కొందరు ఎప్పటికోగాని కొత్త సంపుటి తీసుకురారు. అది కూడా రాసినవారు చిన్నప్పటి స్నేహితులైతే, కాలం పరుసవేది హస్తస్పర్శతో బంగారంగా మారిన గతదినాలు గుర్తుకు వచ్చి, జ్ఞాపకాల పరిమళం చటుక్కున గుబాళిస్తుంది. ఇటువంటి అనుభవమే రెండు కవితా సంపుటాల విషయంలో ఈమధ్య నాకు కలిగింది.
రచయిత వివరాలు
పూర్తిపేరు: విన్నకోట రవిశంకర్ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
విన్నకోట రవిశంకర్ రచనలు
విరసం కార్యవర్గ సమావేశం జరుగుతుండగా గెడ్డం ఉన్న ఒక ముసలాయన వస్తాడు. లోపలి వాళ్ళతో వెంటనే మాట్లాడాలని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆ కార్యకర్త సాయంకాలం రమ్మని పంపించేస్తాడు. నిరాశతో వెనుదిరిగిన ఆయన్ని, ‘ఇంతకీ మీ పేరేంటి సార్?’ అని అడుగుతాడు. దానికాయన ‘నన్ను కార్ల్ మార్క్స్ అంటారు బాబూ!’ అని చెప్పి వెళ్ళిపోతాడు.
తడబడే అడుగుల పసివాడి
పాదం తగిలితే చాలు
పుడమి తల్లి పుత్రవాత్సల్యంతో పులకిస్తుంది
రెండడుగులు తనవైపు నడిచి పలకరిస్తే చాలు
చుట్టాల్ని చూసిన చిన్నపిల్లలా
సముద్రం అరుస్తూ గంతులు వేస్తుంది
ఒకసారి ఓడిపోయిన పద్యం ఇక
మళ్ళీ ఎప్పటికీ గెలవకపోవచ్చు.
తలవంచి కనులు దించిన దీనిని
ఓటమి, గెలుపులు నాకొకటేనంటూ
ఓదార్చాలనిపిస్తుంది.
ప్రస్తుత సంకలనం ఇక్కడ నివాసిగా స్థిరపడ్డాక రూపొందినది. ఇందులో స్నేహరాహిత్యం పట్ల కొంత దిగులు ఉన్నా ఇక్కడ, ఇండియాలోనూ జరిగిన సమకాలీన సంఘటనలకి రాజకీయమైన స్పందన ఎక్కువ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా, ఇండియాలో తన ప్రాసంగికతను నిరూపించుకోవాలనే తాపత్రయం కవిలో ఉన్నట్టు నాకనిపించింది.
అలవికాని తళుకు బెళుకులతో,
అర్థరాత్రి దాకా ఆనందాన్ని వెతుకుతూ తిరిగే మనుషులతో
సతమతమయ్యే ఊరిని చూసి
ఆకుల రంగులే ఆభరణాలుగా ధరించిన అడవి
చిన్నగా నవ్వుకుంటుంది.
నువ్వు నా మాటల్ని
వింటున్నావనుకుంటాను.
ఆనందంగా, అనర్గళంగా
మాట్లాడుతూనే ఉంటాను.
కాని, నీ చెవుల్లో…
కళ్ళు మూసుకున్నంతసేపు
రెక్కలు రెపరెపలాడిస్తూ
గిరికీలు కొట్టే భావాలు
పెన్ను మూతవిప్పగానే
ఎక్కడికో ఎగిరిపోతాయి.
చూపులతో దారి మళ్ళించి
లేదు జానకీ, అది నిజం కాదు. నాకు మనుషుల మీద జాలి, కరుణ అంతే. నాకు ఎవరి మీద, దేని మీద ద్వేషం లేదు – మనుషులతోనే కాదు పువ్వులతో, చెట్లతో, పక్షులతో కూడా మాట్లాడతాను. దారిలో చెయ్యి చాచిన ప్రతి చెట్టు కొమ్మని ఆప్యాయంగా అందుకుంటాను. మమ్మీ! డాడీ మాటలలాగే ఉంటాయి. ఆయన మాట్లాడకపోవటమే బెటరు.
