కండెకు చుట్టుకునే
నూలు పోగుల్లా
పిప్పీ పిల్లంగోవి
చుట్టూ
మంది
పాటకు
పడగ విప్పిన
తాడు చుట్టుకు
సాలె పట్టుల్లా
పైపైకి లేచే
సూటి చూపుల
జతలు
వందలుమిడతలా
కొనకి చేరిన
ఠింగణా ఒకడు
తెల్లబోయిన
తెల్ల మబ్బు
నోట్లోంచిఅప్పడంలా
అంతంతగా
జారిపోతే
ఆకాశ ప్పొ
ట్టలోకిరెప్ప కొట్టడం
వాయిదా వేసిన
కళ్ళ వెనుక
తుళ్ళి పడ్డ
తళుక్కు
బంతులు.ఓయంటే
ఓహ్హోయంటూ
జన సమూహాన
పొడగడితే
బుడతడుఇంద్రజాలపు
గాలి విసురుకు
అట్టిట్టయినవి
తలపాగాలుఅహోరే!
భళి భళీల
కంబళీని
ఎగరేసుకు పోయేటి
దీనార్ల చిలకలు.బేరసారాల
నడి ఎండలో
గారడీ వాడి
కనుమాయా
కారు మబ్బు
కురిపించిన
సోనవానవిచ్చుకత్తుల
రాచ వీథుల్లో
పుట్టించిందో
ఉల్లాసపు
హాళి మడుగు.