రచయిత వివరాలు

భైరవభట్ల కామేశ్వరరావు

పూర్తిపేరు: భైరవభట్ల కామేశ్వరరావు
ఇతరపేర్లు:
సొంత ఊరు: విజయనగరం
ప్రస్తుత నివాసం: చెన్నై
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: http://telugupadyam.blogspot.com/
రచయిత గురించి:

 

ఒకసారి వైశేషికుల సిద్ధాంతంలో పదార్థాల గురించి ఎడమ నేను చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకున్నాను. ద్రవ్యం, గుణం, కర్మ, సామాన్యం, విశేషం, సమవాయం. ఇందులో ద్రవ్యం ఒక్కటే స్వతంత్రమైనది. గుణ కర్మలు ద్రవ్యం మీద ఆధారపడతాయి. అలాగే ద్రవ్యాలలో సమానంగా ఉండే లక్షణం సామాన్యం. ఒక్కొక్క ప్రత్యేకమైన ద్రవ్యం ఒక విశేషం. పదార్థాల మధ్యన ఉండే అవినాభావ సంబంధం సమవాయం.

తర్కం,హేతువు కూడా మానవ బుద్ధినుంచి పుట్టేవేననీ, మానవ బుద్ధి పరిమితమైనదనీ భావించడం వల్ల కాబోలు, తర్కాన్నీ హేతువునూ అధిగమించిన పరమ సత్యం కోసం భారతీయ తత్త్వవేత్తలు తమ అన్వేషణ సాగించారు. అంత మాత్రాన భారతీయులు తర్కానికి తక్కువ స్థానం యిచ్చారని అనుకోవడం పెద్ద తప్పే అవుతుంది. తత్త్వసిద్ధాంతాల ప్రతిపాదనలో తర్కానికి తిరుగులేని ప్రాధాన్యం ఉంది.

అనగనగా ఒక పల్లెటూళ్ళో ఒకే ఒక క్షురకుడు, అనగా బార్బర్ ఉన్నాడు. అతనికి ఒక నియమం ఉంది. ఆ ఊళ్ళో తమకి తాము గడ్డం గీసుకోని వారికే అతను గడ్డం గీస్తాడు. తనకు తాను గడ్డం గీసుకొనే ఏ వ్యక్తికీ అతను గడ్డం గీయడు. చాలా సజావైన నియమం లాగానే ఉంది కదూ! అయితే దీనికి సమాధానం చెప్పు చూద్దాం. ఆ క్షురకుడు తన గడ్డం తాను గీసుకుంటాడా లేదా? ఇందులో మెలిక ఏమిటో జాగ్రత్తగా ఆలోచించు.

ఈ కథలో చిక్కుముడికి అసలు కారణం గమనించారా? ఒక తండ్రికి మరొక సంబంధం ద్వారా కొడుకే తిరిగి తండ్రి కావడం! ఒక దిశలో తిన్నగా సాగిపోయే సాధారణ బంధుత్వాల పరంపర, వేరొక బంధుత్వం ద్వారా మెలితిరిగి, తిరిగి మొదలికి వచ్చిందన్నమాట. దాని వలన సాధారణ సంబంధాలలో కనిపించని ఒకానొక వైరుధ్యం ఇక్కడ ఏర్పడింది.

క్రితం సంచికలోని గడినుడి 24కి మొదటి 15 రోజుల్లోనే అయిదుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపిన అయిదుగురు: 1. రవిచంద్ర ఇనగంటి 2. ప్రతిభ 3. అనూరాధా సాయి జొన్నలగడ్డ 4. వైదేహి అక్కపెద్ది 5. భమిడిపాటి సూర్యలక్ష్మి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి – 24 సమాధానాలు, వివరణ.

క్రితం సంచికలోని గడినుడి 21కి గడువు తేదీలోగా నలుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపిన నలుగురు: 1. రవిచంద్ర ఇనగంటి, 2. జంధ్యాల ఉమాదేవి, 3. గిరిజ వారణాసి, 4. ప్రతిభ. వారికి మా అభినందనలు. గడి నుడి – 21 సమాధానాలు, వివరణ

తాతగారి కవితలోని పదగుంభనమూ ప్రౌఢత్వమూ యీ మనుమడు పుణికిపుచ్చుకున్నట్టు లేదు. రామభద్రకవి రచనలో ప్రౌఢతకన్నా సారళ్యము, ఓజస్సు కన్నా మాధుర్యమూ ఎక్కువగా కనిపిస్తుంది. తన కవిత గురించి చెప్పుకున్న సందర్భాలలో కూడా ‘మామక నవ్యకావ్యము సమంచిత మాధురి సాధురీతి’ అని, ‘మాధురీగతి ప్రబంధ మొనర్చిన నొప్పుగాక’ అనీ, మాధుర్య గుణాన్ని ప్రధానంగా పేర్కొన్నాడితను. పైన యిచ్చిన రెండు పద్యాలూ ఈ గుణానికి చక్కని మచ్చుతునకలు.

రాయిని ఆడది చేసిన రాముడివా! సినిమా పాటగా ఈ వాక్యం ప్రసిద్ధమైనా, నిజానికి ఇందులో కొంత తిరకాసుంది. అదేమిటో పదాలను కాస్త అటూయిటూ చేస్తే తెలుస్తుంది. ఈ వాక్యం చూడండి: ‘ఆడది రాయిని చేసిన రాముడివా!’ దీని అర్థం ఏమిటి? ఒక ఆడదాని చేత రాయిగా మారిన రాముడివా అని అర్థం వస్తుంది. ఇలా పదక్రమం మార్చడం వల్ల అర్థం మారిపోయిందంటే అది సరైన తెలుగు వాక్యం కాదని లెక్క.