బొడ్డు తెగి చాలాకాలమయింది ఒడ్డు మారి కూడా దశాబ్దాలు దాటింది అయినా అమ్మ నేలమీద బెంగ మాత్రం అణువంతయినా తగ్గదు. ఆదరించిన నేల అన్నీ […]
కాగితం గతం
కలం కళ్ళలో కదలాడే ఒక పురాజ్ఞాపకం
అంతరంగం
నిత్యం అలలతో ముందుకీ వెనక్కీ ఊగే
నిస్సహాయ సముద్రం.
సాహిత్య దంపతులు ఆర్. సుదర్శనం, ఆర్. వసుంధరాదేవి విశ్వనాథ సత్యనారాయణగారితో బహుశా పంతొమ్మిదొందల అరవైల చివరలో జరిపిన ఇష్టాగోష్టి ఇది. ఇందులో సాహిత్యం కన్నా ఎక్కువ వేదాంత పరమైన అంశాల మీదే చర్చ జరిగింది. కాని, వాటిపై విశ్వనాథ వారికి ఎంత లోతైన అవగాహన ఉన్నదో మనకు తెలుస్తుంది.
నటులేకాదు, ప్రేక్షకులు కూడా
ఒకరొకరుగా నిష్క్రమిస్తారు.
రంగస్థలం మీది విషాదానికి
కలిసి కన్నీరు పెట్టటానికి
ఇరువైపులా ఎవరూ కనబడరు
ఇప్పటిదాకా అన్నీ నేనై నడిపించినవాణ్ణి
చేతిలో ఉన్న యాంత్రిక వలయంతో
ప్రతి అడుగుని నిర్దేశించినవాణ్ణి
ఎంతసేపట్నించో
ఎదురు చూస్తున్న చిట్టితల్లిలా
కళ్ళమీంచి చేతులుతీసి
కిలకిలా నవ్వుతుంది.
బ్రతుకు పోరాటంలో బయల్దేరినప్పుడు
అపరిచితమైన దూర తీరాలు చేరినప్పుడు
ఆప్త మిత్రునిలా ఆంగ్లభాష.
శ్రీశ్రీ భావనలో మరణాన్ని జయించటమన్నది మనిషి సామర్థ్యం మీద ఆయనకున్న నమ్మకానికి నిదర్శనం. మనిషిపై ఈ నమ్మకం మానవుడా! వంటి ఇతర కవితల్లో కూడా వ్యక్తమౌతుంది.
నేలమీంచి చూసే ఆకాశం కన్నా
ఆకాశంలోంచి చూసే నేలే
అందంగా ఉంటుంది
కాలిన న్యూస్ పేపర్లో ఇంకా నిలిచిన అక్షరాల్ని చదవటానికి ప్రయత్నించినట్టు, గతం పొరల్లో అప్పుడప్పుడు ఆయన గురించిన స్మృతుల్ని చదవటానికి ప్రయత్నిస్తాను.
అనువాద రచనలు మూల భాష తెలిసిన వారిని,అనువాద భాష మాత్రమే తెలిసిన వారిని సమానంగా రంజింపజెయ్యాలని ఎలా ఆశిస్తామో, అలాగే అనుభవాల గురించి రాసిన రచనలు కూడా ఆ అనుభవాల నెరిగిన వాళ్ళకి, ఎరగని వాళ్ళకి కూడా సంతృప్తి నియ్యాలని ఆశించటంలో తప్పులేదు.
ఐతే, ఈ వర్ణనలో ఎక్కడా పర్యాటక దృష్టి కనబరచకుండా, కవి తనకై కలిగిన అనుభూతిని, ఆలోచనని, తన్మయత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసారు.
