మెదడు లోపలి పొరల్లో చిక్కుకుపోయిన ఒక ఊహ, ఒక ఆలోచన, ఒక భావన–ఇవే సిగిౙ్మండ్ కథల్లో హీరోలు. ఆ ఊహని బయటకి తెచ్చి, బాహ్య ప్రపంచంలో మసలడానికి దానికంటూ ఒక అస్తిత్వాన్ని కల్పించి, చుట్టూ కిక్కిరిసిపోయున్న మిగిలిన ఆలోచనలనుంచి దాన్ని కాపాడుకోడానికి దానికి బలాన్ని, స్వతంత్రంగా బతకడానికి దానికి ఆయుష్షును, ఆరోగ్యాన్ని ఎలా ఇవ్వాలనేదే, అతని కథల్లో కనిపించే ప్లాట్.
ఫిబ్రవరి 2019
సిగిౙ్మండ్ క్రిజ్జనావ్స్కీ (1887-1950): యావత్ప్రపంచంలో పేరెన్నిక గన్న రచయితల పంక్తిలో నిలబడవలసింది పోగా, జీవిత కాలంలో ఇంచుమించు విస్మృతుడైపోయి తనను తాను ‘అనామకుడిగా ప్రసిద్ధుడ’నని వర్ణించుకున్న సిగిౙ్మండ్ క్రిజ్జనావ్స్కీ, తన కథలను బ్రతికుండగా ప్రచురణలో చూసుకోలేకపోయాడు. అతని కథలను స్టాలినిస్ట్ ప్రభుత్వం ప్రచురించనీయక పోవడంతో బ్రతికి ఉండగా అతను ఒక రచయిత అన్న సంగతి సాటి రచయితలతో సహా ఎవరికీ తెలియరాలేదు. ఒక ఇరుకైన గదిలో ఒంటరిగా అతను తన కథలనే అద్భుతలోకాలు సృష్టించాడు. వాస్తవంలో సాధ్యం కాని వాటిని భాష సాధ్యం చేయగలదని నమ్మిన సిగిౙ్మండ్ కథలు వర్గీకరణకు లొంగవు. అతని కథలను వాస్తవికతపై చేసిన ప్రయోగాలుగా అభివర్ణించుకున్నాడు ఈ అధివాస్తవిక కథకుడు. అతని కథలలోని పాత్రల అస్తిత్వం అభూత కల్పన; కానీ అవి ఉండేది, పాటించేది భౌతిక జగత్తు ధర్మాలనే. వాస్తవికతకు అద్దిన ఒక కొత్త కళాదృక్పథం అతని సాహిత్యం. వాస్తవం అనేది సంపూర్ణమూ, స్వతంత్రమూ కాదు; అది మనకు ఎన్నటికీ పూర్తిగా అవగతం కాదు; అది కేవలం ఒక పగిలిన ముక్కల కూర్పు వంటిది–ఇదీ వెస్టర్న్ ఫిలాసఫీతో పాటు వేదాంతాన్నీ శ్రద్ధగా చదువుకున్న సిగిౙ్మండ్ కథలలో కనిపించే దృక్పథం. అత్యంత సూక్ష్మమైన అస్తిత్వం ఉన్న పదార్థాలను లోతుగా పరిశీలించడం ద్వారా, తాత్వికసమస్యలను కళాకారుడి దృష్టితో దర్శించడం ద్వారా, వాస్తవికత గురించి కొంతైనా అర్థం చేసుకోవచ్చనే ప్రయత్నం అతని కథలలో కనిపిస్తుంది. 1920 నుంచి 1940ల వరకూ అసామాన్యమైన సృజనతో అతని కలం సృష్టించిన ఒక అద్భుతమైన సాహిత్యప్రపంచం అతని మరణం తరువాత కూడా రహస్యంగా కాపాడుకోబడింది. చివరకు 1976లో వదీమ్ పెరెల్మూతర్ అనే రష్యన్ సాహిత్యవేత్త ద్వారా మొదటిసారిగా వెలుగు చూసిన ఇతని కథలను, గత పదేళ్ళలో వచ్చిన ఆంగ్లానువాదాల వల్ల, ప్రపంచం ఇప్పుడిప్పుడే చదువుతూ అబ్బురపడుతున్నది. ఈ అద్భుత కథకుడి కథలను అనువదించడమే కాక, వాటికి అనుబంధంగా సిగిౙ్మండ్ సాహిత్య దృక్పథాన్ని సరళంగా వివరించే వ్యాసంతో ఒక సమగ్రమైన పరిచయాన్ని అందిస్తున్న పప్పు నాగరాజుకు అభినందనలతో, అతను పడిన శ్రమకు కృతజ్ఞతలతో ఈ సంచికను సిగిౙ్మండ్ విశేష సంచికగా విడుదల చేస్తున్నాం.
