2019లో ఒక అభిప్రాయవేదికని నిర్వహించిన అమెరికన్ పాత్రికేయుడు బ్రెట్ స్టీవెన్, విలా కేథర్‌ని డానల్డ్ ట్రంప్‌కు ఆంటీడోట్‌గా పేర్కొన్నాడు. అమెరికాను గొప్ప దేశంగా చేసే లక్షణాలేమిటో విలా నవలలు చెబుతాయని విమర్శకులు ప్రశంసించారు. ముఖ్యంగా ట్రంప్ విధానాలు విలా కేథర్‌ని చదవాలను గుర్తుచేశాయని అన్నా తప్పులేదు.
రచయిత వివరాలు
పూర్తిపేరు: సి. మృణాళినిఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం: హైదరాబాదు
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సి. మృణాళిని రచనలు
హిందూ వివాహవ్యవస్థలోని బోలుతనం, ఆధిపత్య భావజాలం, కోడంట్రికం, ఇంటి కోడలి సహనం, పతివ్రతాలక్షణం – నవలలో ప్రధానాంశాలు. అయితే కమలను అంతమాత్రంగానే చిత్రించివుంటే ఈ నవలలో చెప్పుకోదగ్గ విషయం ఉండేది కాదు. కమలలో ఈ ‘పవిత్ర భారతనారి’ లక్షణాలెన్ని ఉన్నా, ఆమెలో ప్రత్యేకతలున్నాయి.
సావిత్రి కథను ఇంగ్లిష్‌లో చెప్పిన మొదటి కవయిత్రి ఈమే. తొరూ దత్ రచనలో సావిత్రి కథ ప్రణయభావనలతో అందమైన కావ్యమైంది. అరవింద ఘోష్ ఈ కథకు తాత్వికరూపమిచ్చిన విషయం తెలిసిందే. దాన్ని మోడర్న్ క్లాసిక్స్‌లో ఒకటిగా పరిగణిస్తారు.
సామాజిక చరిత్ర నిర్మాణానికి కేవలం సాహిత్యం పైనే ఆధారపడవలసిన అవసరం ఉండకూడదు. కానీ సాహితీగ్రంథాలను ఆలంబన చేసుకున్నప్పుడే ఆ సమాజం గురించి సరైన అవగాహన సాధించగలుగుతున్న ఈ నేపథ్యంలో రాజగోపాల్, ఆత్మకథలను ఆధారం చేసుకుని వలసవాద సమాజాన్ని విశ్లేషించాలనుకోవడం మెచ్చుకోవాల్సిన విషయం.
నడీన్ గోర్డిమర్ కంటే చాలా ముందే దక్షిణాఫ్రికాలో తెల్ల, నల్ల జాతుల గురించి వ్యాసాలను, అక్కడి స్త్రీల జీవితాల గురించి ఒక నవలనూ రచించిన 19వ శతాబ్ది రచయిత్రి ఆలివ్ ష్రైనర్ ఎక్కువమంది పరిశోధకులకు కూడా అపరిచితురాలే. ఈ రచయిత్రి మన గాంధీజీని కలుసుకుందని, ఆయన అభిప్రాయాలను గౌరవించిందనీ చదివినపుడు కలిగే ఉత్సాహం వేరు.
విశ్వసాహిత్యంలో నల్లజాతి మహిళల నవలా రచన ఎప్పుడు ప్రారంభమైంది? అన్న విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతూ, తొలి నవలను తేల్చలేకపోతున్నారు. ఆ ప్రయత్నాలు అలా కొనసాగుతూండగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన 19వ శతాబ్దిలోని ఇద్దరు నల్లజాతి మహిళల నవలలు వేర్వేరు కారణాలవల్ల ప్రాచుర్యం పొందలేదు.
తొలి నవల పాఠకుల ఆదరణ దృష్ట్యా విజయవంతమైనా, ఆ తర్వాత విమర్శకులు కత్తిగట్టడంతో 19వ శతాబ్ది రచయిత్రుల జాబితానుంచి పక్కకి తొలగిన రచయిత్రి ఎలిజబెత్ గాస్కెల్. విమర్శకులు కత్తిగట్టడానికి కారణమేమిటి? ‘మగవాడిలా కార్మికులు, పేదల గురించి రాయడానికి ప్రయత్నించడం, పారిశ్రామిక విప్లవం ఫలితాలను చర్చించడం!’
