చూరునుంచి జారుతూ
మత్తుగా నానుడు వాన
కురవదు నిలవదు
నానిన గడ్డి వాసన
ఎవరిదో పిలుపు
పలకలేని మొద్దుతనం
రచయిత వివరాలు
పూర్తిపేరు: డా.కోగంటి విజయబాబుఇతరపేర్లు: విజయ్ కోగంటి
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం: గుంటూరు
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: : https://kovibablog.wordpress.com
రచయిత గురించి: విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు.
విజయ్ కోగంటి రచనలు
ఈ లోగా నేనూ అనేక అవతారాలెత్తి
పని భూగోళాన్నంతా అట్లాసై మోసేసి
పై వాడిని మెప్పించో వప్పించో
కావలిసినంత అలసటనో ఆవేగాన్నో నింపుకుని
మనిషితనానికి తావీయకుండా
ఈసురోమని ఇల్లు చేరతాను.
గుడ్లగూబకో బొటనవేలు ఉంటుందనీ
ఐతే అదలా తిరిగి ఉండదని
శరీర శాస్త్రం చెప్తుంది.
పక్షిశాస్త్రం బోధిస్తుంది!
ఎన్నో ఏళ్ళు తెల్ల గుడ్లగూబని అధ్యయనం చేశాను
ఈ డొల్ల పనితనాన్ని చూసి బాధ పడుతున్నాను.
మత్తుగా జోగుతున్న ముసలివాళ్ళ మధ్య
గడ్డకట్టే చలిలో గుర్రాలను చూస్తూ ఆ యాత్రికుడు.
అతని మీసం గడ్డకట్టిన మంచు ముక్క.
కనురెప్పలు జీవం లేని వెండి నెలవంకలు.
గుర్రాల డెక్కల కింద ఎగసిపడుతున్న పొడిమంచు ధూళి
ఒక ఆకాశమే
వేల సంవత్సరాల వర్షమై చీలినట్లు
ఒక చంద్రుడే
వేల రాత్రుల వెన్నెలై విరిసినట్లు
ఒక మనసే
వేల దిగుళ్ళ ఆనందాల చెలమైనట్లు
మళ్ళీ తెలవారంగానే
తెలిసిందే అయినా సరే
ఏదో ఒక దారి ఎంచుకుంటూ
సమాధానపడుతూ
ఖాళీలను పూరించాలనుకుంటూ
ఒక ఘడియ నుంచి ఇంకో ఘడియలోకి
ఆకాశంలో మెరుపులా
మనసులో పులకింతొకటి
ఎపుడు తళుకుమంటుందో
ఎపుడు జలపాతమై
దొరలిపోతుందో –
తెలీదు
మాట దొరకని నిశ్శబ్దమై
మనసు నిలపని ఒంటరితనమై
నీకు నీవు మాత్రమే మిగిలేలా
అగమ్యగోచరంగా
కఠిన శూన్యంగా
మౌనమై అంతరాత్మను
మళ్ళీ మళ్ళీ శోధిస్తూ…
గ్రీష్మం గర్జించింది
నీరు ఆవిరై పోయింది
చెరువు ఎవరి మీదా అలగదు
కారుమబ్బులు ముసురెత్తాయి
వాన వరదలై వెల్లువెత్తింది
నేల ఎవరినీ కసురుకోదు
నీ మాటలతో నన్ను కాల్చివేయచ్చు
నీ చూపులతో నన్ను ముక్కలు చేయచ్చు
నీ విద్వేషంతో నన్ను చంపివేయచ్చు
కానీ మళ్ళీ,
నేను గాలిలా
ఇంకా పైకి లేస్తాను.
నా కాంక్షాపటుత్వం నిన్ను కలవరపరుస్తుందా?
బయటనుంచీ శిల ఒక పొడుపుకథ
దానినెలా విప్పాలో ఎవరికీ తెలియదు. కానీ
లోలోపల అది స్తబ్దంగా నిశ్శబ్దంగా వుండే వుంటుంది
ఓ ఆవు తన భారాన్నంతా దానిపై నిలిపి పైకెక్కినా
ఏ చిన్నారైనా దాన్ని నదిలోకి విసిరేసినా
అది మెల్లగా నిరుద్రేకంగా
నది లోపలికి నిశ్శబ్దంగా మునిగిపోతుంది.
ఆనుకున్న గోడ
వున్నట్టుండి కూలిపోతున్నట్టు
ఆకాశం నుంచి మనుషులు
తలక్రిందులుగా
పైకి జారిపడి భయపెడుతున్నట్టు
తన పాటకు తానే పులకిస్తూ
ఎత్తుపల్లాలను ఏకం చేసే రాగంతో
ఈ గాలి.
స్వచ్ఛంగా
ఆనందంగా
హాయిగా ఎగిరే
ఈ పూల పిట్ట.
