గడి నుడి – 21 సమాధానాలు

అడ్డం

  1. పెద్ద నటుడికైనా, ఈ సౌండ్ ఇంజనీరుకైనా కావాలసినది ఈ కాస్తంత చోటే (5)
    సమాధానం: రంగస్థలము. పెద్ద నటుడికైనా కావలసినది ‘రంగస్థలమే’, సౌండ్ ఇంజనీర్‌గా పిలవబడ్డ పాత్ర చిట్టిబాబు ఉన్న సినిమా కూడా రంగస్థలమే
  2. రాగం పేరులో ఆందోళము తప్ప, కృతి అంతా అమృతమే (9)
    సమాధానం: రాగసుధారసపానము. ఆందోళికా రాగంలో చేసిన త్యాగరాజస్వామివారి కృతి యొక్క పల్లవి. రాగం పేరు తప్ప మిగతాదంతా సుధాపానమే
  3. సినీభూమిని దున్నలేదు కాని ఒకప్పుడు హీరోయినే (2)
    సమాధానం: హలం. హలం అంటే నాగలి అన్న అర్థం ఉన్న ఈ ఒకప్పటి నటి హీరోయిన్‌గా పెద్ద పేరు సంపాదించలేకపోయింది అన్న అర్థం
  4. శివ దాశరథులు తన పేరులో మూర్తీభవించిన కవి (8)
    సమాధానం: రామరాజభూషణుడు
  5. దర్జాకోసం 10లోని విశేషణం ముందు తగిలించాలి తప్ప, అది లేకుండానే గొప్ప ఇల్లు (6)
    సమాధానం: రాజప్రాసాదము. ప్రాసాదము అంటేనే రాజగృహమని కూడా అర్థం
  6. సంపూర్ణం కాకపోయినా, ధైర్యమున్నవాడి భోజనమే (2)
    సమాధానం: రాజ్య. రాజ్యం వీరభోజ్యం అన్నది సామెత, పూర్తిగా లేకపోయిన ఈ ‘రాజ్య’ కూడా వీరభోజ్యమే
  7. ఎటు చూసినా ఎదురే (3)
    సమాధానం: మునుము. ఎటుపక్కనుంచి చదివినా ఒకే అర్థం ఎదురు కల పదం ‘మునుము’
  8. వినమని (3)
    సమాధానం: మనవి. వినమని మనం చేసుకునేదే, మనవి
  9. మొట్టమొదటి రన్నింగ్ కామెంట్రీగా ఈ మాటకి ప్రసిద్ధి. దీనిలో తమ జట్టు గురించిన గెలుపు ప్రసక్తి చాలా కొంచెమే! (6)
    సమాధానం: సంజయఉవాచ. కురుక్షేత్ర యుద్ధాన్ని కళ్ళులేని రాజుకి కళ్ళకు కట్టేలా వివరించిన మొదటి రన్నింగ్ కామెంట్రీ, చెప్పిన అతని పేరుతో సహా
  10. గట్టిగా ఒత్తు పెట్టి చెప్పకపోయినా ఆదికవే (3)
    సమాధానం: నన్నయ. ఒత్తు లేకుండా ఆదికవి, నన్నయ్య
  11. దేవవల్లభం (4)
    సమాధానం: సురపొన్న. పొన్న, సురపొన్న- దేవ వల్లభము
  12. కట్లున్నా లేకున్నా, కొట్టడానికి పెద్ద కర్ర కావలసిందే (2)
    సమాధానం: పాము. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు కదా, అది కట్లున్నదైనా లేకపోయినా పాము పామే..
  13. వంటల రాజు వెనకబడ్డాడు (3)
    సమాధానం: డులున. తిరగబడ్డ నలుడు, వంటలకి పేరొందిన రాజు
  14. తిరిగి విరిగితే ఇసుకలోంచి నూనె లాగ వచ్చా? (3)
    సమాధానం: తివిరి. తివిరి ఇసుమున పద్యం లోని పదమే, ఆధారంలో తిరిగి చూస్తే కనిపిస్తుంది.
