ఆనుకున్న గోడ
అదాటున కూలిపోయి
అనంతంలోకి పడిపోతున్నట్టు
ఆకాశం నుంచి మనుషులు
తలక్రిందులుగా
పైకి జారిపడి భయపెడుతున్నట్టు
ఆధారంగా పట్టుకున్న చేయే
నిరాధార శూన్యత లోకి
తోసేసి నవ్వుతున్నట్టు
నిద్రలో
పొడిబారిన తడికన్ను
ముల్లై గుచ్చుకున్నట్టు
గుండె బయటపడి
నిప్పుల కుంపటిపై
పొర్లాడుతున్నట్టు…