రాత్రి నృత్యం

నిశి రాత్రి వర్షంలా
కరగనీ సంగీతాన్ని-
నాలుగు భుజాలూ కలవనీ
ఊగనీ ఈ చెట్లన్నీ-
మన దేహాలు హత్తుకోనీ.
పాడనీ జంట పిట్టలని
గొంతులు వెర్రిగా అరవనీ.
రేగనీ వెన్నెల ధూళిని
కాళ్ళని ఎగరనీ ఎగరనీ.
ఎండుటాకుల్లో మంచు పొగల్లో
పాము బుసల్లో కీచు రాళ్ళ కేకల్లో
రాత్రంతా రాత్రంతా రాత్రంతా
వెర్రి వెర్రి వెర్రిగా
అబ్బా,అదిగో
నృత్యం నృత్యం నృత్యం.