శాన్ హోసె నగరంలో, జులై 3,4,5 తేదీలలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రజతోత్సవం జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా, తానా ప్రచురణల కమిటీ, […]
జులై 2003
“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం !
తానా వారి ద్వైవార్షిక కథల పోటీలో విజేతలైన ఆరు కథల్ని ఈ సంచికలో ప్రచురిస్తున్నాం. అందుకు సంతోషంగా అంగీకరించి అన్ని సదుపాయాలు కల్పించిన శ్రీ జంపాల చౌదరి గారికి కృతజ్ఞతలు. ఇంతకు ముందు 2001 లోనూ, 1999 లోనూ ఇలాగే అప్పటి కథావిజేతల్ని “ఈమాట” ప్రచురించిందని మా పాఠకులకు గుర్తుండే వుంటుంది. మళ్ళీ ఓ మారు వాటిని చదవదలుచుకున్న వారు జులై 2001, జూన్ 1999 సంచికలను సంప్రదించండి.
ఈ కథల గురించి తానా కథల పోటీ న్యాయనిర్ణేతలు రాసిన అభిప్రాయాలే కాకుండా మరొక పాఠకుడి అభిప్రాయాల్ని కూడ అందిస్తున్నాం. మిగిలిన పాఠకులు వారి అభిప్రాయాల్ని కూడ అందరితోనూ పంచుకుంటారని ఆశిస్తున్నాం.
ఈ సంచిక అనుబంధ రచనా విభాగంలో జాషువా గబ్బిలము రెండవభాగం, ఇస్మాయిల్ కావ్యాలు చెట్టు నా ఆదర్శం, మృత్యువృక్షం ఇస్తున్నాం. ఇస్మాయిల్ గారి కావ్యాల్ని టైప్ చేసి ఇచ్చిన గట్టు వినీల్ గారికి మా కృతజ్ఞతలు. ఇలా ఇతర కావ్యాల్ని, రచనల్ని టైప్ చేసి పంపే ఉత్సాహం ఉన్నవారు మమ్మల్ని సంప్రదించండి. ప్రస్తుతం మేము తిలక్ అమృతం కురిసిన రాత్రి, నగ్నముని కొయ్యగుర్రం, దిగంబర కవుల కవిత్వం మొదలైన కావ్యాల కోసం చూస్తున్నాం. వీటిని టైప్ చేసి ఇవ్వగలిగిన వారికి మా ఆహ్వానం. అలాగే సంప్రదాయ సాహిత్యం నుంచి కూడ వసుచరిత్ర, శృంగారనైషథం వంటి కావ్యాల్ని టైప్ చెయ్యదలిచిన వారు కూడ ఆహ్వానితులే!
తానా కథలతో బాటు నేరుగా “ఈమాట” కు వచ్చిన వాటిలో ప్రచురణార్హమైన కథల్ని యథాప్రకారంగా ప్రచురిస్తున్నాం. అలాగే కవితలు, వ్యాసాలు కూడ. పాఠకుల అభిప్రాయాల్ని, రచయిత్రు(త)ల సహకారాన్ని ఆహ్వానిస్తున్నాం.
వచ్చే సంచిక నుంచి చిత్రకారుల చిత్రాల్ని కూడ “ఈమాట”లో ప్రచురించబోతున్నాం. చిత్రకారులు, ఛాయాచిత్రకారులు కూడ వారి వారి “రచన”ల్ని “ఈమాట”లో ప్రచురణ కోసం పంపవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.
మిత్రులు లేకపోయినా ఫరవాలేదు కాని, శత్రువు లేకుండా బ్రతకటం కష్టం. అజాత శత్రువంటే ఇక్కడ జీవన్మృతుడని అర్థం. ఇంతాజేసి, ఇదంతా ఒక ఆట. ప్రతి […]
అక్కడ… నా అలసటని అనుమానంగా ఆలోచనని అపహాస్యంగా చూస్తారు నా ఆదుర్దాని అనవసరంగా అశ్రువుల్ని అనర్ధంగా భావిస్తారు ఆశయాలూ, ఆదర్శాలూ నాకు సంబంధించిన మాటలుకాదంటారు […]
కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి. కీకారణ్యం. గహనాంతర సీమ! ఎంత ఆస్వాదించినా తనివి తీరని కాంతారం. ఇదీ వర్షారణ్యం అంటే!! ఆస్ట్రేలియాలో […]
జీవితసమరంలో అనుక్షణం ఓడి గెలుస్తూ ఊపిరి నిలిచిపోయినా, స్వాతంత్య్రపు స్వేచ్ఛావాయువుల్ని పీలుస్తూ .. నిర్జీవంగా నట్టింటి వసారాలో … మూసిన కళ్ళలోంచి రంగులనాటకాన్ని వీక్షిస్తున్నా […]