నెలీ పాత్రికేయవృత్తిలో ఉన్నందువల్లనేమో, శైలి చాలా పఠనీయంగా, సంభాషణలు పటిష్టంగా ఉంటాయి. ఉద్వేగభరితమైన శైలి నవలకు అందాన్నిస్తుంది. ఒక్క నెలలో రాసేసిన ఈ నవల బాలీవుడ్‌లో సంచలనం రేకెత్తించిన ‘ఖూన్ భరీ మాంగ్’ నుంచి ‘సాత్ ఖూన్ మాఫ్’ వరకు, ఎన్నో సినిమాలకు ప్రొటోటైపా అన్నట్టుంటుంది.
ఆమె దృష్టిలో తను పెళ్ళికి, పిల్లల్ని పెంచడానికీ పుట్టిన స్త్రీ కాదు. తనకు ఇంకా ఏదో కావాలి. అదేమిటో ఆమెకీ తెలీదు. భర్తను వివాహం చేసుకున్నపుడు అతనితో ప్రేమగానే ఉంది. కానీ అది తన కర్తవ్యంలో భాగం. అందులో ఎలాంటి ఉద్వేగం లేదు. తన సంచలనం ఆమెకు అర్థం కాకపోయినా తనలో ఏదో మార్పు వచ్చిందని గ్రహిస్తుంది.
కొన్ని నవలలు చదివీ చదివగానే అర్థమై, ఉదాత్తంగా, ప్రత్యేకంగా ఉంటాయి. కొన్ని నవలలను నిశితంగా చదివి, పొరలు విప్పుకుంటూ పోతే తప్ప, వాటిలోని పస అర్థం కాదు. ఈ నవల రెండో కోవకు చెందింది. నవలలో కథ గొప్పదేమీ కాదు. ఒకరకంగా ఒక బలహీనుడు, విధి ఎలా లాక్కుపోతే అలా వెళ్ళే యువకుడి కథ.
మాద్రిద్ విశ్వవిద్యాలయంలో ఆమె పేరిట ఒక పీఠం ఏర్పడడం ఎంతో అరుదుగా స్త్రీలకు లభించే గౌరవం. అయితే, మేధావులకోసం స్థాపించిన స్పానిష్ రాయల్ అకాడెమీలో తనకు స్థానం లభించాలన్న ఆమె ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. ఆ అకాడెమీ కేవలం మగవాళ్ళకేనని తేల్చి చెప్పారు పండితులు!
జేన్‌లో ఉన్న ప్రధానమైన గుణం ఎటువంటి పరిస్థితుల్లోనైనా, తన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్నీ కోల్పోకపోవడం. ఎంత గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళతోనైనా తన మనసులో మాట నిక్కచ్చిగా చెప్పడం. మనసుతో కంటే బుద్ధితో జీవించే గుణం. అందుకే ఈమె ఆ కాలం నాటి కథానాయికల కంటే భిన్నంగా ఉంటుంది.
ఈ కథ – సృష్టికి, సృష్టికర్తకూ ఉన్న సంబంధం గురించి; మానవీయతకు, అమానవీయతకూ ఉన్న సంబంధం గురించి; వికారానికి, అందానికీ ఉన్న సంబంధం గురించి; మేధకు, ఉద్వేగానికీ ఉన్న సంబంధం గురించి; శాస్త్రజ్ఞానానికి, యథార్థానికీ ఉన్న సంబంధం గురించి; ప్రకృతికి, మనిషికీ ఉన్న సంబంధం గురించి సరికొత్త వ్యాఖ్యానం.
అన్నాచెల్లెళ్ళను గురించి ఇలాంటి వస్తువు అంతకుముందు ఇంగ్లీషు నవలల్లో ఎవ్వరూ చిత్రించలేదు. ఒకరకంగా ఇది జార్జి ఎలియట్ ఆత్మకథాత్మక నవల అనీ, ఆమెకు అన్న పట్ల అమితమైన ప్రేమ ఉండేదనీ విమర్శకులంటారు. ఇప్పటి విమర్శకులు ఫ్రాయిడియన్ సిద్ధాంతాలతో వ్యాఖ్యానించడానికి పుష్కలంగా అవకాశం ఉన్న నవల ఇది.
కవులను, సాహిత్యకారులను దేశంనుంచి తరిమేయడంలో రష్యా ప్రతిభే వేరు. అలా స్వదేశం నుంచి పారిపోక తప్పని పరిస్థితి ఎదురైన ఒక రచయిత్రి కరొలీనా పావ్లోవా . ఆమె పారిపోవడానికి కారణం జార్ ప్రభువు కాదు. తోటి సాహితీవేత్తలు పెట్టిన మానసిక హింస. మగరచయితల బహిష్కరణకు రాజ్యం కారణమైతే, ఈ రచయిత్రి పారిపోవడానికి కారణం ఆ మగ రచయితలే. వినడానికి ఎంత దారుణంగా ఉన్నా అదే నిజం.
