రచయిత వివరాలు

చంద్ర కన్నెగంటి

పూర్తిపేరు: చంద్ర కన్నెగంటి
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.

 

మీలాంటి రచయితలు ఇంకా కావాలి. మీ రాతలు చదివి మనిషి ఉన్నతుడు కావాలి, దయ, సహనం, క్షమ, వినయం, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధీ న్యాయబుద్ధీ వంటి సద్గుణాలు నింపుకుని. అణచివేతలు, దోపిడి, హింసలు, మోసాలు, అసమానతలూ ఆధిక్యభావనలూ మాయమై దుఃఖం లేని సమసమాజం ఏర్పడాలి. ఎవరిని ఎవరూ ద్వేషించని, భాష, కుల, మత, ప్రాంత, ధన, అధికార, శారీరక కారణాల వల్ల ఎవరినీ కించపరచని, అవమానించని, ద్వేషించని సమాజం.

ఇదంతా ఎలా పని చేస్తుందో నాకేం తెలుసు? ఐ డోంట్ కేర్. మీరొచ్చారు. కనీసం ఇంకో తోడు. అందరూ గుర్తొస్తుంటారు. అమ్మా, నాన్నా, తమ్ముడూ. ఇంకెప్పటికీ వాళ్ళను చూడలేను. ఏడవడం తప్ప ఏం చేయలేను. ‘బయటపడు బయటపడు ‘ లోపలంతా ఒకటే రొదగా ఉంటుంది. మీకు తెలుసా ఎన్ని సార్లు చచ్చిపోదామనుకున్నానో! ఈ మధుగాడేమో నన్నొక్కదాన్నే వదిలేసి ఎటో తిరిగి తిరిగి ఎప్పటికో వస్తాడు. కొన్ని సార్లు కొన్ని రోజులపాటు మాట్లాడడు.

“నా భయాలు, బలహీనతలు, ఇష్టాలు, కోరికలు, నా రహస్యాలన్నీ నీకు చెప్పేశాను. నువ్వేం చెప్పవు!” బుంగమూతి పెట్టింది. ఆమెకి నచ్చినట్టు ఒక బుగ్గ మీద ముద్దు పెట్టుకుని అడిగాడు. “ఏం చెప్పను?” “ఏదయినా నీ చిన్నప్పటి జ్ఞాపకం.” “ఫొటోగ్రఫీ కోర్స్ చేయాలని ఆశ. ఫ్రెండ్స్ అంతా చేరారు. ఇంట్లో గొడవ. డబ్బుల్లేవని నాన్న. ఆయనకి తాగుడు అలవాటు. బార్లో బాకీ కట్టి రమ్మని ఆరోజు డబ్బులిచ్చి పంపాడు. నేనెక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాను…”

రెండు దారులుంటాయి. ఒకటి నలిగిన, ఎవరినీ ఇబ్బంది పెట్టని, దేనితోనూ పేచీ లేని, అందరికీ ఆమోదయోగ్యమైన దారి. మరొకటి దాన్ని ఒప్పుకోలేని, రాజీ పడలేని, తోడు దొరకని, తనకు నచ్చిన సూటి బాట. ఏదీ తేలిక కాదు. ఏ బాట పట్టినా యుద్ధం లోపలి మనిషితోనో, బయటి సమాజంతోనో తప్పనిసరి అవుతుంది కొందరికి ఈ కథల్లోని పాత్రలకు లాగే.

కొన్ని సెకన్లు రెస్టారెంటంతా నిశ్శబ్దంగా అయింది. అతని వైపు చూస్తూన్న అందరి కళ్ళూ ఆమెవైపు తిరిగాయి. ఆమె తలవంచుకుని మొహం దాచుకోవడంతో తలలు తిప్పుకున్నారు. ఆమెకు మరింత ఇబ్బంది కలిగించకూడదన్న సామూహిక ఒప్పందానికి వచ్చినట్టు ఏం జరగలేదన్నట్టు అందరూ తమ మాటలు కొనసాగించారు. పిల్లలు ‘దట్స్ మీన్!’ ‘హౌ రూడ్!’ అని గుసగుసలుగా అంటున్నారు.

