రావిపాటి త్రిపురాంతకుడు మొత్తం ఐదు విశిష్ట గ్రంథాలను ఉదాహరణము, శతకము, తారావళి, శాస్త్రకావ్యము, వీథి అన్న అయిదు విభిన్న ప్రక్రియలలో రచించినట్లు సాహితీవేత్తలు భావిస్తున్నారు.

క్వాంటం ఆవిష్కరణే ఇరవయ్యో శతాబ్దపు భౌతికశాస్త్ర పరిశోధనలన్నింటికీ మూలపునాదిగా మారి, దాని పరిణామాన్ని పూర్తిగా శాసిస్తూ వచ్చింది. ఈ ఆవిష్కరణే లేకపోతే అణువులు, పరమాణువులు, వాటి రూపాంతరాలను నియంత్రించే శక్తి ప్రక్రియల గురించిన ఒక స్పష్టమైన సిద్ధాంతాన్ని నిర్మించడం సాధ్యమయ్యేదే కాదు.

ప్రాణంలేని యంత్రాలతో నింపిన కాంక్రీటు కీకారణ్యం
కలిసున్నా కనిపించని కంచెలతో కట్టిన ఏకాంత ద్వీపం
స్మార్ట్ ఫోన్ తెరపై వెచ్చదనం వెతుక్కునే
అస్థిపంజరం!

గతంలో నాలో ఏముండేదో..
ఇప్పుడది లేని శూన్య స్థానాన్ని
శబ్ద రాహిత్యం అల్లుకుంది
ప్రేమ రాహిత్యం పట్టుకుంది
రిక్త చైతన్యం చుట్టుకుంది

తమిళ మూలంతో పాటుగా అవినేని భాస్కర్ అందించిన సంయుక్త మాయ కవితల తెలుగు అనువాదాలు. కాశీ నగరపు వీధులు, గంగానది అలలపై సాగే జీవితపు లోతులను ఈ కవితలు అన్వేషిస్తాయి.

ఇప్పటికీ ఒక నరం ఇంకా ప్లెక్ట్రమ్ కోసం
ఎదురు చూస్తూ ఆవిరినాపుకుంటూ
ఇప్పుడే ఒక తార తెగి ఆకసానికెగిసి టాటా కొడుతూ
కమాను రజను తగిలి ఖస్సుమన్న వయొలిన్

‘స్థితం’ కోరిక, ఒంటరితనం, అనుబంధం, జీవితపు అన్వేషణల మధ్య ఉండే సంక్లిష్ట సంబంధాన్ని లోతుగా ఆవిష్కరించే ఒక తాత్త్విక కథ. ఈ కథకు మూలస్తంభం అస్తిత్వపు ఆందోళన. కథానాయిక తన చుట్టూ ఉన్న సమాజం, సమాజం వేసే అంచనాలు, చివరికి తననుండి కూడా తాను పరాయీకరణకు గురైనట్లు భావిస్తుంది.

కావ్యాన్ని రచించే కవి అన్ని విధాలా రసానికి లోబడియే ఉండాలి. ఇతివృత్తంలో రసానికి అనుగుణంగా లేని స్థితి కనబడ్డప్పుడు ఆ స్థితిని భంగం చేసి అయినా సరే రసానుగుణంగా వేరే కథను సృజించాలి. కవి కేవలం ఇతివృత్తాన్ని నిర్వహిస్తే, అందువల్ల ఏ ప్రయోజనం కలగదు. నన్నయ భట్టారకుడు భారతమును రసనిర్భరమై ధ్వనివిలసితముగా తీర్చిదిద్దెను.

శాంతం పాపం! శాంతం పాపం! రాక్షసులకన్నా తమరే క్రూరులు. ఎందుకంటే,
లక్కయింటిలో నిద్రిస్తున్న అన్నదమ్ములను నిశాచరులు కాల్చనే కాల్చరు. వదిన తలను ఆవిధంగా తాకరు గాక తాకరు. యుద్ధంలో కొడుకును చంపాలన్న ఆలోచన కూడా రాదు వారికి. వికారశరీరులు, ఘోరవర్తనులూ అయినా కరుణను మాత్రం విడిచిపెట్టలేదు వారు.

హైడెగర్ ప్రధానగ్రంథం పేరు, “Being and Time”. Da-sein దేశాన్ని చెబుతోంది. ఈ కల్పితపదం, మనిషి దేశకాలాలకు అతీతమైన తత్త్వం కాడని, మనిషి సక్రియుడని, తన కర్మలచే తనను తాను నిర్మించుకుంటాడని, “బతకడం” మనిషి “ధర్మ”మని, (తత్త్వం కాదని) చెబుతుంది. ఇది హైడెగర్ పదప్రయోగము, అనువాదభాషావిషయము.

భారత యుద్ధం గురించి చదువుతున్నప్పుడు వచ్చే రకం సందేహాలే ట్రోయ్ యుద్ధం గురించి కూడా వస్తాయి. ఈ కథ పురాణమా? ఇతిహాసమా? ఈ యుద్ధం నిజంగా జరిగిందా? జరిగితే ఎప్పుడు జరిగింది?

రామాయణ, మహాభారతాలు చదవకుండా భారతీయ విలువలను, మనస్తత్త్వాన్ని అర్థం చేసుకోవడం ఎంత కష్టమో అలాగే ఇలియాడ్, ఓడిస్సీ గ్రంథాలు చదవకుండా గ్రీసు దేశపు సంప్రదాయాలనే కాకుండా పాశ్చాత్య సంస్కృతిని, పాశ్చాత్య కళలనూ, పాశ్చాత్య ఆలోచనాసరళిని అర్థం చేసుకోవడం కష్టమే.

దాశరథిని ప్రేమించని సాహిత్యకులు తెలంగాణలో లేరు. దాశరథిచే స్వీకరింపబడని కావ్యవస్తువు తెలంగాణాలో లేదు. దాశరథి గీతాలు వినని రసికులు తెలంగాణమందుండరు. దాశరథియే తెలంగాణము – తెలంగాణమే దాశరథి.

ఎవరెస్ట్, అన్నపూర్ణ ట్రెక్‌లలో వారాల తరబడి గడిపాక కూడా మరో రెండు వారాలు మనస్లు ఒడిలో గడపాలన్న నిర్ణయానికి ఇదిగో – ఈ కొండలు, నదులు, అడవులు, గ్రామాలు, మఠాలు, మనుషులు, వాటి పిలుపులే, వారి తలపులే కారణమై ఉండాలి.

పుంభావసరస్వతి”గా విద్వద్గణాలచే కొనియాడబడిన సముద్ధండ పండితులు డా॥ కొరిడె రాజన్న శాస్త్రిగారి సుదీర్ఘ సాహిత్య ప్రస్థానం, కవితా వైభవం మరియు వారి జీవన రేఖల గురించి వారి కుమారులు కొరిడె విశ్వనాథశర్మ గారు అందిస్తున్న పరిచయం.

తృణ సస్య తరులందు యినుము కనకములందు
మణి సికత శిలలలో శుని హరిణములలో
గుణ శక్తి వైవిధ్య మనువంశికత నేర్పు
మనకు నన్యోనతను – మంకుతిమ్మ

ఇప్పుడు తెలుగు రాతలలో ఈ విరామస్థానాలు ఒక వరసా, వావీ లేకుండా అస్తవ్యస్తంగా కనబడుతున్నాయి. “సరి అయిన పద్ధతి ఏది?” అని ఎవరిని అడగడమో తెలియడం లేదు. మనకి తెలుగులో ఒక లక్షణ గ్రంథం (style manual) లేదాయె.