేట్టుగా; తనూ, భార్యా పక్కపక్కనే ఉండేట్టుగా ఎత్తువేశాడు రాజారామ్‌. తల్లి ముందటింట్లో మంచం వేసుకుంది. చాలా రోజుల దూరం కాబట్టి, అతడికి ఆత్రంగానే ఉంది. కానీ భార్య పడనియ్యలేదు. బుజ్జిదాన్ని పక్కలో వేసుకుని పడుకుంది.

తాణప్పన్న, లీలక్కతో మాట్లాడుతున్నప్పుడు లీలక్క నాలుగు దిక్కులూ చూడ్డం, అప్పుడప్పుడు ఫక్కుమని నవ్వడం, తలొంచుకోడం నిన్న వాళ్ళు గుడికి వెళ్ళేప్పుడు చూశాను. కప్పకళ్ళోడు “తెలిసిందిలే నెలరాజా…” అని పాడుకుంటూ కొబ్బరి చెట్టెక్కాడు. నన్ను చూసి కన్నుకొట్టాడు. అణంజి వంగి తాణప్పన్నను పరీక్షగా చూసింది. చేత్తో అతని లుంగీ పక్కకు తీసి చూసింది. నేను చేతులడ్డం పెట్టుకుని నవ్వాను. “ఏందా నవ్వు? విత్తనం సత్తువ చూడాలిగా!” అంది అణంజి.

ఆమె ఇంటికి తరచు వెళ్ళడం అలవాటైంది. ఉండేకొద్దీ ఆమెతో కాసేపు గడిపిరావడం బాగా అనిపించేది. అప్పుడప్పుడు తెలీసీ తెలీనట్లు ఆమె చేతివేళ్ళను తాకడం, భుజాన్ని తడుతూ మాట్లాడటం జరుగుతుండేది. అదేదో కావాలని చేసినట్లు కాదు కానీ అలా అవుతుండేది. ఆ మొక్కల మధ్య ఇల్లు అరణ్యంలో ఇల్లులా ఉండేది. అక్కడికి వచ్చినప్పుడు నా ఉనికి ఆ మొక్కలకి నచ్చనట్లు అనిపించేది. అప్పుడప్పుడు ఊపిరాడనట్లు అనిపించేది.

ఇక్కడ ఋతువులు మారుతుంటే, చరాచర జీవరాశి మొత్తం దాంట్లో భాగమవుతుంది. సడన్‌గా చీర మార్చుకునే తెలుగు సినిమా హీరోయిన్‌లా ప్రకృతి రంగులు మార్చుకుంటుంది. పక్షుల కిలకిలారావాలు మారతాయి. సూర్యుడి వేళలు మారతాయి. ఇంతెందుకు సంవత్సరానికి రెండు సార్లు గడియారంలో సమయం కూడా మార్చుకోవాలి. కొత్త బట్టలు రోడ్డెక్కుతాయి. సెలవులకి పిల్లల కేరింతలు మార్మోగుతాయి. ఇండియాలో అయితే ఉష్ణోగ్రత, కరెంట్ బిల్లు మార్పు డామినేట్ చేస్తాయి.

ఒక వేళ రాకపోతే? అప్పుడు తానే పిలవవలెనా అస్పష్ట సమాధానము భయంకరమై ఉండెను. గౌరవ భంగమని పిలవడము వీలు కాదు. అట్లని ఒకతే పండుకోవడమూ సాధ్యం కాదు. వస్తున్న నొప్పులు ఒక్కోసారి ఆమె నిశ్చయాన్ని సడలిస్తుండెను. ధైర్యమును జారుస్తుండెను. ‘థూ, పాడునొప్పి’ అనుకుంటుండగానే నొప్పి తగ్గి ముందు ముందు తాను ఎదుర్కోవలసిన దృశ్యమును కల్పించుకొన్నప్పుడు వళ్ళంతా సిగ్గుతో ముడుచుకుని పోయెను.

ఈ అపార్టుమెంటు బ్లాకులోనే ఓ ప్లాటులో ఆయన చాలా కాలంగా అద్దెకి ఉన్నారు. ఆయన గురించి పనిమనిషి – తాను పని చేసే అందరి ఇళ్ళల్లో చెబుతూ ఉండేది. ఈ పనిమనిషిని పనిలో పెట్టుకోవడానికి ముందు ఆయన పదిమందిని మార్చారట. ఈమెకి ఆయన గురించి చెప్పినతను – ఆయన చాదస్తం గురించి కూడా చెప్పాడట. కానీ ఆమెకు పని అవసరం, పైగా దాసుగారు కూడా తరచూ పనిమనుషులను మార్చి విసిగిపోయారు.

లక్షల సంవత్సరాలపాటు తీపి వస్తువు అంటే విషవస్తువు కాదు అని ఎరిగిన మానవులు, ఈ మధ్య కాలంలో అసలు ఒక పదార్థం తియ్యగా ఉండటానికి కారణమైన వస్తువేదో కనుక్కున్నారు. దాన్నే తయారు చెయ్యడం నేర్చుకున్నారు. వంటకాల్లో అమితంగా వాడటం మొదలుపెట్టారు. మితిమీరి తిని, షుగర్ జబ్బు తెచ్చుకున్నారు.

ఇదే మనిషిలో వేరే వారిని చూపించమని
అడగలేకపోయినందుకు ఆమె విచారిస్తుంది
ఇదే తరహాలో వేరే మనిషిని చూపించమని
అడగలేకపోయినందుకు కూడా ఆమె చింతిస్తుంది

స్నేహితులుగానో
రక్తబంధాలుగానో
ఆఖరికి శత్రువుగానో
ఎప్పుడో అప్పుడు
ఎక్కడో అక్కడ
పెదవులపై పేరై వెలుగుతారు
మాటల్లో నలుగుతారు

చూరునుంచి జారుతూ
మత్తుగా నానుడు వాన
కురవదు నిలవదు
నానిన గడ్డి వాసన
ఎవరిదో పిలుపు
పలకలేని మొద్దుతనం

ఆ నది ముందున్న చెట్టు మీద
వాన చినుకులా వాలిన పిట్ట
గాథా సప్త శతిలా ధ్వనిస్తోంది

కూత కూతకి గొంతు
సానబెట్టిన కత్తి అంచులా
మోగుతోంది

కరుణశ్రీకి దక్కిన అరుదైన అదృష్టం ఘంటసాల తొలినాళ్ళలో కొన్ని ఖండికలని పాడి రికార్డులుగా విడుదల చెయ్యటం. అలా ఘంటసాల మధురగంభీర గళంలో ఉదయశ్రీ పద్యాలు తెలుగునాట మారుమోగాయి. ముఖ్యంగా పుష్పవిలాపం, కుంతీకుమారి, వినని తెలుగువారు అప్పట్లో లేరు. ఉదయశ్రీ పద్యాలు ఘంటసాలకి పేరు తెచ్చాయా, లేక ఘంటసాల గానం ఉదయశ్రీకి గుర్తింపు తెచ్చిందా అనేది సహేతుకమైన ప్రశ్న.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: