రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

పట్టుకో పట్టుకో

రచన: పాలపర్తి ఇంద్రాణి
జులై 2009

తెల్ల ఈక ఒకటి
కొన్ని పిట్టలు
నేనూదే సబ్బు బుడగలు
ఆకాశం వైపుకి ఎగురుతూ ఉంటే
పట్టుకో పట్టుకో అని.

ఎర్ర తోక గాలిపటం
గాజు రెక్కల తూనీగలు
ఊదు కడ్డీ పొగల తీగెలు
ఆకాశం వైపుకి ఎగురుతూ ఉంటే
పట్టుకో పట్టుకో అని.

ఆరేసిన పచ్చ చీర
నువ్వు రాసిన ఉల్లి పొర ఉత్తరం
నీలం రంగు పమిట నాది
ఆకాశం వైపుకి ఎగురుతూ ఉంటే
పట్టుకో పట్టుకో అని.

    
   

5అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    obul reddy July 1, 2009 9:42 am

    కవితలో పదహారణాల భావుకత.. చక్కటి కవిత ..అభినందనలు !

  2. 2
    yasasvi July 1, 2009 9:06 pm

    భావుకత కరవైపోతోన్న ఇవాళ్టి కాలంలో ఇంద్రాణి గారి కవిత ఆహ్లాదంగా
    అన్పించింది. రోజూ మన చుట్టూ ఉండే చిన్న చిన్న అందాలని గమనించలేని
    వేగపు బతుకైపోయి ఎవరైనా ‘పట్టుకో పట్టుకో” అని వెనకబడమంటూ..ఊరించే దృశ్యాలని చూపిస్తే “హమ్మయ్య” అని జీవించటానికి
    ఇంత నమ్మకం కలగదూ!! అంత నమ్మకాన్నిచ్చింది ఈ కవిత. ఆమెకు అభినందనలు.

    యశస్వి.

  3. 3
    Subbarao Nanduri July 2, 2009 7:20 am

    కానీ నేను వాటిని పట్తుకొనేందుకు
    ప్రయత్నమే చెయ్యలేదు,
    అందకుండా ఆకాశానికి ఎగిరిపోతున్న ధరలనీ,
    ఆగకుండా పాతాళానికి జారిపోతున్న ఆశలనూ,
    నిరాశల ఊబిలో కూరుకుపోతున్న ఆశయాలనూ,
    అవసరాల అగ్నిలో ఆవిరయిపోతున్న విలువలనూ,
    పట్టుకోలేని నాకు,
    వీటిని పట్టుకొనే శక్తి ఎక్కడిది?

  4. 4
    hrk July 2, 2009 7:20 am

    గాలా బాగుంది కవిత, పోగొట్టుకున్న బాల్యంలో కొంచెం తెచ్చి ఇచ్చినట్టుగా, హాయిగా.
    -హెచ్చార్కె.

  5. 5
    బొల్లోజు బాబా July 2, 2009 8:46 pm

    చాలా బాగున్నది.
    చక్కటి పద చిత్రాలు. అల్లిక.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • Walmart
  • రెండు కవితలు
  • నేనెవరు?
  • Indian groceries
  • గోళం

ఇటువంటివే…

  1. రెండు కవితలు
  2. కిటికీ పక్క ఆకాశం
  3. బావిలో గిరక
  4. పుస్తక పరిచయాలు
  5. చెట్టు కింది మనుషులు

జులై 2009 సంచికలో ...

  • అంచులలో అందాలు
  • అచ్చులో పత్రికలు అంతరిస్తాయా?
  • ఈ కానుకనివ్వలేను
  • ఏడు గంటల వార్తలు
  • కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి?
  • కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి
  • కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతులు – ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సుకు రిజిష్ట్రేషన్
  • గోవిందా! గోవిందా!
  • జులై 2009 ఈమాటకు స్వాగతం
  • నాకు నచ్చిన పద్యం: నిగమశర్మ అక్క పలకరింపు
  • నిద్రిత నగరం వైదేహి ప్రపంచం
  • పట్టుకో పట్టుకో
  • పడమట సంధ్యారాగం
  • పెట్టె బయట
  • ఫాదర్స్ డే
  • రాగమాలిక
  • హాయిహాయిగా ఆమని సాగే
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

పడమట సంధ్యారాగం
రాగమాలిక

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.