ఆమెను లేపబోయేంతలో ఏం జరిగిందో అతనికి ముందు అర్థంకాలేదు. బెడ్‌లాంప్ మసక వెలుతురులో నడుచుకుంటూ పోతున్న ఆకారాలు కనిపిస్తున్నాయి. గోడల మీద పొడుగ్గా నీడలు పాకుతూ పోతున్నాయి. కొన్ని పిల్లల నీడలు, కొన్ని వొంగిపోయిన ముసలి నీడలు, భుజాలకు వేలాడుతూ పసిపాపల నీడలు, నెలల నిండు గర్భిణుల నీడలూ. నెత్తిన ఏవో మూటలూ. నివ్వెరపోయి చూస్తూ కూచుండిపోయాడు.

అతనొచ్చేలోగా స్నానం చేద్దామనుకుని ఒంటిపై కుర్తీ తీసేయబోతూ ఆగిపోయింది. ఎవరో తననే చూస్తూన్న భావన, దానితో కలిగే ఇబ్బంది, అసౌకర్యమూ. రోడ్డు మీద నడుస్తున్నప్పుడూ, అప్పుడప్పుడూ ఆఫీసులోనూ అలవాటయినదే. కానీ ఇది ఇల్లు. ఎవరి జోలీ లేకుండా నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండడానికి అలవాటుపడిన భద్ర ప్రదేశం. ఎందుకలా అనిపించిందో, అనిపిస్తూ ఉందో తేల్చుకోలేకపోయింది.

“మీరెక్కడి మనిషి బాబూ! సినిమా వాళ్ళను ఎవడయినా అలాగే అంటాడు. ఇప్పుడు కొత్తగా వాళ్ళకు మర్యాదలేమిటీ?” చిరాకు అణుచుకుని మళ్ళీ అందుకున్నాడు. “ఆ బాబుగారికి నటనలో ఓనమాలు తెలీవు. మొదటి సినిమా నుంచి ఇప్పటిదాక మొహంలో ఒకటే ఫీలింగ్. వాళ్ళ బాబు దగ్గర డబ్బులుండబట్టి అన్ని సినిమాలు ఫ్లాపయినా ఇంకా సినిమాలు తీస్తూ జనాల్ని చంపుతున్నాడు కానీ బుర్ర ఉన్న వాడెవడూ డైలాగ్ లేని వేషం కూడా ఇవ్వడు.

మొదటి రోజు జనం చాలామంది ప్రత్యక్షంగా చూడడానికి వచ్చారు. స్టేడియం వేదిక మీద ఏం జరిగేదీ పెద్ద తెరల మీద అందరికీ కనిపిస్తూంది. అన్ని టీవీ చానెల్స్ లైవ్ కవరేజ్ ఇస్తూ, వచ్చిన వాళ్ళ స్పందనలు కనుక్కుంటూ మధ్యమధ్యలో సగం కాలిన పాప మృతదేహాన్ని చూపుతూ అతను చేసిన ఘాతుకాన్నీ, పోలీసులు ఎంత చాకచక్యంగా రెండ్రోజుల్లోనే ఎలా పట్టుకున్నదీ, అయిదోరోజునే శిక్ష ఎలా అమలు చేస్తున్నదీ వివరిస్తున్నారు.

అరుదయిన పుస్తకాన్ని మిత్రుడు చదివి ఇస్తానని పట్టుకెళతాడు. ఇస్తానిస్తాను అన్నవాడు మాట మార్చేస్తాడు. “నేను తీసుకువెళ్ళానా? గుర్తు లేదే!” తర్వాతెప్పుడో ఒక వాన సాయంత్రం వాళ్ళ ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ కూచున్నప్పుడు వాళ్ళ పిల్లాడు పడవ చేయమని తీసుకు వచ్చిన కాగితం ఆ పుస్తకంలోనిదే అని గ్రహించీ కత్తి పడవ చేసి వాడితో ఆడుకుంటావు. ఇంతకూ నువ్వా పుస్తకాన్ని చదవనే లేదు.

