ఒక బారక్ దగ్గర నడక వేగం తగ్గించి, వెనక్కి తిరిగి కాస్త కరుకుగా “ఏయ్, ఛుప్!” అన్నాడు లీడర్ ఉపాధ్యాయ్. చెప్పిన సమయానికి ట్రైనింగ్ రెజిమెంట్ హెడ్ క్వార్టర్స్‌కి చేరుకున్న మా చిన్న గుంపుని, మా స్క్వాడ్ చేరబోతున్న కంపెనీకి మార్చ్ చేయించి తీసుకెళ్ళే బాధ్యతని, డ్యూటీ హవల్దార్ నించి అందుకున్నవాడు మా లీడర్. అంతవరకూ తమిళంలో గుసగుసలాడుకుంటూ చిన్నగా నవ్వుకుంటున్న వాళ్ళు సైలెంటయారు. వరండాలో దర్జాగా కూర్చున్న ఒకతని ముందుకి వెళ్ళి ఎటెన్షన్లో నిలబడ్డాడు లీడర్.

మాటామంతీ లేకుండా ఎవరి మానాన వాళ్ళు అలా ఓ చోట ఎవరి గోలలో వాళ్ళుంటే నాకు నచ్చదు కాక నచ్చదు! ఒకళ్ళం కూచున్నాం అనుకో – మనలో మనం ఏదో ఆలోచిస్తూనో, ఊహించుకుంటోనో, ఏవేవో జ్ఞాపకం తెచ్చుకుంటోనో ఉంటాం. అది వేరూ! అందరూ ఒకేచోట కూచుని ఉన్నప్పుడు కబుర్లు చెప్పుకోవాలి. నవ్వాలి. నవ్వించాలి! ఏఁవిటో ఈ పెద్దవాళ్ళు!

“రండి సార్, మొత్తానికొచ్చారు ఈ పేదోడి పార్టీకి!”

“నువ్వే పేదోడంటే మనదేశం ఇప్పటికే ప్రపంచంలో నంబర్ వన్ పొసిష‌న్లో ఉన్నట్టేబ్బా!”

“బావున్నారాండీ?”

“ఆ కీర్తీ, బావుండామ్మా, మీ మ్యారేజ్ సిల్వర్ జూబిలీ అని మీ ఆయన ఓ పట్టుబడితే, కలిసి పోదామని వచ్చా.”

“థాంక్సండీ! ఈసారి ఖచ్చితంగా మేడమ్‌ని కూడా మా ఇంటికి తీసుకురావాలి మీరు.”

ప్రస్తుత మొరాకో యాత్ర నేను కోవిడ్‌ ఉపద్రవంలో ఎదుర్కొన్న కష్టనష్టాలనుంచి బయటపడటానికి బాగా ఉపకరించింది. మనసుకు ఎంతో అవసరమయిన శాంతిని ఇచ్చింది. నాలో స్ఫూర్తిని నింపింది. ప్రయాణ దాహాన్ని పునరుద్ధరించింది. గత ఆరేళ్ళలో ఇది నా మూడో మొరాకో యాత్ర. అంతా కలసి దాదాపు నెలరోజులు మొరాకోలో తిరుగాడాను. మూలమూలలూ చూశాను.

అసలు కాలేజీ చదువు చదవడమనేదే నాకు సమయం వృథా తప్పా మరేం లేదు అని నాకు అకస్మాత్తుగా అనిపించింది! నేనొక కళాకారుడిని. నావంటి వాడికి చరిత్ర, ఆర్థిక శాస్త్రం లేదా రాజనీతి శాస్త్రం చదివి ఆ పట్టా పొందడం వల్ల ఏమిటి ఉపయోగం? నిజానికి నాకు కావలసిన చదువు ఏదయినా ప్రసిద్ధ చిత్రకళా విశ్వవిద్యాలయాల నుండి పుచ్చుకోవలసిన ఫైన్ ఆర్ట్స్‌ పట్టా కదా?

గుప్పెడేసి ఉప్పు సముద్రాల్ని ఔపోసన పడుతుంటాడు వాడు
దర్జాగా అట్టహాసాలని పెట్టెల్లో నింపుకుంటుంటావు
నిత్యం జనద్వీపాలకి వారధి ఔతుంటాడు వాడు
ఎన్నో త్రాగి త్రేనుస్తావు
ఒక్క థాంక్స్‌తో వడగడుతుంటాడు వాడు

వర్ణా నది ఒడ్డున పట్నానికి దూరంగా విసిరేసినట్టు ఉంటుంది భీమా ఊరు. ఒంట్లో ఎంత బలమున్నా, అది ఆ చిన్న వూర్లో అతని కడుపు నింపలేకపోయింది. ముంబయికి వచ్చాడు. ఊరంతా గాలించినా తగిన పని దొరకలేదు. ముంబయిలో పని దొరికి, బాగా సంపాదించాలనీ, భార్యకు కాసుల పేరు చేయించాలనీ కన్న కలలు చెదిరిపోయాయి. పని మీద ఆశ వదులుకుని శివారులో ఉన్న అడవి దగ్గర ఒక చిన్న ఊరికి చేరాడు. అక్కడికి చేరాక దగ్గర్లో ఒక క్వారీలో రాయి కొట్టే పని దొరికింది.