కలుసుకోవాలనుంటుంది
రక్తనాళాల గజిబిజి దారుల్లో
తప్పిపోయిన ఒక రక్తపుబొట్టుని
వానలో తడిసినప్పుడు
పాత గాయాలేవో సలపరించినట్టు
నీ పాటలో తడిసినప్పుడు
మానిన జ్ఞాపకాలు
మళ్ళీ బాధ పెడతాయి.
వానా కాలమే కాదు, వాన పడిన సమయం కూడా కవులకు ముఖ్యమౌతుంది. చంద్ర కవితలను విడివిడిగా అనేక సంవత్సరాలుగా చూస్తూనేఉన్నా, అన్నిటినీ కలిపి ఒకచోట చదవటం మంచి అనుభవం.
సూర్యుడు కూడా చలితో
గజగజ వణుకుతాడు.
పోగొట్టుకొన్నవాడి పాట [“సందుక” లోని మరికొన్ని కవితలు రచయిత వెబ్ సైట్ లో చదవగలరు. -సంపాదకులు] శిఖామణి మొదటి పుస్తకం “మువ్వల చేతికర్ర” లో […]
శరీరానికతీతమైన స్వభావాన్ని వర్ణించటానికి శరీరాన్ని ప్రతీకగా తీసుకోవటంలోనే ఒక ప్రత్యేకత ఉంది.
“ప్రతి శిశు జననం మానవ జాతి మీద భగవంతునికి మిగిలి ఉన్న నమ్మకాన్ని నిరూపిస్తుంది” అన్నట్టే ప్రతి కవిజననం మన భాష మీద మనకున్న ఆశను రెట్టింపు చేస్తుంది.
ఎంత ప్రేమించినా ఏముంది
అడుగుల సడికే పక్షులన్నీ
హడావుడిగా ఎగిరిపోతాయి.
వాన చినుకుల పరిమళం
నన్నిక ముంచెత్తకపోవచ్చు
కాని, వాన కురుస్తూనే ఉంటుంది
కవిత్వానికున్న అనేక ప్రేరణల్లో ఇతర కళల ద్వారా కలిగే ప్రేరణ కూడా ఒకటి. ఒక కచేరీ విన్నప్పుడో, చిత్రం, చలన చిత్రం లేదా శిల్పాన్ని […]
లోతులేకపోవటం క్రమక్రమంగా అలవాటైపోతుంది. తడిసీ తడవని పాదాలతో నడక సాగిపోతుంది. నాలుగో పరిమాణం దాకా సాగిన ఒకప్పటి ఆలోచన రెండో పరిమాణం దగ్గరే ఆగిపోతుంది. […]
లోపల దీపం వెలగకూడదు
ఎవరి ప్రతిబింబం వారికే
అడ్డు నిలవ కూడదు.
