రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఆఖరి మనిషి

రచన: విన్నకోట రవిశంకర్
జులై 2012

క్రమక్రమంగా
మరణానికి అలవాటుపడటమే
జీవితంగా మారిపోతుంది.
పావురాలకి బదులు తీతువు పిట్టలు
ఉత్తరాలు మోసుకువస్తాయి.

చిన్నప్పటి గ్రూప్‌ఫోటోలో
చిరునవ్వులు చిందించినవారంతా
ఎవరి ఫొటో వారు వెతుక్కుని
వెళ్ళిపోతారు

నటులేకాదు, ప్రేక్షకులు కూడా
ఒకరొకరుగా నిష్క్రమిస్తారు.
రంగస్థలం మీది విషాదానికి
కలిసి కన్నీరు పెట్టటానికి
ఇరువైపులా ఎవరూ కనబడరు

ఆకులతోబాటు
ఈ “సంసారవృక్షం”
వేళ్ళు కూడా ఒకటొకటిగా
పోగొట్టుకుంటుంది

అన్ని ముడులూ విడిపోయాక
అన్ని తీగలూ తెగిపోయాక
ప్రపంచంతో కలిపే ఏకైక సూత్రంలా
శుష్కించిన ఒక శరీరం
మిగిలిపోతుంది.

    
   

13అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Narayana Ga. July 1, 2012 10:13 pm

    రవిశంకర్ గారు,

    ఎప్పుడూ మృదువుగా తాకే మీ కవిత్వానికి ఎప్పటిలాగే జోహార్లు. ఈ ఆఖరిమనిషి ‘తన ఆఖరి రోజులలో మనిషి ‘ అనుకోవాలా? లేక ‘ఆఖరిగా పోయే మనిషి ‘ అనుకోవాలా? నాకు తెలియకుంది.

    గ్రూప్‌ఫోటోలోనే కాదు అనేకానేక జ్ఞాపకాలలో సజీవంగా నిలిచిపోయిన మితృలంతా కూడా ఎప్పటికీ సజీవంగానే చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోతేనే బాగుండుననిపిస్తుంది.

    చావు మాత్రమే ఆఖరి మజిలీ అని తెలిసినా అంతులేని ప్రేమ, వ్యామోహం పరిచయమైన ప్రతి సజీవ తలంపులపైనా ఉండిపోతోంది.

  2. 2
    m s naidu July 2, 2012 8:03 am

    ఆఖరి మనిషి
    ఒక శరీరం
    కాదేమో

  3. 3
    ఆర్.దమయంతి. July 5, 2012 6:46 pm

    బ్రతుకు నాటకం ముగిసాక, రంగు కడిగేసిన పాత్ర కి ప్రతిబింబం – ఈ కవిత..
    జీవితం అంటే – ‘ అసలైన విషాదాన్ని ‘ తెలుసుకోడం!

  4. 4
    aditya reddi July 6, 2012 7:33 pm

    రవిశంకర్ గారు – అందరు అలానే ఉంటారా !చిరునవ్వుతో ఎదురేగిన వారు ఎందరు లేరు. తోటి మనుషులతో సంబంధం లేకుండ తన గూటిలో తనకోసం బ్రతికే వారికి మాత్రమే యిలా

    “క్రమక్రమంగా
    మరణానికి అలవాటుపడటమే
    జీవితంగా మారిపోతుంది.
    పావురాలకి బదులు తీతువు పిట్టలు
    ఉత్తరాలు మోసుకువస్తాయి.”

    మరణం అనివార్యం అని తెలుసుకున్నవారు, సమాజం కోసం పనిచేసిన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు.వాళ్ళు ఎవరు యిలా శరీరాన్ని ‘ఓటికుండ’గా భావించరు అనుకుంటాను. నిరాశా జీవులు మాత్రమే యిలాంటి భావాలను కలిగి ఉంటారు.

  5. 5
    ravikiran timmireddy July 7, 2012 11:21 pm

    “క్రమక్రమంగా
    మరణానికి అలవాటుపడటమే
    జీవితంగా మారిపోతుంది.”

    నిజవేనండి, ఎప్పుడూ చూడని ఈ చావు హఠాత్తుగా అనుభవం లోకి వస్తుంది. మరలా, మరలా నేనున్నానని చెబుతూనే ఉంటుంది. కానీ రవిశంకర్ గారు ఈ రంగస్థలం ఎప్పటికీ ఖాళీ కాదు, ప్రేక్షకులు మారుతారు, మారిన వారే మన వారవుతారు. బతుకులో దుఖం, సుఖం కూడా అదే కదండీ.

