కొడవళ్ళ హనుమంతరావు


సొంత ఊరు:
రావినూతల గ్రామం, ప్రకాశం జిల్లా
ప్రస్తుత నివాసం:
సియాటల్ (నగర శివార్లలో)
వృత్తి:
సాఫ్ట్‌వేర్ రంగం
సొంత వెబ్ సైటు:
ఇష్టమైన రచయితలు:
ఈకాలపు సాహిత్యంతో పరిచయం తక్కువ. ఇప్పటికీ ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు చదివిన రచయితలంటేనే మక్కువ ఎక్కువ. వాళ్ళల్లో కొందరు - శ్రీశ్రీ, కొడవటిగంటి, చలం, ఉప్పల, రావిశాస్త్రి, బీనాదేవి, బుచ్చిబాబు, చండీదాస్.

జీవిత విశేషాలు

పుట్టిందీ పదో తరగతిదాకా చదివిందీ ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో. ఇప్పుడు ఉండేది వాషింగ్‌టన్ రాష్ట్రంలో సియాటల్ నగరానికి దగ్గర్లో. ఇంజనీరుగా పని చేసేది సాఫ్ట్ వేర్ రంగంలో.

దాదాపు నలభై యేళ్ళుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగంలో లీనమై సాహిత్యదృష్టి కొరవడిన లోపాన్ని సరిదిద్దుకోడానికి, గత కొంతకాలంలో కొందరు తెలుగువాళ్ళతో పరిచయం, కాస్త తెలుగు చదవడం, ఎప్పుడన్నా ఓవ్యాసం రాయడం – అదీ ప్రస్తుత వ్యాపకం.


 

విస్తార గ్రహాంతర నక్షత్రాంతర ప్రాంతాలను ఇకపై విశ్వంలోని పనికిరాని ఖాళీ ప్రదేశాలుగా పరిగణించలేము; సృష్టికర్త వాటిని తన చిహ్నమైన ఏ వస్తువుతోనూ నింపలేదని అనుకోలేము. ఆ ప్రాంతాలన్నీ ఒక అద్భుతమైన మాధ్యమంతో (medium) నిండి ఉన్నాయి. జ్యేష్టానక్షత్రంలో (dog-star) ఓ అణువు కంపిస్తే, ఆ కంపనాలని ఈ మాధ్యమం తనలో మూడేళ్ళపాటు ఉంచుకొని వాటినన్నిటినీ క్రమం తప్పకుండా భూమ్మీద స్పెక్ట్రోస్కోప్‌కి చేరవేస్తుంది.

ప్రపంచ నలుమూలలకూ వెలుగునిచ్చిందీ, అనేక పరిశ్రమలకు ఆయువుపట్టు అయినదీ, ఆవిరి యంత్రాలతోనో మహాజలపాతాలతోనో ఘనమైన చక్రాలను తిప్పి పుట్టించే విద్యుత్తే. ఆ పుట్టుకకి ఆధారం ఫారడే కనుగొన్న డైనమో.

అప్పటివరకు వినోదకరమైన ప్రయోగాలకీ, భయంకరమైన పిడుగులకీ, విద్యుత్తుతో ఏదో సంబంధం ఉందనుకున్నారు కాని, ప్రకృతిని అర్థం చేసుకోవడంలో గురుత్వాకర్షణ శక్తి లాగా విద్యుత్తు కూడా ప్రధాన పాత్ర వహిస్తుందని డేవీ నిరూపించాడు.

“అందీ అందని నీ చేలాంచలముల విసరుల కొసగాలులతో నిర్మించిన నా నుడి నీ గుడిగా,” అని శ్రీశ్రీ కవితని స్మరిస్తే, బైరాగి, “కవి సమస్య,” లో అనేకానేక హేమ్లెట్లు, రాస్కల్నికోవ్ ల బాధని “విశ్వవ్యధా వారినిధి తటాన బహుభంగుల ఫేనోజ్వల, రుదనాకుల, క్షుభితోచ్చల తరంగాళి” గా ఆలాపించడానికి యత్నించి, “శబ్దాల అసమర్థత” ఎదురయి “కవితాకామిని చేలాంచలాల కొస విసురులు ఎప్పుడూ ఒక బారెడు దూరానే మాయమవడాన్ని” అనుభవిస్తాడు.

వోల్టా కప్ప మీదనేకాక తన మీద కూడా ప్రయోగం చేసుకున్నాడు. నాలుక చివరన తగరపు ముక్కని పెట్టి, నాలుక మధ్యలో వెండి నాణాన్ని ఉంచి, నాలుకతో తగరాన్ని వెండి తో కలిపితే, నాలుక నరంలో విద్యుత్తు ప్రవహించి, నాలుకకి లోహపు రుచి కాకుండా ఓ ఆమ్ల రుచి తెలుస్తుందన్నాడు.