“ఎవరు మీరు? ఏం కావాలి?” అడుగుతుంది వరండాలోకి వచ్చిన ఆమె. ఆమెని గుర్తు పట్టాడు. “మీతో మాట్లాడాలి!” నిలబడలేక అక్కడే ఉన్న కుర్చీ వైపు చూస్తుంటే, “కూర్చోండి!” అని చెప్పింది. “మీరు కూడా కూర్చోండి!” కూచుంది అతని వైపే చూస్తూ “ఏ విషయం? కాలేజ్ విషయమయితే మీరు ఆఫీసుకు వచ్చి అక్కడే మాట్లాడండి.” “కాదు. పర్సనల్. మీకు నాగేంద్ర గుర్తున్నాడా? డిగ్రీ మొదటి ఏడు.”

నీకు నువ్వు తెలియదు. తెలుసుకూడానేమో. నువ్వంత చెడ్డవాడివి కాకపోయినా ఉత్తముడివీ కాదు. నీనుంచి నువు తప్పించుకోలేవు, నీకు విమోచన లేదు. ఆ బిచ్చగత్తెకు ఇచ్చింది రూపాయేనని గుర్తుపెట్టుకోవు. చందాలు మొహామాటానికే ఇచ్చావనీ మనసులో పెట్టుకోవు. మొక్కుబడికీ, ప్రదర్శనకీ తప్పించి నీ వల్ల ఏ కాజ్‌కీ ఇసుమంత ప్రయోజనం కలగదనీ గమనించవు. ఆ మురికినీళ్ళతోటే రోజూ రాత్రిపూట కూచుని కడుక్కుంటూ ఉంటావు.

జీవితం ఒడ్డుకి చేరి అక్కడే నిలబడిపోయాడు. “కదులు కదులు!” మబ్బులు గర్జిస్తూ చెప్పాయి. “పద పద!” చినుకులు కురుస్తూ తట్టాయి. “రా రా!” పిట్టలు పాడుతూ పిలిచాయి. “మరిచిపో మరిచిపో!” ఆకులు రాలుతూ అన్నాయి. కదలని మరవని అతనికి అవసానదశలో ఒకటే ప్రశ్న. దాన్ని మోసుకుంటూ ఎక్కడెక్కడో వెతకగా చివరికి కలిసింది. ఆమె గుర్తు పట్టాక అడిగాడు “నేను పరీక్షలో నెగ్గానా?”

మధ్యలో కనపడని మంచుగోడగా గడ్డకడుతూ గాలి. నేపథ్య సంగీతమెప్పుడు ఆగిపోయిందో తెలియదు. తొందరగా ముగిసిపోయిన ఒక ఆట. ఉద్విగ్నక్షణాలూ విరబూసిన రంగులూ జారిపోయిన, కరిగిపోయిన అనంతరం ఖాళీగా మిగిలిన సినిమా హాల్లా. ఇష్టంగా తినీ, తాగీ అక్కడక్కడా ఇప్పుడు చెత్తగా ఒదిలేసిన కొన్ని పట్టించుకోని జ్ఞాపకాలూ.

ఎక్కడ్నుంచి మొదలెట్టాలో తెలియలేదు. బహుశా ముందు పెద్దవి. ఆమే అంది “వాషింగ్ మెషీన్ నేను తీసుకుంటాను. ఫ్రిజ్ నువ్వు తీసుకుంటావా?” “సరే.” వాటికి రెండు రంగుల స్టిక్కర్స్ అంటిస్తూంది గుర్తుగా. పద్ధతిగా అనుకున్నట్టు జరగాలామెకు. బెడ్స్, సోఫా, టేబుల్స్, టీవీ, వాటి మీద పేరుకున్న ఉదయాలు, సాయంత్రాలు, రాత్రులు, మాటలు, నవ్వులు, భోజనాలు, తిట్లు. ఆ జ్ఞాపకాల బరువుకు అన్నీ కుంగిపోతున్నట్టు ఉంది.