    -కిరణ్

  6. 6
    Dadala Venkateswara Rao July 8, 2012 1:53 pm

    మనిషి బ్రతికే ఉన్నాడు
    ఆఖరి వరకు బ్రతికే ఉంటాడు
    మరణం తప్పని మానవుడు
    తన ప్రాణాలను మాత్రమే విడుస్తాడు
    జీవితం అనే సంసారవృక్షం సాయంతో
    తన రూపాన్ని ఈ భూమిపై
    విడచి వెళుతున్నాడు
    నిరంతర మనుగడ
    సాగిస్తున్నాడు

  7. 7
    satya July 9, 2012 3:41 am

    నటులేకాదు, ప్రేక్షకులు కూడా
    ఒకరొకరుగా నిష్క్రమిస్తారు.
    బాగుంది

  8. 8
    నాగరాజు రవీందర్ July 14, 2012 12:46 pm

    మీ కవిత చదవగానే నచ్చింది. దీనిని ఆంగ్లంలోకి తర్జుమా చేస్తే ఎలా ఉంటుందో చూడాలనిపించి వెంటనే చేసేయడం జరిగింది. చదివి మీ అభిప్రాయం తెలియజేస్తారని ఆశిస్తూ…

                     The last human 

    Gradually adapting to the death only
    Becomes the way of life
    Instead of pigeons “theetuvu ” birds
    Start carrying the letters.

    They find their own photo
    And go away –
    Those who flashed smiles 
    In their childhood group – photograph. 

    Not only the actors but also the 
    Audience leave one by one. 
    There wont be anyone to shed the tears 
    together on both the sides 
    For the trajedy on the stage

    Along with the leaves this “samsara vrkhsham”
    Loses its roots one by one

    After all the knots get loosened
    And after all the strings get broken
    The emaciated body would be left behind
    Like a single thread connecting with the world. 

  9. 9
    రవిశంకర్ July 16, 2012 9:16 pm

    రవీందర్ గారు – మీ ప్రయత్నానికి ధన్యవాదాలు. భావం తెలుస్తోంది. మరికొంత మెరుగుపరచవచ్చునేమో చూడండి.
    వ్యాఖ్యలు రాసిన ఇతరులకు కూడా ధన్యవాదాలు. ఒక చిన్న వివరణ. ఒక తరంలో ఆత్మీయులు, సహచరులు, తాము ఆరాధించిన సెలబ్రిటీలు ఒకరొకరుగా వెళ్ళిపోయాక, మిగిలిన మనుషుల అంతరంగచిత్రణ కోసం చేసిన ప్రయత్నం ఈ కవిత. ఇక్కడ ఆఖరి మనిషి అంటే అర్థం అదే. అంతేగాని, మానవజాతి నశిస్తుందని నా ఉద్దేశం కాదు. – రవిశంకర్

  10. 10
    తః తః July 26, 2012 12:37 am

    రవిసంకర్
    మీ కవిత చిన్నప్పుడు పదకొండవ తరగతి లొ చదువుకున్న
    T Moore రాసిన The Light of Other Days అన్న పద్యాన్ని – అందులొ లొ రెండొ భాగాన్ని ముఖ్యం గా -గుర్తు కు తెచ్చింది.
    OFT in the stilly night
    Ere slumber’s chain has bound me,
    Fond Memory brings the light
    Of other days around me:
    The smiles, the tears
    Of boyhood’s years,
    The words of love then spoken;
    The eyes that shone,
    Now dimm’d and gone,
    The cheerful hearts now broken!
    Thus in the stilly night
    Ere slumber’s chain has bound me,
    Sad Memory brings the light
    Of other days around me.

    When I remember all
    The friends so link’d together
    I’ve seen around me fall
    Like leaves in wintry weather,
    I feel like one
    Who treads alone
    Some banquet-hall deserted,
    Whose lights are fled
    Whose garlands dead,
    And all but he departed!
    Thus in the stilly night
    Ere slumber’s chain has bound me,
    Sad Memory brings the light
    Of other days around me.
    తః తః

  11. 11
    రవిశంకర్ July 28, 2012 4:51 pm

    తఃతః గారు – ఈ పద్యం నేనింతకుముందు చదవలేదుగాని, ఒక మంచి పద్యాన్ని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. పద్యం రెండవభాగం గురించి మీరు చెప్పింది కరక్టే. ఇందులో వర్ణించిన అనుభవం సార్వజనీనమైనదే కదా. – రవిశంకర్

  12. 12
    ananth mallavarapu August 3, 2012 12:11 pm

    కవిత బాగుంది! కాకపొతే కాస్త భారంగా గంభీరంగా ఉంది.
    ఆఖరి మజిలి అందరికి చావే కాబట్టి, తప్పని మరణాన్ని తలుచుకుంటూ కుచించుకు పోవడం కన్నా,
    ఉన్నన్ని రోజులూ ఉత్సాహంగా, ఉల్లాసంగా బతకడమే ఉత్తమం.

