విప్లవం అనేమాట తెలుగుపాఠకులకి ఒకరకంగానే అర్థం అవుతుంది. ఆ అర్థం నాకు పట్టదు అనీ, ఒకరకమైన సాహిత్యం ఇంకొకరకమైన సాహిత్యంగా మారినప్పుడు రచనాసూత్రాలు మారతాయనీ, ఇలా మారినప్పుడు విప్లవం అనేమాట వాడవచ్చనీ నేను ఎన్నిసార్లు చెప్పినా నా పాఠకులు పట్టించుకోలేదు.
వెల్చేరు నారాయణరావు
- పూర్తిపేరు
- వెల్చేరు నారాయణరావు
జీవిత విశేషాలు
వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లో కృష్ణదేవరాయ చైర్ ప్రొఫెసర్గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు.