ఒక రచయిత తన రచనకు గ్రహించిన మూలాన్ని–అది చరిత్ర గాని పురాణం గాని–తన రచనకు అవసరమైన విధంగా మార్చుకోడంలో విశేషం లేదు. షేక్స్‌పియర్ చరిత్రను మార్చడమే కాదు, ఆ చరిత్రను తన వ్యక్తిజీవనావసరాలకు అనుగుణంగా మార్చుకున్నాడు. ఇది కూడా విశేషమేమీ కాదు. విశేషమేమంటే, ఆ అవసరాలు నాటకంలో తొంగికూడా చూడలేనంతగా కథను కళగా మలచుకోవడం.
మార్చ్ 2021
తెలుగులో ఒక కవితను కాని, కావ్యాన్ని కానీ ఎలా చదవాలో చెప్పేవాళ్ళు మన సాహిత్యసమాజంలో లేరు. ఒక పుస్తకాన్ని ఎందుకు చదవాలో కారణాలు చెప్పమని అడిగితే, దాన్ని అవమానమనుకునే వాతావరణం నుండి సాహిత్యకారులు ఎడంగా జరిగినదెన్నడూ లేదు. ఒక కవిని, కావ్యాన్ని చదవకపోతే, మన జ్ఞానంలో పూడ్చుకోలేని లోటుగా ఏదో మిగిలిపోతుందని బలంగా వివరించి చెప్పగల ధైర్యవంతులు లేరు. భాష, చరిత్ర, సాహిత్యం, విమర్శ–వీటి అవసరమేమిటో, కాలానుగుణంగా వాటికి తగ్గట్టు పాఠకుడిని సన్నద్ధం చెయ్యాల్సిందెవరో మన ఆలోచనలకు అందదు. వాటికి సంబంధించిన కనీస అవగాహన, ఆయా రంగాల్లో కృషి చేస్తున్నామని రొమ్ము విరుచుకునేవారిలో కూడా కనపడదు. ఇలాంటి వాతావరణం నుంచి తప్పించి, తన లోతైన పరిశోధనలతోను, సూక్ష్మమైన పరిశీలనలతోను, బలమైన ప్రతిపాదనలతోనూ తెలుగు సాహిత్యానికి చేతన తెచ్చి విశ్వవేదికన స్థానం కలిగించిన సాహితీవేత్త వెల్చేరు నారాయణరావు. తెలుగులో కవితావిప్లవాల స్వరూపాల అధ్యయనం నుంచి సాహిత్య అనువాదాలు, విశ్లేషణల దాకా విశేషంగా పరిశ్రమించి, శోధించి వెలువరించిన వెల్చేరు సాహిత్యం పట్ల, తెలుగునాట ఈనాటికీ అనంతమైన నిశ్శబ్దం ఉంది. ఏ రంగంలోని వాళ్ళకైనా, ఎన్నేళ్ళుగానో వాళ్ళు సౌకర్యవంతంగా అనుసరిస్తున్న పద్ధతుల్లో లోపాలను ఎత్తి చూపి మార్పు అవసరమని హెచ్చరించేవారి పట్ల సుహృద్భావం ఉండదు. దానిని అడ్డుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ ఎదుటి మనిషి కృషి పట్ల నిర్లక్ష్యంగానే పరిణమిస్తాయి. రచ్చ గెలిచిన ఈ ప్రపంచస్థాయి సాహిత్యాధ్యాయి కృషికి, ఇంట దక్కిన నిరాదరణకి ఇంతకన్నా బలమైన కారణమేదీ కనపడదు. వాదభావజాలపు సంకుచిత నియమాలకు విభిన్నంగా సాహిత్యాన్ని కొత్తగా చదవడానికి, అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికీ వెల్చేరు నారాయణరావు చేసిన ప్రతిపాదనలు విప్లవాత్మకవైనవి. సశాస్త్రీయమైనవి. వాటితో ఏకీభవించగలమా లేదా అన్నది సమస్య కాదు, కాని వాటిని విస్తృతంగా అధ్యయనం చేసి విశ్లేషించవలసిన అవసరాన్ని తెలుగు సాహిత్యలోకం ప్రయత్నపూర్వకంగానే విస్మరించడం మాత్రం సాహిత్యనేరం. ఆలస్యంగానయినా, వారికి అత్యున్నత సాహితీపురస్కారమైన ఫెలోషిప్ అందించి, సాహిత్య అకాడెమీ తన బాధ్యత నిర్వర్తించింది. గౌరవాన్ని నిలుపుకుంది. కనీసం ఈ పురస్కార వార్త మిషగా అయినా, వెల్చేరు నారాయణరావు రచనలు, సిద్ధాంతాలు తెలుగునాట చర్చలోకి తేవడం, బహుశా అదీ, ఆయన కృషికి ఒక సాహిత్యసమాజంగా మనమివ్వగలిగిన అసలైన గౌరవం.
