ఈసారి కూడా చాలా తొందరగా చాలా పరిష్కారాలు వచ్చినా, తప్పుల్లేని పరిష్కారాలు మాత్రం అంత తొందరగా రాలేదు. అన్ని సమాధానాలూ సరిగా పంపింది ఒక్కరే:
- బిహెచ్ విజయాదిత్య
ఒక్క తప్పుతో సమాధానం పంపించిన వారు: పం.గో.కృ.రావు, పూల రమాదేవి గార్లు. ఈ ముగ్గురికీ అభినందనలు!
అడ్డం
- సామెత ప్రకారం కొడుకు పేరు (4)
సమాధానం: సోమలింగం. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెత వినే ఉంటారు. - ఊర్మిళ వధలో చూస్తే రంగుపడుద్ది (3)
సమాధానం: ధవళ. వెనకనుండి చూస్తే కనిపిస్తుంది. - అద్దం వెనకుండేది (3)
సమాధానం: కళాయి. అద్దం వెనుక కళాయిపూత గురించి వినే ఉంటారు. - అపరంజి బంగారం (3)
సమాధానం: పుత్తడి. అపరంజి, బంగారం అన్న రెండు అర్ధాలున్నాయి. - నాభికి ముందుండే గొప్పదనం ఆకర్షణశక్తా? (3)
సమాధానం: గరిమ. ఆకర్షణ శక్తి గరిమనాభినీ, గురుత్వాకర్షణశక్తినీ సూచిస్తోంది. - చూడుము పండుగరోజు (3)
సమాధానం: కనుము. అంటే చూడుము అని కదా? - తలతెగిన స్వభావంలో కొద్దికాలం (2)
సమాధానం: క్షణం. లక్షణం తలతెగింది. - తుదిలేని పండితుడు వీడు. వదులు (2)
సమాధానం: విడు. విదితుడు అంటే పండితుడు. తుదిలేకపోతే విడు మిగిలింది. - నెలతప్పిన బాలచంద్రుడు దిక్కు చూసేడు (2)
సమాధానం: వంక. నెలవంక అంటే చంద్రుడు. నెలతప్పితే వంక (అంటే దిక్కు) మిగిలింది. - రోజూ ముంచుకొచ్చే ప్రళయం కాబోలు (2)
సమాధానం: నిద్ర. దీనికి నిత్యప్రళయము అని ఇంకో పేరు కూడా ఉంది. - కవిత రసాభాసు కాకుండా వెనుతిరిగి తరచు కాపాడిన కవి (3)
సమాధానం: భారవి. తరచు అన్నది అక్షరాల ఎంపికని చెప్తే, వెనుతిరిగి అన్నది ఆ ఎంపిక వెనకనుండి అని చెప్తోంది. - అప్పుతచ్చులు కాబోలు (6)
సమాధానం: ముద్రారాక్షసాలు. అచ్చుతప్పులు కి బదులుగా అప్పుతచ్చులు కావాలనే ఒక సూచనగా వాడేము. - మతిపోయిన బుద్ధిహీనుడు పశువులగుంపుతో మిగిలాడు (2)
సమాధానం: మంద. మందమతి అంటే బుద్ధిహీనుడు. మతిలేదు కదా? - మకర సంక్రాంతిలో తాగేది (2)
సమాధానం: రసం. అందులోనే ఉంది. - మోసము చేసేముర. కాని అంతా తలకిందులైంది (4)
సమాధానం: నికారము. అంటే మోసము. తలకిందులు వెనకనుండి వెతకమని చెప్తోంది. - పాపం! పుణ్యంతో వచ్చేది (2)
సమాధానం: అన్నెం. అంటే పాపం/అన్యాయం. అన్నెం-పున్నెం వాడుకలో ఉందికదా? - ప్రతి సూర్యోదయం ఆరంభం నడుమనుంటే కానుపు (3)
సమాధానం: ప్రసూతి. సూర్యోదయం ఆరంభం ‘సూ’ ప్రతి మధ్యన ఉండాలని చెప్తోంది. - లయ మతం మారు ఆలోచనకి చల్లని గాలి వీచింది (6)
సమాధానం: మలయమారుతం. చెల్లాచెదురైన అక్షరాల్ని పేరిస్తే సరిపోతుంది. - నేల వంగని మొక్కకి పుట్టి తాంబూలానికి పరిమళాన్నిస్తుంది (3)
సమాధానం: లవంగ. అందులోనే ఉంది. తాంబూలానికి పరిమళం ఇవ్వదూ? - లెక్కలు రాసే పుస్తకం (2)
సమాధానం: దస్త్రం. వేరేగా చెప్పక్కర లేదుకదా? - జూదరి పునాది గోడ బలంగా లేకుండా కట్టిన ఇల్లు? (4)
సమాధానం: పేకమేడ. జూదరి అనగానే పేక గుర్తొస్తుంది ముందు. అదొస్తే ఇల్లు ఉండనే ఉంది మేడ అని ఆలోచింప చెయ్యడానికి..
