రచయిత వివరాలు

వెల్చేరు నారాయణరావు

పూర్తిపేరు: వెల్చేరు నారాయణరావు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు.

 

విప్లవం అనేమాట తెలుగుపాఠకులకి ఒకరకంగానే అర్థం అవుతుంది. ఆ అర్థం నాకు పట్టదు అనీ, ఒకరకమైన సాహిత్యం ఇంకొకరకమైన సాహిత్యంగా మారినప్పుడు రచనాసూత్రాలు మారతాయనీ, ఇలా మారినప్పుడు విప్లవం అనేమాట వాడవచ్చనీ నేను ఎన్నిసార్లు చెప్పినా నా పాఠకులు పట్టించుకోలేదు.

తెలుగు కవిత్వానికి అలవాటు కాని పద్ధతిలో ఈ ఒరియా కవిత్వాన్ని అనుసృజన పేరుతో పనికట్టుకుని అచ్చు వేయించడంలో వెంకటేశ్వరరావుకి ప్రత్యేకమైన దృష్టి వుందని నా అనుమానం. నేలబారుగా ఏదో ఒక వస్తువునో ఒక వాదాన్నో ఒక నమ్మకాన్నో చెప్పడం కోసం రాసే తెలుగు పద్యాల పద్ధతి ఒరియా కవిత్వం ద్వారా మార్చాలని, తెలుగు అభిరుచి ఇంకా క్లిష్టమవ్వావలని వెంకటేశ్వరరావు ఆలోచన.

రామారావుగారి కథలు చదివించవని చాలామంది అంటే, అలా తప్ప మరోలా రాయలేక పోయానని ఆయన వినయంగా అన్నారు. ఆ మాటలకీ, ఆ వినయానికీ అర్థమేమిటంటే, ఆ కథలు అలానే రాయాలి అని. నాకు తెలిసిన ప్రపంచ సాహిత్యంలో రామారావుగారిలా కథ చెప్పేవాళ్ళు ఎంతోమంది లేరు.

జాషువా మొదట్నించీ పద్యాన్ని పట్టుకోవాలి, పద్యాన్ని బాగా రాయాలి అన్న ప్రయత్నంలోనే ఉన్నాడు. తను కవిత్వం రాసే కాలానికి పద్యం పాత పద్ధతుల్లో లేదని, పద్యాన్ని భావకవులు వచ్చి మాటల కూర్పు మీద, ఊహల పొందిక మీద దృష్టి పెట్టి పద్య స్వభావాన్ని మార్చేశారని జాషువా గుర్తించలేదు. ఆయనకు కావలసిందల్లా పాత పద్ధతుల్లో భావాన్ని ఛందస్సులో ఇమిడ్చి చెప్పడమే.

రామస్వామి తన కాలానికి మించిన ప్రతిభావంతుడు, ప్రయోజకుడు, వర్తక రహస్యాలు తెలిసినవాడు. బహుశా భారతదేశంలోనే మొదటి ప్రచురణకర్త. అతను చేసిన పనిని, ముఖ్యంగా దక్కను కవుల చరిత్రతో అతను సాధించిన పెద్ద మార్పుని మనం ఇప్పటికీ సరిగా గుర్తించలేదు. ఆ మార్పు ఫలితాన్ని ఇప్పటికీ మనం తెలియకుండానే కొనసాగిస్తున్నాం.

కవిత్వం, కథలు కాకుండా ఆలోచనాపరమైన విమర్శలతో, వ్యాసాలతో గట్టిగా చదువుకున్నవాళ్ళు ప్రాచీన, మధ్యకాలపు, ఆధునిక రంగాలలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆలోచనల్ని పురస్కరించుకుని వ్యాసాలు రాసే మేధావులు కాని, అవి ప్రచురించే పత్రికలు కానీ మనకి లేవు. తెలుగులో మేధావులకు కావలసిన ప్రోత్సాహం లేదు. అంచేత మేధావి అని చెప్పడానికి అనువైన ప్రమాణాలు లేవు. వాళ్ళని గుర్తించే సమాజమూ లేదు.