గడినుడి 16కు ఈసారి గడువు తేదీలోపు ఎవ్వరూ సరైన సమాధానాలు పంపలేదు. సరిచూపు సహాయంతో నింపిన మొదటి ఐదుగురు: 1. రమాదేవి పూల 2. హరిణి దిగుమర్తి. 3. సతీశ్ 4. భమిడిపాటి సూర్యలక్ష్మి 5. మంథా వీరభద్రం. వీరికి మా అభినందనలు.

గడి నుడి – 16 సమాధానాలు, వివరణ.

పదిహేనేళ్ళ అమృతకి, ఆ వయసుకి తగ్గట్టే తన రూపరేఖలపై ప్రత్యేకదృష్టి ఉండేది. సంప్రదాయాన్ని తోసిరాజనే కొత్త ఫేషన్లు, ప్రయోగాలు ఇష్టపడేది. పారిస్ నగరంలో అడుగుపెట్టాకనే షేర్-గిల్ ఆత్మాకృతి చిత్రణ పూర్తిగా వికసించింది. మొత్తం పందొమ్మిది చిత్రాలను ఆమె అక్కడే గీసింది. ఒక కళాకారిణిగా తోటి కళాకారుల మధ్య జీవించే, పనిచేసే అవకాశం అక్కడ ఆమెకి దొరికింది.

గడినుడి 14 పూర్తిగా నింపిన 1. కామాక్షి, 2. ఆళ్ళ రామారావు గార్లకు మా అభినందనలు. సరిచూపు సహాయంతో గడి పూర్తిగా తప్పులు లేకుండా నింపిన మొదటి ఐదుగురు: 1. రమాదేవి పూల, 2. కార్తిక్ చంద్ర, 3. GBT Sundari, 4. హేమంత్ గోటేటి, 5. రవిచంద్ర ఇనగంటి. వీరికి మా అభినందనలు.

గడి నుడి – 14 సమాధానాలు, వివరణ.

వలపులు చిందే చూపులలోని అందమే వేరు! అందులోనూ, తొలిచూపుల పలకరింపులు మనసులను గిలింతలు పెడుతూ మరింతగా అలరిస్తాయి. పెళ్ళిపీటల మీద, సిగ్గుబరువుతో రెప్పలు ఎత్తలేక, పక్కనున్నవారిని కంటితుదలతో చూసే ప్రక్కచూపుల నేర్పు, మన్మథుడు నేర్పే ప్రథమ విద్య అంటారు విశ్వనాథ. ప్రేయసీ ప్రియల తొలిచూపులను శృంగార రసోల్లాసంగా తెలుగులో వర్ణించిన మొట్టమొదటి కవి నాకు తెలిసి తిక్కన.

నిందాస్తుతి అంటే పైకి తిడుతున్నట్టు, గేలి చేస్తున్నట్టు, కనిపిస్తూనే స్తుతి చేయడం. నిందాస్తుతిని సమర్థంగా నిర్వహించాలంటే కవికి మంచి చమత్కారం ఉండాలి, భాషపై గొప్ప పట్టు ఉండాలి. భాషపై పట్టు అంటే కేవలం పాండిత్యం కాదు, సజీవమైన వాడుక. మాట్లాడే భాషలో ఉండే కాకువు దీనికి ప్రధానమైన సాధనం. కోపం, వెటకారం, భయం మొదలైన భావాలు స్వరం ద్వారా ధ్వనించే శక్తిని కాకువు అంటారు.

నిన్ను చూసి అరుస్తుందీ లోకం
అన్నా! వదలకు ఆత్మస్థైర్యం
రెండు నాలుకల బుసకొడుతుందది
గుండె దిటవుచెయ్ తమ్మీ! బెదరకు
రెండు మాటలీ లోకం పోకడ
విచిత్రమైనది భాయ్, తెలుసుకో!

ఆయన అన్నగారు ఇప్పుడెలా అని అడిగితే, కంగారు అవసరం లేదని చెప్పి తన గదిలోకి వెళ్ళి గడియ వేసుకొని శారదాపీఠం ముందు కూర్చొని సరస్వతీ ధ్యాన నిమగ్నుడయ్యాడట పినవీరన. అతను ధ్యానంలో ఉండగా సరస్వతి ప్రత్యక్షమై శతఘంటాలతో కావ్యాన్ని వ్రాయడం మొదలుపెడుతుంది. ఇంచుమించు పూర్తి అవుతోందనగా, ఆ గదినుండి వస్తున్న దివ్యకాంతులను చూసి అన్న తలుపు సందునుండి చూసేసరికి, ‘బావగారు వచ్చారు’ అంటూ సరస్వతి అదృశ్యమవుతుంది.

