మంచు కింద
ఉన్నది నది
గట్టును రాసుకు
సన్నగా ఊగుతూ
కోలాహలంగా ఆడంగులు
అక్కడికి రాక ముందు
ఒంగిన కొమ్మల
నీడల కింద
ఉన్నది నది
చల్లగా పారుతూ
కలకలమని వాళ్ళు
నీళ్ళను కలచక ముందు
బుడి బుడి
నీటి తెప్పల కింద
ఉన్నది నది
తక్కుతూ తారుతూ
బుడుంగున మునిగి
బిందెలు నిండకముందు