ఈ స్థావర, జంగమ సిద్ధాంతాన్ని కుడి, ఎడమ కులాలతో పోల్చడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తమిళదేశంలో భూస్వాములను కుడిచేతి వర్గంగా, ఇతర వృత్తికారులను ఎడమచేతి వారిగా వ్యవహరిస్తారు. బసవ పురాణంలోని భక్తుల కథలు, ఉదంతాలు చాలావరకు ఈ ఎడమ కులాల వారి నుండే ఉంటాయి. అంటే వృత్తికారులు, వ్యాపారులు, చాకలివారు, కుమ్మరులు, చర్మకారులు మొదలైనవారి కథలు. రైతులుగాని, వారి పాలేరులైన మాలల కథగాని ఒక్కటి కూడా కనబడదు. కానీ ఎడమ కులాలవారి కథలతో నిండి వారి సిద్ధాంతాలకు అద్దంపడుతుంది బసవ పురాణం.

గిడుగు రామమూర్తి పంతులు మనం వాడవలసిన భాషకి వ్యావహారిక భాష అని పేరు పెట్టారు. కానీ ఎవరు వ్యవహరించే భాష వ్యావహారిక భాష అని అడిగితే స్పష్టంగా చెప్పలేక శిష్ట వ్యావహారిక భాష అనే మాట అన్నారు. శిష్టులంటే గోదావరి జిల్లాల్లో చదువుకున్న బ్రాహ్మణులు. వాళ్ళు కూడా ఉచ్ఛరించే పద్ధతిలోనే తెలుగు రాయరు. అందుచేత శిష్ట వ్యావహారికం అనే మాటకి స్పష్టమైన నియమాలు చెప్పటం కష్టమైంది.

విశ్వనాథ రెండు నవలికలు (Two Novellas by Visvanatha Satyanarayana) అన్న పేర, హా హా హూ హూ, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు నవలికలను 2018లో పుస్తకంగా పెంగ్విన్ ఇండియా వారు ప్రచురించబోతున్నారు. నారాయణరావు అనువదించిన అన్ని కావ్యాలు, రచనలు లాగానే ఈ అనువాదానికి కూడా ఆయన రాసిన తొలి, మలి పలుకులు మన సాహిత్య చరిత్త్ర గురించి, కవులు రచయితల గురించి ఒక విభిన్నమైన, విశిష్టమైన దృక్పథాన్ని మనకు అందిస్తాయి. ఇక్కడ ఈ పుస్తకానికి నారాయణ రావు రాసిన ముందుమాట తెలుగులో ప్రచురిస్తున్నాం.

సెయింట్ జార్జి కోటలో నున్న కళాశాలలో తెలుగు పండిత పదవి దొరకకముందు చిన్నయ కొన్నాళ్ళు సి. పి. బ్రౌన్ దగ్గర పనిచేశాడు. బ్రౌన్ పద్ధతులు చిన్నయకు నచ్చలేదో, చిన్నయ రచనా పద్ధతులు బ్రౌన్‌కి నచ్చలేదో, ఆ ఉద్యోగంలో చిన్నయ ఎక్కువ కాలం ఉండలేదు. అంతకు ముందు మిషనరీ స్కూలులో పని చేసినప్పటికీ, కోటలో వుద్యోగం దొరికిన తరువాతే చిన్నయకి కొంత స్థిరమైన, సుఖమైన జీవితం ఏర్పడింది.

మీరొక పుస్తకాల షాపులో అప్పటిదాకా మీకు తెలియని ఒక రచయిత పుస్తకాన్ని ఎందుకు మీరు చేతిలోకి తీసుకుంటారు? మీ కంటికి నదురుగా కనిపించే ఆ పుస్తకం ఎలా వుంటుంది? ఏవి ఆ పుస్తకంపై మనకి ఆపేక్ష ఏర్పడేలా చేస్తాయి? అంటే, విషయం ఏదైనా కూడా పుస్తకమూ ఒక వస్తువే!