విష్ణువు అంటాడు కదా, ‘నువ్వు నన్ను వదిలిపోయినప్పటి నుంచీ, ఇదిగో ఈ పుట్టలో నిన్నే తలుచుకుంటూ కూర్చున్నాను. పశులకాపరి నా తల పగలగొట్టినప్పుడు ఆ బాధకు ఓర్చి నేనిలా ఉన్నానంటే అది నీ మహిమే. నీ పాతివ్రత్య నిష్ఠ చేతనే నేనింకా బతికున్నాను. అదలా ఉంటే, ఈ ఆకాశరాజ కన్య నన్ను మోహించి నా వెంటపడింది. అందుకామెను పెళ్ళిచేసుకోవలసి వచ్చింది. అది కూడా నువ్వు ఒప్పుకొంటేనే సుమా! నువ్వు కాదంటే నాకీ పెళ్ళి వద్దు.’ ఇవీ ఆయనగారి మాటలు! అయినా అమ్మవారి దగ్గరా ఆయన మాయలు?

గడినుడి 10కి ఈసారి చాలా ఆలస్యంగా ఇద్దరు మాత్రమే తప్పుల్లేని పరిష్కారాలు పంపగలిగారు: 1. రవిచంద్ర ఇనగంటి, 2. శ్రీవల్లీ రాధిక. అన్ని సమాధానాలూ సరిగా పంపిన ఈ ఇద్దరు విజేతలకు అభినందనలు.

గడి నుడి – 10 సమాధానాలు, వివరణ.

అడవిలో తిరిగే పిశాచాల సాహచర్యంతో పైశాచీ భాష నేర్చుకుంటాడు గుణాఢ్యుడు. నేర్చుకోవడమేమిటి, ఆ భాషలో కవిత్వం అల్లగల పాండిత్యం సంపాదిస్తాడు! దీని కోసమే ఎదురు చూస్తున్న కాణభూతి అనే ఒక పిశాచం వచ్చి మహత్తరమైన కథలను వినిపిస్తాడు. వాటిని పైశాచీ భాషలో ఏడేళ్ళు శ్రమపడి ఏడు లక్షల శ్లోకాలతో ఏడు బృహత్ గ్రంథాలుగా రచిస్తాడు గుణాఢ్యుడు. అయితే, ఆ అడవిలో అతనికి రాసేందుకు సాధనాలు ఎక్కడివి?

చనుబాల కోసం ఏడుస్తున్న పిల్లాడికి ఒక పిండిముద్ద ఇచ్చి మాయ చేసే తల్లిలా నన్ను మాయ చేసి పోదామని అనుకుంటున్నావా. నీకు మూడు కళ్ళు ఉన్నా లేకున్నా, నువ్వు హర రూపంలో వచ్చినా నర రూపంలో వచ్చినా నాకు ఒకటే. అంచేత నీ చమత్కారాలు చాలించి నే పెట్టిన భోజనాన్ని బుద్ధిగా ఆరగించి వెళ్ళు – అని శివుడినే గదమాయిస్తుంది ఆ మహా భక్తురాలు!

ఒక శిల్పాన్ని నిర్మించడమంటే, మనిషి ముక్కు చెవులు తెలిసేట్టు ఏదో చెక్కుకుంటూ పోవడం కాదు. మనసుపెట్టి చూసేవారికి అందులోని ప్రతి వంపులోనూ విశిష్టత కనిపించాలి. ఆ కూర్పులో గొప్ప సౌష్ఠవం తొణికిసలాడాలి. మనసుపెట్టి చూసేవారికి అందులోని ప్రతి వంపులోనూ విశిష్టత కనిపించాలి. ఆ కూర్పులో గొప్ప సౌష్ఠవం తొణికిసలాడాలి. పద్యమైనా అంతే!

పూర్వం మన కథలన్నీ చివరకు కంచికే వెళ్ళేవి. అందుకే వాటి ముగింపుతో మనకి పెద్దగా నిమిత్తం లేదు. ఆ మాటకొస్తే కథతో కూడా లేదు! కథనంలో వచ్చే కల్పనలు, సంభాషణలు, వర్ణనలు, అవి రేకెత్తించే ఆలోచనలు, అనుభూతులు – అవీ మనకు ముఖ్యం. అందుకే మన కావ్యాలలో పురాణాలలో, అవే పాత్రలు అవే కథలు రకరకాలుగా వినిపిస్తాయి. కథ మొదట్లోనే దాని ముగింపు తెలిసిపోతుంది! ఈ కావ్యం కూడా సరిగ్గా అలాగే మొదలవుతుంది.

అంచేత మన్మథుని దండయాత్రకు అనువైన సమయం సాయంత్రమే. ఇక్కడ జైత్రయాత్ర ఎవరిపైన అంటే, పాంథనిచయంబులపైన. అంటే ప్రయాణంలో ఉన్నవాళ్ళపైన. తమ ప్రియతములకు దూరమై విరహంతో వేగుతూ ఉండే వాళ్ళపైనన్న మాట! రాజు ఎక్కడికైనా బయలుదేరాడనగానే పెద్ద సన్నాహమే కదా. అతని ఠీవికి తగ్గట్టుగా ముందు కొంతమంది రాజోచిత లాంఛనాలను పట్టుకొని నడుస్తారు. అలాంటి రాజచిహ్నాలలో సూర్యచంద్రుల బొమ్మలున్న పలకలు అమర్చిన పొడుగాటి కర్రలను సూర్యపాను చంద్రపాను అంటారు. కాని, ఇక్కడ యాత్రకి సన్నద్ధమయినది మామూలు రాజు కాదు కదా!