తన 17వ యేటే తన డైరీలో రాసుకున్న వాక్యాలను చూస్తే ఆమె తదనంతర జీవితం, సాహిత్యం ఎలా ఉంటాయో తెలుస్తుంది. ‘పిరికివాళ్ళంటే నాకిష్టం లేదు. వివాహం విషయంలో నాకో అనుమానం. నిజంగా భర్త తెలివైనవాడైతే తన భార్య భీరువుగా ఉంటే సహించగలడా?’ అంటుంది. భయం, సంకోచం స్త్రీల లక్షణం అనే భావజాలాన్ని చాలా చిన్నతనం నుంచే ఆమె వ్యతిరేకించేది.
మనిషి మనసు ఒక మహాసముద్రమని, దాన్ని అర్థం చేసుకోవడం కష్టసాధ్యమనీ, మానవ హృదయంలో అతనికే తెలీని ప్రేరణలు, ఆలోచనలు ఉంటాయనీ మనస్తత్వ శాస్త్రం నిరూపించిన తర్వాత, అవేవీ తెలియకుండా ఇంత లోతైన మనస్తత్వాలను చిత్రించిన ఎమిలీ బ్రాంటీ ఒక గొప్ప రచయిత్రిగా గుర్తింపు పొందింది.
ఎంతో గొప్ప నవలలు రాసిన జేన్ ఆస్టిన్, ఎమిలీ బ్రాంటీ, షార్లెట్ బ్రాంటీ, జార్జి ఎలియట్, ఎలిజబెత్ గాస్కెల్ వంటివారు ప్రణయానికి తమ నవలల్లో పెద్దపీట వేశారు. కానీ ఈ రష్యన్ అక్కచెల్లెళ్ళు మాత్రం సమాజంలో తమ స్థానానికీ, ఎదుగుదలకూ పోరాడే స్త్రీ పాత్రలనే సృష్టించారు.
స్త్రీపురుష సంబంధాల్లో భావోద్వేగాల కంటే ఇంగితజ్ఞానానికి, ప్రణయవేగం కంటే పరస్పరగౌరవానికి, ఆర్ధిక సమానతల కంటే బౌద్ధిక సమానతలకూ ప్రాధాన్యం ఇచ్చిన రచయిత్రి జేన్. ఆమె నవలల్లో స్త్రీపురుషులిద్దరూ విలువల్లో, జీవన విధానంలో, ప్రాపంచిక దృక్పథంలో సమవుజ్జీలుగా ఉన్నపుడే ‘ప్రేమ’ అనే పదానికి అర్థం ఉంటుంది.
జేన్ ఆస్టిన్ ‘నేను అందరిదాన్నీ’ అని ఏనాడూ చెప్పుకోలేదు కాని, అందరూ ఆమె తమకే చెందుతుందని అనుకున్నారు. తమ సిద్ధాంత పరిధుల్లోకి ఆమెను లాక్కువెళ్ళాలని ప్రయత్నించారు. ఆమె మరణించి రెండు శతాబ్దాలు గడిచినా, ఇప్పటికీ ఆమెను చర్చించుకుంటూనే ఉన్నారు. అందుబాటులో ఉన్న ఆరు నవలల్లోనూ లోతుల్ని వెతుకుతూనే ఉన్నారు.
ఇలా మానవాతీత శక్తులు లేవని, అవి మన ఊహాజనితాలనీ చెప్పడం వల్లనే కాబోలు 20, 21వ శతాబ్దుల్లోనూ ఆన్ రాడ్‌క్లిఫ్ ఒక సంచలన రచయిత్రిగా సాహిత్యవేత్తల మన్ననను పొందుతోంది. ఇది మౌలికంగా సెంటిమెంటల్ నవలే. కానీ అందులో సస్పెన్స్‌నూ, థ్రిల్‌నూ పొందుపరచడంలో ఆన్ రాడ్‌క్లిఫ్ చూపిన ప్రతిభ వల్ల ఇది ఒక అసాధారణ రచన అయింది.
మేరీ ఉల్‌స్టన్‌క్రాఫ్ట్ నవలల కంటే ముందు రాసిన నాలుగు గ్రంథాలూ స్త్రీల విద్యకు పెద్ద పీట వెయ్యడంతో పాటు, సామాజిక, రాజకీయ వ్యవస్థల్లో ఆధిపత్యాన్ని ప్రశ్నించేవే. వ్యక్తి స్వాతంత్ర్యాన్నీ, సమానత్వాన్నీ సమర్ధించేవే. ఒక్క ఫ్రెంచి విప్లవం నేపథ్యంగా ఆమె రాసిన మూడు రచనలూ పెద్ద ప్రకంపనలకు దారి తీశాయి.