  13. 13
    rama bharadwaj August 7, 2012 6:21 am

    పంతొమ్మిదివందల డెబ్భయిల్లో కాబోలు – బహుశా మల్లాది శివరాం రచన అనుకుంటాను – ఆకాశవాణి నించి ఒక పాట ప్రసారం అయ్యేది. ఆ పాట వినీవినగానే నన్ను ఆకట్టుకుంది. నా యుక్త వయసులో నాకు బాగా ప్రేరణనిచ్చిన పాటగా నేను దీన్ని గుర్తుంచుకున్నాను. ఇప్పటికీ ఈ పాట నాకిష్టమైన పాటల్లో ఒకటి. ఎప్పుడూ సన్నగా కూనిరాగం తీసుకునే పాటగా నా గొంతులో ఉంటుంది. ఆ పాట ఇలాంటి మాటల్లోంచి నడుస్తుంది. జీవితాన్ని మల్లాది శివరాం ఇలా పాడారు. అందులోంచి ఆయన మరణాన్ని ఇలా చూపించారు. పాట ఇదీ!

    ఈ లోకంలో ఈ నా దేశంలో ఈ నా ఇప్పటి దేహంతో
    ఎన్నాళ్ళైనా బతకడమిష్టం ఎపుడు రాలినా ఇష్టం!

    పొరపాటునా మోక్షం వస్తే పుట్టుక లేకుండా పోతే
    ఇలా తలానికి దూరంగా ఎలాగన్నదే నాకు భయం /ఈ లోకంలో/

    సంసారం సాగరమైతే జలక్రీడగా జీవనమిష్టం
    తిరిగిపుట్టుటకె మరణంబైతే మరణం అంటే మరి మరి ఇష్టం /ఈ లోకంలో /

    నిత్యం తలుచుకోబుద్ధయ్యే ఈ పాట తరవాత ఇక్కడ ఉన్న రవిశంకర్ కవిత చదివేకా ఒక్కో కవి బతుకుని ఎలా చూస్తాడో ఎలా చూపిస్తాడో కదా అని మాత్రం అనిపించింది. అంతే !! 🙂

    రమ.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • e తరమ్‌ (నాటిక )
  • శత్రువు
  • క్షమాపణ
  • శివకాశి
  • గతచిత్రం

ఇటువంటివే…

  1. చీలిన మనిషి
  2. మనిషి మృగం
  3. ఏండ్రాయిడ్ మనిషి
  4. Doors Closing – ఆఖరి భాగం
  5. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం)

జులై 2012 సంచికలో ...

  • అంతరం
  • అమ్మ గోపెమ్మ
  • ఆంధ్రభాషలో చరిత్రాత్మక నవల
  • ఆఖరి మనిషి
  • ఇటు నేనే – అటు నేనే
  • ఈమాట జులై 2012 సంచికకి స్వాగతం!
  • ఉరుము ఉరిమి…
  • కాల్వీనో కథల నుంచి – 4
  • చరిత్రాత్మక నవల అంటే?
  • చారిత్రక నవల: కొల్లాయి గట్టితే నేమి?
  • జీవిత నవల – 1
  • జుగల్‌బందీ
  • తెలుగు వ్యాకరణాల పరిచయం
  • నాకు నచ్చిన పద్యం: ద్రౌపది పరివేదన
  • నైరూప్యచిత్ర కళాయాత్రికుడు
  • బింబం
  • మత్తకోకిల కథ
  • మూడు లాంతర్లు – 11
  • యజ్ఞం కథ: మరో పరిశీలన
  • రెండు కవితలు – ఇద్దరు కవులు
  • వేసవి
  • స్మృతి
  • హోమగుండం: కథ నచ్చిన కారణం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

మత్తకోకిల కథ
నైరూప్యచిత్ర కళాయాత్రికుడు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.