ఈసారి కూడా చాలా తొందరగా చాలా పరిష్కారాలు వచ్చినా, తప్పుల్లేని పరిష్కారాలు మాత్రం అంత తొందరగా రాలేదు. అన్ని సమాధానాలూ సరిగా పంపింది బిహెచ్ విజయాదిత్య ఒక్కరే. ఒక్క తప్పుతో సమాధానం పంపించింది: పం.గో.కృ.రావు. ఇద్దరికీ అభినందనలు!

గడి నుడి – 5 సమాధానాలు, వివరణ

ఆగమెమ్నాన్ గ్రీకు పురాణాలలో ప్రముఖుడైన రాజు. ట్రోజన్ యుద్ధంలో గ్రీకు సైన్యాలని ఒకటి చేసిన వీరుడు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, హోమర్ చెప్పడం వల్లనే ఆతని పేరు ఇంత కాలం నిలిచున్నదని, ఆగమెమ్నాన్ ముందు ఎంతమంది వీరులు కావ్యానికి ఎక్కకపోవడం వలన కాలగర్భంలో కలిసిపోయారో! అని అంటున్నాడు హోరెస్. హోమర్‌ని సేక్రెడ్ బార్డ్‌గా పేర్కొన్నాడు హోరెస్. సరిగ్గా మన పద్యంలో ఉన్న వాల్మీకి కూడా అదే కదా!

ఇది నన్నెచోడుడు రచించిన కుమారసంభవ కావ్యంలోని పద్యం. శివునికి తపోభంగమయ్యే ఘట్టం. పార్వతీదేవి కడకంటి చూపులతో కలిసి మరుని తూపులు శివుని మనసులో నాటుకున్నాయి. స్థాణువులో ఒక్కసారి కదలిక వచ్చింది. సర్వసంగపరిత్యాగిలో శృంగారం అంకురించింది. ఆ సమయంలో శివునిలో కలిగిన ఒక సాత్వికభావ విశేషాన్ని వర్ణిస్తున్న పద్యమిది.

పద్యానికి ఆధునికస్వరాన్ని యివ్వడంతో పాటుగా, పాటని కావ్యంగా మలిచిన చాలా కొద్దిమంది కవులలో విద్వాన్ విశ్వం ఒకరు. పాటనీ పద్యాన్నీ జమిలిగా నేత నేసి, అటు పల్లెపాట లోని అమాయకత్వమూ యిటు మార్గకవిత్వం లోని ప్రౌఢత్వమూ సరిపాళ్ళలో జత చేసి, ఒక సరికొత్త పాటను వినిపించిన కవి. రాయలసీమ కన్నీటిపాటను పెన్నేటిపాటగా ఆయన మలిచిన తీరు అపూర్వం.

మానవుని ఊహకి అంతేముంది. చకోరమనే పక్షి వెన్నెలని మాత్రమే తాగుతుందనీ, ఆ పక్షికి అదే ఆహారమనీ ఒక చిత్రమైన కల్పన చేశాడు. ఎవరు ఎప్పుడు చేశారో తెలియదు కానీ, అది కవుల కవిత్వానికి గొప్ప ముడిసరుకయ్యింది. వెన్నెలను వర్ణించే ప్రతిచోటా చకోరాల ప్రస్తావన తప్పనిసరి. ఆదికవి వాల్మీకితో మొదలుపెట్టి, ఇంచుమించుగా సంస్కృత కవులందరూ వెన్నెల గురించీ వెన్నెలపులుగుల గురించీ రకరకాల కల్పనలు చేసినవారే. మన తెలుగు కవులకి అదే ఒరవడి అయ్యింది.

మొదటి గడి-నుడిని ఉత్సాహంగా ప్రయత్నించి ప్రోత్సహించిన పాఠకులందరికీ మా కృతజ్ఞతలు. ఈ నెల గడినుంచీ నియమాలు కొద్దిగా మారాయి. దయచేసి గమనించగలరు.

భాష తెలియడమంటే నిఘంటువులో పదాలు, వ్యాకరణ సూత్రాలూ తెలియడం మాత్రమే కాదు. వాక్యవిన్యాస రహస్యాలు తెలియాలి, నుడికారంలోని సొగసులు తెలియాలి, పలుకులోని కాకువు తెలియాలి. అవి తెలియాలంటే పండితుడయితే సరిపోదు, జనవ్యవహారంలో నిత్యం ప్రవహించే పలుకుబడి వంటబట్టాలి. అందుకే విశ్వనాథ ‘లోకమ్ము వీడి రసమ్ము లేదు’ అన్నది. పోతన కన్నా గొప్పగా తెలుగులోకపు పలుకుబడిని పట్టుకొన్న కవి ఎవరున్నారు!

మల్లెపూలు కోసుకొచ్చి, ఒడిలో పోసుకొని, తల్లి దగ్గర కూర్చొని ఉంది కొత్త పెళ్ళికూతురు. ఒకో పువ్వుని తల్లికి అందిస్తూ ఉంటే ఆమె కూతురికి చక్కని వాలుజడ అల్లుతోంది. ఈ లోపున ఈయన వచ్చారు. ఇంకా కొత్త కదా, సిగ్గూ బిడియం పోలేదు. ఆయన్ని అలా చూసేసరికల్లా ఆ నవోఢకు ఏం చేయడానికీ పాలుపోలేదు. దగ్గరకి వెళ్ళాలా, అలాగే ఉండాలా, సిగ్గుతో పారిపోవాలా – ఏమీ తెలియక, ఏదో చేయాలన్న తొందరలో, దిగ్గునలేచి మునిగాళ్ళపై నిలుచుండిపోయింది.

