అస్తిత్వవాద సాహిత్యం: 6అ. హైడెగర్

6. హైడెగర్ (Martin Heidegger (1889-1976) Germany, German)

Quotes

Only man exists. A horse is, but it does not exist. An angel is, but it does not exist. God is, but he doesn’t exist.
(అస్తిత్వమంటే జీవించడం, ఉండడం కాదు, “ఉండుటను చేయుట” (Be-ing) అందుకే హైడెగర్ రచనల్లో ప్రతి రెండు వాక్యాలలో, ప్రతి రెండు పదాలలో, ఒకదానికి (ఆంగ్లానువాదంలో) “-ing” ఉంటుంది, చివరకు దేవుడికి కూడా: ” Being is trembling in Godding.” అందుకే అద్వైతం దేవుడున్నాడనదు, రెండవది లేదంటుంది. “ఉన్నాడు” అంటే, “ఇప్పుడున్నాడా?” (కాలం, Time); “ఇక్కడున్నాడా, యీ స్తంభంలో?” (దేశము, space), “ఉండి ఏం చీల్చాడు?” (-ing).

Dasein, the being for whom Being is a question is not a what, but a who.
(Dasein హైడెగర్ సృష్టించిన పారిభాషికపదం. అతని రచనల్లో బహుళంగా కనిపిస్తుంది. ఇది రెండు పదాలను కలిపిన పదం, Da-sein. (Da, అక్కడ; sein, ఉండు.) హైడెగర్ వివరించవలెనంటే.) తత్త్వమంతా చెప్పవలసి ఉంటుంది యీ పదాన్ని

Your destiny can’t be changed but, it can be challenged. Every man is born as many men and dies as a single one.

The great thinker is one who can hear what is greatest in the work of other “greats” and who can transform it in an original manner.

The possible ranks higher than the actual.

Is the Earth in your head, or under your feet.

Where is the boundary of the body? Every body is my body.

Being-here as an existing human being is always one and the same as being-there with you.
(“ఆత్మవత్ సర్వభూతాని సర్వభూతేషుచాత్మని”.గీత.6.32)

that is, “What we call feeling or mood…is more reasonable more intelligently perceptive – because more open to Being, than all reason…which was misinterpreted as being rational.” (ລ້ బుద్ధిజీవి (rational animal) కాడు. అతడు హృదయంతో తెలుసుకుంటాడు. పాస్కల్ యిదే అంటాడు: “బుద్దికంటే బుద్ధికలది హృదయం. “Heart has its own reason that reason doesn’t know.” Pascal)
(“నైషా తర్కేణ మతిరాపనేయా.” (కఠ.ఉప.)

జీవిత విశేషాలు

1889, (సెప్టెంబరు 26): జననం. జర్మనీలో. రోమన్ కాథలిక్ చర్చిలో కాటికాపరి (sexton) కుటుంబం.

1913 వేదాంతంలో డాక్టరేట్. మార్టిన్ లూథర్ కింగ్, కాల్విన్ వంటి వారి రచనలు చదివి కాథలిక్ మతం వదిలాడు.

1917 ఒక లూథరన్ స్త్రీని (ఎల్ఫిడ్ పెట్రి, Elfride Petri) పెళ్ళిచేసుకున్నాడు.

1919 ఫ్రైబర్గ్ విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గా చేరాడు, హసర్ల్ (Husserl) కింద. హసర్ల్ జగద్వాదం (phenomenology) హైడెగర్ ను ప్రభావితం చేసింది. కాని తరువాతి కాలంలో అతడి వాదంతో విభేదించాడు. కీర్క్ గార్డ్ నుండి అస్తిత్వవాదము, వ్యక్తి ప్రాముఖ్యము యితనిపై ప్రధాన ప్రభావం. నీచ (Nietzsche) మీద రెండు వాల్యూముల గ్రంథం రాశాడు.

1923–1928 మార్బర్గ్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా మంచి పేరు. హసర్ల్ పదవీవిరమణ తరువాత హైడెగర్ తిరిగి ఫ్రైబర్గ్ వచ్చి హసర్ల్ స్థానంలో ఆచార్యుడిగా చేరాడు.

1924 అతడి యూదు (Jew) విద్యార్థిని హానా ఆరెంట్ (Hannah Arendt) తో రహస్యప్రేమ ప్రారంభం. ఆమెకు అతడు ఒక జీవితకాలపు ఆకర్షణ, “మారువేషంలో తిరుగుతున్న మహరాజు”. కాని, అతడి వైవాహిక జీవితం భంగంకాలేదు. హైడెగర్, భార్యను యిద్దరు కొడుకులను ఎన్నడు వదిలేయలేదు. అతడు నాజీపార్టీలో చేరిన తరువాతకూడా హానాతో తన ప్రేమకు భంగం కలగలేదు.