తడి తడి గుడి జారుడు మెట్ల పాదగయ కోడి కూయకముందే కొలువు తీరిన కుక్కుటేశ్వరుడు. అరుగు మీద అమ్మ నోము (వాయనాల్లో వర్ణ భేదం) […]
ఇస్మాయిల్ గారిపై మా ఆసక్తి “అర్థం కాకపోవటం” అనే ప్రాతిపదిక మీద మొదలైంది. పి.ఆర్ . కాలేజీ లో ఇంటర్ చదివేరోజుల్లో మా మిత్రబృందం […]
ఏదో ఒక రుతుబలహీనతకి లోబడి వేరు పడుతుందేగాని పచ్చగా కలిసి ఉండటమే చెట్టుకి హాయి. అందుకే రంగుమారిన మరుక్షణం నుంచి రాల్చటం మొదలెడుతుంది. కలవని […]
మిత్రులు లేకపోయినా ఫరవాలేదు కాని, శత్రువు లేకుండా బ్రతకటం కష్టం. అజాత శత్రువంటే ఇక్కడ జీవన్మృతుడని అర్థం. ఇంతాజేసి, ఇదంతా ఒక ఆట. ప్రతి […]
బహుశ అందరికీ తెలిసినదే ఒక కధ ఉంది. ఒక వేళ కాని వేళ శ్రీరాముడికి నేనెవరన్న సందేహం కలుగుతుంది. వెంటనే వశిష్టులవారి ఆశ్రమానికి వెళ్ళి, […]
(డ్రాయింగు రూములో లక్ష్మి అటూ ఇటూ తిరుగుతూ పేపర్లూ అవీ సర్దుతూ ఉంటుంది. మధ్యలో ఒకసారి ఆగి, టేబుల్ మీద ఉన్న పెళ్ళి ఫొటో […]
చిన్నప్పుడు ఒక సరదా ఉండేది. సినిమా పాటల్లో ఎక్కడైనా ఒక లైన్లో “సన్నిధి” అనే పదం వస్తే, వెంటనే తరువాతి లైన్లో “పెన్నిధి” అని […]
ఏడాది పొడుగునా వేచి వేచి ఒక చెట్టు ఒళ్ళంతా పువ్వులతో తనను తాను తిరిగిపొందే ఈ వేళ, ఒక నవ నాగరికుడు అలవికాని రంగుల్లో […]
ఉదయపు గాలి తాకిడికి కలల గాలిపటం తెగడంతో చటుక్కున లేచి కూచుంటాం. తెగిన గాలిపటం ఏ మరుపు పొరల చింతగుబురుల్లోనో చిక్కుకొని, మరి కనిపించటం […]
నిండైన దీని జీవితాన్ని ఎవరో అపహరించారు. దీని బలాన్ని, బాహువుల్ని, వేళ్ళని, వైశాల్యాన్ని, నింగిని అటకాయించే నిర్భయత్వాన్ని, ఎవరో నిర్దయగా, నెమ్మదిగా, అందంగా అపహరించారు. […]
పొలిమేరల్లో ఉన్న ఊళ్ళోకొచ్చిన పులిలా చప్పుడుకాకుండా కాలేజీ కేంపస్ లోకి కాలుపెడుతుంది జ్వరం. ఇక్కడి మనుషులు నిరాయుధులని, వీళ్ళ మధ్య యే బలమైన బంధాలూ […]
అక్కడున్న అందరి మనసుల్లోని దుఃఖాన్నీ ఆవిష్కరించే బాధ్యతని ఒక స్త్రీ నయనం వహిస్తుంది. ప్రకటించక, ప్రకటించలేక, పాతిపెట్టిన వందల మాటల్ని ఒక్క మౌనరోదన వర్షిస్తుంది. […]
ఓ రాత్రివేళ అంతటా నిశ్శబ్దం ఆక్సిజన్ లాగా ఆవరిస్తుంది. వాయించని కంజరలాగా చంద్రుడు, మోయించని మువ్వల్లాగా చుక్కలు ఆకాశం మౌనం వహిస్తుంది. వీధిలైట్లన్నీ తలవంచుకొని, […]
నేను మాటాడుతుండగానే నువ్వు మెల్లగా నిద్రలోకి జారుకోవడం చూడ్డం నాకు చాలా ఇష్టం. లాంతరు భూతంలా నిద్ర నువ్వు తలచిందే తడవుగా నీ ముందు […]
కదిలే కథ మధ్య కదలకుండా నిలిచేదానా ! కదలని మనసుల్ని కూడా కదిలించేదానా ! పొలం గట్టున పొరపాటున మొలిచినట్టున్న గులాబీ మొక్కా ! […]