శుచిముఖి చేసిన వర్ణనలో, ప్రభావతి శరీరాంగాలకు పోలికలుగా చెప్పిన తుమ్మెదలు, చంద్రబింబమూ మొదలైన ఉపమానాల సౌందర్యానికి వెయ్యిరెట్లుగా ఆయా శరీరభాగాలను ఊహించుకొన్నాడు ప్రద్యుమ్నుడు. అలా ఊహించి ఊహించి తన మనసుకి కొద్ది కొద్దిగా కనిపించే ఆమె శరీరాకృతిని జాగ్రత్తగా పొందుపరచుకొన్నాడు. అలా కొంచెం కొంచెం పొందుపరచుకొంటూ పోగా చివరికి ఆమె రూపం ఎలా ఉంటుందో, సరిగ్గా అలాగే ప్రద్యుమ్నునికి దర్శనమయ్యిందిట!

బాణాసురుడు ఒక విపరీత మనస్తత్వం కలిగినవాడు. ఇతను బలిచక్రవర్తి కుమారుడు. బహుశా యితని చిన్నతనంలోనే తండ్రి పాతాళానికి వెళ్ళిపోయాడేమో! ఇతని చిన్నతనం గురించి అంతగా తెలియదు కాని కొంత పెద్దవాడయ్యాక గొప్ప శివభక్తుడవుతాడు. ఒకనాడు శివుడు కుమారస్వామిని వాత్సల్యంతో దగ్గరకు తీసుకోడం చూసిన బాణునికి సంతోషమూ విచారమూ ఒకేసారి కలుగుతాయి. తన తండ్రి ఉండుంటే తనని కూడా అలా లాలించేవాడు కదా అనుకొంటాడు.

కంసుడు పంపిన రాక్షసులలో రెండవవాడైన శకటాసురుని కృష్ణుడు సంహరించే సన్నివేశంలో వచ్చే పద్యమిది. యశోద స్నానానికని గోపసతులతో నదీతీరానికి వస్తుంది. తాము వచ్చిన బండి క్రింద పక్కవేసి కృష్ణయ్యను పడుకోబెట్టి, నది దగ్గరకి వెళుతుంది. ఆ బండిని శకటాసురుడు ఆవహిస్తాడు. ఇంతలో కృష్ణుడు మేలుకొంటాడు. తల్లి దగ్గర లేకపోయేసరికి ఏడుపు లంకించుకొంటాడు. అప్పుడా బాలకృష్ణుని ముగ్ధస్వరూపాన్ని వర్ణించే పద్యం ఇది.

‘సామాన్యుని జీవనం’ ఆయా కాలాలలో వచ్చిన సృజనాత్మక సాహిత్యంలో అంతో ఇంతో ప్రతిఫలిస్తూనే ఉంటుంది. దేశి సాహిత్యంలో అది విస్తృతంగా కనిపిస్తే, మార్గ సాహిత్యంలో పరిమితంగా కనిపిస్తుంది. తెలుగులో శైవసాహిత్యమూ, శ్రీనాథుని కావ్యాలూ సామాన్య జనజీవనాన్ని మరింత ఎక్కువగా ప్రతిఫలిస్తాయి. అయితే, ఏ కావ్యమైనా సమకాలీన సమాజ పరిస్థితుల ప్రభావం నుంచి పూర్తిగా తప్పించుకోలేదు కాబట్టి ఏదో ఒక రూపంలో ప్రబంధాలలో కూడా ఆ కాల స్వభావం వ్యక్తమవుతూనే ఉంటుంది.

అగస్త్యుడు తానొక్కడే చకచకా ఆ కొండెక్కి లోపాముద్రని వచ్చేయమనలేదు. పాపం అసలే సన్నని నడుమేమో, అంత పెద్ద కొండ ఎక్కేటప్పుడు ఆమెకి నడుమునొప్పి రాక మానదు. అది గ్రహించిన అగస్త్యుడు, తానొక అడుగు ఎక్కి, ఆమె చేయిపట్టుకొని, ప్రేమగా రమ్మని పిలిచి, ఎక్కిస్తూ, ఎంతో ఆదరంతో జాగ్రత్తగా తనతో పాటు కొండ చివరికంటూ తీసుకువెళ్ళాడట. ఆ తర్వాత అక్కడి జలపాతాలలో వారిద్దరూ సరిగంగ స్నానాలు చేశారు. ఎంత చూడముచ్చటైన దృశ్యమో కదా!

మన తెలుగుభాషలో ‘పొంకము,’ ‘బింకము’ అని రెండు చక్కని పదాలున్నాయి. పొంకము అంటే పొందిక, బింకము అంటే బిగువు. శారీరక సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు ముఖ్యంగా యీ పదాలు వాడుతూ ఉంటాం. సంస్కృతంలో సౌష్ఠవం అనే పదానికి యిదే అర్థముంది. మనిషి శరీరంలోనే కాకుండా సృష్టిలో అనేక చోట్ల అనేక రూపాల్లో మనకీ సౌష్ఠవం దర్శనమిస్తుంది. పూలరేకుల అమరిక దగ్గరనుండీ, గ్రహగతుల సమీకరణాల వరకూ విస్తరించిన సౌందర్యం అది.