ఇలా ఒక నవలలో జాతి, సంస్కృతి, మతం వంటి విషయాలు ప్రణయజీవుల మధ్య ఇనపతెరలై నిలిచిపోవడం ఒక విలక్షణమైన రచనగా దీన్ని నిలబెడుతుంది. వివాహానికి ఇవి అడ్డమయ్యాయి కానీ ప్రేమకు మాత్రం కాదు. అందుకే అతన్ని చేసుకోలేకపోయిన కొరీన్ వివాహాన్నే మానేస్తుంది. అతనిపై దిగులుతో కృశించి, మరణిస్తుంది.
స్టాఎల్ ప్రణయ జీవితం కేవలం ప్రణయ జీవితమైతే చెప్పుకోవాల్సిన పనిలేదు. తన రాజకీయాలతో అనుసంధానం చేసి, అప్పటి రాజకీయనాయకులకు ప్రేరణను కలిగిస్తూ, వారి ద్వారా చాణక్యుడి తరహాలో రహస్య చర్యలు చేపడుతూ సామాజిక, రాజకీయ జీవితంలో తన కార్యక్రమాల నిర్వహణకు ఆ ప్రణయసంబంధాలను ఉపయోగించుకుంది.
స్త్రీలు సృజనాత్మక పనులు చేయడం తప్పని భావించే సగటు మనస్తత్వాన్ని బర్నీ కొంతకాలం అధిగమించలేకపోయింది. అందుకే ఆమె తన తొలి రచనలన్నిటినీ కుప్పపోసి తగలబెట్టింది. ‘నా పుస్తకాలనైతే తగలబెట్టగలిగాను కానీ నా ఆలోచనలను తగలబెట్టలేకపోయాను’ అంది ఆమె ఆ తర్వాత.
సంక్లిష్టమైన ఇతివృత్తాన్ని లేఖల ద్వారా కథనం చేయడంలో రచయిత్రి అపారమైన ప్రతిభ చూపింది. ఉత్తరాలనగానే కథకు మాత్రమే ఉపకరిస్తాయనిపిస్తుంది కాని, ఇందులో ఉత్తరాల ద్వారా అప్పటి సమాజం, ఆర్థిక వ్యత్యాసాలు, స్త్రీలను, పేదలను ధనవంతులు దోచుకునే విధానాలు, వాటికి వ్యవస్థ ఆమోదాలు అన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి.
మీ అన్న నా శత్రువును చంపితే చట్టం అతన్ని శిక్షిస్తుందని భయపడుతున్నావని అర్ధమైంది. కానీ అలాంటి అనుమానాలు పెట్టుకోకు. హీరోలపై చట్టానికి ఎలాంటి అధికారం ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చినంతమందిని చంపొచ్చు. ఎన్ని ప్రాణాలను వాళ్ళు తీసేస్తే వాళ్ళ శీలం, కీర్తి అంతగ ప్రసిద్ధి చెందుతాయి.
ఈ నవలలో కథ చిన్నదే. కానీ ఇది రేకెత్తించిన ఆలోచనలు కొత్తవి. అందులో ముఖ్యమైన విషయం నల్లజాతీయుల బానిసత్వం. బ్రిటన్‌లో అప్పటికి ఆఫ్రికన్ కాలనీల్లో బానిసత్వం ముమ్మరంగా ఉన్నప్పటికీ దానిపై తిరుగుబాట్లు, దాని నిషేధానికి పోరాటాలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. అక్కడక్కడా కొందరు వ్యతిరేకించడం మినహా, సంఘటిత పోరాటాలేవీ అప్పుడు లేవు.
ఫ్రెంచి భాషలో తొలి చారిత్రక నవలగా, మనస్తత్వ ప్రధాన నవలగా ఈ నవల పేరు పొందింది. ఇందులో కథానాయిక తప్ప తక్కిన అందరూ చారిత్రక వ్యక్తులే. ఏ భాషలోని చారిత్రక నవలల్లోనైనా చారిత్రక వ్యక్తులు అతి తక్కువగా, కల్పిత పాత్రలు ఎక్కువగా ఉండడం సహజం. కానీ ఈ తొలి ఫ్రెంచి చారిత్రక నవలలో అన్నీ చారిత్రక పాత్రలే. కథానాయిక మాత్రమే కల్పితం.