నిలువు
- సోము గయ సవ్యంగా వెళ్తేనే చక్కదనం (4)
సమాధానం: సోయగము. సవ్యంగా చెయ్యమని సూచన. - గణం రాలింపు లోదాగిన పద్దెనిమిదిలో ఒకటి (5)
సమాధానం: లింగపురాణం. అష్టాదశపురాణాల్లో ఒకటి. దాగిన పదం లో వెతుక్కొమ్మని సూచన. - ఈ వానరాయి వలన ఇల్లు గడవ కష్టంగా ఉంది (4)
సమాధానం: వడగల్లు. వెనుకనుండి కనిపిస్తోంది. - రకరకములైన తినుబండారాలు తింటుంటే తిరిగి వచ్చే ధ్వని (4)
సమాధానం: కరకర. మళ్ళీ వెనుకనుండి. - పన్నీరు ఇందులోనా వృధాగా పోసేది? (3)
సమాధానం: బూడిద. సామెత ఉందిగా బూడిదలో పోసిన పన్నీరని? - వాడు మనువాడ పొట్టివాడు కానీ గట్టివాడే (4)
సమాధానం: వామనుడు. అక్కడే దాగున్నాడు. - తిరిగి చూడము అంటే జలక్రీడ (3)
సమాధానం: మునక. కనము తిరగబడింది. - ప్రతి భావ సంవత్సరానికీ పుట్టే స్త్రీ నామధేయం (4)
సమాధానం: ప్రభావతి. తారుమారుగా పుట్టిందిక్కడ. - తలలకీ, వాహనాలకీ కావల్సింది (3)
సమాధానం: చమురు. రెండింటికీ పనికి వచ్చేదే కదా? - జనాలు లేకపోతే హారతులు కల్లుతో సమానం (2)
సమాధానం: నీరా. నీరజనాలు అంటే హారతులు. జనాలు పొతే మిగిలేది నీరాయే కదా? - ఈ దోపిడి ఇక్కడ అడ్డం కాదు (3)
సమాధానం: నిలువు. ఇక్కడ అడ్డం కాదు నిలువు గడి అని సూచన. నిలువుదోపిడి వినే ఉంటారు. - మనసు వినదు. పరమనీచాతి నీచమైన ఆలోచనలని చేస్తుంది. జాగ్రత్తగా చూస్తే ఉద్యోగపర్వం లో ఒక భాగం కనిపిస్తుంది.(5)
సమాధానం: విదురనీతి. అక్షరాలని తప్పించి చూస్తే కనిపిస్తుంది. - గట్టు ఎక్కించిన సహోదరి (2)
సమాధానం: దరి. అక్కడే ఉంది. - అన్నీ వదులుకున్నవాడు ధరించేది (5)
సమాధానం: కాషాయవస్త్రం. అన్నీ వదులుకున్నవాడు సన్యాసి కదా. మరి వాడి యూనిఫారం అదే కదా? - వర్షములు సుమారు. గాలులు సరిగ్గా వీచితే జడి వానలు అవుతాయి (4)
సమాధానం: ముసురులు. అక్కడే సరిగ్గా చూస్తే ఉంది. - అబద్ధం చెప్పనిది (2)
సమాధానం: అద్దం. అదెప్పుడూ ఉన్నది ఉన్నట్టుగానే కదా చూపిస్తుంది. - భిక్షాపాత్రతో తిరిగే తాబేలు (3)
సమాధానం: కమఠ (లేదా కమఠం). రెండూ సరైన సమాధానాలే. దీనికి భిక్షాపాత్రము, తాబేలు అని రెండర్ధాలున్నాయి. - నా బ్రతుకెలాగని తిరిగి అడగను మళ్ళీ (4)
సమాధానం: మనుగడ. వెనుకనుండి కనిపిస్తోంది. - కునికిపాటు పడ్డ మళయాళ దేశపు రాణి (3)
సమాధానం: ప్రమీల. దీనికి మళయాళదేశపురాణి, కునికిపాటు అనే అర్ధాలున్నాయి. - అన్నమాచార్య తాళ్ళతో కట్టిన శాల గుడిసె (2)
సమాధానం: పాక. తాళ్ళపాక అన్నమాచార్య వారి ఇంటిపేరులో పాక అంటే గుడిసె కదా?