రచయిత వివరాలు

పాలపర్తి ఇంద్రాణి

పూర్తిపేరు: పాలపర్తి ఇంద్రాణి
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

 

సూర్యునిలాగా
తల ఎగరేస్తూ
నిప్పులు విసిరేది
చంద్రునిలాగా
నవ్వులు పేల్చే
మల్లెలు విరిసేది
మబ్బు తునకలా
తల వంచుకుని
సాగీపోయేది

చలికాలం,
మంచు సరస్సు కింది
చేపలా మారేందుకు
గుహలో ఎలుగులా
మూడంకె వేసేందుకు
చీకటి నదిలో
సుషుప్తిలోకి జారేందుకు

ఎవరి గ్రంథం వారే అచ్చువేయించుకోవలసి రావడం కవులకు ఎంత దౌర్భాగ్యమో వివరిస్తూన్న శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి అనుభవాలూ-జ్ఞాపకాలూనూ పుస్తకం రెండవభాగం నుంచి 35వ ప్రకరణం, పఠనరూపంలో.

పూర్వం, ఎప్పుడో ఒక ఉత్తరం వచ్చేది యోగక్షేమాలను తెలియజేస్తూ. వ్యక్తులు అవసరం మేరకు మాట్లాడేవారు. అంచేత ఏ వ్యక్తి అయినా అవతలివారికి ఎంత మేరకు అవసరమో అంతే తెలిసేవారు. ఇప్పుడు దాదాపుగా ప్రతి వ్యక్తి సోషల్‌ మీడియాలో ‘ఎవైలబుల్’గా అందుబాటులో ఉంటున్నాడు. ప్రతిరోజు అనేక విషయాల మీద తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వాటి మీద చర్చోపచర్చలు చేస్తున్నాడు.

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు గిడుగు రామ్మూర్తి పంతులుగారిని కలుసుకున్న సందర్భాన్ని వ్యాసరూపంలో, వారి ప్రబుద్ధాంధ్ర పత్రికలో (డిసెంబరు10, 1935) ప్రకటించారు. ఆ వ్యాసపు పఠనరూపం ఇది.

మన ఇలాకాలో మొనగాడిని
బంగారు పతకాల వేటగాడిని
ఏమనుకున్నావ్,మామయ్యంటే?
ఆ పురవీథుల్లో యువసింహాన్ని
నా బ్లాక్‌ అండ్ వైట్‌ కాలానికి
నేనే ఈస్టమన్ కలర్ హీరోని!

భారత దేశపు బీద అమ్మాయిలందరిలాగే ఓపికమ్మకు ఓపిక ఎక్కువ. పదిహేనేళ్ళకే పెళ్ళి చేస్తే అప్పటి వరకూ ముక్కూ మొహం తెలియని అత్తవారింటికి వెళ్ళి ఓపికగా ఇంటెడు చాకిరీ చేసింది. కాలక్రమేణా ముగ్గురు మగ పిల్లలు, ఓ ఆడ పిల్ల పుడితే వారందరినీ ఓపికగా సాకింది. ఇంతలో భర్తను గిట్టని వారెవరో జైలు పాలు చేయగా సంసారం కిందపడ్డ గుమ్మడికాయలా ముక్కచెక్కలు కాకుండా ఓపికగా కాచుకుంది.

కాలాన్ని ఒడ్డి ఈ గులక రాళ్ళను ఏరుతున్నాను
శక్తిని పోసి ఈ నౌకను నీళ్ళపై నిలుపుతున్నాను

సంకల్పాల పాచికలను నక్షత్రాల వీథుల్లోకి విసురుతున్నాను
పాలపుంతల దారుల్లో నీ పేరే పిలుస్తున్నాను

కాంతిల్లు నీ ఎఱుకలో అమ్మా, రేణువులుగా విడిపోతున్నాను.

కాశ్మీరు సైనికుడి రక్తమంటిన అరువు రాయి
అటవీ అధికారులపై ఎర్ర చందనం కూలీ రాయి
వాహన చోదకుని రక్తమంటిన నిర్లక్ష్యపు రాయి
స్థలాల దురాక్రమణల్లో కాళ్ళొచ్చిన రాయి
మృత కథలని మోస్తున్న చరిత్ర రాయి
మోసులెత్తిన ఆశలను మోస్తున్న పునాది రాయి

లోకపు పచ్చి వాసనలను
కప్పి పెడుతున్న
రాత్రి

కన్ను పొడుచుకున్నా
కానరాని చీకట్లలో
కరుకు గొంతుకతో
గాలి హూంకరిస్తున్న
రాత్రి

కవుకుదెబ్బలే​-​
చీకట్లో ఉఫ్ ఉఫ్‌మని
ఊదుకొమ్మంటోంది
నువ్వు కట్టుకున్న
పేక ముక్కల
​గీర మేడల్లో ​
ఎవరికీ తెలీకుండా
ఘొల్లుమని
ఏడవమంటోంది