ఈ నవలలో నాయకుడున్నాడు గానీ నాయిక లేదు. నాయికలు అనేకం ఉన్నారు. నవలలో 40కి పైగానే పాత్రలున్నాయి. అందులో పాతిక వరకూ ప్రాముఖ్యం కలిగినవి. ముఖ్యంగా చెప్పుకోదగ్గవి మూరాసాకి, ఫుజిత్సుబొ, ఆకాషీ. ఈ ముగ్గురిని గెన్జి వేర్వేరు దశల్లో ప్రేమిస్తాడు. అతనిలో ఆనందానికీ, మనోవ్యథకూ కూడ వీళ్ళు ముగ్గురూ ఎక్కువ కారకులౌతారు.
క్రీ.శ. 11వ శతాబ్ది నుంచి నవలను తమ ప్రధాన సాహిత్యమాధ్యమంగా చేసుకుని, ప్రపంచ భాషలన్నిటిలోనూ నవలా సామ్రాజ్యంలో మహిళలు తమ బావుటా ఎగరేశారు. అలాంటి నవలారచయిత్రులను సాహిత్య చరిత్రలు ఎలా గుర్తించాయి? వారు ఎలా జీవించారు? వారు ఏం రాశారు? సమకాలీన సాహిత్య సమాజం వారిని ఎలా చూసింది? వారి రచనల్లో ఇప్పుడు కూడా చదివి, తెలుసుకుని ఆనందించగల విషయాలేవైనా ఉన్నాయా?
చిన్నప్పటినుంచీ ఎంతో కలిగిన కుటుంబంలో అల్లారు ముద్దుగా పెరిగి, అమెరికాలో చదువుకోవాలన్న కోరిక తీర్చుకుని, తనకిష్టమైన అబ్బాయిని పెళ్ళి చేసుకుని, జీవితమంతా వడ్డించిన విస్తరిలా బతుకుతున్న రాధ ఇలాంటి వాళ్ళ గురించి అంత సానుభూతి ఎలా చూపగలిగింది? ఆ అమ్మాయిలో ఆ సంస్కారం ఎలా వచ్చింది? తప్పు చేసిన మనుషుల్లో కూడా మంచి ఉంటుందని ఎంత ధీమా తనకు! ఎలా నమ్ముతోంది వీళ్ళని!
సోమరాజు సుశీల పాఠకులకు తమ బాల్యాన్ని పునర్దర్శించుకునే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, అనుభూతిని ‘ఇల్లేరమ్మ కతలు’లో అందించారు. ఆ క్రమంలో అందులోని పాత్రలు ఉడుక్కున్నా, ‘అది నిజమే కదా. ఉడుక్కోవడం దేనికీ, నిన్ను కథలోకి ఎక్కించి అమరత్వం కల్పిస్తేనూ’ అని డబాయించారు. ముందే చెప్పినట్టు, ఆమెకు నిజం చెప్పడం ఓ సరదా.
ముఠాతత్వం అన్నది విమర్శలో కూడ ఇప్పుడు కనిపిస్తోంది. ఒక్కొక్కసారి ఈనాటి కవులు, రచయితలు తమ విమర్శకులను తామే సృష్టించుకుంటున్నారేమో అన్న అనుమానం, తమపై విమర్శ (ప్రశంస) తామే రాయించుకుంటున్నారేమో అన్న అనుమానం కూడ సహజంగానే కలుగుతుంది. అది సత్యదూరం కూడ కాదు. (డీటీఎల్సీవారు ప్రచురించిన తెలుగు విమర్శ: కొన్ని ఆలోచనలు అన్న సంకలనం నుంచి పునర్ముద్రణ.)
సామాజిక నవలల్లో కథనా శిల్పం అన్న అంశంపై డా. మృణాళిని గారు కాలిఫోర్నియా లో చేసిన ప్రసంగం నిడివి: షుమారు 90 నిమిషాలు (54.5 […]
వస్తువులోనూ, కథనంలోనూ ఎన్నదగినవిగా ఉన్నవి ముఖ్యంగా రెండు. అవి జిగిరీ, తోలుబొమ్మలాట. జిగిరీ నవల మానవుడిలో ఉన్న రెండు పార్శ్వాలను స్పృశించిన రచన. తోలుబొమ్మలాట- ఆధునికీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో మన వినోదాలుకూడ టీవీ, సినిమాలకు పరిమితమై, దేశీయ కళలు, జానపద ప్రదర్శన కళలు కనుమరుగైపోతున్న విషయం ఇందులో వస్తువు.