సంస్కృత గ్రంథాలు, వాటి సమయ సందర్భాలు తెలియని అజ్ఞానం కారణం గానూ, భారత దేశానికి పాశ్చాత్య ప్రపంచం కన్నా గొప్ప నాగరికత వున్నదని అంగీకరించడానికి తమ గర్వం అడ్డు రావడం కారణం గానూ, కొందరు పాశ్చాత్యులు చేసిన దుర్వ్యాఖ్యానాలని సహేతుకంగా కాదనగలగడం శ్రీరామచంద్రుడు చేసిన మహోపకారం. ఈ పని, భారత దేశంలో ప్రతిదీ గొప్పది, పాశ్చాత్యమైనది ప్రతిదీ చెడ్దది అనే చెక్కపడి పద్ధతిలో కాకుండా, సహేతుకంగా, సున్నితంగా చెయ్యడం ఆయన ప్రత్యేకత.

తెలుగు నేర్చుకోవడం మూలంగా తెలుగులో వున్న పుస్తకాలు చదవడం మూలంగా ప్రపంచ విజ్ఞానాన్ని పెంచగలమని మన దేశపు విజ్ఞానులు ప్రపంచానికి ప్రదర్శించగలరా? నువ్వు ఏ భాష వాడివైనా తెలుగులో రాసిన పుస్తకాలు చదవకపోతే నీ విజ్ఞానానికి ఈ రకంగా లోపం వస్తుంది, అని మనం చెప్పగలిగిన రోజున, ఆ మాట ప్రపంచం లోని విజ్ఞానులు విన్న రోజున, వాళ్ళు తెలుగు పుస్తకాలు చదివి అందువల్ల గ్రహించిన విజ్ఞానాన్ని ప్రపంచ విజ్ఞానంలో భాగం చేసిన రోజున — తెలుగు ప్రపంచ భాష అవుతుంది.

ఈ ప్రయత్నం అంతా ఎందుకు? అంటే లిఖిత గ్రంథానికి తోడుగా వేరే పాఠ్యగ్రంథం ఉంది అని గుర్తిస్తే ఫలితాలు ఎలా వుంటాయో చూడ్డానికి. తెలుగులో, ఆ మాటకొస్తే మొత్తం భారతదేశంలో, పాఠ్యగ్రంథానికే ప్రామాణిక గౌరవం, లిఖిత గ్రంథానికి కేవలం ఆనుషంగిక గౌరవం వున్నాయి. ప్రామాణికమైన గురువుగారు తనకి కంఠస్థంగా వున్న పాఠం చెప్పినప్పుడు శిష్యులు లిఖిత ప్రతిలో వేరే పాఠం వుంది అని చూపిస్తే ఆయన తనకి కంఠస్థంగా వున్న పాఠాన్నే ప్రామాణికంగా చెప్తాడు. లేఖకుడికి పాఠాలు చెప్పే గురువులకున్న ప్రామాణికత లేదు.

బ్రౌన్‌ ఎవరు? ఏ పరిస్థితుల్లో తెలుగు దేశానికి వచ్చాడు? ఆయన చేసిన పని ఏమిటి? ఆయన దగ్గర పండితులు ఏ పరిస్థితుల్లో ఎలాంటి పని చేశారు? బ్రౌన్‌ చేసిన పని తెలుగుకి ఎంత వరకు ఉపయోగ పడింది? దానివల్ల అన్నీ లాభాలేనా, నష్టాలేమయినా జరిగాయా? ఈ విషయాల్ని సవిర్శకంగా పరిశీలించి బాధ్యతాయుతంగా కొన్ని ఆలోచనలు ప్రతిపాదించడం ఈ వ్యాసంలో మేము తలపెట్టిన పని.

తెలుగుని మన పిల్లల మనస్సుల్లో నిలబెట్టమని ఆడిగేది ఎందుకూ అంటే మీ స్వార్థం కోసం అడుగుతున్నాను. ప్రజాస్వామిక దేశాలలో అధికసంఖ్యాకుల కన్నా సంస్థాగతంగా కూడి ఉన్న తక్కువమందికి ఎక్కువ బలముంటుంది. ఈ సంగతి సాధారణంగా తెలీదు మనకి. మనం organized minority గా అవగలమా?

