నువ్వూ నేనూ ఇద్దరమే
నువ్వూ నేనూ పక్కపక్కనేకొంచెం దూరంగా సంగీతం
ఉద్వేగం నిండిన సంబరపు
గొంతుల్ని కలుపుకుని
కనపడకుండా నాట్యంఏదో జరగబోతుందన్నట్టు
కుతూహలంగా పరుగులు తీస్తూ
వదలకుండా మన చుట్టూ నీటిగాలీనీ మొహమ్మీద మెరుస్తూ
చక్కిలిగింతలు పెడుతూ
వెలుతురు అలలూనీ చేతిని తాకి ఉండేవాణ్ణి
నా చేతిలోకి తీసుకోగలిగీ ఉండేవాణ్ణి
నీ కంటిమీదుగాపడుతున్న వెంట్రుకల పాయని
వెనక్కి సర్ది ఉండేవాణ్ణి
అక్కడికక్కడే ఆగి ఆపి ఉండేవాణ్ణిఅది మనకు గుర్తుండిపోయే సాయంత్రమయ్యేది
‘ఒకానొక సాయంత్రం’ అని మొదలుపెట్టి
ముచ్చట్లు చెప్పుకోవడానికి మనకుండేదిఇప్పుడదొట్టి ఇంకో సాయంత్రం
విచ్చుకోకనే రాలిపోయిన జ్ఞాపకం