రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఒంటరితనం

రచన: విన్నకోట రవిశంకర్
మార్చి 2000

(విన్నకోట రవిశంకర్‌ గారు “ఈమాట” పాఠకులకు చిరపరిచితులు. ప్రఖ్యాత కవి. “కుండీలో మర్రిచెట్టు” అనే కవితా సంకలనం ప్రచురించారు. మరో సంకలనం సిద్ధం చేస్తున్నారు. సౌత్‌ కేరొలైనా లోని కొలంబియాలో ఉంటారు.)

ఏ చిరు దీపమూ పెదవులు సాచి
మృదువుగానైనా  చుంబించకనే గదా
ఈ ప్రమిదలో వత్తికి
వేడి,వెలుగుల అనుభవం లుప్తమై పోయింది.

ఏ కొమ్మా తన పలుకులకి
తన్మయత్వంతో తలాడించకనే గదా
ఈ చిలుక పాత మాటల పంజరంలో
బందీయై పోయింది.

ఒకసారి ప్రేమగా వెలిగిస్తే చాలు
ఆపై కోరికతో జ్వలించి
ఆనంద నాట్యం చెయ్యటం,
దీపానికెవరూ నేర్పనక్కర్లేదు.

దయ తలచి,నాలుగు వేళ్ళు
దాని పంజరపు తలుపు తెరిస్తే చాలు
రెక్కలు టపటపలాడిస్తూ రాగాలాలపించటం
పిట్టకెవరూ నేర్పనక్కర్లేదు.

నునువెచ్చని అరచేయి యేదీ
తనను స్పృశించకనే గదా
ఈ భుజం మీద ఒంటరితనం
యింతగా గడ్డ కట్టింది.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • రెండు శరీరాలు
  • పాత పద్యం
  • తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు
  • పాత పద్యం
  • కవితల ఇంద్రధనుస్సు

ఇటువంటివే…

  1. ఒంటరితనం
  2. అవ్యయ: అపరాహ్ణము
  3. సంక్రాంతి లక్ష్మికి స్వాగతం (పాట )
  4. చెట్లు
  5. త్రిశంకు స్వర్గం

మార్చి 2000 సంచికలో ...

  • బహుశా ఇంకో నిజం
  • అనువాద కళ నా అనుభవాలు
  • అమెరి”గల్పిక”
  • ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం)
  • ఒంటరితనం
  • ఓహో యాత్రికుడా..
  • కొడుకుల శివరాం భాగవత గానం
  • కొత్త పదకేళి
  • చాసో కథ
  • తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు 4, 5
  • నిజంగా …
  • పందెం ఎలకలు
  • మహాభారతం ఏం చెప్తుంది? ఒక కొత్త కోణం
  • మార్చ్‌ 2000
  • యోర్హే లూయీ బోర్హేస్‌కవితలు
  • వంగూరి ఫౌండేషన్‌ సాహిత్య వ్యాసంగాల ప్రకటన
  • షికారు పోయి చూదమా ….
  • సంక్రాంతి లక్ష్మికి స్వాగతం (పాట )
  • సాహితీ చమత్కారాలు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

వంగూరి ఫౌండేషన్‌ సాహిత్య వ్యాసంగాల ప్రకటన
షికారు పోయి చూదమా ….

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.