పాలగుమ్మి పద్మరాజు భమిడిపాటి జగన్నాథరావుల సాహిత్య సంభాషణం, బాలాంత్రపు వెంకటరావు తో ముఖాముఖీ ,
స్థానం నరసింహారావు పాటలు, పద్యాలు
మార్చి 2004
“ఈమాట” పాఠకలోకానికి పునః పునః స్వాగతం! ఉత్సాహంగా రచనల్ని పంపుతున్న రచయితలు, రచయిత్రులకు ఆహ్వానం. ఇప్పటివరకు పంపని వారికి మరోసారి మళ్ళీ! “ఈమాట”కు పంపిన […]
పదహారేళ్ళ మా పిల్లాడు ఒక కేథలిక్ హైస్కూల్లో పదకొండవ తరగతి చదువుతున్నాడు. వాడి చిన్నప్పటి నించీ వాడిని పెంచడంలో ఎక్కడ తప్పులు చేస్తానో అని నన్ను నేను చెక్ చేసుకుంటూనే వస్తున్నాను. నాకిష్టం లేకపోయినా అమెరికన్ ఫుట్‌బాల్ టీమ్‌లో చేరనిచ్చాను. వాడికోసమని అర్థం కాకపోయినా వాడి ప్రతీ మాచ్కీ వెళ్ళాను. నెగ్గినప్పుడల్లా వాడితో పాటూ నేనూ సంతోషించాను. ఓడినప్పుడల్లా వాడితో పాటూ నేనూ విచారిమ్చాను. ఐదవ తరగతి నించీ వాడిని ప్రైవేటు స్కూళ్ళో చేర్పించాను ఖర్చు ఎక్కువైనా. వాడికి కావలసినవన్నీ కొంటూనే వున్నాను. వాడికి స్నేహితుడిలా కూడా ప్రవర్తించేవాడిని. ఫ్రీగా ఆర్య్గూ చేయనిచ్చేవాడిని. బేంక్ బేలన్సులూ, నా జీతం అన్నీ తెలుసు వాడికి. చిన్నపిల్లాడిలా ట్రీట్ చెయ్యకుండా అన్ని విషయాలూ చెప్తూవుండేవాడిని. అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చేవాడిని ఏం కొనుక్కోడానికన్నా. నాకిష్టం అయిన కర్నాటక సంగీతం క్లాసులు మానేసి, వాడి కిష్టమయిన కరాటే క్లాసులకి వెళతానంటే అలాగే ఒప్పుకున్నాను. పక్కా శాఖాహారినయినప్పటికీ, స్కూళ్ళో మాంసం తినడం నేర్చుకుని ఆ రుచుల కోసం అడుగుతూ వుంటే, వాడి కోసమ్ నేర్చుకుని ఇంట్లో మాంసం వండేవాడిని.
ఇండియా ప్రయాణం అంటే నాకు మహా ఇష్టం. ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళినప్పుడల్లా, ఓ నెల్లాళ్ళు ఆనందంగా గడిపేస్తాను. నిన్ననే మా […]
వెనక్కి రాదు దూరాల సొరంగంలోకి జారిపోయాక, రైలు. కాసేపే ఇక్కడి యీ వెతుకులాటలూ బతుకుపాటలూ ఎదురుచూపులూ తలపోతలూ చివరి ఎడబాటు దాకా. వస్తున్నప్పుడు ఎంత […]
తడి తడి గుడి జారుడు మెట్ల పాదగయ కోడి కూయకముందే కొలువు తీరిన కుక్కుటేశ్వరుడు. అరుగు మీద అమ్మ నోము (వాయనాల్లో వర్ణ భేదం) […]
నువ్వొచ్చే దాకా ఆకాశంలో విహరించేవాడిని నువ్వొచ్చి భూమ్మీదకు తీసుకొచ్చావు ఆకాశం లో మేఘం లా విహరించే నేను చల్లని నీ చూపు తాకి వర్షమై […]
జీన్ కొడుకు ఫ్రాంకీ అరుస్తూ లేచాడు. ఈ మధ్యన ఈ అరుపులు ఎక్కువయ్యాయి వారానికి రెండు, మూడు సార్లు, రాత్రి మూడింటికీ, ఐదింటికీ కూడా. […]
బలిచ్చేందుకు తీసుకెళ్తున్న పశువు చివరిసారిగా తాగడానికి నీళ్ళిస్తే, ఆ ఇచ్చే మనిషిని ఎంతో నమ్మేసి, తన మీద ప్రేమతోటే ఇదంతా అని నమ్మినట్టు శ్రీను […]
నాలుగు వేడి వేడి ఇడ్లీలు ఆరగించి, ఇంటి ముందు వరండాలో సుఖంగా మడతకుర్చీలో చేరాడు ధర్మారావు. దాదాపు తొమ్మిదిన్నర అవుతుంది. ఇంటిముందూ, వీధిలో అంతా […]
ఎంత పెద్ద నోటున్నా
చిల్లరగా మార్చలేని
చిన్నబోయినతనమో
ప్రఖ్యాత చిత్రకారుడు బాపు తనకెంతో నచ్చిన బడేగులాం అలీఖాన్ బొమ్మ గీసి, తెరిచిన ఉస్తాద్ నోట్లో కోయిల పాడుతున్నట్టు చూపారు. హిందుస్తానీ సంగీతాభిమానులకు చిరపరిచితుడైన […]
యీ “సముద్రం”లో అన్వేషణ వుంది. గుర్తు పట్టే చూపుంది. చుట్టూ పరిగెత్తమనే పరిస్థితులున్నా తమలోకి తాము చూసుకొనే మనుష్యులు మనకి స్నేహితులవుతారీ “సముద్రం”లో.
భూషణ్ కథల్లో ముఖ్యమైన వస్తువు స్త్రీపురుష సంబంధం. ఒక యువకుడు ఉంటాడు. మిత భాషి. తన ప్రవర్తన, వ్యక్తిత్వం ఆమెకు ఇష్టం; నిన్నుప్రేమిస్తున్నాను అని చెప్పనవసరం లేకుండానే ఆమె తనను అర్థం చేసుకుంటుంది అనుకుంటుంటాడు. కాని అలా జరగదు. ఆమె దూరం అవుతుంది. అతని ప్రయత్నం లేకుండానే మరోస్త్రీకి దగ్గిరవుతాడు; లేక మొదటి స్త్రీ తిరిగి అతనికి దగ్గిరవుతుంది. ఇంతకంటే లోతుగా ఈ సంబంధాన్ని పరిశీలించటం ఈ కథల్లో కనిపించదు.
(తమ్మినేని యదుకుల భూషణ్ కవితాసంకలనం “చెల్లెలి గీతాలు” పై సమీక్ష) ఈ కవితలు చదివే ముందు ఒకసారి, వర్తమానాన్ని వదిలి బాల్యంలోకి తిరిగి పయనించేందుకు […]