వసంతం వెళ్ళి పోయింది
కోయిల ఎక్కడికో మరలి పోయింది
చెట్టు దేనికీ వగవదు
గ్రీష్మం గర్జించింది
నీరు ఆవిరై పోయింది
చెరువు ఎవరి మీదా అలగదు
కారుమబ్బులు ముసురెత్తాయి
వాన వరదలై వెల్లువెత్తింది
నేల ఎవరినీ కసురుకోదు
మొగ్గలు పూలై పరిమళించి
రాలిపోయాయి
మొక్క దిగాలు పడదు
కానీ మనసే
ప్రతి క్షణమూ
గ్రహించకుండా…