జిరాఫీ విజిటర్స్ వంక తూస్కారంగా చూసి నాలుగు ఆకులు పీకి చపక్ చపక్ మని నముల్తోంది కారా కిళ్ళీ నమిల్నట్టు. ఏనుగులు నిద్రలేచి దుమ్ము స్నానాలు చేస్తన్నాయి. పక్కన్నే తొట్లల్లో నీళ్ళు. ఎన్నియల్లో మల్లియల్లో అని పాడుకుంటా తానాలు చేసుంటాయి చిన్నప్పుడెప్పుడో అడవుల్లో. వాటిని పాపం ఎర వేసి. వల వేసి. పట్టార్రా మామా.

ఆయినెవరో డైరెక్టరునని షే​కాం​డ్ ఇ​త్తా​డా, అంతలో శ్రీశ్రీ నీ చెవి పక్కక్కొచ్చి బానిసకొక బానిసకొక బానిసకొక బానిస అంటాడు. ఇంకో​ ​ఆయన​ నేనే ​మ్యానేజరునని షే​కాం​డ్ ఇత్తాడా, మళ్ళా శ్రీశ్రీ ఎనకమాలగా వచ్చి బానిసకొక బానిసకొక బానిసకొక బానిస అంటాడు. ఇంకప్పుడు శ్రీశ్రీ మీన గయ్యిమని లేత్తావ్. నీ సాగిత్యాలన్నీ చెత్త బుట్టలో బెట్టి కిలోల్లెక్కన అమ్మిపార్నూకి, ​మేయ్, ​లగెత్తు!

ఆళ్ళేమో నీకు లిఫ్ట్ దగ్గిరే ఎదురౌతారు డవ్వు సబ్బు వాసనల్తో నీలి మబ్బు నురగలో కాలు జారి పడ్డ వేళ నీకు నిద్దరే నో నో అనేసి న్యూడ్ బార్స్‌లో లాప్పులమ్మా, అప్పల్నర్సమ్మా నువ్వెళ్ళి సాగర సంగమం, శంకరాభరణం సూసుకో బుజ్జమ్మా, మేవలా పోయొస్తామని–చిలిపి చిలిపి కవ్వింత కబుర్ల కళ్ళతో అలాలాలా లిఫ్టు దిగిపోతా ఉంటే, ఆళ్ళు కుర్రోలమ్మా…

ఇంతలో హడావిడిగా సుబ్బారావు అచ్చటికి వచ్చెను. నావైపుకి అభిముఖుడై వచ్చుచూ ఏమాలోచించుచున్నారని అడిగెను. భళారే విచిత్రం పాటను గూర్చి ఆలోచించుచుంటినని, అటులనా, ఎంతైనా నా ముందు తరము వారు కదా! అని వెటకారముగ బలికి నవ్వెను. వంకాయవంటి కూరయు వంకజముఖి సీత వంటి భార్యామణియు అన్న నానుడి తెలుసునా అనగా తనకు సంస్కృతము రాదనెను.

కొనండి. కొనండి. బొమ్మలు. కిచెన్ వేర్. సైకిళ్ళు. దుప్పట్లు. రగ్గులు. బొగ్గులు. డీల్స్! డీల్స్! భలే మంచి చౌక బేరము. ఆలసించిన ఆశాభంగము. మోడల్స్ ఓసారి ఉంచినవి ఇంకోసారి ఉంచరండీ ఇక్కడ. తర్వాత కొనుక్కుందాం అంటే మళ్ళా దొరకవండీ. మాయావిడ ఇదే పని మీదుంటాది. ఎక్కడెక్కడ ఏం డీల్స్ ఉన్నాయా అని. షీ ఈస్ వెరీ ఇంటెల్లిజెంట్ యూ నో?

ఆ మాటలలో తెలుగు వానికి అస్థిమూలగతమై ఒనరెడు సినిమాల పిచ్చి అతగానికీ గలదని, చిరంజీవి నట కుటుంబమన్న ఒళ్ళు మరచునని తెలిసికొని నవ్వితిని. చిరంజీవి సినిమా పాటలన్న ప్రాణమని, ఆ పాటలు చెవుల బడినంతనే అశక్తుడై ఆనందము ఆపుకొనలేక బ్రేక్‌నృత్యము కూడా చేయబూనునని తెలిసి అమేజ్మెంటు నొందితిని.