  15. పతంజలి పేస్టుకి యిసుమంత చేరితే గణేశుని పంచరత్నం గుర్తుకొస్తుంది (6)
    సమాధానం: దంతకాంతిమంత. పతంజలి వారి పేస్ట్ దంతకాంతి, దానికి ఇసుమంత లోని మంత చేరిస్తే గణేశ పంచరత్నంలోని ఒక పాదం ‘నితాంత కాంత దంతకాంతిమంత’ గుర్తొస్తుంది.
  16. ఒకటే సణుగుడు (3)
    సమాధానం: గునుపు
  17. చేపలనైనా, మనుషులనైనా ఇలా పట్టాల్సిందే (2)
    సమాధానం: వల
  18. రెక్కలు ముక్కలు చేసుకున్నా, ఆయువు మూడింది కానీ పాపం పని జరగలేదు (4)
    సమాధానం: జటాయువు. రెక్కలు తెగి మరణించాడు తప్ప సీతమ్మను కాపాడలేకపోయాడు-జటాయువు
  19. ప్రవచన చక్రవర్తికి భక్తులు పెట్టిన ముద్దు పేరు (2)
    సమాధానం: చాకో. చాగంటి కోటేశ్వరరావుగారి చిన్న పేరు- చాకో
  20. అట్నుంచి గొర్రెపిల్ల (2)
    సమాధానం: రిమ. మరి అంటే గొర్రెపిల్ల అన్న అర్ధం ఉంది, అటునించి అంటే తిరగబడితే రిమ
  21. కొడుకు లేక పొతే నరకం వెనకబాటుగా వచ్చి పడుతుందా ? (2)
    సమాధానం: త్తుపు. పుత్తు అనేది ఒక నరకము, పుత్రుడు కలిగిన ఈ నరకాన పడరు అనేది ఒక నమ్మకం, అది వెనకగా వచ్చి ‘త్తుపు’ అయింది.
  22. పూయని పువ్వులు, రువ్వే పువ్వమ్మలు (3)
    సమాధానం: నవ్వులు. పూయని పువ్వులు నవ్వులు. ‘నవ్వులు రువ్వే పువ్వమ్మ’ పల్లవి ఊరికే ఊతంగా ఇచ్చింది
  23. ఉత్త్రాంధ్రుల భాషలో దారుణమైన అన్యాయం( 4)
    సమాధానం: ఘోరకలి. ఘోరకలి అనేది ఉత్తరాంధ్రలో దారుణం అనే మాటకి వాడేది
  24. అన్నీ విడిచిపోవడమే లక్ష్యంగా గలవాడు (4)
    సమాధానం: ముముక్షువు. ఇహలోకం లోని విషయాలన్నీ విడిచి వెళ్ళిపోవాలనుకునేవాడు

నిలువు

  1. నడిచే దారుల గమ్యమొక్కటే, నడిపేవాడికి అందరొక్కటే (6)
    సమాధానం: రంగులరాట్నము. సినిమా పాటే అయినా జీవిత సత్యాన్ని బోధించే ఈ పాటున్న చిత్రం ‘రంగుల రాట్నం’
  2. క్షేత్రమహిమను తెలిపే కథ (6)
    సమాధానం: స్థలపురాణము. ఏ దేవాలయ క్షేత్ర మహిమనైనా తెలిపేది ‘స్థలపురాణము’.
  3. కింద నుంచి పైకి భూమి నుంచి పుట్టి పెరిగేది (4)
    సమాధానం: ముహరుభూ. భూమి నించి పుట్టి పెరిగేది చెట్టు-‘భూరుహము’ కిందనించి పైకి
  4. కాళ్ళు లేని వాడి తమ్ముడు చక్కగా ఎగరగలడు ( 4)
    సమాధానం: గరుడుడు. కాళ్ళు లేని వాడు అనూరుడు, అతని తమ్ముడు చక్కగా ఎగిరేవాడు ‘గరుడుడు’
  5. ఎన్టీవోడి భీమావతారం పద్యం ఎత్తుకో! (15)
    సమాధానం: ధారుణిరాజ్యసంపదమదంబునకోమలి. ఏంటీవోడి భీమావతారం అనగానే గుర్తొచ్చే పాండవ వనవాసం చిత్రంలోని పద్యం ఇదే కదూ. తిక్కన భారతంలో “ధాణిరాజ్య…” అని ఉంటుంది. ధరణికి వృద్ధిరూపం ధారణియే కదా. అయితే, పాండవ వనవాసం సినిమాలో “ధారుణిరాజ్య…” అనే ఘంటసాల పాడాడు. అందుకే ఆధారాల్లో ఏంటీవోడి పద్యం అని ఇచ్చాము.
