గడినుడి – 16 సమాధానాలు

అడ్డం

  1. బలం విశేషంగా బోల్తాపడి జాగుకు కారణమైంది
    సమాధానం: విలంబ. విలంబ(ము) అంటే ఆలస్యం లేదా జాగు. విలంబ అనగ్రామ్.
  2. సవరణ చేస్తే చక్కనౌతుంది
    సమాధానం: వరస. చక్కనైనది వరస. అనగ్రామ్.
  3. శ్రీశ్రీ సాక్షిగా ఊరికే
    సమాధానం: ఉత్తినే.
  4. కలం కవి మీద తిరగబడి చెదిరిపోయింది
    సమాధానం: వికలం. వికలం అనగ్రామ్.
  5. హారతవడంలో పద్ధతి
    సమాధానం: తరహా. హారతవడంలో పద్ధతి. తరహా అనగ్రామ్.
  6. వాహనం కాదు. గర్భగుడి పైకప్పు మీదుండేది
    సమాధానం: దివ్యవాహనం.
  7. ఒక దేశమంత పెద్ద ఇల్లు
    సమాధానం: లంకంతకొంప. లంకంత కొంప. (శ్రీ)లంక ఒక దేశం.
  8. కవి రమ్యంగా వర్ణించదగిన కంచుకం
    సమాధానం: రవిక. రవిక అనగ్రామ్
  9. ముక్కంటి
    సమాధానం: కపర్ది. త్రినేత్రుడైన శివుడి పేర్లలో ఒకటి కపర్ది.
  10. ఇక్కడి మాన్యాలు ఎవరికీ కాబట్టవు
    సమాధానం: శంకరగిరి. శంకరగిరి మాన్యాలకు పోవాలని ఎవరూ అనుకోరుగా.
  11. ఆంధ్రమహాభారతకర్తలు
    సమాధానం: కవిత్రయము.
  12. విజయా వారి ప్రొడక్షను. పేరే కాదు సినిమా కూడా పెద్దదే.
    సమాధానం: పెళ్ళిచేసిచూడు.
  13. దగ్గరికొచ్చా
    సమాధానం: సమీపించా.
  14. 23 నిలువు కుదరకపోవడం
    సమాధానం: చేజారు. చేపట్టలేకపోవడం అంటే చేజారడమే.
  15. ఒక కట్టడం, ఒక సాధనం
    సమాధానం: కమాను. కమాను అంటే తోరణం, విల్లు, ఇతర అర్థాలు కూడా ఉన్నాయి.
  16. డుతుసుద్రీమా
    సమాధానం: డులుకున. నకులుడు మాద్రీసుతుడు కదా!
  17. అడ్డం 19తో కలిసి సామెత సంపూర్ణం
    సమాధానం: ఇల్లుకట్టిచూడు. సామెత: ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు
  18. పింగాణీ పాత్రలు తయారుచేసే మట్టి
    సమాధానం: చీనామృత్తిక. అంటే చైనా మట్టి.
  19. కుమార భీమేశ్వరుడి ఆరామం
    సమాధానం: కుమారారామం.
  20. పాత కంపెనీలో చేసిన మహాపాపం
    సమాధానం: పాతకం. అనగ్రామ్
  21. షష్టిపూర్తి సంవత్సరం
    సమాధానం: అక్షయ. తెలుగు సంవత్సరాల్లో అరవయ్యవది.
  22. మనిషి రుచి మరిగిన రాక్షసుల ట్రేడ్ మార్క్ డయలాగా?
    సమాధానం: నరవాసనా. మనిషి గాలి సోకగానే రాక్షసులు “నరవాసనా, నరవాసనా” అని పలవరిస్తారట :-).
  23. సద్దపిండితో చేసిన సంగటి
    సమాధానం: సద్దసంగటి.
  24. క్యాంపు
    సమాధానం: శిబిరం.
  25. భ్రాంతి
    సమాధానం: వికల్పం. వికల్పం అంటే భ్రాంతి
  26. లోతైన కవళిక
    సమాధానం: గంభీరం. గంభీరం అంటే లోతైనది. ముఖకవళికల్లో మనోభావాలు తెలియకుండా ఉండడం గంభీరం.
  27. పీనాసితనం
    సమాధానం: లుబ్ధత్వం.
  28. శివుడిని పెళ్ళాడిన పార్వతి
    సమాధానం: కల్యాణి. పార్వతి నామాంతరం.

