సామాజిక నవలల్లో కథనా శిల్పం


సామాజిక నవలల్లో కథనా శిల్పం అన్న అంశంపై డా. మృణాళిని గారు కాలిఫోర్నియా లో చేసిన ప్రసంగం
నిడివి: షుమారు 90 నిమిషాలు (54.5 Mb)

(సేకరణ: సాయి బ్రహ్మానందం గొర్తి )


డా. మృణాళిని గారి సాహితీ పరిచయం

తెలుగు సాహిత్యంలో చాలా మంది నవలా రచయిత్రులున్నారు. తెలుగు నవల కి అత్యంత ఆదరణ తీసుకొచ్చిందీ నవలా మణుల్లాంటి రచయిత్రులే. నవల అంటే ఆడవాళ్ళే రాయాలి అన్నంతగా రచయిత్రులు నవలా రాజ్యాన్ని ఏలారు. కానీ, తెలుగులో నవలా విమర్శ అనేది అంతగా లేదు, అందులోనూ నవలలో తులనాత్మక విమర్శ అన్నది ఇంకా తక్కువగా ఉండేది. నవలల మీద విమర్శనాత్మకమైన సమీక్షలు కూడా రాలేదు. నవలకి కావల్సిన నేపథ్యం ఏమిటి? నవలల్లో శిల్పం ప్రాముఖ్యత ఏమిటి? ఇలాంటి విషయాల్లో ఇటీవలి వరకూ విమర్శ అంతగా రాలేదు. ఏ సాహితీ ప్రక్రియైనా విమర్శ అనే కొలిమిలో కాలితేనే రాణిస్తుంది. తెలుగు నవలా సాహిత్యం పై విమర్శనాత్మక, పరిశోధక వ్యాసాలు రాసిన మొట్ట మొదటి రచయిత్రి డా. మృణాళిని.

డా. మృణాళిని తెలుగులో ఎం ఏ, ఎంఫిల్, పీ హెచ్ డీ చేసి తెలుగు విశ్వ విద్యాలయంలో తులనాత్మక అధ్యయనాల (comparative studies) విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేసారు. “తెలుగు సాహిత్యంలో సామాజిక నవలల్లో కథనా శిల్పం” అనే అంశం పై వీరికి పీ హెచ్ డీ ఇచ్చారు. ఇంగ్లీషులోనూ, విమెన్స్ స్టడీస్‌లోనూ ఎం.ఏ. డిగ్రీలు పొందారు. “ఉదయం” అనే దినపత్రికలో దాదాపు 8 ఏళ్ళు విలేకరిగా పనిచేసారు. వీరివి ఇంత వరకూ అనువాదాలూ, విమర్శ, కథానికలూ, రచనలూ, వెరసి 9 పుస్తకాలు ప్రచురించ బడ్డాయి. మృణాళిని గారు రచనా వ్యాసంగమే కాక, తెలుగు టీవీలో అనేక సాహిత్య పరమైన కార్యక్రమాలూ, ఇంటర్వ్యూలూ, స్త్రీల సమస్యలపై అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వీరు ఆంధ్రజ్యోతి దిన పత్రికలో “తాంబూలం” అనే శీర్షిక దాదాపు రెండేళ్ళు నిర్వహించారు. ప్రస్తుతం “ఇంతిహాసం” అనే శీర్షికని నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం వీరు World Space Satellite Radio వారి రేడియో స్పందన ప్రోగ్రాం డైరెక్టర్ గా పని పనిచేస్తున్నారు.

డా. మృణాళిని గారి అమెరికా పర్యటన సందర్భంగా శాంతాక్లారా, కాలిఫోర్నియా లో జరిగిన సాహితీ సభలో తెలుగు నవలా సాహిత్యంపై వారి ప్రసంగం ఇది.
-సాయి బ్రహ్మానందం గొర్తి


సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...