  6. అటూ ఇటూ అయిన పద్యాలంకారాలు, ఒకటి మధ్యన సరిపోయింది, మరొకటి అటొకటి, ఇటొకటి (4)
    సమాధానం: సయతిప్రా. కావలసినవి యతి, ప్రాస. మధ్యన సరిపోయినది యతి, మరొకటి అటూ, ఇటూ అయినది ప్రాస
  7. మునులెట్లగని మోహించిరో? త్యాగరాజ స్వామినడగాలి మరి (4)
    సమాధానం: ముద్దుమోము. “ముద్దు మోము ఏలాగు చెలంగేనో మునులెట్ల గని మోహించిరో?” అన్నది త్యాగరాజ స్వామి కృతి గదా.
  8. దివ్యకేకి వాహనుడిని పాహి అన్నారు స్వాతి తిరుణాళ్ (4)
    సమాధానం: షడానన. దేవ మామయే పాహి షడాణన దివ్య కేకి వాహన అన్నది స్వాతి తిరుణాల్ కృతి. అందులో పాహి అన్నది ‘షడానన’ అనే కుమారస్వామినే.
  9. అన్నమయ్య వినమన్న పాలు, ఆవు పాలు కాదు (8)
    సమాధానం: విన్నపాలువినవలె. విన్నపాలు వినవలే, అన్నది అన్నమయ్య కృతి
  10. తర్వాత పోయేది పైలోకానికే (5)
    సమాధానం: ఉత్తరగతి. పోయిన తర్వాత పోయే లొకమే ‘ఉత్తరగతి’. కొంతమంది ఉత్తమగతి అని రాశారు. కానీ, ఆధారంలో “తర్వాత” అన్నది ఉత్తర- కు సూచిక.
  11. అశ్వారి (2)
    సమాధానం: దున్న
  12. భగినీ హస్త భోజనం ఈవిడే మొదలు పెట్టిందా? (3)
    సమాధానం: యమున.
  13. యక్షడు చేయాల్సిన గానం రుద్రమైన కవి చేస్తే ఇలాగే ఉంటుంది మరి (6)
    సమాధానం: సుగ్రీవవిజయం.
  14. కమలానికే కాదు, ఈవిడకీ సూర్యుడు దూరమే! అందుకే ఎదురు తిరుగుతూ ఉంటుంది..(8)
    సమాధానం: పొద్దుతిరుగుడుపువ్వు. సూర్యుడికి దూరమైనా ఆయన గతి, గమనాల ప్రకారం అతనికి ఎదురు తిరుగుతూ ఉండేది ‘పొద్దు తిరుగుడు పువ్వు’
  15. అతిపురాతన హిందూ దేవాలయమున్న రాజ్యం (5)
    సమాధానం: కాంభోజరాజ్యము. అతి పురాతన హిందూ దేవాలయం ‘అంకోర్ వాట్’ ఉన్న కాంబోడియా దేశానికి పాత పేరు ‘కాంభోజ రాజ్యం’
  16. పరికించినా లేకున్నా అనునాయికే (3)
    సమాధానం: చారిక. పరి- అన్న ఉపసర్గ లేకపోయినా చారిక అంటే అనునాయికే, పరిచారికే.
  17. ఆకలేస్తే తిరగబడరా మరి! (2)
    సమాధానం: త్తుక్షు. క్షుత్తు అంటే ఆకలి, తిరగబడింది
  18. తేలిగ్గా అన్నా సుమించేదే (2)
    సమాధానం: పువు. పువ్వుని తేలిగ్గా పువు అన్నా, అదే అర్ధం