పురాణాల గురించి వాళ్ళు చేసే వ్యాఖ్యానాలూ ప్రవచనాలూ ప్రసంగాలూ, ‘కలలో వార్తలు విప్పిచెప్పడం’ వంటిదట. ఇది మరొక ఆశ్చర్యమైన పోలిక. అందులోని స్వారస్యం పాఠకులే గ్రహింతురు గాక! అలా పురాణార్థాలను వివరించే సన్యాసులకు సైతం నిజంగా మోక్షం అంటే ఏమిటో తెలియదబ్బాయ్ అన్నాడు. మోక్షాన్ని కౌగిలించుకోవడం అనేది చింతకాయ కజ్జాయం వంటిదట.

బాణాలే కాదు, మన్మథుని సరంజామా అంతా ప్రకృతికి సంబంధించినదే. చెఱుకువిల్లు, తుమ్మెదల నారి, పూలబాణాలు, చిలక వాహనం, చిరుగాలి రథం, చంద్రుడు సైదోడు. అంతా, మనసులని మరులుగొలిపే వసంతకాలపు ప్రకృతి. స్వయానా ఆ వసంతుడే అతని సైన్యాధిపతి. ఇలా దేవతా స్వరూపాలను ప్రకృతికి ప్రతీకలుగా రూపుదిద్దడం మన సంస్కృతిలో సర్వత్రా కనిపించే విశేషం. మన సంస్కృతికి ప్రకృతే జీవం. ప్రకృతికి దూరమైపోయి మన సంస్కృతిని కాపాడుకోవాలని తాపత్రయపడటం శవజాగరణ చేయడం లాంటిదే!

మొత్తం సృష్టిలో ఒకానొక జీవిగా మన మానవజాతి ఆయుఃప్రమాణమెంత? దాన్ని మనం ఎంతవరకూ సద్వినియోగం చేసుకుంటున్నాం? బుద్ధిజీవులమైన మనం ఆ బుద్ధిని దేనికోసం ఉపయోగిస్తున్నాం? జారిపోయే కాలం విలువని తెలుసుకోనీయకుండా ఏయే ఉన్మాదాలు మన బుద్ధిని ఆక్రమించేస్తున్నాయి? మతోన్మాదం, మదోన్మాదం, ధనోన్మాదం, అధికారోన్మాదం – ఎన్నెన్నో ఉన్మాదాలు!

ఒక్కసారి ఆలోచించి చూస్తే, వెన్నెలకీ శివునికీ ఎంత దగ్గరి పోలికో మనకి అవగతం అవుతుంది! వెన్నెల ఎప్పుడూ రాత్రే ప్రకాశిస్తుంది. అంచేత అది నలుపు తెలుపుల చిత్రమైన సమ్మేళనం. శివుడూ అంతే! ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే, అతను ఎంతటి జ్ఞానమూర్తియో, అంతటి తామసికశక్తి. మనం చిత్రించుకున్న భౌతిక రూపాన్ని ఊహలోకి తెచ్చుకున్నా, అతను నలుపు తెలుపుల చిత్ర సంగమమే!

ఇదీ నన్నయ్యగారి దేవయాని! తెలుగు భారతంలో ఆమె అసాధ్యురాలు, గొప్ప గడసరి కూడా! అందుకే మొదలుపెడుతూనే నిష్ఠూరాలు! తప్పంతా యయాతిపై తోసేసింది. ఆ రోజు నన్ను బావినుండి బయటకు తీసే సందర్భంలో సూర్యుని సాక్షిగా నీ ఉన్నతమైన దక్షిణహస్తంతో నా దక్షిణహస్తాన్ని పట్టుకున్నావు. కాబట్టి ముందే నన్ను పాణిగ్రహణం చేశావు. అది నువ్వు మరచిపోవడం న్యాయమా? అని యయాతిని నిలదీసింది!

చీకటి మరింత చిక్కబడింది. మన్మథుడు వచ్చాడు కాబట్టి వారవనితలూ జారవనితలూ కూడా వచ్చి చేరారు! కవిగారి చమత్కారం చూడండి. ‘వృద్ధ వారవిలాసినీ విసరమునకు అపలితంకరణ ఔషధంబు అనగ’ ఉందట చీకటి. పలితకేశం అంటే నెరిసిన జుట్టు. పలితంకరణం అంటే జుట్టు పండిపోవడం. అపలితంకరణం అంటే కేశాలకు నల్లదనం రావడం. అపలితంకరణ ఔషధం అంటే, అలా నల్లబడేందుకు వాడే మందు, అంటే ఇప్పటి భాషలో hair dye.

అనగనగా ఒక భీముడు. పేరుకు తగ్గట్టుగానే అరివీర భయంకరుడు. తన కత్తితో పిడుగును సైతం నరికిన పరాక్రమం అతనిది. అది ఆషామాషీ కత్తి కాదు! కాలకూటవిషపు ముద్దని తన మూడవకన్ను అనే కొలిమిలో కాల్చిపెట్టి, వాసుకి కోరలనే పట్టకార్లతో పట్టి, ఒక దిగ్దంతి తలపై పెట్టి, పిడుగుల సమూహమనే సమ్మెటతో కొట్టి, స్వయంగా ఆ లయకారుడైన శివుడే కమ్మరిగా తయారుచేసినదేమో అన్నంత భయంకరంగా ఉండే ఖడ్గం అది.

