ఒక్క క్షణం యుద్ధరంగంలో నిశ్శబ్దం ఆవరించింది. మెనలెయస్‌ సాలోచనగా అన్నాడు, “మా ఇద్దరి మధ్య వచ్చిన ఘర్షణ కారణంగా రెండు పక్షాలలోనూ ఎంత జననష్టం వచ్చిందో చూస్తూనే ఉన్నాం! స్పర్ధలు వచ్చింది మా ఇద్దరి మధ్యనే కదా. కనుక నేను ఈ సవాలుని అంగీకరిస్తున్నాను.”

అయ్యగారు ఖద్దరు పంచె, లాల్చీ ధరించి, నుదుట బొట్టు పెట్టుకుని కూర్చుని ఉండేవాడు. మధ్యమధ్యలో ముక్కుపొడి పీల్చేవాడు. మధ్యాహ్నానికి ఇంటి నుంచి అమ్మగారు పంపిన రసం అక్కడే తాగేవాడు. ముక్కుపొడి, రసం, వైద్యం, ఊరి కబుర్లు—అన్నీ ఆ దర్బారులోనే, అందరి కళ్లముందే.

ఇక్కడ నేను “చంద్రరేఖా విలాపం”లో హాస్యప్రబంధం కావటానికి కావలసిన సామాగ్రి పుష్కలంగా వుందని చూపిస్తాను. కనుక అది నిజంగా, కవి స్వయంగా చెప్పుకున్నట్టు హాస్యప్రబంధమే అని నా వాదన.

అరె, ఏమిటా చప్పుడు?

మబ్బులు ఉరుముతున్నాయా? వజ్రాయుధపు దెబ్బలకు పర్వతాలు పొడి అయిపోతున్నాయా? భయంకరమైన శబ్దం చేస్తున్న తుఫాను గాలులు భూమిని చీల్చివేస్తున్నాయా? తనగర్భంలోనున్న మంథరపర్వతపు గుహలను గాలికి చెలరేగిన పెను అలలు తాకినప్పుడు సముద్రం వెలువరిస్తున్న శబ్దమా? సరే, వెళ్ళిచూద్దాము.

వేమన, వీరబ్రహ్మం ఇద్దరిదీ దాదాపు ఒకటే మార్గం. దీన్ని అద్భుతంగా ప్రదర్శించే గ్రంథం “కాళికాంబ సప్తశతి”. వీరబ్రహ్మం ఆధ్యాత్మిక జీవితం ద్వారా సమాజంలో ఎలాంటి మార్పు కోరుకున్నాడో, కులమతాల అసమానతలను ఎలా ఎత్తిచూపారో ఈ శతక పద్యాల ద్వారా తెలుసుకోవచ్చు.

ఎఱ్ఱదాచమ నాయని విక్రమగాథను చిత్రీకరించిన యాచ ప్రబంధము కావ్యకర్త దేవరకొండ నివాసి త్రిపురాంతకుడు, అక్కడికి సమీపాననే ఉన్న ఓరుగల్లులో కాకతీయ సామ్రాజ్య సామాజిక స్థితిగతులను వర్ణించిన ప్రేమాభిరామము కావ్యకర్త అయిన రావిపాటి త్రిపురాంతకుడు ఒకే కాలంలో, ఒకే ప్రాంతంలో ఉండి సంస్కృతంలో కావ్యరచన చేసిన ఇద్దఱు వేర్వేఱు వ్యక్తులని భావించటం కంటే యాచ ప్రబంధము సుప్రసిద్ధుడైన రావిపాటి త్రిపురాంతకుని రచనమని భావించటమే సమంజసంగా ఉంటుంది.

అవునయ్య నే పృథ్వి నతుల ప్రతాపుడౌ
ప్రోడ దశరథుని కోడలినిని!
అవునయ్య నే భవ్యయశమొప్పు వైదేహ
జనకుని కూతురు జానకినిని!
అవునయ్య నే భువి ననవద్య గుణుడైన
ధీమంతుడౌ రాము ధీరసతిని!
అవునయ్య పతిబాసి అలమట పడుచుంటి
సీత నా నామమే స్నిగ్ధవచన!

నేను ఎన్నో రకాల రేడియోధార్మిక రూపాంతరాలు చూశాను. కానీ వాటన్నిటికన్నా వేగంగా జరిగిన రూపాంతరం—ఒక్క క్షణంలో నేను భౌతికశాస్త్రవేత్త నుంచి రసాయనశాస్త్రవేత్తగా మారిపోవడమే!

భూమి ఎక్కడో సముద్రమెక్కడో తెలియని భూ-జల ప్రపంచంలో ఒక గమ్యమంటూ లేకుండా పడవ ప్రయాణం. ఎదురుగా పచ్చని కొండలు… కొండల నడుమ ఏభై గజాల ‘ఇరుకు’ జలసంధులు… అవతల అనంతసాగరం. ద్వీపాలలో చిక్కని అడవులు… చేపల పడవలు.. అలలు లేని జలధి…

స్వదేశీ ఉద్యమంలో కేవలం భౌతికమైన ఆయుధాలే కాదు, సంగీత సాహిత్యాలూ, కలం అనే అత్యంత శక్తివంతమైన అదృశ్య ఆయుధాలు కూడా ఎంతగానో పోరాడాయి. నాటినుంచి నేటివరకూ, ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తిని రగిలిస్తూ, అచంచలమైన స్ఫూర్తిని నింపుతున్న ఆ అమర గీతాల ప్రయాణం ఒక్కసారి గుర్తు చేసుకుందాం!

అవన్నీ
పరుచుకున్న ఆకాశంలోనే నువ్వూ
జ్వలిస్తున్న కాంతిలోనే నువ్వూ
తడుస్తున్న జీవితంలోనే నువ్వూ

సాహిత్య విమర్శకుడు, పుంభావ సరస్వతి కీ.శే. జొన్నవిత్తుల రామకృష్ణశర్మగారు, వారి శ్రీమతి కీ.శే. లక్ష్మీనరసమ్మగారల సంస్మరణార్థం, వారి కుమారులు జొన్నవిత్తులవారి సాహిత్య స్ఫూర్తి పురస్కారాన్ని ఇవ్వాలని సంకల్పించారు. ఈ పురస్కారాన్ని తెలుగు, సంస్కృత, ప్రాకృత భాషా సాహిత్యాల్లో అద్వితీయమైన ప్రతిభ కనపరుస్తున్న యువ సాహితీవేత్త, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీ పరిమి శ్రీరామనాథ్‌గారికి అందిస్తున్నారు.