అందుచేత ఆధునిక కవి, లౌకిక వ్యక్తిలో ఒక పొర. ఒక అంతరార్థ భాగం. ఒక్కొక్కప్పుడు, స్ప్లిట్ పర్సనాలిటీ అని మానసిక శాస్త్రజ్ఞులు చెప్పేటట్టు చూస్తే లౌకిక వ్యక్తిలో ఒక ఖండం, ఒక ముక్క. ఇంతకీ కవి అంటే ఎవరూ మనకు కవిత్వం ద్వారా తెలిసే కథ మాత్రమే. అందుచేత కవులందరూ కథలే.

అక్షరాలా ఎవరు పుస్తకాన్ని రాశారు అన్నది తెలుసుకోవాలనే ప్రయత్నం తెలుగు సాహిత్యం కాని సంస్కృత సాహిత్యం కాని ఇతర భారతీయ సాహిత్యాలు కాని చెయ్యలేదు. కవి అంటే పుస్తకానికి తన పేరుతో కవితా గౌరవాన్ని కల్పించేవాడు అని అర్థం. ఆ పుస్తకానికి పాఠకులు చెప్పుకున్న అర్థానికి అనువైన జీవిత చరిత్ర కలవాడు అని అర్థం. అంతేకాని అక్షరాలా ఆ పుస్తకాన్ని రాసిన వాడు అని అర్థం కాదు.

బ్రౌన్ తెలుగు ప్రజలతో కలిసిమెలిసి తిరిగి రాతప్రతులని వాళ్ళు ఇళ్ళల్లో భద్రపరిచే తీరు, చదివే తీరు, అందులో తేడాలు, అన్నీ గ్రహించి వుంటే తెలుగు గ్రంథ ప్రపంచాన్ని గురించి ఆయనకు కొంత అవగాహన వచ్చేది. కానీ ఆ ఆలోచన ఆయనకి రాలేదు. తెలుగు గ్రంథసంస్కృతి యూరోపు దేశాల గ్రంథసంస్కృతికన్నా భిన్నమైనదేమో అన్న సందేహం కించిత్తయినా కలగలేదు కూడా.

శైలీలక్షణం అనేది కేవలం పదాలు, వాక్యాల అర్థం తెలుసుకున్నంత మాత్రాన బోధపడదు. ఒక రచనని పుట్టించిన సాహిత్య సంప్రదాయంతో సహజమైన సంబంధం ఉన్నప్పుడే ఇది సాధ్యం. అలా అని, ఇది అర్థం చేసుకోలేని అమూర్త భావన కాదు.

ఇందుకు ఒక స్పష్టమైన ఉదాహరణ కుమార రాముని కథ. ఈ కథ ఎప్పటిదో మనకు తెలియదు. ఈ కథ కుమార రాముడనే వీరుడు, అతన్ని ముమ్మూర్తులా పోలివున్న పోలిక రాముడనే అతని సోదరుడి, పరాక్రమాల గురించిన కథ.

చరిత్రకారులు కొన్ని కొన్నిసార్లు అబద్ధాలు ఆడుతునే ఉంటారు. కాని ఆ అబద్ధాలు చెప్పే పద్ధతిలో తేడా వుంటుంది. మేము పదే పదే ప్రస్తావిస్తున్నట్టు, జాగ్రత్తగా అంచనా వేసి నిర్ధారించవలసిన అంశాలకు ఆస్కారమిచ్చే కొన్ని వ్యక్తావ్యక్త నియమాలు చరిత్ర రచనలో ఉంటాయి. చరిత్ర గూర్చి తాను చేసే వ్యాఖ్యానానికి పూర్తిగా బద్ధుడై ఉంటాడు చరిత్రకారుడు.

చరిత్రకారుడు చెప్పే సత్యం, చారిత్రక సత్యాల (కనీసం చారిత్రక వాస్తవాల) పూర్ణ స్వరూపం ఎప్పుడూ కాదు. అయితే, తానెనున్నుకున్న రచనాస్వరూప నియమాల పరిధిలో, ఆ సత్యం యుక్తియుక్తము సమగ్రమూ అయి ఉంటుంది.

సాంప్రదాయ వాదాన్ని ఎదురించే ఆధునిక కవులు, వ్యాసకర్తలు ఇతిహాసాలను పుక్కిటి పురాణాలుగానే భావిస్తారు, ఆ అభిప్రాయాన్నే బలంగా వినిపిస్తారు. గజేంద్ర మోక్షంలో ఏనుగు, మొసలి మధ్య పోరాటం, సమాజంలోని పీడితుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు, పాలక వర్గం ప్రచారం చేసే ఒక అబద్ధంగా శ్రీశ్రీ వాదించాడు.