మబ్బులేమన్న కనిపిస్తున్నాయిర, రాం రెడ్డి అరుగుమీద మోకాళ్ళ మీద కుసుంట అడిగిండు. ఏది పటేలా కొంచెం చల్లబడ్డేటట్టుంది, బట్ట తడిశే సినుకులన్న పడ్తె మంచిగుండు, […]
బహుశ అందరికీ తెలిసినదే ఒక కధ ఉంది. ఒక వేళ కాని వేళ శ్రీరాముడికి నేనెవరన్న సందేహం కలుగుతుంది. వెంటనే వశిష్టులవారి ఆశ్రమానికి వెళ్ళి, […]
“మావిడికాయ పప్పు మహా అద్భుతం గా కుదిరిందోయ్ కాపోతే..కందిపప్పు కాస్తంత వేయించి వుంటేనా.., వర్సాగ్గా ముగ్గురూ కనబడే వారు, ఇంద్రుడి తో సహా.” అన్నాడు […]
సినిమాపాటలు ప్రపంచంలో మనదేశానికి ప్రత్యేకం. వాస్తవికత దృష్య్టా సినిమాల్లో అసలు పాటలుండాలా అన్న చర్చను పక్కన పెడితే సినిమాలతో సంబంధం లేకుండా పాటలు శాశ్వతంగా […]
సోమారమొచ్చిందంటే నాకు తిప్పలు మొదలయినట్టే. ఆ అస్సైను మెంటూ ఈ అస్సైనుమెంటు అంటూ దుంపతెంచుతారు అయ్యోర్లు అందులో ప్రభాకరయ్యోరి దగ్గర యవ్వారం మరీ దారుణంగా […]
గబ్బిల మేమని చెప్పెనొ
గుబ్బలి యల్లుండు కన్నుగోనల నశ్రుల్
గుబ్బటిల లేచి నల్లని
మబ్బులలో తక్షణంబ మాయం బయ్యెన్
అటు వైపు మా మేనేజర్ జెఫ్, ఇటు వైపు చిరకాల మిత్రుడు హమీద్ మధ్యలో నేను. ఇలాంటి చిక్కులో పడతానని నేనెప్పుడూ అనుకోలేదు. జెఫ్ […]
స్వేచ్ఛాగానం దివిలో ఊగే విహంగాన్ని భువిలో పాకే పురుగు బంధిస్తుంది గడియేని ఆగని సూర్యుణ్ణి గడియారపు బాహువులు బంధిస్తాయి పీతడెక్కల చంద్రుణ్ణి చేతులెత్తే సముద్రం […]
పండగ, సంబరం, ఆనందం. పట్టలేని విజయోత్సాహం. ఒకళ్ళ నొకళ్ళు కౌగిలించుకుంటున్నారు, అభినందించుకుంటున్నారు. కోలాహలం. కోల్పోయిన సాయంత్రాలూ, నిద్రలేని రాత్రులూ ఎన్నని? రెండున్నరేళ్ళ గొడ్డుచాకిరీకి గుర్తింపు,ప్రతిఫలం. […]
అకస్మాత్తుగా
ఒక రోజు
మృత్యు వృక్షం
వ్యత్యస్తంగా
తలకిందుగా
మొలిచింది.
కాంపౌండు వాల్ పక్కన వేపచెట్టు విరగబూసింది. ఫాల్గుణ మాసపు సాయంకాలం నులివెచ్చని గాలి చిరు చేదు సుగంధాన్ని కిటికీ లోంచి గదిలోకి మోసుకొస్తోంది. కిటికీకి […]
ఏం మడిసో! ఇల్లొదిలి బెట్టిపోయి, ఇయ్యాల్టికి పది రోజులైంది. ఒక మంచి లేదూ … చెడూ లేదూ, చచ్చాడో .. బతికేడో … కూడా […]
“బాపూ, మక్కప్యాలాలే ” “వద్దు బిడ్డ. కడుపుకొడ్తది.” “ఏం నొయ్యదే! అబ్బకొనియ్యే. అమ్మా, కొనియ్యే! ఊ … ఊ …” “పాప్కార్న్! గరం గరం […]
(6,000 రూపాయల ప్రథమ బహుమతి పొందిన కథ) తెల్లటి మంచు కప్పబడ్డ ఆ శవాలు రోడ్డు మీద … ఒక్కొక్కటీ పైకి లేచి వరుసగా […]
పొడుపు చుక్క యింకా పొడవనే లేదు. చీకటి దట్టంగా ముదరకాలిన కుండ తీరున్నది. ఊరుఊరంతా పోలీసొళ్ళకు భయపడి నక్కిన బుడతల తీరున గుట్టు చప్పుడు […]
1 తెలుగు రచయితలు తెలుగు సాహిత్యంలోనూ, ప్రపంచ సాహిత్యంలోనూ కలకాలం నిలబడేలా రచనలు చేసేలా ప్రోత్సహించాలనే ప్రయత్నమే తానా కథల పోటీ నిర్వహణ ముఖ్యోద్దేశ్యం[1]. […]
కథా సమీక్ష ఈ పోటీలో బహుమతులందుకున్న కథలన్నీ సమకాలీన పరిస్థితుల్ని విశ్లేషించేవే అయినా ఎంచుకున్న కథాంశాల్లో భిన్నత్వం ఉన్నవి. కష్టాల ఊబిలో కూరుకొని పోయి, […]