1927 ప్రధానరచన Sein und Zeit (Being and Time). ఈ పుస్తకాన్ని హస్లర్‌కు అంకితమిచ్చాడు (“in friendship and admiration”). ఖ్యాతి జర్మనీలోనే కాక యూరప్, అమెరికాలలో కూడా పాకింది. దానితో అతడికి ఆచార్యుడిగా పదోన్నతి, విద్యార్థులలో ఒక గొప్ప గౌరవం లభించాయి.

అస్తిత్వం తత్త్వం శాస్త్రంలో కంటే కవిత్వంలో, కావ్యశైలిలో, కావ్యభాషలో మరింత బలంగా వ్యక్తమవుతుందని అనుకున్నతరువాత అతని రచనావిధానం ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది. హోల్డర్లిన్ (Hölderlin), రైనా మరియా రిల్క (Rainer Maria Rilke) వంటి కవులు అతణ్ణి ఆకర్షించారు.

1930 లో హైడెగర్ నాజీపార్టీలో చేరాడు, విశ్వవిద్యాలయంలో రెక్టర్ అయ్యాడు. ఇతడి నాజీసంబంధం గురించి తెలిసి విశ్వవిద్యాలయం యితన్ని ఆచార్యుడిగా బహిష్కరించింది.

1949 వరకు తిరిగి ఆ పదవిని పొందలేదు.

1936-37 “Contributions to Philosophy”లో హైడెగర్ రెండవ ముఖ్యగ్రంథం. ఒక అర్ధశతాబ్ది అముద్రితంగా ఉండిపోయి, 1989 లో అచ్చయింది.1999 లో ఇంగ్లీషులో అనువాదం.

1946 “Letter on Humanism”లో ఒక క్రొత్త హైడెగర్ కనిపిస్తాడు. వెనుకటి తత్త్వము, తాను సృష్టించిన తాత్త్విక స్వభాషాపారిభాషికపదాలు, యినపగుగ్గిళ్ళు యివేవీ యిందులో లేవు. కాని తన సహజమైన అభివ్యక్తి వదలలేదు (“Being is the trembling of the Godding”. కీర్క్‌గార్డ్ వదలలేదు.) నాస్తికుడు అనిపించుకున్న హైడెగర్ తన మలిదశలో “దేవతలు, మానవులు, భూమి, ఊర్ధ్వలోకాల” గురించి కూడా మాట్లాడాడు (“What Is Called Thinking?” 1954). 1966 లో ఇచ్చిన ఒక యింటర్వ్యూలో “ దేవుడే దిక్కు” (“Only a God can save us!”) అన్నాడు. ఆ మాట ఆస్తిక్యబుద్ధితో కాక, సమకాలీన పరిస్థితిపట్ల నిస్పృహతో అని ఉండవచ్చు.

ఏమైనా, యిరవై ఆరో ఏట చెప్పిందే డెబ్బై ఆరో ఏట కూడా చెబితే అది అబద్ధం అవుతుంది.

1976 (మే 26) మరణం.

ఆధునికతనుండి అత్యాధునిక యుగానికి దారిలో అడ్డంగా నిలబడిన మేరువు హైడెగర్. అతన్ని దాటడం కష్టం. దాటకుండా యీ యుగంలోకి నడవడం కష్టం. అతడి ప్రభావం ఒక రంగంలో కాదు. తత్త్వశాస్త్రం అటుంచి, మనస్తత్త్వశాస్త్రం, మానసికవైద్యం, సాహిత్యవిమర్శ, సాంకేతికత, పర్యావరణము-బహుశా అతడి ప్రభావంలేని ఆధునికరంగం లేదేమో! అతని ప్రభావం లేని యిరవయ్యవ శతాబ్దంలోని ప్రముఖమేధావి లేడు. డెరిడా (Derrida), సార్థ (Sartre) వంటివారు ఎందరో. సా తన ఆలోచనలన్నీ హైడెగర్ నుండి సంగ్రహించినవే అంటాడు గ్రాంట్ (George Grant). అస్తిత్వవాదంలో అతడు ప్రవేశపెట్టిన పదం “అకృత్రిమత” (authenticity), యిప్పుడు వాడనివాడు లేడు. మనిషి ప్రతిచేష్టలో సమాజం ఉంటోంది, తానుమాత్రం లేడు, అంటాడు హైడెగర్ (“Everyone is the other, and no one is himself.”)

Main works

  1. Being and Time (1927)
  2. What is Metaphysics? (1929)
  3. Contributions to Philosophy (1936-37)

(ఇంకావుంది)