ఈక్షణమ్మున నొక హత్య; యీ క్షణమున
మానభంగము; వికృతసమాజమందు
నీక్షణమున దారుణము లెన్నిజరు గేను
హాయిగా నున్న యీ క్షణమందు నిపుడు.
నిద్ర పట్టుచున్నది నాకు నిజముగాను.

ఒక్కోసారి పొద్దున్నే
రెప్పలచూరు పట్టుకుని
ఒక ఊహ
చినుకులా వేళ్ళాడుతుంటుంది
కిందకు జారేలోగా
ఏదో పనిశరం తగిలి
పగిలిపోతుంది

ఢిల్లీ నగరం గురించి విశేషంగా రాసి, తిరుగులేని వ్యంగ్య రచయితగా పేరు తెచ్చుకున్నా ఫిక్‍ర్‍ తౌన్‍స్వీకి సాహిత్య అవార్డులు ఏవీ రాలేదు. ఇప్పటికీ తక్కిన హిందుస్తానీ రచయితలంత విరివిగా ఆయన పేరు వినిపించదు. కానీ ఒక్కసారి అలవాటైతే మాత్రం మర్చిపోలేని చమత్కార వచనం ఆయనది. తప్పక చదవాల్సిన రచయిత. ప్రతినిత్యం వాడుకలో ఉన్న పదాలకి తనదైన శైలిలో అర్థాలు, నిర్వచనాలు ఇచ్చారు లుఘాత్-ఎ-ఫిక్రీ అనే రచనలో.

వేడి, వేడి వడి వడి అంతర్జాలంలో విర్రవీగే
సాంకేతిక విజ్ఞాన అంధకారంలో ప్రపంచం
ఒక్కుమ్మడిగా ఆంక్షలకీ, కట్టడికీ చేరాలంటే
అలోచనలకి అనేక వారాల సమయం పట్టదూ?

టోలెమీ అనే ఒకటో శతాబ్దపు శాస్త్రవేత్త తను రాసుకున్న నోట్సులో మైసోలస్ అంటే కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో పిటిడ్ర అనే వాణిజ్యం నగరం గురించి ప్రస్తావించాడు. బహుశా ఆ పిటిడ్రనే ప్రిథుండ కావచ్చు. బౌద్ద స్తూపాలు నేలలో సగం పూడ్చిన గుడ్డు ఆకారంలో ఉంటాయి. ప్రిథుండ అంటే పెద్ద గుడ్డు. అలాంటి ఓ పెద్ద స్తూపం ఉన్న నగరంగా ప్రిథుండను ఊహించాలి.

ఈ భూమిపై ఎందరో పిల్లలు ఆకలితో చనిపోతుంటే అంగారక గ్రహ యాత్ర కోసం బిలియన్ల డాలర్ల ఖర్చును నేను ఎలా సూచించగలుగుతున్నానని మీ లేఖలో అడిగారు. అయ్యో! ఆకలితో చనిపోతున్న పిల్లలున్నారని నాకు తెలీదు, ఇప్పటినుంచి మానవాళి ఈ సమస్యను పరిష్కరించే వరకు నేను అన్ని అంతరిక్ష పరిశోధనల నుంచి విరమించుకుంటాను వంటి సమాధానాలు మీరు ఆశించరని నాకు తెలుసు.

ఇందలి ఇతివృత్తము శృంగార,కరుణారస భరితమై ఇంపుగా నున్నది. దీనిని భారతసంస్కృతికి అన్వయించుకొనుటకు కొన్ని ముఖ్యమైన మార్పు లవసరమైనవి. 12వ శతాబ్దిలో జెరూసలెంవంటి క్రైస్తవపుణ్యస్థలములను పరిరక్షించుకొనుటకై అచ్చట నున్న ముస్లిముపాలకులతో మధ్యప్రాచ్యదేశములలో యూరోపియనుల కనేక మతయుద్ధములు జరిగినవి.

జ్యోతి మాసపత్రికలో 1970,80లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: