రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

స్నానాల గదిలో

రచన: పాలపర్తి ఇంద్రాణి
మార్చి 2012

రెక్కలు ముడుచుకున్న బాతులా
కొంకీ మీద కూచునుంది
తువ్వాలు

సబ్బు పెట్టెలో
ఘుమఘుమల ఊపిరి తీస్తూంది
సబ్బు బిళ్ళ

బాదంకాయ తొట్టి పొట్టలోంచి
వెల్ల వేసిన పైకప్పుకు చేరుతోంది
నీటి ఆవిరి

విలాసంగా దేవతావస్త్రాలను
తొడుగుతూన్నది
ఈల పాట

ఆవిరి నిండిన ఈ గదిలో
నేనొక్కదానినే

మునివేళ్ళతో నీళ్ళని తాకి చూస్తాను
తేనీటి కప్పుని పెదవులకి ఆనించినట్టు.

    
   

10అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    rama bharadwaj March 1, 2012 4:29 pm

    ” మునివేళ్లతో నీళ్లని తాకి చూస్తాను
    తేనీటి కప్పుని పెదవులకి ఆనించినట్టు ”

    ఇంకా దీన్ని నేను ఊహించుకుంటునే ఉన్నాను సుమా !!

    ఇంద్రాణీ !! అభినందనలు.

    రమ.

  2. 2
    మోహన March 1, 2012 8:59 pm

    గదిలో కలిగిన భావాలను మదిలో పదిలపరచుకొని, మదిలో మెదలిన భావాలను గదిలో పదిలపరచుకొని చక్కగా కవితను అల్లారు. మీ ఊహాగానానికి జోహారులు. కాని ఆవిరితో నిండిపోయిన నీటిని తేనీరనుకోకండి, నాలుక నల్లబడుతుంది 🙂 విధేయుడు – మోహన

  3. 3
    జాన్ హైడ్ కనుమూరి March 2, 2012 4:34 am

    విలాసంగా దేవతావస్త్రాలను
    తొడుగుతూన్నది
    ఈల పాట
    …..
    మునివేళ్ళతో నీళ్ళని తాకి చూస్తాను
    తేనీటి కప్పుని పెదవులకి ఆనించినట్టు.

    అభినందనలకు మాటలు లేవు.

  4. 4
    బొక్కా ప్రేమ్ కుమార్ March 9, 2012 7:18 am


    ఆవిరి నిండిన ఈ గదిలో
    నేనొక్కదానినే

    మునివేళ్ళతో నీళ్ళని తాకి చూస్తాను
    తేనీటి కప్పుని పెదవులకి ఆనించినట్టు.

    కవిత అర్ధాంతరంగా ఆపేసినట్టు ఉంది, ఇంకా కంటిన్యూ చేస్తే బావుండేది.

    – బొక్కా ప్రేమ్ కుమార్

  5. 5
    సురేష్ March 26, 2012 6:43 am

    ఆడపిల్లా, అగ్గిపుల్లా, కుక్కపిల్లా, సబ్బుబిల్లా కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్లు, బావుంది
    మీ కవితా వస్తువూ, ప్రేంకుమార్ చమక్కు.

    సురేష్

  6. 6
    Radha Krishna Bojja April 4, 2012 4:41 am

    నాకు ఇలాంటి సరదా కవితలంటే చాలా ఇష్టం …
    పైగా మీ కవిత చాలా సరళంగా అందరికీ (ముఖ్యంగా నాకు) అర్థమయ్యే విధంగా ఉండడంతో నా వోటు మీకే !!!

  7. 7
    peddadasatyaprasad April 9, 2012 9:19 am

    ఇంద్రాణిగారూ మీ కవిత చాలా బాగుంది. కవిత్వమనే సూరీడుకి ఎక్కడైనా లోకమే. ఏదైనా చూడగలడు. మీ సాహిత్యం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ పెద్దాడ సత్యప్రసాద్., viSaaKapaTnam.

  8. 8
    శారదా కిషోర్ April 20, 2012 5:09 am

    ఆవిరి నిండిన ఈ గదిలో నేనొక్కదానినే

    ఈ లైను. ఎవరికయినా యిక్కడ దొరికే ఏకాంతం మరెక్కడా దొరకదు. నీటితొట్టెలో నీళ్ళోసుకుంటూనే అర్కేమేడీసు పెద్ద ఫార్ములా కనిపెట్టాడు. ఈ కవిత ఆశు కవిత్వం లాగ ఉంది. ఇలాంటి కవితలు మరిన్ని రాస్తారని ఆశిస్తూ…

  9. 9
    thummuri rammohan rao July 6, 2012 8:11 am

    స్నానాల గది నుంచి కాగితం మీదికి ఎక్కించేదాకా తడి ఆరని ఊహలకు జోహార్లు.

  10. 10
    డా. చి. సు. October 21, 2015 8:10 am

    ఆవిరి నిండిన ఈ గదిలో
    నేనొక్కదానినే
    అందువల్లే అర్ధాంతరంగా ఆపివేసేరా? బాగున్న కవిత మధ్యలో ఆపివేస్తే, బాగు కంటే చికాకు ఎక్కువ అవుతుంది

    ధన్యవాదములు

    డా. చి. సు.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శిథిల రాజ్యం
  • దుప్పట్లో ముడుక్కున్నా
  • వాళ్ళు రాక ముందు
  • Indian groceries
  • ఐదు స్వాభిమాన కథలు

ఇటువంటివే…

  1. పై గదిలో ప్రేమికుడు
  2. తొలి వలపు
  3. ఎడబాటు
  4. పాట ఒకటి…
  5. చేపలార్బరు దినాలు

మార్చి 2012 సంచికలో ...

  • ఈమాట మార్చ్ 2012 సంచికకు స్వాగతం!
  • ఎమితిని సెపితివె?
  • ఏకైక కథాయానా – మెడికో శ్యామ్ కథలు
  • కాల్వీనో కథల నుంచి – 2
  • కినిమా పత్రిక నుంచి – 2
  • కొవ్వుపుంజి
  • కోనసీమ కథలు: పిండంతే నిప్పటి
  • చిరునవ్వుగాది
  • చేపలార్బరు దినాలు
  • ఛందస్సు కొక కొండ కొక్కొండ
  • త్రిపురాంతకేశ్వరా!
  • త్రిపురాంతకేశ్వరా!
  • నాకు నచ్చిన పద్యం: వింధ్యుని స్వగతం
  • పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి
  • పిలూ రాగం
  • బిచ్చగత్తె శిశువు
  • భయం
  • మల్లెపూల మధూలిక
  • మూడు లాంతర్లు – 10
  • రెండుజడలు
  • వఱడు: కథ నచ్చిన కారణం
  • విధ్వంసం
  • వెల్చేరు కవితలు కావలెను
  • శివోహం! శివోహం!
  • సాహిత్యం – స్త్రీల చైతన్యం
  • సీత గడియ
  • స్నానాల గదిలో
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

కినిమా పత్రిక నుంచి – 2
ఎమితిని సెపితివె?

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.