రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

దిగువ మానేరు పెద్దవ్వ

రచన: శ్రీరామ్ పుప్పాల
జూన్ 2026

నేను ఏ ఊరెళ్ళినా నీటి కోసం వెతుకుతాను
నా అసలు ముఖం నీటి అద్దంలోనే
దొరుకుతుంది

రాజమండ్రి గౌతమీ ఘాట్లో
తప్పిపోయిన నన్ను
కరీంనగర్లో దిగువ మానేరు తల్లి
ప్రేమగా ఒడికట్టుకుంది
తల్లి ఎక్కడైనా తల్లే

డ్యాంలు కట్టిన చోట
రాశి పోసిన అనుభవాల నీటి మట్టము
మునగబెట్టిన బతుకు ఆనవాళ్ళుంటాయి
పోరాటపు నేల వొంటి మీద కప్పిన
నీలి జలతారు వస్త్రము
అనేక రక్తపు గాయాల్ని దాచిపెడుతుంది

ఈ డ్యాం దు:ఖం కాస్త కాస్త నాకర్థమయ్యేది
నిండు మనిషి పొట్టలో కదిలే
ఆకుపచ్చటి తడి రూపాన్ని ఊహించగలిగేవాణ్ణి
నీటి బిందువులోంచే సుఖ దు:ఖాల సింగిడి
నిగనిగలాడుతుంది కనుక
ఎల్ ఎం డీ గట్టు మీద కూర్చుని
నాలో నన్ను తడిమి చూసుకునేవాణ్ణి
మనిషి ఎన్ని రంగుల ఒదిగిన కాంతి రహస్యమో కదా

ఈ నీటి కుప్ప మీద వలస పక్షిలా ఎగురుతున్నప్పుడు
నేను దాటిన ఊళ్ళ సరిహద్దులన్నీ
ఇందులో చేప పిల్లల్లా ఈత్తూ కనిపించేవి
నన్నోదార్చే కాసిన్ని తేమగల అక్షరాల్ని
దోసిట్లోకి తీసుకుని పైతట్టున చల్లుకునేవాణ్ణి

నా కవిత్వానికిక్కడే కొత్త మొప్పలు మొలిచాయి
దేశి పలుకుబళ్ళ గవ్వలగురిగి దొరికింది

ఈ డ్యాం గేట్లెత్తినప్పుడల్లా
రంది తీరక ఉసురు దీసుకున్న కలలన్నీ
భోరున పల్లానికి పారేవి
మానేరు పెద్దవ్వనప్పుడు
ఊరడించడం ఎవ్వరి తరం కాని పని

(కరీంనగర్ చుట్టుపక్కల 3.5-4 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే రిజర్వాయరు పేరు లోయర్ మానేరు డ్యాం. దాని గట్టు మీద ఎంతో మంది వాకింగ్ చేస్తారు. బోటింగ్ ఉంటుంది. నాకెంతో ఇష్టమైన ప్రదేశం)

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • కవి వైద్యుడు
  • కొత్త వాచ్‌మన్
  • దిగువ మానేరు పెద్దవ్వ
  • గీతాచారి

ఇటువంటివే…

  1. ద్వివిధ
  2. బహురూపుల వాన
  3. ప్రేమే జిహాద్
  4. మంకుతిమ్మడి మరో మిణుకు — 5 (41-50)
  5. భ్రమలు

జూన్ 2026 సంచికలో ...

  • ‘గాలి నాసరరెడ్డికి…’ కమ్మ తెమ్మెరలు
  • అక్కడ ఉంటావు
  • అస్తిత్వవాద సాహిత్యం: 6అ. హైడెగర్
  • ఎక్కడున్నాను?
  • ఓడిస్సీ – చివరిమాట
  • ఓడిస్సీ – 7: అంతిమ పోరాటం, విజయం
  • కంప్యూటర్ చిప్ కథ – 14: లీ డి ఫారెస్ట్ కనుగొన్న ఎలక్ట్రానిక్ స్విచ్ – ట్రయోడ్
  • జూన్ 2026
  • తలుపులు బార్లా తెరవండి, ఎదురుగా మీ పల్లెటూరుంది
  • ది అన్‌సీన్
  • దిగువ మానేరు పెద్దవ్వ
  • దూతవాక్యం – సమూలానువాదం
  • నడిచే చెలమ
  • నెచ్చెలి-2026 7వ వార్షికోత్సవ కథా, కవితా పురస్కార పోటీలు (ఆఖరు తేదీ జూన్ 10, 2026)
  • పాట-మాట – 2: చెమటబిందువులోని సుడిగుండాలను చూపిన కవి వంగపండు
  • ప్రేమే జిహాద్
  • భ్రమలు
  • మంకుతిమ్మడి మరో మిణుకు — 5 (41-50)
  • మనసును దోచే మనస్లు– 6
  • యూట్యూబ్ లో ఈమాట: మే 2026
  • సీతాంజనేయ సంభాషణం – I
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

అక్కడ ఉంటావు
ఓడిస్సీ – చివరిమాట

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.