నేను కవినీ కాదు, విమర్శకుడినీ కాదు; కేవలం ఓ సామాన్య పాఠకుడిని. ముకుంద రామారావు గారి “అదే ఆకాశం: అనేక దేశాల అనువాద కవితలు,” గ్రంథాన్ని సమీక్షించడానికి ఎందుకు సాహసించానంటే, ఈ పుస్తకంలో అనేక దేశాల కవితలు అందమైన తెలుగులో ఉన్నాయి; రోర్టీ అన్నట్లు వాటిని నెమరేసుకుంటే దగ్గరి స్నేహితులతో గడిపినట్లే.

1752 జూన్ నెల వానా కాలం. కొడుకుని తీసుకొని ఫ్రాంక్లిన్ మైదానానికి వెళ్ళాడు. గాలిపటాన్ని ఆకాశంలోకి వదిలాడు. గాలికి పటం అటూ ఇటూ కొట్టుకుంటూ ఎగురుతూ మిన్నంటుకున్నది. ఓ మబ్బు గాలిపటాన్ని రాసుకుంటూ వెళ్ళింది కాని ఏమీ జరగలేదు. ప్రయోగం విఫలమైందని విచారిస్తుండగా మరో మబ్బు పటాన్ని తాకింది. దారానికి గల పోగులు రోమాల్లా నిక్కబొడుచుకున్నాయి – ఒకదానికొకటి దూరంగా, అవన్నీ విద్యుద్వాహకమైన తీగె మీద ఉన్నట్లుగా. ఫ్రాంక్లిన్ తాళం చెవిని మెటికతో తాకాడు. స్పార్క్ వచ్చి షాక్ కొట్టింది. ప్రయోగం సఫలమైంది.

షేక్స్పియర్ కన్నా బేకన్ ఆధునికుడు; బేకన్‌కి స్పష్టమైన చారిత్రక అవగాహన ఉంది; షేక్స్పియర్‌కి అది బొత్తిగా లేదు. పదిహేడో శతాబ్దంతో శాస్త్రీయ యుగం మొదలయిందని గ్రహించిన బేకన్, అరిస్టాటిల్ తాత్త్వికతని పూజించడానికి బదులు ప్రకృతిపై ప్రత్యక్షమైన పరిశోధనలు జరగాలని కోరాడు

మా దగ్గరకొచ్చేకొలదీ అతని శరీరం త్వరత్వరగా పెరగసాగింది. అలా పెరిగే క్రమంలో నేను అతని అనేక రూపాలని చూశాను: టెలెస్కోప్‌ని ఆకాశం వైపు తిప్పడం, పైనుండి క్రిందకి పడే రాయి వేగాన్ని లోలకంతో లెక్కకట్టడం, పాదరసం ఉన్న గొట్టంతో పీడన కొలవడం. అతని రూపం బ్రహ్మాండమైంది: తల ఆకాశాన్ని అంటింది; కాళ్ళు పాతాళం లోతులని చూశాయి; చేతులు రెండు దిశలనీ తాకాయి. అతని చేతిలోని దీపం ఆకాశం అంతటా, అగాధాలలో, నేల నలు మూలలా, వెలుగు ప్రసరించింది. ఎవరీ మహాకాయుడని అడిగాను. ప్లేటో ప్రత్యక్షమయి, ‘ప్రయోగం’ అని సమాధానమిచ్చి..

నిజానికి ఆ సూపర్ కంప్యూటర్ కంటే ఈనాడు మన అరచేతిలో ఉన్న ఫోనులోని కంప్యూటర్ కొన్ని వేల రెట్లు శక్తివంతమైనది. లక్షల ట్రాన్సిస్టర్లు ఉన్న ఆనాటి కంప్యూటరు కంటే ఈనాటి సెల్ ఫోనులో ఎన్నో వేల రెట్లు ఎక్కువ ట్రాన్సిస్టర్లు ఉంటాయి. ఆనాటి కంప్యూటరు ఒక అంతస్తులో సగభాగం ఆక్రమిస్తే, ఈనాటి సెల్ ఫోనులు అరచేతిలో పట్టేస్తాయి.

ప్రతి అడుగుకీ చెయ్యవలసిన పని కేవలం ఓ గుర్తుని చదవడం, అవసరమైతే దాని స్థానంలో వేరే గుర్తుని రాసి, స్థితి మారి అటో ఇటో కదలడం. అంతే. ఈ మాత్రం చెయ్యడానికి మనిషి ఎందుకు, ఓ యంత్రాన్ని పెడితే సరిపోతుంది గదా. అదీ ట్యూరింగ్ ఆలోచన. మనిషి మనఃస్థితులని ఈ యంత్రం యాంత్రికస్థితులుగా అనుసరించాలి. ఇది కారు లాంటి యంత్రమా? గేర్లు ఉంటాయా? కరెంటు మీద నడుస్తుందా? ఇవేవీ ముఖ్యం కాదు. ఇది కేవలం గణిత భావానికి ఆకారం ఇవ్వడం. పోయి నిర్మించాలని లేదు. కాని ముఖ్యంగా గ్రహించాల్సింది – ఎలాంటి ఆల్గరిదమ్ అయినా సరే ఇలాంటి యంత్రంతో చేసెయ్యవచ్చు. మీకది నమశక్యం కాదంటే నేనర్థం చేసుకోగలను. మీకు నమ్మకం కలగాలంటే యంత్రాలతో కొన్ని లెక్కలు చేయించాలి.