ఇంతపని జరుగుతుందని నేననుకొన్నానా ? అంతా ఒక్కటిగా వెళ్ళిన వాళ్ళం బలవంతాన నిన్నక్కడ మరచిపోయి రావలసి వస్తుందని ! శిల్పాల మధ్య తిరుగాడుతున్నప్పుడనుకొన్నానా, నీ […]
మళ్ళీ అప్పుడే నిద్ర వద్దు; నిన్నటి కల ఇంకా పచ్చిగానే ఉంది. కళ్ళల్లో గాలిదుమారం లేపుతూ, ఎర్రటి ధూళిని రేపుతూ వస్తుంది నిద్ర. రెప్పల […]
అమ్మా,నీ జ్ఞాపకం ఫొటోలా దుమ్ము పడుతోంది. ఒకప్పుడు వేల చిత్రాలై నన్ను ఉక్కిరిబిక్కిరిచేసిన జ్ఞాపకం అంతులేని చలన చిత్రమై నా కళ్ళల్లో కదలాడిన జ్ఞాపకం […]
ఉదయపు చీకట్లో ఒక గాలి తెర కొబ్బరి చెట్టు జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి, నిట్టూర్చి శెలవు తీసుకుంటోంది. అవి విడిపోవడాన్ని ఎవరు గమనిస్తున్నారు ? […]
ఒక ఊరితో సంబంధం హఠాత్తుగా తెగిపోతుంది. ఆప్యాయం గా ఒక వ్యక్తి చుట్టూ అల్లుకున్న బంధం స్ప్రింగులా విడిపోతుంది. అనుకోకండా ఆకాశం రంగులు మార్చినట్టుగా, […]
ఈ గాయం స్రవిస్తూనే ఉంటుంది, డాక్టర్ ! నీ మౌనం చేసిన గాయం, నా ప్రాణప్రదమైన వ్యక్తిని నా నుంచి దూరం చేసినప్పటి గాయం, […]
” అమ్మా ! కళ్ళు మండుతున్నాయే !” ” ఏం చెయ్యనురా, తండ్రీ, ఎక్కడ దాచను నిన్ను ! గదిలో, వాకిట్లో, ఊరిలో, వాడలో, […]
ఇతనికెవరూ వీరత్వాన్ని వెన్నతో పెట్టి తినిపించలేదు. ఒళ్ళో కూచోబెట్టుకుని, సాహస గాధల్ని ఓపిగ్గా వినిపించలేదు. అయినా, ఉదయమయ్యేసరికల్లా ఈ పసివాడు మృత్యువు గుహలోకి నడిచిపోతాడు. […]
ఇప్పుడు తెర తీసేశారు ఇక యే దాపరికమూ లేదు ! ఈ రహస్యం ఇంత వికృతంగా ఉంటుందని నేననుకోలేదు. నేనిన్నాళ్ళూ కొలిచిన వేలుపు అసలు […]
నీ క్షణికానందాన్ని ఆమె తొమ్మిది నెలలు మోసింది. వీడైతే దానిని నూరేళ్ళూ మోయవలసినవాడు. ఇంకా నీ బెల్టు చారల్ని, వేళ్ళ ఆనవాళ్ళని కూడా ఎక్కడ […]
పాపం దానికేమీ తెలీదు. దాన్నేమీ అనకండి. మనం ఛేదించలేని మృత్యు రహస్యాన్ని అది గుప్పిట్లో పెట్టి నిల్చుంది. వేళ్ళలా చుట్టుకున్న వరల వెనకాల్నించి ఎవరు […]
ఈ కష్టాల్ని భరిస్తూ ఈ కాంప్లెక్సిటీని ఓర్చుకొంటూ ఎన్నాళ్ళిలా సాగిపోదాం ? సముద్రం నుంచి విడిపోవాలనే పడుచు కెరటాలు ఉవ్వెత్తున లేచి మళ్ళీ ఒక్కసారికి […]
ఒకొక్కరం ఒకో విధంగా రంగ ప్రవేశం చేసినా, మా బృందనృత్యం ఒక పద్ధతిగానే సాగింది. ఒకరు ప్రపంచాన్ని సమ్మోహింప చెయ్యాలని, ఒకరు ప్రజల మత్తు […]
నేనిప్పుడు కలలపడవలో తేలడంలేదు. కలవరించడం లేదు. జీవితంలో తుదకంటా మునుగుతున్నాను. మత్తెక్కిన జూదగాడిలా మొత్తం కాలాన్ని పణం పెట్టి ఈ ఆట ఆడుతున్నాను. గెలిచితీరాలని […]