నిలువు

  1. అడ్డం 41 లాంటిదే, సాధారణంగా పెళ్ళివారిది
    సమాధానం: విడిది.
  2. బలిపీఠం
    సమాధానం: బలివితర్ది. వితర్ది అంటే వేదిక, పీఠం.
  3. వనం దగ్గర సర్దుకున్న నోరు
    సమాధానం: వదనం. అనగ్రామ్
  4. అర్థాలంకారాల్లో ఒకటి
    సమాధానం: సమాలంకారము.
  5. “రామసేతు” నిర్మాణంలో పాలుపంచుకున్న బుడుత
    సమాధానం: ఉడుత.
  6. పడుగుపేకలను కూర్చే పలక
    సమాధానం: నేతపలక. నేతలో నిలువు, అడ్డ పోగులను పడుగు, పేక అంటారు.
  7. మనోల్లాసకరమైన జాతర!
    సమాధానం: విహారయాత్ర. జాతర అనేది యాత్రకు వికృతి.
  8. కొండనాలుక
    సమాధానం: లంబిని.
  9. కృప అనే పేరు టాలెమీకి ఇలా వినబడింది కాబోలు
    సమాధానం: కరుపె. 2000 సంవత్సరాల కిందట భారతదేశానికి వచ్చిన టాలెమీ అనే విదేశీ యాత్రికుడు కడప ప్రాచీన నామమైన “కృప(నగరం)”ను కరిపె అని పేర్కొన్నాడు.
  10. తులసి భర్త
    సమాధానం: శంఖచూడుడు.
  11. పనీపాటా లేకుండా
    సమాధానం: రికామీగా.
  12. చీలు, విడిపోవు
    సమాధానం: విచ్చు.
  13. కడలి
    సమాధానం: మున్నీరు.
  14. చేపట్టు
    సమాధానం: చేకొను.
  15. పేరులో చా(వు), కల్లు కలిసిన ఊరు
    సమాధానం: చాగల్లుగ్రామం.
  16. చేకొని
    సమాధానం: చేపట్టి.
  17. చాసో రాసిన గవిరి కథ
    సమాధానం: కుంకుడాకు. చాసో రాసిన కుంకుడాకు కథలో ప్రధాన పాత్ర గవిరి.
  18. ఈ ఊరు బిస్కట్లకు కూడా ప్రసిద్ధి
    సమాధానం: కరాచీ.
  19. మేనల్లుడి దెబ్బకు తలకిందులుగా పడిన శిశుహంతకుడు
    సమాధానం: డుసుకం. శ్రీకృష్ణుడి మేనమామ కంసుడు తలకిందులుగా. కృష్ణుడి తోబుట్టువులను శిశువులుగా ఉన్నప్పుడే చంపాడు.
  20. ఈ విమర్శల పదును స్టార్ ఫాన్సుకు బాగా తెలిసొచ్చింది
    సమాధానం: కత్తి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్సుకు, సినీ విమర్శకుడు కత్తి మహేష్ కుమార్‌కు మధ్య ఇటీవల వివాదం రేగింది.
  21. ఇవి శతకోటట
    సమాధానం: శ్రీరామనామాలు. “శ్రీరామనామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి” అన్నది ప్రసిద్ధమైన పాట.
  22. మట్టిబొమ్మ
    సమాధానం: మృణ్మయపాత్ర.
  23. యుద్ధభూమి
    సమాధానం: కదనరంగం.
  24. ఆయుష్షు తీరాక ఆర్కైవులో చేరేది
    సమాధానం: పాతసంచిక.
  25. కారును కలిపేసుకుంటుంది కాన చిట్టిని కూడా
    సమాధానం: అడవి. కాన అంటే అడవి. కారడవి, చిట్టడివి.
  26. వారం నడుమ కనిపించే జంతువు
    సమాధానం: వానరం. అనగ్రామ్
  27. సమంగా ఉండడం
    సమాధానం: సమత్వం.
  28. టీకా తోడి వివరణ
    సమాధానం: టిప్పణి.