మంకెన పువ్వులు విచ్చే కాలం
పచ్చని ఆకులు మెరిసే కాలం
వెన్నెల పువ్వులు తురిమే కాలం
చంద్రుని చల్లని ముద్దుల కాలం
సూర్యుని వెచ్చని కౌగిలి కాలం

నడి రేయి దొంగ! దొంగ! పట్టుకో! పట్టుకో​మ్మని ​ రామయ్య కేకలు బెట్టె. ‘దొంగోడు సంచీ​ బట్టుకోని లగెత్తాడు​ గురవయ్యా!’ అంటానే ఆడి ఎంటబడ్డాడు రామయ్య. ఎనకమాల్నే మేవూ పరుగునొస్తన్నాం. ఆడ్ని ఎట్నో అందుకోని చేతిలో ఉన్న కర్రతో కాలిమీద ఒక్క దెబ్బేసినాడు. ఆడు ​సచ్చాన్రా నాయనో అనరిచినాడు​. ​అదే ఊపులో ఇంక రెండు దెబ్బలు బడినా​యోడికి​. ​ఆ దెబ్బకి ​ఆడి చేతిసంచీ జారి కింద​బడ్డాది.

తాను ఈమధ్యే ఒంగోల్లో చూసొచ్చిన కొండవీటి దొంగ సినిమా ఎత్తుకోని వైనవైనాలుగా చెప్పడం మొదలుపెట్టాడు కోటిగాడు. సినిమా కతలు చెప్పమంటే యమాజోరు కోటిగానికి. స్టోరీ అయిపోతూండగానే కుంట వచ్చేసింది. అక్కడ ఎక్కువ వెయిటింగు లేకుండానే దోర్నాల పోయే బస్సు వచ్చేసింది. కిక్కిరిసిపోయి ఉంది. వీళ్ళకి సీట్లు దొరకలా. కండక్టరు మా ఒడుపుగా అందరిమధ్య దూరిపోతూ టిక్కెట్లు కొట్టేసి తన సీట్లో దర్జాగా కూచున్నాడు.

అడవిలోనే చెట్టు కింద శిధిలావస్థలో దొరికింది ఓ విగ్రహం తల. వీరభద్రుడట. గోతాంలో ఉన్నాడు. ఆటవికులెవరో పూజలు చేయడం మానేసి వదిలిపెట్టిపోయిన విరిగిపోయిన విగ్రహం తాలూకూ తల అని నిర్ణయించారు వాళ్ళు. చివరికి వాళ్ళింటిలోనే పూజ గదిలో ఉంచాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా నలుగురూ కలిసి మోసుకు వెళ్ళి పూజగది ముందు ఉంచి ఇంక వెళ్ళొస్తామని వెళ్ళిపోయారు.

ఇన్నేసి మతాలు, ఆచారాలూ , వాటితో పోరాడుతూ నిబ్బరంగా సాగుతూంటారు ఈ చిన్ని గుంపులోని మనుషులు. మత మౌఢ్యం పెద్ద పులి. వేటాడుతుంది వీరిని.

అప్పుడెపుడో చిన్నపుడు గుళ్ళో ఉన్నప్పుడు భోరున వర్షం కురవడం మొదలై అక్కడే కూచుండిపోతే ఆ చీకట్లో దీపపు వెలుగులో ఉన్నట్టుండి మెరుపు మెరిసి ఆ తెల్లటి వెలుతురు తెర వెనుక వెచ్చగా –

ఆ ఇంటికి నిండుగ
కొలువు తీరినవి
నిక్కి నిక్కి
చూస్తూ ఉన్నవి
బారులు తీరి
రంగు రంగుల
పిట్టల బొమ్మలు

కందుకూరి రమేష్ బాబు సామాన్యుల జీవితాలను ఇష్టంగా రికార్డ్ చేస్తున్నారు. వారి బతుకులను తన కెమెరాతో బొమ్మలు తీస్తున్నారు.వారి జీవితాలను గానం చెయ్యడమే తనకు సంతృప్తినిస్తుందని చెబుతున్నారు. జర్నలిజంలో పుష్కరకాలం పైగా ఉన్నారు.సామాన్యుల జీవిత పరిచయాలే వీరికి వృత్తీ, వ్యాపకం.

ముసలి కట్టెల మీది మంటల గుబురుల్లోంచి గంగ వైపుకి పాకే తెల్లని పొగ పాము. నీళ్ళల్లో ఊగుతున్న నిర్జీవ హస్తాన్ని ఒడ్డుకి లాగే అఘోరా […]

చురుక్కు కొమ్ములు విసిరే ఎండకు
సింహం తల కూజా పంజా
సెగల రెక్కలు సాచిన ఇనునికి
పకపక నవ్వుల పంకా జోరు