వాటికెపుడు పోస్తావో
ఆ మార్మిక జీవాన్ని
ఎవరి గుండెలోనో
కంటితడిలోనో
పొర్లాడి వచ్చిన పుప్పొడిని
ఆ గదినిండా కుమ్మరిస్తాయి
వెంటనే దాన్నొక తేనెపట్టులా మార్చి
నువ్వు తాళం పెట్టేస్తావు
నువ్వంటే…
కొంచెం అమ్మ, కొంచెం నాన్న
కొంచెం తాతయ్యలు, అమ్మమ్మ నానమ్మలూ
కొంచెం నువు పుట్టిన వూరు
ఇంకొంచెం నువు పెరిగిన ఇల్లూ…
‘మరి నా బొమ్మలూ, చాక్లెట్లూ…’
అవి కూడా.
ఉన్నట్టుండి
గోడమీంచి వూగని వూయల పైకి
దాని మీంచీ వూగే చిటారు కొమ్మపైకి ఎగిరింది
పిడికెడంత బరువుకే
కిందాకా తూగిన కొమ్మచివరన
చిన్ని పిట్ట పైకీ కిందకీ సంతోషాన తేలింది
కానీ నీ నాటకం మధ్యనో చివరనో
ఏదో ఒక ఉన్మత్త సన్నివేశంలో
ఆ అద్దం చేసే రొద
ఏదోరకంగా వింటూనే వుంటావు
అదీ నిజమేనని ఒప్పుకోలుగా లోలోపలైనా
తప్పక గొణుక్కుంటూనే వుంటావు
అంగలతో వాడెవడో
నింగి కత్తిరిస్తుంటే
అంతులేని వర్షమొకటి
అవని నంత ముంచుతోంది
తలలు లేక జనమంతా
తలోదిక్కు పోతుంటే
కనిపించని వాసుకికై
సురాసురులు ఒకటైరి
అదే నీవై నీలోకి నువ్వు
ప్రవేశిస్తావు: తనను తాను
ఉంగరం లాగా
చుట్టుకున్న ప్రపంచంలా.
ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డును
ఎప్పుడూ కలుపుతూ నిలువెల్లా
వంపు తిరిగిన దేహం: ఒక ఇంద్ర ధనువు.
వర్గ ప్రాతినిధ్యపు
పక్షపాతపు చూపులేని కవిత
పుంఖానుపుంఖాలుగా సాగి
రొట్టకొట్టుడు ప్రయోగాలతో
సూక్తివాక్యాలతో
నీకు మాత్రమే సందేశమవని
కవిత ఒక్కటి చెప్తావా
పగటిరూపాల సాయంసంధ్యలో
సూర్యాస్తమయాన్ని కనబడనీకుండా
చీకటి తీరాల కావల నుంచి
కిటికీ దగ్గర చేరి
సంధ్యారూపాల పగటి నీడలను చూస్తూ
ఆ కొద్దిపాటి ప్రేమ రాకను తెలుసుకోనివ్వండి.
కౌగిలించుకు
బతుకునిచ్చే నవ్వూ, మాటా,
ప్రతి కొత్త కోరికా
నువ్వేనని
నీ తొలి అడుగుకై
ప్రతి పడిగాపూ నాదే
తుఫాను గుప్పిట దాగిన సముద్రాన్నీ
ఇంద్ర ధనువైన ఆకాశాన్నీ
ఒకేలా ప్రేమించగలనని నేనంటే
అసలు నీకు ప్రేమంటేనే తెలియదంటావ్
అవతలి కొసను తాకాల్సిన
ప్రాణమొకటి
నీళ్ళబయటి చేపై
కొట్టుకుంటూనే వుంటుంది
లోపలి ఆశ మాత్రం
అదే దారికేసే చూస్తూంటుంది.
ఏది ఏ కాలమో తెలియదు
ఎవరు నీకోసమో కాదో తెలియదు
ఏ తూనీగలు నీపై ఎగిరిపోతాయో
ఎవరి కేరింతలు నీలో అలలై కదులుతాయో
ఏ తామరలూ కలువలు నీలో పులకించి
నిన్ను పగటినో రాత్రినో చేస్తాయో తెలియదు
ఆవల దూరంగా
విరిసిన ఇంద్రధనువోటి
నన్నిట్టే పట్టేస్తుంది
పరిగెట్టి పట్టాలని
నీవగుపడలేదని
వెతుకుతాను
గచ్చు మీద తన నీడనే చూస్తూ
గుమ్మం దగ్గర నిలిచున్న తలుపు
అడుగులతో నడిచొచ్చిన జ్ఞాపికలను దాచుకుని
మూసిన గాజు తలుపుల అరమరలతో
మూగ సాక్షిగా నిలిచిన గది
ఈ గదిలో చేరిన రెండేళ్ళకి మొదటిసారి పైకొచ్చింది. ఒక పెళ్ళీడు కొచ్చిన అమ్మాయి, వయసుకు సంబంధించిన ఆవేశమేమీ లేకుండా చాలా సూటిగా తొణక్కుండా మాట్లాడింది. చాలా స్పష్టతతో గూడా. అపుడపుడూ పలకరింతనవ్వులూ పరిచయవాక్యాలూ తప్ప మేమెప్పుడూ పెద్దగా మాట్లాడుకోలేదు. తన పని తాను చేసుకుపోయే మంచి పిల్ల. ఏం చేయాలిపుడు?
