రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

మూడు కవితలు

రచన: పాలపర్తి ఇంద్రాణి
జనవరి 2020

1. చావు విత్తనం

భావోద్వేగాల
కారు మబ్బుల్లోంచి
సుఖదుఃఖాల
జడి వాన
కురుస్తోంది

ఆ వానల్లో
నానుతోన్న
మనో భూమిపై
పెరుగుతోంది
పురాతన పీడ

ఆ పీడలో
మొలకెత్తుతోంది
ఎవరూ గమనించని
చావు విత్తనం.

2. పని కౌగిలి

అప్పుడే పుట్టిన
తాజా రోజును
గుటుక్కున మింగడానికి
నోరు తెరుచుకుని
ఎదురు చూస్తోంది
పని

తన ఊపిరాడని
ఉక్కు కౌగిలిలో
జనం చచ్చిపోకండా
రోజువారీ
రొట్టె ముక్కలు విసురుతుంది

పని,
రోజును
రొట్టె ముక్కలు తిన్న
జనాన్ని
మింగుతుంది.

3. చీకటి మాంసం

వీడు
ద్వంద్వార్థాలు
మాట్లాడి
నీ శరీరంపై
అగ్గి పుల్ల
వెలిగించుకుంటాడు

వీడు
నీ జ్ఞానాన్ని ప్రశ్నించి
నీ ఆత్మ విశ్వాసంపై
చలి కాచుకుంటాడు

ఎవడినీ
నీ ఆత్మపై
ఉమ్మి వేయనీయకు

నెత్తుటి నూనె
రాసుకుని
మిలమిలలాడుతున్న
ద్రౌపది కురులను
స్మరించు

బాలా, చీకటి మాంసాన్ని
తినిపించు
నీ పెంపుడు
వెలుతురు గద్దలకు.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి
  • కోటిగాని కతలు: శ్రీశైలంలో సన్యాసి
  • గుప్పిట ప్రేమ
  • నేనే కవిత్వాన్ని
  • కిటికీ

ఇటువంటివే…

  1. మూడు కవితలు
  2. సౌభాగ్య కుమార మిశ్ర: మూడు ఒరియా కవితలు
  3. రెండు కవితలు
  4. రెండు కవితలు
  5. నిర్ణేత వ్యాఖ్య – కవితలు

జనవరి 2020 సంచికలో ...

  • ఆకాశవంతెన 2
  • ఇంగ్లీషు చదువుల చరిత్ర 1
  • ఏక్ టాంగ్- సత్రేనీ- ముల్లముట్టి-నల్లంగోడ
  • కోలుకోవడమే… ఇదంతా
  • గడినుడి – 39
  • గ్రీకు పురాణ గాథలు 1
  • జనవరి 2020
  • తెలుగు పుస్తకానికి ‘నవోదయం’
  • తెలుపు-నారింజ ఘోష
  • థాయ్‌లాండ్ యాత్రాగాథ – 6
  • నవోదయతో నా రుణానుబంధం
  • పుస్తక పరిచయాలు
  • పుస్తకాల గుళ్ళో ధ్వజస్థంభం ‘నవోదయ’
  • ప్రవహించు…
  • భారం
  • మహా నిశ్శబ్దం
  • మూడు కవితలు
  • మెడిటేషన్‌
  • వార్త నిన్నటిదే వాస్తవమే నేటిది
  • శ్రీమాన్ కొండ్రాజు బలాదూర్ చరిత్ర: అశ్వపర్వం
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 39
  • హెచ్చరిక
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

శ్రీమాన్ కొండ్రాజు బలాదూర్ చరిత్ర: అశ్వపర్వం
ప్రవహించు…

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.