ఊరికి నువ్వొక చివర నేనొక చివర ఉంటున్నా అది మన మధ్య దూరమేమీ కాదు. చేతుల్లో చేతులు వేసుకొని చిరునవ్వులతో షికార్లు చేసినప్పుడు, గంటల […]
నేననుకోవడమేగాని, ఈ మంచుగడ్డని నేను పగలగొట్టలేను. మన మధ్య మాటల వంతెన కట్టలేను. ఇవ్వి నేను ప్రేమతో పెంచుకొన్న పువ్వులు మరిమరీ ముడుచుకుపోవటమే తప్ప […]
నాయనలారా! నన్ను మన్నించండి ! సగం వేషం వేసినందుకు సగమే మోసం చేసినందుకు. నా సగం మీసాన్ని, సగం పెదవుల ఎరుపుని, సగం బుగ్గల […]
ఈ పాపకి మన ప్రపంచం అంతగా నచ్చదు. ఉదయం లేచిన దగ్గర్నించి దాని మరమ్మత్తుకోసం ఉబలాట పడుతూ ఉంటుంది. ఇదే అందం అనుకొని, మనం […]
ఎప్పుడో నేను ఫోటో తీసేదాకా నీ బాల్యం ఉంటుందిరా, బాబూ ! మంచులా, మైనంలా, మౌనంగా కరిగిపోతుంది. బాల్యం ఒక ప్రవాహం వెళుతూ, వెళుతూ […]
కొన్నిసార్లు ఆడకుండానే విరమించవలసి వస్తుంది. సకలాలంకారాలూ చేసుకొని సర్వ సన్నద్ధంగా ఉన్నా, నీ పాత్ర రాకండానే నాటకం ముగింపుకొచ్చేస్తుంది. నూరిన నీ కత్తి వీరత్వాన్ని […]
మూత విప్పగానే అత్తరులా గుప్పున గుబాళించడం నాకు తెలీదు. తలుపు తియ్యగానే ఏ.సి.లా ఊహించని స్నేహపు చల్లదనంతో ఉక్కిరి బిక్కిరి చెయ్యడం నాకు చేతకాదు. […]
పాపను పడుకోబెట్టినపుడు తనపై పరుచుకున్న నిద్రని దుప్పటిలా తొలగించివచ్చి ఎప్పటిలా ఆమె తిరిగి పనిలో పడింది. కళ్ళకి అక్కడక్కడా అంటుకొనున్న కలని కాసిని చన్నీళ్ళతో […]
సగం నిద్రలో గడచిన సగంజీవితం సగంనిద్రలో కలుక్కుమని గుచ్చుకున్న సగంచదివి విడిచిన పుస్తకం. సగమే ముందు సగం గతం ఆశపడటం అప్పుడప్పుడు అసంగతం. నడినెత్తికిచేరిన […]
అక్కడెక్కడో వసంతం అడుగులు వినబడితే చాలు, యిదే అదనని యిక్కడి చెట్లన్నీ అకస్మాత్తుగా యుద్ధం ప్రకటిస్తాయి. నిన్నటిదాకా చడీచప్పుడూ లేకుండా, తెల్ల్లారేసరికల్లా యింటినిచుట్టుముట్టిన సైనికుల్లాగా […]
సమయం ఎక్కువగా లేదు కిరణాలు కిరణాలుగా దొరికే వెలుగులతో ఈ చీకటి గుహల్నింక తవ్వలేను. దేనికేదో తెలియని తాళాల గుత్తితో లెక్కలేనన్ని చెరసాలల్ని తెరవలేను. […]
ముందుగా మౌనం కావాలి నిరంతరం ఫౌంటెన్లా ఎగజిమ్మే ఆలోచనలు ఒక్కసారిగా లోపలికి ముడుచుకుపోవాలి. గత వర్తమానాల మధ్య లయాత్మకంగా ఊగేందుకు మనసొక తూగుటుయ్యాల కావాలి. […]
కవిత్వం భాషకు, భావనకు ఉన్న పరుధుల్ని విస్తరింపజేస్తుంది. పదాల ఎంపిక, కూర్పు, కొత్త పదబంధాల సృష్టి వంటి సాధనాల ద్వారా ఇది సాధ్య పడుతుంది. […]
కొన్ని గుర్తుకురావు
కొన్ని మరపుకు రావు
గతాన్ని చీకటి వెలుగుల జల్లెడతో జల్లించి
మనసొక మాయాజలం కల్పిస్తుంది.