ఆయన పాఠకులకు భాగవత పురాణం ఒక కట్టు కథ మాత్రమే. కానీ సాంప్రదాయ హిందువుల దృష్టిలో గజేంద్ర మోక్షం నిజంగా జరిగిన సంఘటన. వారికందులో ఏ సంశయము లేదు. ఒక ఇతిహాసపు స్థాయి, అది ఎంత నిజం అనే నమ్మకం పైన ఆధారపడి ఉందని ఇక్కడ గ్రహించవలసిన సంగతి.

అన్నమయ్య రాసిన 32వేల కీర్తనల రాగిరేకులు తిరుపతి దేవాలయంలోని ఒక చీకటి కొట్లో పడి ఉన్న సంగతి 70 ఏళ్ళకు పూర్వం ఎవరికీ తెలియదనీ, వేటూరి ప్రభాకర శాస్త్రి గారో, ఇంకొకరో అయాచితంగా ఈ రాగిరేకులను కనుగొన్నారని, తద్వారా ఈ భాండారాన్ని వెలికితీశారని ఒక కట్టుకథ బహుళ ప్రచారంలో ఉంది. ఈ కథ దాదాపు అన్నమయ్య గురించి రాసిన చాలా పుస్తకాలలో ఉటంకించడం కనిపిస్తుంది.

దాదాపు ఇటువంటి కథే చాలా సాహితీ గ్రంథాల విషయంలో చెప్పుకునే సంప్రదాయం దక్షిణ భారతంలో ఉంది. గొప్ప సాహితీ సంపద ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోవడం, దానిని అనుకోకుండా ఒక పండితుడు కనుక్కోవడం ఈ కథలన్నింటిలోనూ కనబడే సాధారణ అంశం.

ఆధునిక చరిత్రకారులు నాయకరాజ్యాల సంగతి పట్టించుకోలేదు. గత రెండు దశాబ్దాలలో భారత చరిత్ర రాసిన వారు 1565 నుంచి, 1761 వరకు ఉన్న కాలాన్ని దక్షిణభారత చరిత్రలో ఒక అంధకారయుగంలా పరిగణించారు. ఈమధ్యనే ఈ అలక్ష్యానికి బదులుగా నాయకులు, వారి కాలమంటే ఒక కొత్త ఆసక్తి కనబడుతున్నది.

ఈ పుస్తకంలో విశదీకరించినట్టుగా, నాయకరాజులు దక్షిణ భారతీయ సమాజపు భావనలోనూ, సంస్థాగత నిర్మాణంలోనూ మౌలికమైన పెద్ద మార్పుకు సాక్షులు గానూ, కొంతలో కొంతవరకూ కారణభూతులుగానూ ఉన్నారని మా వాదం.

అమెరికా నించి కృష్ణమూర్తిగారు తిరిగి వచ్చిన తరవాత తెలుగుశాఖ వాళ్ళే ఆయనని తమ శాఖలో కలుపుకుని ఉంటే ఏమయి ఉండేది అన్న ప్రశ్న నన్నెప్పుడూ ఆలోచింపజేస్తూ ఉంటుంది. మొదటిది, పరిశోధనలో అంతర్జాతీయంగా ఒప్పుకున్న ప్రమాణాలు ఆయన తెలుగుశాఖలలో అమలులోకి తెచ్చేవారు.

కారడివిలో రావణాసురుని చేత పట్టుపడిన నిన్ను తొడలమీద పెట్టుకొని ఉన్నాడు రాముడు. ఆయన ఒక క్షణం నీ దగ్గిర లేకపోతే నీకు ప్రాణాలు నిలవవని అన్నావు గుర్తుందా, అప్పుడే నన్ను అనరాని మాటలు అన్నావు కదా, మరి ఇప్పుడు ఆరునెలలు రాముడు లేకుండా ప్రాణాలు నీకు ఎలా నిలిచాయి? ఆడవాళ్ళ మాటలు నమ్మకూడదు.