ఇలా ఒక నవలలో జాతి, సంస్కృతి, మతం వంటి విషయాలు ప్రణయజీవుల మధ్య ఇనపతెరలై నిలిచిపోవడం ఒక విలక్షణమైన రచనగా దీన్ని నిలబెడుతుంది. వివాహానికి ఇవి అడ్డమయ్యాయి కానీ ప్రేమకు మాత్రం కాదు. అందుకే అతన్ని చేసుకోలేకపోయిన కొరీన్ వివాహాన్నే మానేస్తుంది. అతనిపై దిగులుతో కృశించి, మరణిస్తుంది.
గల్ఫ్ దేశాలు మళ్ళా వెళతానా? ఎందుకు వెళ్ళనూ, తప్పకుండా వెళతాను! ఆ దారిలో అక్కడ జలరహితంగా పరచుకొన్న అనంత అరేబియా సైకత సాగరంలో గతకాలపు సాహసికులు వదిలివెళ్ళిన పాదముద్రలను వెదకడానికి వెళతాను; ఆ అడుగుల్లో నాలుగడుగులు వెయ్యడానికి వెళతాను. వెళతాను. త్వరలో వెళతాను.
ఎక్కిన వాళ్ళందరూ ఆ రైలు వాళ్ళదే అనుకుంటారు. వాళ్ళకే కాదు వాళ్ళ సామాన్లు పెట్టుకోడానికి స్థలం కోసం కొట్లాడతారు. కొంచెం స్థిరపడ్డాక కొత్తవాళ్ళు ఎక్కితే, మేము ముందే ఎక్కాం, రైలు మాది అని ఏదో అధికారం చూపే చూపులతో కాల్చేస్తారు. దిగేటప్పుడు ఒక్క నిమిషంలో అప్పటిదాకా వాళ్ళతో ప్రయాణించిన వాళ్ళందరిని ఒక్క క్షణంలో వదిలేసి గమ్యం వచ్చిందని ఆనందంగా వెళ్ళిపోతారు.
చదవడానికీ, రాయడానికీ మధ్య లింకు ఇంకా నేను కనుక్కోవలసే ఉంది. చదివితే ఆలోచన వస్తుంది. కానీ చదివినదాన్లోంచి రాదు. ఈ తేడా చాలా ముఖ్యం. ఎక్కడో ఒక కొనను పట్టుకుని పాక్కువెళ్ళడం లాంటిది. లేదా అది మనలోని నిద్రాణంగా ఉన్నదాన్ని దేన్నో తట్టిలేపుతుంది కావొచ్చు. అసలు ఏం జరిగి ఆలోచన వస్తుందో చెప్పలేం.
వచ్చినట్టే వెళ్ళిపోయింది, తన పన్నెండో ఏట, మొన్నటి ప్రేమికుల రోజున, ఎవరో పిలిచినట్టు, వచ్చిన కారణానికి పోయే ముహూర్తానికి లంకె ఏదో ఉందని తెలుపడానికి అన్నట్టు. ఆ అమ్మాయి తన స్నేహితుడితో మాట్లాడుతూ అంది, “మనవాళ్ళు చచ్చిపోవడం నన్ను పెద్ద ఇబ్బంది పెట్టే విషయమేమి కాదు ఇపుడు. సమయం వస్తే వెళ్ళిపోతారు కదా. కానీ ఇదే ఎందుకో కొత్త లోతుతో గుచ్చుకుంటోంది” అని.
ఆనుకున్న గోడ
వున్నట్టుండి కూలిపోతున్నట్టు
ఆకాశం నుంచి మనుషులు
తలక్రిందులుగా
పైకి జారిపడి భయపెడుతున్నట్టు
అంతా ప్రేమే
నువ్విచ్చినవన్నీ వద్దన్నందుకు
నా నిద్రమీద మంటేసి ఎండుచేపలు ఆరేసిన చీర కాల్చిన చప్పుడు గుండెల్లోకి తన్నుతున్నావు చూడూ అంతా అదంతా ప్రేమే.
