అడ్డం
- నందనవనంలో దాగిన మొహం
సమాధానం: వదనం. ఏనగ్రామ్. - శకుని చేతిలోని ఆయుధం
సమాధానం:పాచిక. - వని కాని భూమి
సమాధానం: వని కానిది అ-వని. అవని అంటే భూమి. - నీటిలోని మొసలి
సమాధానం: నీరాటం. భాగవతంలో శౌనకాది మునులు సూతుడిని అడిగిన ప్రశ్న: “నీరాట వనాటములకు పోరాటంబెట్లు కలిగె?…” (నీళ్ళలో ఉండే మొసలికి, వనంలో ఉండే ఏనుగుకు పోరాటమెట్లా కలిగింది.) - రాకావెన్నెల సరిపోగా మిగిలిన ఇంటిపేరు
సమాధానం: రావెల. సరిపోగా = సరిస్థానాల్లోని (2వ, 4వ) అక్షరాలు పోగా అని. - విష్ణువైతే యుగాల తరబడి. కమల్ హాసనైతే ఒకేసారి
సమాధానం: దశావతారం. - అతికఠినమైన శిరోలంకారం
సమాధానం: వజ్రకిరీటం. శిరస్సుకు అలంకారం కిరీటం. అతి కఠినమైనది వజ్రం. - జలదరింపు
సమాధానం: కంపరం. - వనంతో కవిత్వం
సమాధానం: కవనం. - లాలించేచోటు పాలించకపోయినా లోటు లేదు
సమాధానం: అంకపాలిక. ఒడి లేదా కౌగిలి. - విశాఖదత్తుడి గుప్తనాటకం
సమాధానం: ముద్రారాక్షసం. - ఎంతసేపూ కిచకిచలే
సమాధానం:పిచ్చుక సరసం (పిచుక/పిచిక/సరసం). మాటిమాటికి చేసే పనిని పిచ్చుక సరసం అంటారు. - రాజ్యతంత్రం లేదా మంత్రాంగం
సమాధానం: కూటనీతి. - క్లూనిచ్చే గుర్తు
సమాధానం: సంకేతం. - మనం చేసే తలపోత
సమాధానం: మననం. - అంతుచిక్కని వింతదేవుడు
సమాధానం: గణపతి. ఈమాటలో వస్తున్న వ్యాస శీర్షిక. - కవి కలానికి రాజులు కట్టిన వెల
సమాధానం: అక్షరలక్షలు. - మధ్యమంతో మొదలుపెట్టి ఆరోహణ అవరోహణాలు పూర్తి
సమాధానం: మపదనిస. సప్తస్వరాల్లో మధ్యమం ‘మ’ దగ్గర్నుంచి మొదలుపెట్టి చివరి వరకు ఉన్నవి మపదనిస. వీటిలో ప వరకు ఆరోహణ, తర్వాత అవరోహణ. - చెడ్డ గర్వం
సమాధానం: దురహంకారం. - చిలీ దేశపు సముద్రమంత గొప్ప కవి నాయకుడు
సమాధానం: నెరుడా (నెరూడా). చిలీ దేశపు ప్రసిద్ధ కవి, దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు పాబ్లో నెరుడా. సముద్రం ఇతని కవిత్వంలో అంతర్భాగం. అందుకే ఇతనిని సముద్ర కవి అని కూడా అంటారు. - అక్కడే ఉంది హద్దు
సమాధానం: అవధి. - తలవెంట్రుకల వరుస
సమాధానం: శిరోజావళి. - ఇరుగ్గా సర్దుకున్న తిరుచానూరు అమ్మవారు
సమాధానం: అలమేల్మంగ. అలమేలుమంగ ఇరుగ్గా అలమేల్మంగ అయింది. - గౌరవం కోసం క్రోసు దూరం వడిగా వెళ్ళు
సమాధానం: పరువు. - శిల్పి
సమాధానం: స్థపతి. - అడుగులు తడబడ బుడుత(డు) నడిచెనిలా
సమాధానం: డుబుత. - ఫుల్ మీల్స్ రాత్రికి తింటారా?
సమాధానం: డిన్నరు (డిన్నర్). డిన్నరుకు మొదటి అర్థం main meal of the day, taken either around midday or in the evening. రెండో అర్థం a formal evening meal, typically one in honor of a person or event. - రీతికి తోడొచ్చే పరభాషా సంప్రదాయం
సమాధానం: రివాజు. రివాజ్ అనే ఉర్దూ పదం నుంచి వచ్చిన మాట ఇది.