ఎప్పటికీ సీత రాకపోతే ఆయనకి చాలా కోపం వచ్చి పడకగది తలుపు గడియ పెట్టేస్తాడు. నీ పనులిలా ఉన్నాయా, నీకు వొళ్ళూ పై తెలియడం లేదు అని తల పంకించి ‘కడు భ్రమ చెంది’ పక్కమీద పడుకుంటాడు. ఇక్కడ ‘భ్రమ చెందడం’ చాలా అర్థవంతమైన మాట. రాముడు తనకి సీత మీద లేని అధికారం ఉన్నదని ఊహించుకుంటున్నాడు.

ఆడవాళ్ళ వ్యక్తిత్వాలని నిబ్బరంగా నిలబెట్టిన రచన ఇది. ఇందులో పాత్రలకి వ్యక్తమైన మనస్సే కాకుండా సుప్తచేతన, అవ్యక్తభావాలు అనేకం ఉంటాయి. ఇలాంటివి ఫ్రాయిడ్‌ వొచ్చిన తరవాతే మన సాహిత్యంలో కనిపిస్తాయని విమర్శకులు అంటారు. అలా అనుకోవడం తప్పు అని ఈ పాట మనకి గుర్తు చేస్తుంది.

ఇది జాలి పద్యమా, లేదా నాకీ పద్యంలో ఉండడం ఇష్టంలేక ఇది నాకు ఇచ్చే ధైర్యాన్నీ, కసినీ, కోపాన్నీ భరించే శక్తిలేక నన్ను నేను తప్పించుకోడానికి నేను వేసుకున్న వ్యూహం మాత్రమేనా? ఈ పద్యం చదవడం కష్టం, చదివాక మరిచిపోవడం కష్టం.

దక్షిణ భారతీయ సాహిత్య చరిత్రలో మొదటిసారిగా రాజు యొక్క వ్యక్తిగత ధర్మాలకు, రాజ్యపాలనా ధర్మాలకు మధ్య భేదాన్ని విస్పష్టం చేసింది ఆముక్తమాల్యద.

అప్పుడు నేను గుర్తించని ఒక విశేష విషయం ఏమిటంటే, ఆనాటి షష్టిపూర్తిలో అన్ని వేలమంది జనం మధ్య వేదిక మీద శ్రీశ్రీ ఒంటరిగా కూర్చున్నాడు. అప్పటి ఉద్వేగపూరిత వివాదాత్మక సంఘటనల మధ్య శ్రీశ్రీ నిజంగా లేడు.

మనం ఏ పద్యం చదివినా, విన్నా, అంతకు ముందు కొన్ని పద్యాలు వినే వుంటాం. అప్పుడు మనకి ఒక పద్యం అర్థం అయే తీరు, మనం అంతకు ముందు చదివిన, విన్న పద్యాల మీద ఆధారపడి వుంటుంది.

ఇది సమాజంలో చాలా పెద్ద మార్పు. ఇలాంటి మార్పు అప్పటి మనుషుల్లో వారి స్థితిని బట్టి, అలజడినో, ఆశనో, ఉత్సాహాన్నో, నిర్వేదాన్నో కలిగిస్తూ వుండి వుండాలి. అలాంటి కాలంలో వేంకటాధ్వరి రాసిన పుస్తకం ఈ విశ్వగుణాదర్శం.

ఒక కవి పద్యం మీద అభిప్రాయం చెప్పడానికి ఆ కవి ఎదురుగా లేకపోవడం ఒకరకంగా ఉపకారమేనేమో. చెప్పే విషయం కూడా, కొంత గోప్యంగా…

తెలుగులో ఆలోచనా రంగం బలంగా ఏర్పడటానికి కృషి చేసిన వారిలో కృష్ణమూర్తిగారు చాలా పెద్దవారు. ఆయన వేసిన ప్రణాళికలూ, చేసిన ఆలోచనలూ, ప్రతిపాదించిన సిద్ధాంతాలూ తయారు చేసిన శిష్యులూ, తెలుగు భాషని ఒక్కసారిగా కొన్ని శతాబ్దాలు ముందుకు తీసుకొచ్చి ఇరవయ్యో శతాబ్దిలో పెట్టాయి.