ఆ పిల్లవాడేమో అల్లరివాడు, ఎప్పుడూ ఇటూ అటూ ఆడుతూనే ఉంటాడు. కానీ వసంతానికి అతడు ముద్దులబాలుడు. అందుకే వాడిని మురిపెంగా జోలపాడి బజ్జో పెట్టాలన్న తాపత్రయం. ఆ సన్నివేశాన్ని చాలా అందంగా మన ముందుంచాడు భట్టుమూర్తి. వసంతశోభ అంతా పచ్చదనంతో మిసమిసలాడే చెట్లలోనే కనిపిస్తుంది.

ఆమె ముఖపద్మం వాడిపోయింది. తెల్లని నిడుదైన కన్నులు చిన్నబోయి ఉన్నాయి. చెలులతో చేరి ఆమె సరసులోకి దిగి ఆడటం లేదు. ఒక చేయి నుదుటన పెట్టుకుని అలా ఒడ్డునే కూర్చొని ఉంది. నెచ్చెలులు తనని ఆడడానికి రమ్మని పిలుస్తున్నారు. వాళ్ళకి రెండో చేత్తో, ఒంటి చేత్తోనే, నమస్కారం పెట్టి, దయచేసి మీ దోవన మీరు ఆడుకోండని చెపుతోంది. నలుదిక్కులా పరికిస్తోంది. ఏమిటి చూస్తోంది? ఏమీ లేదు! అది ‘చూడక చూచు చూడ్కి.’ వట్టి చూపులన్న మాట.

ఇక పద్యంలోని కవిత్వలోతుల వైపు దృష్టి సారిస్తే, తిక్కన కవిత్వంలో ప్రధానంగా కనిపించే గుణం ధ్వని. కవిత్వంలో ధ్వనిని రకరకాల మార్గాల ద్వారా వ్యక్తం చేయవచ్చు. శబ్దం ద్వారా, అలంకారాల ద్వారా, వర్ణనల ద్వారా, కథాకథనం ద్వారా, యిలా అనేక మార్గాలు. ఒకో కవిది ఒకొక్క ప్రత్యేక మార్గం.

శ్రీనాథుని యజ్ఞదత్తుడు, భార్యతో వ్యంగ్యంగా మొదలుపెడతాడు. ఇంటికి వచ్చి, “సోమిదమ్మ! ఏమి చేయుచున్నావు? ఇటు రమ్మ! నీ కొడుకెక్కడం బోయె? బోవగా కేమి? విను మిట్లనియె”, అని పై పద్యం చెపుతాడు. ఎక్కడా తిట్టుపదం లేదు. కానీ పలికే తీరులో ఒలికే వ్యంగ్యమంతా సహృదయులైన పాఠకులు ఊహించుకోవలసిందే!

కవి ఒక మనోజ్ఞ కావ్యాన్ని రచిస్తున్నాడు. ఎక్కడ? దొంతరలైన మబ్బులకు త్రోవలు చూపే కాగడా చెంత కూర్చుని కావ్యాన్ని రచిస్తున్నాడు కవి. అప్పుడతని దగ్గరకు నాగుపాముల్లాంటి భావాలు వచ్చి చేరాయి. అలా ఆ భావనాభుజంగాలు తనను చేరేసరికి కవిలో ఆవేశం పెల్లుబికింది. రుద్రవీణ వాయిస్తూ పడమటి దిక్కు చివళ్ళ నాట్యం చేస్తానంటున్నాడు.

చరిత్రకారులు కొన్ని కొన్నిసార్లు అబద్ధాలు ఆడుతునే ఉంటారు. కాని ఆ అబద్ధాలు చెప్పే పద్ధతిలో తేడా వుంటుంది. మేము పదే పదే ప్రస్తావిస్తున్నట్టు, జాగ్రత్తగా అంచనా వేసి నిర్ధారించవలసిన అంశాలకు ఆస్కారమిచ్చే కొన్ని వ్యక్తావ్యక్త నియమాలు చరిత్ర రచనలో ఉంటాయి. చరిత్ర గూర్చి తాను చేసే వ్యాఖ్యానానికి పూర్తిగా బద్ధుడై ఉంటాడు చరిత్రకారుడు.

చరిత్రకారుడు చెప్పే సత్యం, చారిత్రక సత్యాల (కనీసం చారిత్రక వాస్తవాల) పూర్ణ స్వరూపం ఎప్పుడూ కాదు. అయితే, తానెనున్నుకున్న రచనాస్వరూప నియమాల పరిధిలో, ఆ సత్యం యుక్తియుక్తము సమగ్రమూ అయి ఉంటుంది.

కవిత్వం వ్రాయడం లాగానే, చదివి ఆకళించుకొని ఆస్వాదించడం కూడా అంతో ఇంతో సృజనతో కూడుకున్న పనే. దానికి కూడా కొంత పరిశ్రమ, అనుభవము నిస్సందేహంగా అవసరమే. ఇలా అంటే కొంతమంది ‘అభ్యుదయవాదులు’ ఉలిక్కిపడే అవకాశం ఉంది!

దేశీయతకు సంపత్కుమారగారి నిర్వచనం విశ్వనాథ అంతరంగానికి ప్రతిధ్వని. నేడు ప్రభంజనంలా వ్యాపిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ దేశీయత గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతయినా ఉంది.

శ్రీశ్రీ అనువాదాలు చదివితే ముందుగా కొట్టొచ్చినట్టు కనిపించేది వాటిలోని వైవిధ్యం – ప్రతీకాత్మకత, అధివాస్తవికత, విప్లవం – ఇలా అనేక కవిత్వ ధోరణులు ఈ అనువాదాలలో కనిపిస్తాయి.