దిక్కు తోచక దాచుకున్నవన్నీ బయటికి తీసి చూస్తావు. చాకొలేట్ రేపర్, సినిమా టికెట్, రుమాలు, ఎండిన మల్లెపువ్వొకటి, రెండు గవ్వలు, నాలుగు మబ్బులు మూసిన సాయంత్రాలు, కొన్ని పాత పాటలు. చెదలు తినేస్తూ. దేన్నీ రేకెత్తించని, దేన్నీ సూచించని ఈ చెత్తంతా ఎందుకు ఏరిపెట్టుకున్నట్టో అర్థం కాదు. బరువు దించుకుని అవన్నీ గాలికి కొట్టుకుపోతాయి. అప్పుడు తను ఈ భూమ్మీద ఇదే కాలంలో జీవించే తోటి మనిషి.

కొన్ని ప్రశ్నలూ జవాబులూ అవుతూండగానే ఆకర్షణ వల్ల ఒంట్లో విద్యుత్తు, దాన్నుంచి చెంపల్లో వేడి, కళ్ళలో మెరుపులు, పెదాల మీద నవ్వులూ. కొన్ని మాటల్లో తెలిసీ, కొన్ని మాటల్లేకుండానూ. చేతులు పట్టుకుని నడకలు, అర్థాలతో బరువెక్కిన మాటలు, ఊహలతో మత్తెక్కిన కళ్ళూ, కొన్ని ‘మిస్ యూ’లూ చేతికి అందేంత దూరంలో ఆశగా. మరికొంత దూరంలో ఒళ్ళు విరిచే ఉద్రేకాలూ బిగి కౌగిలింతలూ తడి ముద్దులూ.

భళ్ళున బద్దలయిందది. పొరపాటున జారిపడిందా కావాలని విసిరికొట్టిందా తెలియదు. మిటకరించిన కళ్ళలో భయం లేదు. ఏం చేస్తావో చేయి అన్నట్టు నిల్చుంది మూడడుగుల ఎత్తుగా. పెదాల చివర్లలో నవ్వొలుకుతుందా? దాన్ని తాకొద్దని ఆమె వారిస్తూనే ఉంటుంది. చాలా ప్రియమైనది అది. చెదిరిన ముక్కలన్నీ ఏరుతూంటే ఏడుపు ముంచుకొచ్చింది.

ప్రాణసఖిగా అతని జీవితంలోకి ప్రవేశించి, ప్రేయసిగా మారిన ఆమె ఉన్నట్టుండి ఒకనాడు తన జీవితాన్నుండి అతన్ని బహిష్కరించింది ఎందుకెందుకెందుకెందుకని అడిగేందుకు వీలివ్వకుండానే. ఒకే చరణం పదే పదే పాడే అరిగిపోయిన గ్రామఫోను రికార్డ్ లాగా ఆమెనూ, ఆమె జ్ఞాపకాలనూ మించి ఆలోచించలేకపోయాడు అతను.

ఒకానొక కాలంలో ఒక వీరుడు ధీరుడు శూరుడు ఉండేవాడు. అతని కత్తికి ఎదురు లేదు, బాణానికి తిరుగు లేదు, అతను గెలవని యుద్ధం లేదు. రాజు మెచ్చి ఆదరించి పదవులు ఇచ్చాడు. పురజనులు అతని పరాక్రమాన్ని వేనోళ్ళ పొగిడేవారు. అతన్ని పెళ్ళాడాలని ఎంతమంది యువతులో కలలు కనేవారు. కానీ అతను ఆమెని చూడగానే మోహంలో పడిపోయాడు. పెళ్ళి చేసుకుని ప్రేమలో మునిగిపోయారు.

ఆ పూట గాయాలు ముందు పోసుకుని కూచున్నాడు తాత. మనవడికి ఒక్కోటీ చూపెడుతూ. చిన్నప్పుడు గడప తగిలి బోర్లా పడి తగిలించుకున్నదీ. వెంటపడి కరిచిన కుక్క పంటి గాట్లూ. గోడ దూకీ, చెట్టు మీదనుంచీ పడిందీ. ఏదో పోటీ పడీ. ఓడీ. ఎవరితోనో గొడవ పడీ. కొన్ని దురాశ పడీ. నవ్వుతూ మనవడికి వర్ణించి చెబుతున్నాడు. గర్వంగా సాధించిన పతకాలు చూపినట్టూ. సిగ్గుపడుతూ రహస్యాలు చెప్పుకుంటున్నట్టూ.