ఎదురెదురుగా వున్న రెండు దేహాలు
ఒక్కోసారి రెండు కెరటాలు
రాత్రి ఒక సముద్రం.
ఎదురెదురుగా వున్న రెండు దేహాలు
ఒక్కోసారి రెండు శిలలు
రాత్రి ఒక ఎడారి.
ఈ చల్లటి గాలిలో
స్వేచ్ఛగా ఎగురుతున్న తూనీగనై
కొన్ని సార్లైనా
ఏ పందెపు గాలానికీ చిక్కకుండా
ఏమీ ఆలోచించకుండా
దేనికోసమో పరుగులెత్తకుండా
ఇలా వుండనీ
కొన్ని మోహాల్లోనో దాహాల్లోనో
నీకై నీవే చిక్కుకున్నప్పుడు
తప్పదు
చెదరిన
గడ్డిపరకల గూటినే
మమకారంగా వెతుక్కునే పిట్టలా
ఈ వేదననిలా భరించాల్సిందే
ఆ పాట
దూరంగా కొండ కొమ్మున
వినిపిస్తుంది
ఎందుకంటే
ఆ పంజరపు పక్షి
స్వేచ్ఛను గురించి పాడుతుంది మరి
కొంచెంగానే నవ్వి చెప్పిన మాట
కలువల కింద మెదిలి వెళ్ళిన చేపపిల్లలా
చెప్పకనే చూపు మిగిల్చుకున్న నవ్వొకటి
చలిమంటలో అగ్గి ఆరనట్టే
ఏనాటివో గుర్తులేక
రంగు వెలుస్తున్న ఊహలు
రేకులు విప్పి అందంగా
కుండీలో కుదురుకుని
మళ్ళీ కొత్తగా పూసినట్లే నవ్వుతూ
పంట కోసినప్పటి నుంచి
నారు పోసిందాకా
అనుభవిస్తూనే వుంది
ఓ మాటైనా పలకలేనితనాన్ని
మూగపోయిన కవిలా
నేల!
ఈ మునిమాపు వేళ
గుబురుకున్న పొదలమధ్యలోంచి
తాటిచెట్ల నీడలు మొలిచినట్టున్న
వూరి అంచులోకి
నా నడకకు
సందిగ్ధంగా దారిగీస్తూ
అక్కడేదో ఓ మలుపు –
గీత గీసే ముందూ రంగులద్దేముందూ
ఒకింత పరికించుకో
ఆకసానికి ఆకుపచ్చనీ
గడ్డిపరకకు నీలాన్నీ అద్దకు
నవ్వుకూ కన్నీటికీ
ప్రతి రంగుకూ ఓ భాష వుంటుంది
కొంచెం గమనించుకో
సమయం ఎనిమిది కావస్తున్నట్లుంది
పరుచుకుంటున్న తెల్లటి ఎండా
వెచ్చనౌతున్న ఎండాకాలపు గాలీ
గుచ్చుకునీ గుచ్చుకోకుండా వుండే
రాత్రి నీవు కురిపించిన
మౌనమో మాటలో కన్నీరో నవ్వులో-
ఏదో లీలగా ఒక అలికిడి చేస్తూ…
మనసూ కొత్తగా గొంతు సవరించుకుంటోంది
వసంత మొస్తున్నదేమో!
ఎపుడూ వుండే
చేదు మాటలూ పులుపు గుర్తులూ
వుంటూనే వున్నై,
ఇప్పుడైనా
కొంచెం తియ్యదనాన్నీ కలిపి చూద్దాం!
నీ వునికి నాలో
నిరంతరం ప్రవహించినా
కనుచూపుమేరా అదృశ్యంగా
నన్ను స్పృశిస్తూనే వున్నా
నేను నీ అగుపించని రూపుకై
తపిస్తూనే వుంటాను
రూపుదిద్దుకునే భావాల
పసి పాదాలు
తెమ్మెరలై వచ్చి
తగులుతున్న ప్రతిసారీ
మరో జన్మెత్తుతున్న సంబరం
దగ్గరై నిలచి
సంభ్రమమో, సందిగ్ధమో అయేకన్న
ఆవిరి రూపమై
మరలే యింద్ర ధనువవడమే
అందమేమో!
గడప దగ్గర
వేగంగా
తలుపు మీద వరకూ
ఓ వెలుతురు నీడ వూగులాట!
నిలుస్తూ వూగుతూ
నిలకడ లేకుండా-
తాళం వెనుక తాళం తీస్తూ పోతే
తలపులలా తెరుచుకుంటూనే
వుంటాయి.శూన్యమైన గది మూలల్లోనూ
ముడుచుకున్న జ్ఞాపకాలు
మళ్ళీ తలలెత్తి చూస్తాయి.