గడి నుడి – 24 సమాధానాలు

అడ్డం

  1. కయ్యపుతిండి తింటాడా? (7)
    సమాధానం: కలహభోజనుడు
  2. వేసుకునే మెడను బట్టి భయపెట్టే విషప్పురుగు కూడా మేళకర్త రాగమవుతుంది- (7)
    సమాధానం: శంకరాభరణము
  3. చిదంబరంలో కేదారమా? ఆకాశ లింగమా? దీక్షితార్ ని అడుగుదామా? (9)
    సమాధానం: ఆనందనటనప్రకాశం
  4. చిరస్మరణీయమైన కుంచె, కలాల స్నేహం- (7)
    సమాధానం: బాపూరమణీయము
  5. కాలమున్నా లేకున్నా కాలుడే- (3)
    సమాధానం: యముడు
  6. అటునించి ట్రావెంకోర్ అత్తల ముద్దుల కోడలు, చక్కటి నర్తకి – (3)
    సమాధానం: నభశో
  7. ఇతడు మహేష్ బాబు కాదు- (3)
    సమాధానం: అతడు
  8. మన నడుమ చాలామంది ఇది తిప్పని వీరులే- (3)
    సమాధానం: గుల్భము
  9. అమరావతిలో చెప్పినవే, పసలపూడిలోనూ చెప్పారు- (3)
    సమాధానం: కథలు
  10. కాస్త కంగారులో మరుమల్లెతోట అట్నుంచి వేసింది (3)
    సమాధానం: కురామా
  11. అంతా ఒక్కటై చేరి చక్కన్ని పాపనెక్కడో ఉంచారుట! – (7)
    సమాధానం: ముక్కోటిదేవతలు
  12. రాముడికి లేనిది ఈయనకి రంగుల్లో ఉంది- (3)
    సమాధానం: కాముడు
  13. రెండుపక్కలా హర్షమే- (3)
    సమాధానం: సంతసం
  14. ఎంత గుజ్జురూపుడైనా మరీ బొటనవేలంతేనా? నిమజ్జనానికి, పర్యావరణానికీ హాయి – (9)
    సమాధానం: అంగుష్ఠమాత్రగణపతి
  15. బహువచనమైన సీతమ్మకు శ్రీరామదాసు చేయించిన వంకీ- (7)
    సమాధానం: రతనాలకుప్పెలు
  16. సదాశివ బ్రహ్మేంద్రులు కలిపిన పానకం తాగడానికి ముందే వచ్చింది – (4-3)
    సమాధానం: రామరసంపిబరే

నిలువు

  1. విశ్వనాథ్ తపస్సును వీడి, ఏడిద సంస్థలో చేరితే, పింగళి చంద్రుడు జన్మిస్తాడు (7)
    సమాధానం: కళాపూర్ణోదయము
  2. హలోకాని ఇది ఏమి హాయిలే (2)
    సమాధానం: హలా
  3. గుర్రమున్న్నా లేకపోయినా వడిగలదే- (3)
    సమాధానం: జవనం
  4. ఎవరిమడి ఇది? ఏ వరిమడి? – (3)
    సమాధానం: రాజికా
  5. ఇది కాకపోతేనే అరవం అంటారు-(2)
    సమాధానం: రవం
  6. మహిమ గల ఓ అమ్మ కొడుకు మరో అమ్మ ఇంట ముత్యమట- (7)
    సమాధానం: ముద్దుగారేయశోద
  7. ఇది ఆగితే ఓ సీటు గల్లంతా?- (2)
    సమాధానం: పాట
  8. మల్లెమాల పిల్లలతో చెప్పించిన రాముడి కథ- (7)
    సమాధానం: బాలరామాయణము
  9. గంభీరంగా వినిపించే అప్పుతచ్చులు- (7)
    సమాధానం: ముద్రారాక్షసములు
  10. కోపగృహం కాదు ఊరే ఇక్కడ- (3)
    సమాధానం: అలక
  11. తిరగబడినా బుద్ధి మారలేదు, ఎప్పుడు తనకే లబ్ఢి కావాలనేవాడు- (3)
    సమాధానం: డుబ్ధులు
  12. కూరిమి కూరిన మరదలిపిల్ల వంట- (7)
    సమాధానం: గుత్తివంకాయకూర
  13. అక్కడా, ఇక్కడా తిరగకే మనసా! అంటూ సామ రాగంలో అన్నారు బ్రహ్మేంద్రులు-(7)
    సమాధానం: మానససంచరరే
  14. నిద్ర సరళంతో మొదలైతే తృణధాన్యము- (3)
    సమాధానం: గునుకు
  15. అటునిండి కొడుకు ఇటునుండి తవ్వితే- (2)
    సమాధానం: త్రపు
  16. చివర కొమ్ము లేక రంగు తగ్గిన రసము?- (3)
    సమాధానం: పసర
  17. పాటేకర్, జాతిసమితి- (2)
    సమాధానం: నానా
  18. సూర్యుడికీ, చంద్రుడికీ ఒకే పేరా?(2)
    సమాధానం: పపి