రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

మూడు కవితలు

రచన: పాలపర్తి ఇంద్రాణి
ఆగస్ట్ 2020

1.చెఱువు దగ్గర గృహిణి

నీలాంబరపు ఛాయలలో
నీ కన్నుల వెలుగులలో
నిండు నీళ్ళకుండలున్నవి
అవి తొణకకూడనివి

తామర రేకుల వంపులలో
నీ మాటల చోటులలో
నలనల్లని నీడలున్నవి
అవి చెప్పకూడనివి

చేప పిల్లల మిసమిసలో
నీ చేతుల అంచులలో
రక్తకాంతి గుసగుసలున్నవి
అవి విప్పకూడనివి

నల్లని నీడలను
కలిచే నీ చేతులు
అమ్మాయీ,
ఉదయాస్తమానమూ
నిండు నీళ్ళకుండను
నడుముకు ఎత్తుతున్నవి

నిండు నీళ్ళకుండలు
చిప్పిల్లకూడనివి.

2. దుప్పటీ

ఉక్కపోస్తే
గబుక్కున
తాబేలులా
తల బయటకు
తీసేందుకు

చలివేస్తే
డిప్పలో
తాబేల్లాగానే
ముడుక్కుందుకు

కావద్దూ, దుప్పటీ?

మంచు పూల
చలికాలంలోను
మల్లెపూల
వేసంగిలోను

కొసలు పాదాల కిందకి
అంచులు ఒంటి కిందకి
చుట్టేసుకు పోకుండా
ఊరికే పరుచుకునే
దుప్పటీ

చలికాలం,
మంచు సరస్సు కింది
చేపలా మారేందుకు
గుహలో ఎలుగులా
మూడంకె వేసేందుకు
చీకటి నదిలో
సుషుప్తిలోకి జారేందుకు

ఎండాకాలం,
డేరాలో ఒంటెలా
దూరేందుకు
చిరు చల్లగాలిని
అడ్డేందుకు
నక్షత్రాల కింద
మాటు వేసేందుకు

ఏ కాలంలోనూ
పల్చనిదో
మందపాటిదో

కావద్దూ, ఓ దుప్పటీ?

3. పెరటి తోట

విరజాజి పువ్వుకి
సనసన్నని నవ్వుకి
ఒక మూరెడు
సొగసుంటే

పొట్ల పాదు
పందిరికి
గజి జిగిబిగి
పువ్వులకి
తెగ బారెడు
పొగరుంటే

కిల కిల కాకర
గరుగ్గరుగు
తాకి చూడు
ఒక పువ్వెడు
చేదుంటే
కొంత కొంత
కులుకుంటే

చిరు చిరు
చిరు దోసలు
అరిటాకుల
ఊసులూ

తూగుతూ
ఊగుతూ
గుసగుస
గుసగుస
లాడుతూ
ఏ పాటో
పాడుతూ
సూర్యకాంతి
తాగుతూ

చూడు, చూడు
వేసవి ఘన
వల్లె వేస్తోంటే
కాస్తోంటే
పూస్తోంటే
తీపి గాలి రైలు
కూకూమని
వస్తోంటే
నీ వెంటే

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    K.K.Sastry August 8, 2020 10:41 am

    చెఱువు దగ్గర గృహిణి – అద్భుతం! ఇంద్రాణి అసామాన్య కవయిత్రి.

    అభినందనలు.
    శాస్త్రి.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • నీళ్ళు కాచే పనిపిల్ల
  • ఐదు స్వాభిమాన కథలు
  • తిరణాల
  • నేనే కవిత్వాన్ని
  • మూడు కవితలు

ఇటువంటివే…

  1. మూడు కవితలు
  2. సౌభాగ్య కుమార మిశ్ర: మూడు ఒరియా కవితలు
  3. రెండు కవితలు
  4. రెండు కవితలు: ఆగిన పాట
  5. ఐదు కవితలు: నాలుకపై వానచుక్క

ఆగస్ట్ 2020 సంచికలో ...

  • ఆగస్ట్ 2020
  • ఆలస్యం
  • ఇట్టి ప్రేమలు…
  • ఎదురుచూపు
  • కల
  • గడినుడి – 46
  • గల్ఫ్ గీతం: 2. షార్జా
  • గ్రీకు పురాణ గాథలు 8
  • చంద్ర ఆడియో కథలు
  • డెఫినిషన్స్
  • దందెడ
  • నీతో నువ్వే
  • పుస్తక పరిచయాలు
  • ప్రయాణం
  • బతుకు వస్త్రం
  • భవరోగ వినాశనం
  • భారత స్వాతంత్ర్య సమరములు: 1757-1857
  • మూడు కవితలు
  • రెండో కథలు
  • లక్ష్మి
  • వడిసెట్లో రాయి
  • విశ్వ మహిళా నవల: 1అ. గెన్జి గాథ
  • వెంకట సత్య స్టాలిన్
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 46
  • ‘నేను’ అంటే?
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

గ్రీకు పురాణ గాథలు 8
ప్రయాణం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.