ఒకసారి వైశేషికుల సిద్ధాంతంలో పదార్థాల గురించి ఎడమ నేను చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకున్నాను. ద్రవ్యం, గుణం, కర్మ, సామాన్యం, విశేషం, సమవాయం. ఇందులో ద్రవ్యం ఒక్కటే స్వతంత్రమైనది. గుణ కర్మలు ద్రవ్యం మీద ఆధారపడతాయి. అలాగే ద్రవ్యాలలో సమానంగా ఉండే లక్షణం సామాన్యం. ఒక్కొక్క ప్రత్యేకమైన ద్రవ్యం ఒక విశేషం. పదార్థాల మధ్యన ఉండే అవినాభావ సంబంధం సమవాయం.
రాత్రి ఎక్కడికీ పోదు, గమనించావా? మిట్ట మధ్యాహ్నం పూట కూడా. అనంతమైన ముక్కలుగా, అది అన్నిచోట్లా దాక్కొని ఉంటుంది. ఒక చెట్టు ఆకు ఎత్తి చూడు. దానికింద దాక్కుని ఉన్న చీకటి వీచిక ఒకటి తటాలున వేరులోకి పాకిపోయి తలదాచుకుంటుంది. ఎటుచూసినా– నడవాల లోపల, గోడల వెనుక, ఆకుల కింద–రాత్రి, ముక్కలైపోయి పీలికలుగా తచ్చాడుతూ ఉంటుంది.
మానవాళిలో విస్తరిల్లిన ద్వేషాన్ని నేను ఇంధనశక్తిగా మారుస్తాను. అస్థిమూలగతమైన ద్వేషాన్ని లోలోపలే ఆపుతున్న ఆ తలుపులు మనం తెరచి, దానికి అడ్డు లేకుండా సమాజంలోకి ప్రవహించనిస్తే, ఈ పచ్చ బొగ్గు–అవును, పచ్చగా పసరులాగా మనలో పేరుకుపోయే ఈ పైత్యరసప్రకోపితద్వేషాన్ని, నేను పచ్చబొగ్గు అని పిలుస్తున్నాను–మన కర్మాగారాలను మళ్ళీ నడిపిస్తుంది.
మరుసటి రోజు, వాళ్ళమ్మాయి రాత్రికి రాత్రి మాయమైపోయిందని తెలుసుకున్నాక, వాడి అత్తవారింట్లో పెద్ద గొడవ మొదలైంది. ఒక వారం వరకూ ఆమె కోసం అక్కడా ఇక్కడా వెతికారు. ఎవరికీ ఈ సంగతి గురించి తెలియనివ్వలేదు. కానీ తర్వాత, అమ్మాయి వాళ్ళ అన్నయ్య నా దగ్గరకి వచ్చాడు. అతడికి తోడుదొంగనైనట్టు మొత్తం కథ చెప్పుకు రావాల్సి వచ్చింది.
ఇప్పటికీ ఆరోజుని తల్చుకుంటే గుండె మెలిపెట్టినట్టుగా ఉంటుంది–నా పెదాలతో ఆమె పెదాలని అందుకోవాలని ముందుకు వంగాను, అలవాటుగా ఆమె కళ్ళలో వాడికోసం చూశాను. ఆ కనురెప్పల కిందగా కనిపించి చేయి ఊపాడు. వాడి కళ్ళల్లో ప్రయత్నపూర్వకంగా దాచుకుంటున్న విషాదం. చప్పున వెనుతిరిగి ఆమె కంటిపాప లోలోపలికి పరుగెత్తిపోయాడు.
You don’t know what to say either
and you make meaningless sounds
hoping to mean something.
And then you burp. Loud and long.
You still don’t excuse yourself.
I hang up.
ఇవి సాధారణమైన వెండినాణేలు– గుండ్రటి అంచులు, అచ్చుపోసిన అంకెలు, తగరపు మెరుగు. అయితే, వాటి మీద ఏదో కంటికి కనిపించని ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది. కొత్తవాళ్ళకి శ్మశాన శాంతిని ప్రసాదించే ఆ నాణేలు మాత్రం విశ్రాంతిని ఎరగవు. వాటిల్లో ఉన్న ఏదో దురద వాటిని చేతి నుంచి చేతికి, పర్సు నుంచి పర్సుకీ మార్చుతూనే ఉంటుంది. ఎంతవరకూ అంటే… అహా అలాకాదు, మొదటినుంచీ వరసలో వద్దాం.
