ఓటి కుండలకు
దరువు వేస్తూ పోతే
వంకర తిరుగుతుంది
వెన్నెముక
నీ గదిలో
నిస్తంత్రీ సంగీతంలో
జీరో వాట్ బల్బు కింద
ఒంటరి దుఃఖపు
విషాన్ని తాగి
బలాన్ని తెచ్చుకో
అప్పుడు
లోకోపవాదాలను
ఉండ కట్టి
చెత్త బుట్టలో
పారేస్తావు
స్నేహాలు నీకు
ఎక్కిళ్ళు తెప్పించవు
పరిచయాలు
పాములైనా కరవలేవు
మెలకువలో
మగత రాదు
చీకటి పిల్లిని
తరిమి
విరాగివై
అపుడిక
రాస్తావు
వెలిగి పోయే
కవిత్వాన్ని
ధగధగ లాడేది.