నాటకీయత సాధించే మహత్తర ప్రయోజనం పాత్రలని కళ్ళముందు కదిలించడమే కాకుండా సంభాషణల ద్వారా ఆయా పాత్రల స్వభావాలని, అంతరంగాలని ధ్వనింపజెయ్యడం కూడా.

ఈ కావ్యం పేరే ఒక పెద్ద మిస్టరీ! దీనికి ‘ఉత్తర హరివంశం’ అన్న పేరు సోమన ఎందుకు పెట్టాడో ఎవరికీ అంతుపట్టలేదు. పైగా, ఇదొక ‘తలా తోకా లేని’ కావ్యం.

కవిత్వభాషకీ, వ్యావహారిక భాషకీ మధ్యనున్న తేడాలు, భాషలో ఉన్న వివిధ ప్రత్యేకాంశాలు కవిత్వంలో సాధించే ప్రయోజనము గూర్చి యీ వ్యాసంలో నాకు తెలిసినంతలో విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.

ఒక్క క్షణం తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. అది కలా నిజమా – అని తెలుసుకుందుకు గిల్లుకొనేవాడే, అంతలో కయ్యి మని హారన్ కొట్టుకొంటూ ఎదురుగా వెళ్ళిపోయిన లారీ తన శబ్దభేరిని భేదించినంత పని చేస్తే, తను చూస్తున్నది కలకాదని నిశ్చయించుకున్నాడు. ఆమె… ఆమేనా?! ఇది సాధ్యమేనా?! లేక తను భ్రమపడుతున్నాడా?!

“చిన్నప్పట్నుంచీ చిలకాగోరింకల్లా పెరిగారు. అనుకున్నసంబంధం…మనముందు పెరిగిన కుర్రాడూ మంచి వాడూ అనుకుంటే… చివరి నిమిషంలో ఇలాంటి పేచీపెట్టాడు…”

ఈ సన్నివేశం చిత్రించాలంటే, ఒక్కసారిగా కథనం భరతుడి నుంచి రాముడి వద్దకు మారాలి. ఈ మార్పు పాదూఖండంలోని కథాప్రవాహాన్ని(flow ని) భగ్నం చేస్తుంది. ఈ సమస్యని విశ్వనాథ ఎలా పరిష్కరిస్తాడా …

ఈ కవిత అర్థమవడానికి “వర్షుకాభ్రములు” అన్న పదంకోసం నిఘంటువులు తిరగెయ్యనక్కరలేదు. మహా ప్రవాహంలా హోరెత్తించే ఆ కవిత్వ వేగం సామాన్య పాఠకుణ్ణి సైతం మున్ముందుకి తోసుకుపోతుంది.

పద్య ప్రియులకీ, విముఖులకీ మధ్య చిరకాలంగా (అంటే సుమారు ఎనభై ఏళ్ళుగా) స్ఫర్ధ కొనసాగుతునే ఉంది. ఇది ఇప్పటికీ ఉంది, కాని ప్రస్తుతం పద్య ప్రియులు defensive modeలో ఉన్నారనిపిస్తుంది. ఈ విషయానికి సంబంధించి చాలా రోజులుగా నన్నొక చిన్న ప్రశ్న వెంటాడుతోంది, “పద్య ప్రియులకు పద్యం అంటే అంత అభిమానం ఎందుకు?”. నాకు పద్యమంటే ఇష్టం. అంచేత, ఇది నన్ను నేను వేసుకుంటున్న ప్రశ్న. నాలాంటి పద్యప్రియులందరికీ వేస్తున్న ప్రశ్న. చిన్న ప్రశ్నే ఐనా ఇదొక పెద్ద చిక్కు ప్రశ్న!

తెలుగు పద్యాలలో కనిపించే వివిధ శిల్ప విశేషాలను, ఆయా నిర్మాణ వైఖరుల సార్ధక్యాన్ని రసభావ పోషణ కనుకూలంగా సమన్వయించి చెప్పిన ఒక సమగ్రమైన శాస్త్రం గానీ సిద్ధాంత గ్రంథంకానీ యింతవరకూ తెలుగులో రాలేదు. ఈ దిశగా ఔత్సాహికుల దృష్టిని మళ్ళించడానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం ఈ వ్యాసం.

శ్రీ భాస్కర్‌ గారి “మన ఛాందసులు” అన్న వ్యాసం తెలుగులో ఛందఃప్రయోగాలని గూర్చి చాలా విలక్షణమైన విషయాలను పరిశీలించింది. ఎన్నో నూత్న ప్రతిపాదనలు కూడా […]

తెరుచుకోకుండానే శాశ్వతంగా మూతబడ్డ ఆ కళ్ళను నేను చూళ్ళేదు కవిత్వం కాదు కదా ఆ బాధలోంచి కన్నీళ్ళైనా రాలేదు! వస్తా వస్తా నంటూ వస్తూనే […]

(విజయనగరం లో పుట్టి పెరిగిన నేను, ప్రస్తుతం చెన్నై వాస్తవ్యుడను. కంప్యూటరు వృత్తి, కవనం ప్రవృత్తి. కథ, కవిత్వం రెండిటిపైనా ఆసక్తి ఉంది. ప్రత్యేకించి […]