చాలా కథల్లో అమ్మ పాత్ర నేరుగానే, అన్యాపదేశంగానే వస్తూ, పోతూ ఉంటుంది. అమ్మ ప్రేమకు, టీనేజ్ ప్రేమకు మధ్య ఊగిసలాడే చాంచల్య స్వభావం వెనుక సైకలాజికల్ థియరీని రచయిత పట్టుకున్నాడు. అందుకే లొంగినట్లు, తప్పుకున్నట్లు పాత్రలు మానసిక జగత్తు నుంచి లౌకికంగా కూడా ప్రభావితం అవుతుంటాయి. అంతలోనే పరుగెడుతుంటాయి.
ఈ స్థావర, జంగమ సిద్ధాంతాన్ని కుడి, ఎడమ కులాలతో పోల్చడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తమిళదేశంలో భూస్వాములను కుడిచేతి వర్గంగా, ఇతర వృత్తికారులను ఎడమచేతి వారిగా వ్యవహరిస్తారు. బసవ పురాణంలోని భక్తుల కథలు, ఉదంతాలు చాలావరకు ఈ ఎడమ కులాల వారి నుండే ఉంటాయి. అంటే వృత్తికారులు, వ్యాపారులు, చాకలివారు, కుమ్మరులు, చర్మకారులు మొదలైనవారి కథలు. రైతులుగాని, వారి పాలేరులైన మాలల కథగాని ఒక్కటి కూడా కనబడదు. కానీ ఎడమ కులాలవారి కథలతో నిండి వారి సిద్ధాంతాలకు అద్దంపడుతుంది బసవ పురాణం.
ఒక స్త్రీ ఏడ్పును వర్ణించే ఘట్టం అది. ఆ స్త్రీ మనుచరిత్రంలోని కథానాయిక వరూధిని. తాను కామించిన ప్రవరుడు తనను తిరస్కరించిన తరువాత, తాను కొంత చొరవ చూపబోతే త్రోసేసినప్పుడు- ఆ తిరస్కృతి కలిగించిన అవమానమూ రోషమూ వేదనా ముప్పిరిగొని ఆపుకోలేనంత ఏడుపు వచ్చింది ఆమెకు. కన్నీరు ఉబికింది. అయితే ఆమె రోషావమానాలకన్నా, నొప్పిని కారణంగా చూపించింది.
సాయంత్రం గంగా హారతికి ఇంకా సమయముంది. ముగ్గురం ఒక చోట కూర్చున్నాం. అతను విదేశీయుడిలా కనిపించలేదు. ఆమె చెప్పినట్టుగానే భారతీయతను కలవరించి, భారతీయతను తొడుక్కున్న వ్యక్తిగానే ఉన్నాడు. ఇద్దరి ముఖాల్లో అనిర్వచనీయమైన ఆనందం. మురళి కూడా వచ్చిఉంటే ఎంత బావుణ్ణు అనిపించిందోక్షణం. పక్కనే కలకలం వినిపించి చూస్తే ఒక ఏడాది పాపాయి పాకుతూ గంగా ప్రవాహపు అంచు వరకూ వెళ్ళింది.
విచిత్ర రహస్యాల్ని దిగంబరం చేసి
బంతులాడుకుంటూ,
ఉప్పెన కోసిన తీరం మీద
విచ్చుకునే గ్రహణపు రాతిరిలోకి
జారవిడవడం తప్ప
కూరిమితో అది కోయిలై వాలిందెప్పుడు
నాకు తెలిసినంతమట్టుకు వెల్చేరు నారాయణరావు కానీ, జీన్ రాఘేర్ కానీ ఆచరణ పరంగా వీరశైవులు కారు. వారు పరిశీలించిన గ్రంథాలను బట్టి స్వీయ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ అధ్యాయాన్ని అనువదించేటప్పుడు ఈ వ్యాసంలో వారి ప్రస్తావనలు, అభిప్రాయాలను మార్చకుండా ఉన్నదున్నట్లు అనువదించాను. అయితే అనువంశికంగా వీరశైవాన్ని పొందిన నాకు కొన్ని విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
క్రితం సంచికలోని గడినుడి-27కి మొదటి మూడురోజుల్లోనే అయిదుగురినుండి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారు: 1. శైలజ/ఆగడి ప్రతిభ 2. నాగమణి 3. సుభద్ర వేదుల 4. భమిడిపాటి సూర్యలక్ష్మి 5. అనూరాధా శాయి జొన్నలగడ్డ. విజేతలకందరికీ మా అభినందనలు.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.