రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

కాళీ పదములు-6

రచన: పాలపర్తి ఇంద్రాణి
డిసెంబర్ 2019

1.

కాలాన్ని ఒడ్డి ఈ గులక రాళ్ళను ఏరుతున్నాను
శక్తిని పోసి ఈ నౌకను నీళ్ళపై నిలుపుతున్నాను

సంకల్పాల పాచికలను నక్షత్రాల వీథుల్లోకి విసురుతున్నాను
పాలపుంతల దారుల్లో నీ పేరే పిలుస్తున్నాను

కాంతిల్లు నీ ఎఱుకలో అమ్మా, రేణువులుగా విడిపోతున్నాను.

2.

కాళీ,
మాటలు
నాకొద్దు

జ్ఞానమనే చెట్టుకు
మౌనమనే పండు కాసిందిట
ఆ పండు కోసుకు
నిశ్శబ్దంగా తిననివ్వు

కాళీ,
మహిమలు
నాకొద్దు

మౌనమనే పండులో
వైరాగ్యమనే గింజ ఉందిట
ఆ గింజని తీసి
నిర్లిప్తంగా
మింగనివ్వు

కాళీ,
మోక్షసాధన
నాకొద్దు

వైరాగ్యమనే గింజనించి
జ్ణానమనే చెట్టు
నాలోంచి పుడుతుందట
ఆ చెట్టు కిందకు
వచ్చి నిలబడు.

3.

పక్షి ఒకటి
క్షణం ఆగి
నీళ్ళు తాగి
వెళుతోంది

లేత ఆకుల తీగె
వెదురు గెడను
అల్లుతోంది

ఝుంఝుం
తుమ్మెదల గుంపు
గాలివాటుకు
చెదురుతోంది

గడియ పడ్డ
మది చెవులకు
ఘల్లు ఘల్లు
గజ్జె సద్దు

తోటలోకి
కాళ రాత్రి
వస్తోందని
కీచురాయి
పదే పదే
అరుస్తోంది.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • నేపథ్య సంగీతం
  • The great Indian rope trick
  • కాళీ పదములు 3
  • కాళీ పదములు 5
  • రెండు కవితలు: ఆగిన పాట

ఇటువంటివే…

  1. కాళీ పదములు
  2. కాళీ పదములు 3
  3. కాళీ పదములు 2
  4. కాళీ పదములు 4
  5. కాళీ పదములు 5

డిసెంబర్ 2019 సంచికలో ...

  • అనుకోని అల
  • అమ్ముదామా? అమ్ముడుపోదామా సోదరా?!
  • అసలేం చేశానని?!
  • ఆకాశ వంతెన 1
  • ఉండేలు
  • కాళీ పదములు-6
  • గడినుడి – 38
  • డిసెంబర్ 2019
  • థాయ్‌లాండ్ యాత్రాగాథ – 5
  • పుస్తక పరిచయాలు
  • ర-కారం
  • రంగుల రాజ్యం
  • శూన్యం చెక్కిన శిల్పం
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 38
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ర-కారం
శూన్యం చెక్కిన శిల్పం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.