ఆంధ్రసాహిత్యములో గల అఖండపాండితీమండితము, అత్యంతకఠినమైన గ్రంథములలో ప్రథమగణ్యమైనది మా పాలమూరు జిల్లాలో వర్ధిల్లిన జటప్రోలు (కొల్లాపురం) సంస్థానమున కధీశుడైన శ్రీ సురభి మాధవరాయలవారి చంద్రికాపరిణయ […]
Category Archive: ఈ-పుస్తకాలు
ఇక్కడ నేనిస్తున్నది మక్కికిమక్కి అనువాదం కాదు. ముఖ్యమైన భాగాలను సరళీకరించి మూలం నాటకరూపంలో వున్నా ఇక్కడ కథారూపంగా ఇచ్చాను. ఇది చదివాక ఇంకా వివరాలు తెలుసుకోవాలని కుతూహలం కలిగినవారు మూలాన్ని గాని లేక తమకు నచ్చిన అనువాదాన్ని గాని చదువుకోవచ్చు.
ఇరవైయవ శతాబ్దం భౌతిక శాస్త్రానికి స్వర్ణయుగం అనవచ్చు. మేక్స్ ప్లాంక్ 1900 లో వేసిన విత్తు మహా వృక్షమై మన జీవితాలనే మార్చి వేసింది. అప్పటి నుండి ఇరవైయవ శతాబ్దం అంతం వరకు శరవేగంతో జరిగిన సంఘటనలని సాధ్యమైనంత తేలిక భాషలో, సాధ్యమైనంత తక్కువ గణిత సమీకరణాలు మాత్రం ఉపయోగించి, ఒక సింహావలోకనం చేసేను.
ఏవూరిసిన్నదో ఎవ్వారి సిన్నదో
ఈడేరి వున్నది ఇంచక్క వున్నది
కొప్పేటి ముడిసింది కోకేటికట్టింది
సూపేటి సూసింది నడకేటి నడిసింది
సుడిగాలిలా నన్ను సుట్టపెట్టేసింది
తానా సావనీరు – ఫుల్ స్క్రీన్లో.
తిలక్ అమృతం కురిసిన రాత్రి కవితాసంకలనం పై రా.రా. సమీక్ష (సంవేదన, జనవరి 1969) సారస్వత వివేచన – రా.రా. వ్యాస సంకలనం నుండి పునర్ముద్రణ.
శ్రీశ్రీ కవితలకు బాపూ గీసిన బొమ్మల సంకలనం ఈమాట పాఠకులకోసం ప్రత్యేకంగా.
నరకం, భూమి. స్వర్గం అనే మూడుకాలాలలో ఆలాపన శ్రీశ్రీ రచన చరమరాత్రి – ఈరాత్రి నా ఆత్మహత్యా మహోత్సవం. ఇది ఆహ్వాన పత్రిక కాదు..
శ్రీశ్రీ మాటల్లో “వచనగీతం అంటే చేతికి వచ్చిన వ్రాత కాదు. వ్యర్థ పదాలు లేకుండా వచనం రాయటం మరీ కష్టం. వచనగీతానికి ప్రాణప్రదమైన లక్షణం గమన వైవిధ్యం.”
కొడవటిగంటి కుటుంబరావు కథల సంపుటి ‘స్వగతం’ పైన భారతి (జనవరి 1938) పత్రికలో బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం రాసిన విమర్శా వ్యాసం.
కొడవటిగంటి కుటుంబరావు ప్రతివిమర్శ, భారతి పత్రిక, ఫిబ్రవరి 1938.
రచయితగా కుటుంబరావుని విశ్లేషిస్తూ రా.రా. 1983లో వ్రాసిన విమర్శాత్మక వ్యాసం.
ఫిబ్రవరి 1953లో ఆలిండియా రేడియోలో పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటి కుటుంబరావుల మధ్య జరిగిన సాహిత్యచర్చాపాఠం ఇది.
మహీధర రామ్మోహనరావుగారు (వారి శతజయంతి కూడా ఈ సంవత్సరమే) కొడవటిగంటి కుటుంబరావు పంచకళ్యాణి నవల గురించి చర్చించిన ఈ వ్యాసాన్ని మీకందిస్తున్నాం.