ద్వంద్వం

పచ్చటి వలపన్ని
పగలంతా ఎదురుచూసింది
వొంటి కాలి మీద కొంగ జపంతో చెట్టు
మాపటేళకు వచ్చి వాలి ఇరుక్కుపోయింది పిట్టలగుంపు
ఒకటే గలగలలు

కాటుకపిట్టల దండు
వలై వచ్చి విసురుగా పడింది
పారిపోలేని పిచ్చి చెట్టు చిక్కుకుపోయింది
వొళ్ళంతా రెక్కలుండీ ఎంత విసిరీ ఎగరలేదు
ఒకటే కువకువలు


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...