ముద్దుముద్దుగా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. పూలు చూపించీ, వాటిమీద వాలే సీతాకోకచిలుకలు చూపించీ. మబ్బులు చూపించీ, తొంగి చూసే చంద్రుణ్ని చూపించీ. ఉలిక్కిపడేలా చన్నీళ్ళు చల్లీ, ఉత్తినే భయపెట్టీ. ఒడిలో కూచోబెట్టుకునీ పడుకోబెట్టుకునీ గోరుముద్దలు తినిపించీ. చక్కిలిగింతలు పెట్టి నవ్విస్తూ.

మేమూ పిల్లలలమే ఒకప్పుడు
మాకూ సమయం తెలియని కాలం ఉండేది
లోకం తెలియని నవ్వులు ఉండేవి
తడిసిన చెంపలు తుడిచే చేతులు ఉండేవి

మనం చిన్నప్పుడు ఎట్లా స్నేహితులమయ్యామో నాకు గుర్తే లేదు. మీ నాన్న జేబులో సిగరెట్లు నేను కాజేసి తెచ్చి బలవంతంగా నీతోటీ తాగిస్తే పట్టుబడినప్పుడు తప్పంతా నీమీద వేసుకుని తన్నులు తిన్నావు గుర్తుందా? పరీక్షలో నాకు సాయం చేయబోయి పట్టుబడ్డావు. ఇన్నేళ్ళూ మన స్నేహం చెక్కు చెదరలేదు. నువ్వొక్క ద్రోహం మాత్రం చేశావు. అది నీకు తెలుసు. అయినా నీ స్నేహం ముఖ్యం నాకు. తెలీనట్లే ఉండిపోయాను. క్షమాపణలేవీ అక్కర్లేదు. మనం మనుషులమే కదా!

పిల్లలమంతా మళ్ళీ రెక్కలు విప్పుకున్న
సీతాకోకచిలుకలమవుతాము
కట్టుతాళ్ళు విప్పుకున్న లేగదూడలమల్లే బయటికురుకుతాము
నోళ్ళు తెరుచుకుని ఆఖరి వానచుక్కలు అందుకుంటూ…

రెక్కలు విప్పుకొన్న దూది కొండల్లో
చెట్లూ, ఏనుగులూ, కొండశిలవలూ ఇంక యేవో
అగపడినట్టే పడి మాయమవుతుంటాయి
వాటి కిందగా ఒంటరిగానో గుంపులుగానో
దేన్నీ పట్టించుకోకుండా
రెక్కలాడిస్తూ పోతున్న పిట్టలూ-

గాలి వుక్కిరిబిక్కిరై అల్లాడుతుంది
పారిపోవాలని వొకటే ప్రయాస-
దాక్కుందామని అదే తాపత్రయం-
ధ్వని కంపనాలకు దడపుట్టి
నిశ్శబ్దంలోకి తప్పుకోవాలని!

లయ తెలుసు నీకు. అనుగుణంగా అడుగు తీసి అడుగు. ఊగుతూ నడుం. ఊపుతూ చేతులు. ముందుకీ వెనక్కీ. కవ్విస్తూ దగ్గరగా ఒరిగి అందకుండా దూరంగా జరిగి. కదలికకు బదులుగా కదలిక. ఉబికే కండరం మీద నిగనిగలాడుతూ వెచ్చటి తడి.

నీ చేతిని తాకి ఉండేవాణ్ణి
నా చేతిలోకి తీసుకోగలిగీ ఉండేవాణ్ణి
నీ కంటిమీదపడుతున్న వెంట్రుక పాయను
వెనక్కి సర్ది ఉండేవాణ్ణి
అక్కడికక్కడే ఆగి ఆపి ఉండేవాణ్ణి

“ఇంకా స్టేజ్ అంతా ఖాళీగా ఉందేమిటి? తెరలూ, డెకరేషన్స్ ఏవీ లేవు!” కోక్ ఒక గుక్క తాగి అడిగింది. “అదే మరి దీని స్పెషాలిటీ! ఇది పూర్తిగా నాచురల్‌గా ఉంటుంది. మేకప్ కూడా ఉండదు. స్క్రిప్టూ, ప్రాంప్టింగ్ లాంటివీ ఉండవు. లైటింగ్‌లో కూడా ఏ ట్రిక్కులూ ఉండవు. బీజీఎమ్ కూడా ఉండదు. నో గిమ్మిక్స్, నో మానిప్యులేషన్స్! అంతా ప్యూర్, సింపుల్ ఎండ్ నాచురల్!” అన్నాడు అతను.