గుణింతాలనుంచి పిళ్ళారి గీతాలదాకా
పూనిన బాలూ నుంచి పేలిన శివమణి దాకా
గ్రక్కున మింగిన మది గుక్కలనుంచీ
(సీ-తమ్మకు చేయిస్తీ చింతాకూ పతకమూ రామచంద్రా)
ప్రక్కకి పిలిచిన అన్-కోని అల దాకా…
ఉత్తర సర్కారులోని నిజాముగారి జమీందారులు చాలా దౌర్జన్యము చేసిరని పిండారీలు, మరాటీ దండ్లు దేశమును కొల్లగొట్టుచుండెనని, హైదరాబాదు రాజ్యమున ప్రతిదినము బందిపోట్లు, దొంగతనములు జరుగుచుండెనని, రోహిలాలగుంపులు, దొంగలగుంపులు గ్రామములను దోచుకొనుచుండెనని బిల్‌గ్రామీగారు తమ గ్రంథమున వ్రాసినారు.
మేనక అను ఈ ఆపెరా ఈకోవలో నేను చేసిన ఏడవరచన. ఇది మసెనే ఆపెరాకంటె అనేకవిషయములలో భిన్నముగా నున్నది. ఇతివృత్తమును భారతసంస్కృతికి అన్వయించుచు వ్రాయుటకై ఈభిన్నత్వ మవసరమైనది. అందుచే మాసినో ఆపెరాకు అనువాదముగాఁ గాక అనుసృజనగా, అనేకమైన మార్పులతో, నూతనసన్నివేశ పరికల్పనలతో చేసిన స్వతంత్రరచన యిదని గ్రహింపవలెను.
ఆ నిముషం ఎవరికీ తెలీని రసహ్యమేదో గుసగుసలాడుతూ
ఊపిరి వేగం పెంచుతున్నప్పుడు
కునుకు మరచిన రేయి లాలనగా ఊ కొడుతుంది
ఎదురుచూపులు పలవరింతలైన వేళ
ఒక సూర్యోదయం చురకలు వేస్తూ సర్ది చెబుతుంది.
వాన చివరి చెమ్మగాలివంటి నిర్వేదం
మిణుగురు చుట్టూ ముసిరిన రాత్రిలాంటి నిరాశ
దేనినీ మొదలు పెట్టనీయని, ముగించనీయని
వెలిగీ వెలగని దీపం లాంటి ఒంటరితనం
నిన్ను నీ ప్రక్క లాలనగా కూర్చోబెడతాయి
కదలని శిలగా నిలిపిన కాలాన్ని
కమ్మనికల ఒకటి నిదురగా ప్రవహింపజేసినట్టు
నైరాశ్యపు నీడన
ఎంతకీ ఎదగని ఒక చిన్నారి ఆశ
ప్రేమై చుట్టిన చేతుల గూటిలో
వటవృక్షమై విస్తరించినట్టు
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
రాజిరెడ్డి చెప్పేవాటిలో చాలా మటుకు సబ్బునురగలాంటి తేలికపాటి సంగతులే. గాలిబుడగలను చిట్లించినంత సరదాగా రాసుకొస్తాడు వాటి గురించి. ఆ సంఘటనలు అతి సామ్యానమైనవి, ఏ ప్రత్యేకతా లేనివి, అసలు చెప్పేందుకేమీ లేనివే కూడా కావచ్చు కాక. అతని మాటలనే అరువు తెచ్చుకుంటే ‘ఉత్తి శూన్యమే’. కానీ, శూన్యంలో ఏదీ లేదని ఎలా అనగలం?!
క్రితం సంచికలోని గడినుడి-52కి మొదటి ఇరవై రోజుల్లో పదముగ్గురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-52 సమాధానాలు.
సంస్కృతంలోని మాటలు తెలుగులో ఎలా మార్పు చెందుతాయో, చక్కగా స్పష్టంగా తెలుగు ఎంత భిన్నమైనదో, ఎట్లా సంస్కృత పదాలను మార్చుకుందో వివరించిన కేతన భాషా వ్యవస్థలలో మాటలు, వ్యాకరణం ఈ రెండు భాషల్లో ఎంత తేడా ఉందో నిరూపించారు.