ఆ దృశ్యం చూసేసరికి హెక్టర్కి చిర్రెత్తుకొచ్చింది. “ఇక్కడ గోళ్ళు గిల్లుకుంటూ ఎలా కూర్చోగలుగుతున్నావ్? అక్కడ మన సైనికులు శత్రువుల చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారే! అక్కడ మన ఆడంగులు భరించరాని రీతుల్లో భయపడి విలవిలలాడుతున్నారే! ఇక్కడ నువ్వు నీ డాలుకు మెరుగులు దిద్దుతూ అందులోనే నీ ప్రతిబింబాన్ని చూసుకుని మురిసిపోతున్నావా? నువ్వు మమ్మల్ని అందరినీ నట్టేట ముంచేవు కదా! ట్రోయ్ నగరం పతనమైపోతూ ఉంటే నీకు చీమ కుట్టినట్లయినా లేదా?”
వేమూరి వేంకటేశ్వర రావు
- పూర్తిపేరు
- వేమూరి వేంకటేశ్వర రావు
- ఇతరపేర్లు
- రావు వేమూరి
- సొంత ఊరు
- పెరిగినది తునిలో
- ప్రస్తుత నివాసం
- ప్లెజన్టన్, కేలిఫోర్నియా
- వృత్తి
- విశ్రాంత విశ్వవిద్యాలయ ఆచార్యులు
- ఇష్టమైన రచయితలు
- ఏనుగు లక్ష్మణకవి, Isaac Asimov, Carl Sagan
- హాబీలు
- సైన్సుని తెలుగులో రాయడం
- సొంత వెబ్ సైటు
- https://www.cs.ucdavis.edu/~vemuri/
జీవిత విశేషాలు
వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.