1.
కోరికల మూట
గూట్లో పెట్టి
తచ్చాడేది
మమతలు మాయక
తలకిందులుగా
కుసిల్లిపోయేది
శరీరాన్ని
వెతుక్కుంటూ
గిరికీలు కొట్టేది
అది, అది, అది
దేవి మెడలో
అక్షర మాల
ఛట్‌ఛట్
నర్తనకు
బొబ్బలు పెడుతూ
పారిపోతూంటే
గాలి హోరు
అగ్గి మేళా.
2.
నల్లని కురులుగా
పాకుతోంది నీడ
తుమ్మెదలను
తోస్తోంది గాలి
నీటి తుంపరల
చిన్న వాన
ఆ నీడలో
ఆ గాలిలో
ఆ వానలో
కాళి.