అయితే భావకవిత్వం చేసిన ముఖ్యమైన పని ఇంకొకటి వుంది. అది దేశంలో ఒక మధ్యతరగతిని తయారు చేసి వాళ్ళ ఊహలద్వారా ఒక భారత జాతీయతని నిర్మించడం.

ఫిడేల్ రాగాల డజన్ ఆనాటి కవిత్వానికి విద్యుత్ చికిత్స అయింది. భావకవిత్వంలో ఏవి సున్నితంగా చెప్పుకుంటారో వాటి నన్నిటినీ హేళన చేసిన “anti-poem” పఠాభి రచన. అయితే శుక్లపక్షంలా జడ దృక్పథంతో భావకవిత్వాన్ని హేళన చేసిన కావ్యం కాదిది. భావకవిత్వం వల్ల ఏర్పడిన జడత్వాన్ని తొలగించే దృక్పథంతో చేసిన ప్రాణవంతమైన హేళన ఇది.

అర్థాలతో పద్యాలు చెప్పీ చెప్పీ, లోకానికీ నిజానికీ మధ్య దూరం పెరిగిపోతోందన్న దశలో కొందరు కవులు ఆ భాషని బతికించడానికి ఇలాంటి పద్యాలు రాస్తారు. అంటే లోకంలో భాషని వాడడం మానేసి భాషలో మరో లోకాన్ని సృష్టిస్తారు. ఒకరకంగా ఈ పనే చేసారు పఠాభి.

అనువాదం అనువదించబడే భాషలో సాహిత్య స్థానాన్ని సంపాదించ లేక పోతే అది ఎంత విధేయంగా వున్నా అది సాహిత్యానువాదం కాదు. అంచేత సాహిత్యానువాదకుల పని ప్రధానంగా తాము అనువదించిన భాషలో తమ అనువాదానికి సాహిత్యస్థానాన్ని సంపాదించుకోవటమే.

గోడ కడుతున్నారు ఇంతకు ముందో గోడ ఉంది అది దేవుడి గోడ దానిముందు ప్రార్థనలు చేస్తారు కొందరు గట్టిగా దీని వెనకాతల ఏడుస్తారు మరికొందరు […]

ఇరవైయో శతాబ్ది తెలుగు సాహిత్యంలో ఒక విశేషం ఏమిటంటే, అప్పుడు పుట్టిన ప్రతి సాహిత్యోద్యమము రామాయణాన్ని తిరగరాసింది. నిజానికి, రామాయణాన్ని ఒక కొత్త దృష్టితో చూడకపోతే అది చెప్పుకోదగ్గ ఉద్యమమే కాదని ప్రతిపాదించొచ్చు! ఐతే ఇది ఇరవైయో శతాబ్దికే ప్రత్యేకించిన అంశం కాదని, తెలుగు సామాజిక జీవనంలోని ఎన్నో మార్పుల్ని శతాబ్దాలుగా రామాయణాలు ప్రతిబింబించాయని ఈ వ్యాసంలో చూడవచ్చు.

ఎప్పుడో భవభూతి అన్నాడు “కాలోహ్యయం నిరవధి ర్విపులాచ పృథ్వీ” (కాలం అంతులేనిది. ప్రపంచం విశాలమైనది) అని. దాని అర్థం మార్చి కాలం నిరంతరమైనా క్షణికమైనది, […]

ఈమధ్య ఒకసారి అఫ్సర్‌తో మాట్లాడుతూ ఇండియా టుడే వాళ్ళు వేసిన సాహిత్య సంచికలో మీ పద్యం చూసానని చెప్పాను. అఫ్సర్‌ వెంటనే ఆ పద్యం […]

(వెల్చేరు నారాయణరావు గారు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌ , మేడిసన్‌లో కృష్ణరాయ చైర్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. తెలుగు సాహిత్య విమర్శకుడిగా ఎన్నో గొప్ప రచనలు […]

(వెల్చేరు నారాయణ రావు గారి గురించి ఎవరికీ పరిచయం అక్కర్లేదు. ఈ నాటి తెలుగు సాహితీ పరిశోధకులలో అగ్రశ్రేణిలో వారు. ఈ వ్యాసం “అహంభావ […]