నువు నా చుట్టూ నా చూపు కోసం, నవ్వు కోసం తిరగడమే గుర్తుంది కానీ నేను నీ చుట్టూ తిరగడం ఎప్పుడు మొదలయిందో గుర్తు రావడం లేదు. మనం రహస్యంగా కలుసుకోవడానికి ప్లాన్స్ వేసుకోవడమూ, ఎప్పుడెప్పుడా అని ఆత్రంగా ఎదురు చూడటమూ గుర్తుకొస్తాయి. కొన్నిసార్లు మనిద్దరమూ కూచుని చెప్పుకున్న కబుర్లు గుర్తు చేసుకుంటాను.

“అదేమిటి? ఇద్దరమే కూచుని గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. సినిమాకి వెళితే నా పక్కనే కూచునేదానివి. గుర్తుందా ఒకసారి వానలో ముద్దముద్దగా తడిసి వస్తుంటే “రిం ఝిం గిరె సావన్” పాట పాడుతూనే ఉన్నావు దారంతా? నేను అడగ్గానే ఏ పాటయినా పాడేదానివి!”

నేను మిమ్మల్ని మోసం చేయబోవడం లేదు. చేసి మీ దృష్టిని ఆకట్టుకునే ఉద్దేశమే ఉంటే నా మొదటి వాక్యం “చిమ్మ చీకట్లోంచి ఒక స్త్రీ ఆర్తనాదం హృదయ విదారకంగా వినిపించింది” అయి ఉండేది.

తనకు మొహాన ఒక మచ్చ కావాలనుకుంటే పెట్టుకోనివ్వచ్చు గదా? మీ మాటే నెగ్గాలనే పట్టుదల మీకెందుకు?

కల్మషం లేని కలుషితంగాని
సత్యమైనది స్వచ్ఛమైనది..
ఏ పోలికకూ అందనిది..
దొరుకుతుందని చేరవస్తుందని నాకై ఎదురు
చూస్తుంటుందని

మబ్బులయితే నల్లగా కమ్ముకున్నాయి. గాలి చూస్తే వాన పడేట్టూ ఉంది, తేలిపోయేట్టూ ఉంది. మెయిన్‌ రోడ్డు మీద హడావుడిగా నడుస్తున్న జనాలు మరింత వడివడిగా […]

ఆ శుక్రవారం సాయంత్రం అతడు ఇల్లు చేరేసరికి ఆలస్యమయింది. నెరిసిన జుట్టు అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఒకటే ఇబ్బంది పెడుతుండడం చేత దారిలో ఆగి షాప్‌లో […]

ఖాళీలను పూరించుము అని ఎవరో చెప్పినట్టు నవ్వులూ నాలుగు చుక్కల కన్నీళ్ళూ తదితరాలూ ఎంత ఓపిగ్గా నింపినా నిండదు నిరతం అసంతృప్తం జీవితం జీవితమూ […]

చూడవలసిన పేషెంట్లంతా అయిపోయారు. ఇన్‌పేషెంట్లలో మళ్ళీ చూడవలసినవారెవరూ లేరు. తీసుకోవలసిన జాగ్రత్తలేవో తెలుసుకుని కాంపౌండరూ, నర్సూ గదులవైపు వెళ్ళిపోయారు. మరుసటిరోజు చేయవలసిన పనుల గురించి […]

సాళ్ళు సాళ్ళుగా నాటిన మొక్కలన్నీ మారాకువేసి చిక్కటి పచ్చదనంలోకి తిరిగాయి. మిరపలూ, రామ్ములక్కాయలూ, వంగలూ అయితే పూతకూడా వేశాయి. ఆకుల వెనక పురుగులేమన్నా ఉన్నయ్యేమోనని […]