(విన్నకోట రవి శంకర్ కవిగా లబ్ధప్రతిష్టులు. ఈమాట పాఠకులకు చిరపరిచితులు. “కుండీలో మర్రిచెట్టు” వీరి తొలి కవితాసంకలనం. మరో సంకలనం ప్రచురణకు సిద్ధంగా ఉంది. […]
( మధ్య తరగతి ఇంట్లో డ్రాయింగురూము. ఒక పెద్దాయన కూర్చుని పేపరు చదువుతూ ఉంటారు. ఆయన పేరు రామ శర్మ ఆ కుటుంబానికి చిరకాలంగా […]
(విన్నకోట రవిశంకర్ గారు “ఈమాట” పాఠకులకు చిరపరిచితులు. ప్రఖ్యాత కవి. “కుండీలో మర్రిచెట్టు” అనే కవితా సంకలనం ప్రచురించారు. మరో సంకలనం సిద్ధం చేస్తున్నారు. […]
ఏది కవిత్వం, ఏది కాదన్న విషయం ఎవరూ నిర్దిష్టంగా తేల్చి చెప్ప లేరు. అది కవి, పాఠకుడు తమ తమ అనుభవం మీద ఆధారపడి […]
ఒక మార్పు కోసం ఎప్పుడైనా నాకు చనిపోవాలని ఉంటుంది. అంతుపట్టని ఒక చీకటిలో అంతమైపోవాలని ఉంటుంది. జలజలకురిసే వానలో ఒక చినుకులాగా, గల గల […]
కొన్నిపాటల్లో నేను గమనించిన విశేషాలను ఈ వ్యాసంలో ప్రస్తావిస్తాను. ఇందులో క్లాసిక్సునే కాకుండా, అన్ని రకాల పాటల్నీ తీసుకుంటాను. దీని ఉద్దేశ్యం, కొన్ని రచనా వైచిత్రుల్ని గుర్తించటమే గాని, ఉత్తమ రచనల్ని ఎన్నిక చెయ్యాలని కాదు. అందువల్ల కొన్ని మంచి రచనల గురించి చెప్తూనే, ఇతరత్రా విషయాల గురించి కూడా కొంత ముచ్చటిస్తాను.
‘భయం’ అంటే ముసుగువేసుకొని, హఠాత్తుగా ఎదురొచ్చే అపరిచితవ్యక్తి గదా! మాయలు చేసి హింసించే వికృత మంత్రగత్తె గదా! వీళ్ళు తమ ఊహాశక్తితో దాన్ని, కితకితలుపెట్టి […]
ఇస్మాయిల్ గారు కాకినాడ పి.ఆర్. గవర్నమెంటు కాలేజీలో చాలా కాలం ఫిలాసఫీ లెక్చరరుగా పని చేసి, కాలేజీ ప్రిన్సిపాలుగా పదవీవిరమణ చేశారు. కొంత కాలం […]