కంచెనొకటి చుట్టూరా
కట్టుకుంటాను
దూరంనించీ చూసుకు
బలే కట్టుకున్నానని
సంబరపడతాను
ఆవల దూరంగా
విరిసిన ఇంద్రధనువోటి
నన్నిట్టే పట్టేస్తుంది
పరిగెట్టి పట్టాలని
నా కంచెను నేనే పడగొడతాను
నీవగుపడలేదని
వెతుకుతాను
నీవింతేలే వద్దంటాను
నీ తలపెపుడూ
ప్రతిసారీ నదినీరే
పైకి చల్లగా
లోలోపల వెచ్చగా
నీ నిశ్శబ్దం లాగే
శూన్యాన్నీ
జ్ఞాపకాల్నీ రేకెత్తిస్తూ
రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచ ... పూర్తిగా »