కొన్ని ఉదయాలు అంతే తుమ్మచెట్టుకు చిక్కుకుని చిరిగిన గాలిపటాలే కళ్ళ కింద పరుచుకుని గుచ్చుకునే ఎడారులే దూకేందుకు పొంచి ఉన్న ఎర్రనోటి పెద్దపులులే కొన్ని […]

నా పేరు అభిరామి. అందరూ నాపేరెంతో బావుంటుందంటారు. “మీ లాగే” అని కొసరు. నేన్నవ్వేసి ఊరుకుంటాను. “నీ నవ్వు కూడా” అంటారప్పుడు. చిన్నప్పణ్ణుంచీ అంతే. […]

పచ్చటి వలపన్ని పగలంతా ఎదురుచూసింది వొంటి కాలి మీద కొంగ జపంతో చెట్టు మాపటేళకు వచ్చి వాలి ఇరుక్కుపోయింది పిట్టలగుంపు ఒకటే గలగలలు కాటుకపిట్టల […]

“అయినా లాభం లేదు. ఫ్లైట్‌ వెళ్ళిపోయింది” కౌంటర్లో మనిషి నిర్లక్ష్యంగా చెపుతూనే ఉన్నాడు. ఇటు తిరిగి చూస్తే ఫ్లైట్‌ గాల్లోకి ఎగురుతూ.. ఒక క్షణంసేపు […]

వాళ్ళిద్దరికీ వస్తానని చెప్పి వచ్చేసిందిగానీ ఆరోజంతా ఆ విషయమే మనసులో కదలాడుతూ ఉంది. ఈ వయసులో ఉద్యోగం చేస్తూ ముగ్గురు పిల్లల్ని ఎట్లా సాకగలుగుతుంది? అందుకు కావలసిన మానసిక శారీరక శక్తులు ఆమెకి ఎక్కణ్ణుంచి వస్తున్నాయి? కోరి నెత్తిమీదికి ఈ కష్టం ఎందుకు తెచ్చుకుంది?

ఇప్పుడక్కడ కవిత్వంగా మలచడానికి మిగిలిందేమీ లేదు ఒక నివ్వెరపోయే దృశ్యం, కంట తడిరాని దుఃఖం వెడల్పాటి బాటలూ, ఎ్తౖతెన అరుగులూ, అటూ ఇటూ నవ్వులతో […]

(కన్నెగంటి చంద్ర తెలుసా, “ఈమాట”, తానా పత్రికల ద్వారా అమెరికా పాఠకులకు పరిచితులు. కవిత్వంలోనూ, కథనంలోనూ తనవైన శైలి, భావాలు, ప్రతీకలు చూపిస్తున్న చంద్ర […]

కలనించి మెలకువకు వంతెన వేస్తూ ఫోన్‌ చప్పుడు.. “హలో” వదలని నిదరమత్తు, బద్ధకం. “హలో! నేను శంకర్ని మాట్లాడుతున్నా!” “ఆఁ శంకర్‌ ఏమిటి సంగతులు?” […]

(కన్నెగంటి చంద్రశేఖర్‌ డల్లాస్‌ వాసులు. కవిగా, కథకుడిగా అందరికీ చిరపరిచితులు. కొత్త తీరాల్లో సరికొత్త ద్వారాలు తెరుస్తున్నారు తన రచనల్తో!) “మంచి సినిమా వస్తుంది […]

ఆటల్లో మునిగినా ఎట్లా గమనించారో, ఎవరు ముందుగా చూశారో తెలియదు, పిల్లలంతా గుమికూడారు దాని చుట్టూ..వాళ్ళ కేకలూ, చిందులూ చిటికెలో వదిలేసి.. ఎంత ఎగరాలని […]

ఇన్నిరకాల అభినయాలూ.. నవరసాల పోషణలూ.. అంత సీనేం లేదు.. తెరలన్నీ నెమ్మదిగా దించేద్దూ.. స్విచ్‌లన్నీ ఒక్కటొక్కటే ఆఫ్‌చేసి..మ్యూట్‌బటన్‌నొక్కేసి ఒక మంద్రగీతం లోకి మగతగా..మెల్లగా.. వంతెన […]