రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

కాలాతీతం

రచన: విన్నకోట రవిశంకర్
జనవరి 2002

సమయం ఎక్కువగా లేదు
కిరణాలు కిరణాలుగా దొరికే వెలుగులతో
ఈ చీకటి గుహల్నింక తవ్వలేను.
దేనికేదో తెలియని తాళాల గుత్తితో
లెక్కలేనన్ని చెరసాలల్ని తెరవలేను.

ఒక కల్లోలిత తీరాన్ని వదిలి
వేరొక తీరాన్ని  చేరేందుకు సాగిన నావ
ఒక ఊయల నందుకోవటానికి
మరొక ఊయల విడిచిపెట్టిన చెయ్యి
సాహసవంతమైన ఒక మార్పుకోసం
క్షణకాలం కూడా వేచిఉండలేను.

అన్నీ నమ్మటం నేరం
అన్ని నమ్మకాల్నీ పోగొట్టుకోవటమూ నేరం.
నిరంతరం వీచే సందేహాల పెనుగాలులకి
రెపరెపలాడే దీపాన్ని
కాలిన అరచేతులతో కాపాడలేను.

కదలని కంటితో కావలసిందేదో పోల్చుకోవాలి
పదునైన ముక్కుతో చటుక్కున అందుకోవాలి
సమయం ఎక్కువగా లేదు
అలసిన రెక్కలకిక ఆకాశం ఆటస్థలం కాదు.

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    PAPARAO September 13, 2013 12:44 pm

    జీవతములో అథ్యాత్మిక భావాలు ఎలా విస్తరించుకోవాలో హ్రుద్యంగా చెప్పిన మీ కవిత చాలా బాగుంది

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • ఇద్దరు మిత్రుల కొత్త కవితా సంపుటాలు
  • కాలాతీతం
  • ఆఖరి మనిషి
  • చలన చిత్రం
  • కథాంతం

ఇటువంటివే…

  1. దీపాన్ని చూస్తున్నా
  2. కోరిక
  3. నిద్ర
  4. నిద్రానుభవం
  5. మార్పు లేదు

జనవరి 2002 సంచికలో ...

  • అంటు, అత్తగారు
  • అమ్మకు తెలిస్తే
  • ఏమైనా చేస్తాను
  • కల చెదిరింది
  • కవిత్వ మీమాంస
  • కాలాతీతం
  • జనవరి 2002
  • ద్వంద్వం
  • నటన
  • నిరంతరం
  • ప్లే స్టేషన్
  • బర్త్‌డే
  • మార్పు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

నిరంతరం
అమ్మకు తెలిస్తే

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.