నిలువు
- కోరిక తీర్చే వెల్లువ
సమాధానం: వరద. వరద అంటే కోరిన వరమునిచ్చేవాడు అని, వెల్లువ అని రెండు అర్థాలున్నాయి. - శివుడి వాహనం పెరిగితే ఒక పూలచెట్టు
సమాధానం: నందివర్ధనం. - కువకువలాడే క్వార్టర్ బాటిల్ రమ్
సమాధానం: పావురం. క్వార్టర్ = పావు. - మడువలేని వటుడు పాలమరకతో పడిన ఆందోళన
సమాధానం: కలవరపాటు. ఏనగ్రామ్ - 6 నిలువుకు అడ్డమొచ్చేది
సమాధానం:అడ్డంకి. ఏనగ్రామ్ - 5 నిలువు లేకపోవడం
సమాధానం: నిరాటంకము. - రాధ కంట మరల నీరొలకగ శివాయని పిలిచెనట
సమాధానం: నీలకంధరా. ఏనగ్రామ్. - ఝంకారం కాదు. నారి చేసే ధ్వని
సమాధానం: టంకారం. ధనుష్టంకారం అని అంటారు కదా. - పిళ్ళా కనకం తలవాకిట్లో అటు ఇటుగా
సమాధానం: కళ్ళాపి. ఏనగ్రామ్. - లోపలినుంచి పారే జలం. ఒక ఊరు, ఒక తీర్థం
సమాధానం: అంతరగంగ. కర్ణాటకలోని కోలూరు జిల్లాలో ఉంది. - చెవికింపైన రాష్ట్రం
సమాధానం: కర్ణాటక. కర్ణమంటే చెవి. చెవికింపైనది కర్ణాటకం. - పాకాల్లో అతిసులువైనది
సమాధానం: ద్రాక్ష. నేరుగా నోట్లో వేసుకుని చప్పరిస్తేనే కరిగిపోయేది ద్రాక్షపాకం. సులభంగానే అయినా ఒలిచి తినవలసినది కదళీపాకం. ఒక పట్టాన కొరుకుడు పడనిది నారికేళపాకం. - ఒకరకంగా 15 నిలువు దీనికి సంబంధించినదే
సమాధానం: సంగీతం. - అడ్డం 1 తల మారిస్తే యుద్ధమే.
సమాధానం: కదనం. వదనంలో వ మారిస్తే కదనం. - ఒకచోట సొంతభక్తితో, ఇంకొకచోట వేరొకరి యుక్తితో
సమాధానం: తిరుక్షవరం. - బేడీ
సమాధానం: సంకెల - 26 అడ్డమాయన దీనిని తొలగిస్తాడా?
సమాధానం: అపవాదు. నీలాపనిందలు తొలగించేది గణపతే కదా? - ఎటు చూసినా ఒకటే, అయినా దీన్ని తిప్పడం పరువుతక్కువ పని
సమాధానం: మడమ. మడమ తిప్పడం అంటే వెనుతిరగడం. - రువాండా కాదు ఇంకో దేశపు రాజధాని
సమాధానం: లువాండా. అంగోలా దేశపు రాజధాని. - నిగనిగల మధ్య తవ్వకాలు జరిపేచోటు
సమాధానం: గని - ఉజ్జయినిలో ప్రసిద్ధ దేవాలయం
సమాధానం: మహంకాళి గుడి. - దండుమగడు
సమాధానం: దళాధిపతి. దండు అంటే సైనికదళం. - ఎల్లప్పుడూ శుభం కలిగించేవాడు (అప్పుడప్పుడూ భయం కూడా)
సమాధానం: సదాశివుడు. ఎల్లప్పుడూ = సదా. శుభం కలిగించేవాడు = శివుడు. శివుడే రుద్రుడు కూడా. కాబట్టి భయం. - చందమామను మింగేవాడు రాహువు
సమాధానం: నెలమేపరి. రాహువుకు ఇంకో పేరు. నెల = చంద్రుడు - కష్టమైన దశ
సమాధానం: అవస్థ - వెళ్ళు అమ్మాజీ అంటున్న అల్లుడు
సమాధానం: జామాత. హిందీలో జా=వెళ్ళు. - ఇంగ్లీషు పుండు
సమాధానం: అల్సరు (అల్సర్). - ఉర్దూ భాష రోత
సమాధానం: గలీజు.