“ఈ వాక్యం అబద్ధం” అన్నది నిజమైతే, తన గురించి తను చెప్పుకున్నది నిజమన్న మాట; మరి తన గురించి తను ఏం చెప్తున్నది? తను అబద్ధమని!

గణితవేత్తలు గోటింగెన్ యూనివర్సిటీకి రావడానికి కారకుడు డేవిడ్ హిల్బర్ట్ అయితే, వాళ్ళు పారిపోవడానికి కారకుడు అడోల్ఫ్ హిట్లర్.

అనంతం! మనిషి మనసుని ఇంతగా ప్రభావించిన లోతైన ప్రశ్న మరొకటి లేదు. మానవ మేధని ఇంతగా ఉత్తేజింపచేసిన ఊహ మరొకటి లేదు. అయినా, అనంతం కన్నా స్పష్టం చెయ్యాల్సిన భావన మరొకటి లేదు.

జీవితాంతమూ అనాదరణకి గురైన ఫ్రేగె ఆధునిక కంప్యూటర్ కి మూలమైన తార్కిక గణితానికి సంస్థాపకుడిగా, అరిస్టాటిల్ స్థాయి మేధావిగా, వైశ్లేషిక తత్వానికి (analytic philosophy) మూలపురుషుడిగా గుర్తిస్తారు.

జార్జ్ బూల్ బీజగణితాన్ని తర్కశాస్త్రానికి అన్వయించి కొత్త గణిత శాస్త్రానికి పునాది వేశాడు. ఆ కొత్త గణితాన్ని ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ కి అన్వయించి కంప్యూటర్ విప్లవానికి నాంది పలికాడు క్లాడ్ షానన్.

పుస్తకాలు, గడియారాలు, నేత మగ్గాలు – వీటన్నిటి సాంకేతిక జ్ఞానాన్ని కలిపి రూపొందించిన గణన యంత్రాలు – ఆధునిక కంప్యూటర్లకి పూర్వగాములు. ఆ యంత్రాలనీ, జీవితాంతమూ వాటి నిర్మాణంలో గడిపిన 18వ శతాబ్దపు మేధావి ఛార్లెస్ బాబేజ్‌నీ (Charles Babbage) పరిచయం చెయ్యడానికే ఈవ్యాసం.

నడిచే విజ్ఞాన సర్వస్వంగా, అపర అరిస్టాటిల్‌గా పేరు తెచ్చుకున్న లైబ్‌నిట్జ్ జీవితాన్నీ, బహుముఖ ప్రతిభనీ, కంప్యూటర్ సైన్సుకి మూలాధారమైన అతని విప్లవాత్మక ఆలోచనలనీ ఈ వ్యాసం ద్వారా రేఖామాత్రంగానయినా పరిచయం చెయ్యాలని నా ఉద్దేశం

“ఈ తీరని ప్రశ్న గురించి ఎంతమందికి తెలుసు? కంప్యూటర్ సైన్సు లోకెల్లా ఇంతకన్నా తెలుసుకోదగ్గ విషయం మరేముంది? దీని గురించి నలుగురికీ తెలిసే విధంగా ఓ వ్యాసం రాస్తే బాగుంటుంది గదా,” అని అనిపించింది.

ఏ.టి.ఎం. (Automatic Teller Machine) లాంటి సౌకర్యాల వెనక వున్న సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి? దానిని సగటు మనిషికి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసిన వాళ్ళలో ఎందరో మహానుభావులు – అందరిలో ఓ మహనీయుడు – జిమ్ గ్రే (Jim Gray) – ఆయన్ని తెలుగు వాళ్ళకి పరిచయం చెయ్యాలన్నదే నా ఈ వ్యాసం ఉద్దేశం.

“సాహిత్యం వల్ల తాత్కాలిక ప్రయోజనం విశేషంగా ఉండటమే కాక అది త్వరగా అయిపోతే అంత మంచిది… నా కథలు చిరస్థాయిగా ఉండిపోవాలనే ఆశ నాకు ఏకోశానా లేదు.”

గమనాన్నీ, యానాన్నీ, ప్రవాహాన్నీ అక్షరాలలో చిత్రించాలని — అంతర్ బహిర్ వర్తనాల మధ్యన వుండే గొలుసు పొరలు చిరగకుండా వొక్కొక్కటె విప్పి, యేదో శూన్య రహస్యాన్ని తెలుసుకోవాలన్న కోర్కె తో రాసిన అస్తిత్వ వాద మనోవైజ్ఞానిక నవల హిమజ్వాల