రచయిత వివరాలు

లైలా యెర్నేని

పూర్తిపేరు: లైలా యెర్నేని
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

 

రావణుడు కోరినట్టే, వారిద్దరూ, అతని అతిథిగా కొన్ని దినాలపాటు రాజమందిరాలలో ఉన్నారు. కరువుతీరా సంగీత కళ, సంగీత శాస్త్రము, ఇతర శాస్త్రములు, సముద్రంపై వారధులు ఎలా నిర్మించటం, ఎక్కువమంది ఎక్కగలిగే ఓడలు, విమానాలెలా తయారు చెయ్యటం, సంహిత వంటి సంగీత, సందేశ సాధనాలు ఇంకా చిత్ర శక్తులతో అందరికీ ఎలా అందించటం, అంతరిక్షం లోని గ్రహాలలోకి జనుల ప్రయాణాల వంటి -విషయచర్చలు రోజూ జరిగాయి.

రుషులను చూడటానికి వారి ఆశ్రమాలకు దేవతలు వచ్చినట్లే, ఆ అరణ్యంలో సీతారాములను చూడటానికి, జగత్తులోని పూర్వపరాలలోని ప్రేమికుల జంటలు -రోమియో జూలియట్; ముంతాజ్ షాజహాన్; పార్వతి శివుడు; లైలా మజ్నూ; వీనస్ అడోనిస్; క్లియొపాట్రా ఏంటొనీ; భాగ్యమతి కులీకుతుబ్ షా; ఎంకి నాయుడుబావ; ఎలిజబెత్ ఫిలిప్; జేన్ టార్జాన్; హెలెన్ పారిస్; అనార్కలి సలీమ్, మరియా వాన్ట్రాప్ -ఎందరెందరో ఆ చుట్టు పట్ల చరించారేమో మరి!

రాగము లెన్నని? రాతిరి కాంత
తీగల వీణను తీయగ అడిగె.
వీణియ నవ్వెను హాయిగ ఊగి,
మోగెను తీగల వింతగ సాగి-
సరి! సరి! పదసరి దాపరీ!
సరిగమపదని గని నీదని గని
సరిగ నీ దాగని పస గని
మరి సరిగ నీ దాగని గరిమ గని

ముంజేతులకు ముత్యాలిత్తువు
రొమ్ములపైనా రత్నాలుంతువు
సంపగి సొబగుల ఉడుపులిత్తువు
ఇంతగ నాతో రమింతువేలా?
రాముడా! నాపైన నీకింత భ్రమతేమీ?

ఈ నేల నడవనిస్తుందీ
నాకు గరిక తివాసీ పరుస్తుంది
ఈ ఎండ ఎదురు వస్తుందీ
నా మెడలో పొగడ దండ వేస్తుంది
ఈ గాలి గౌరవిస్తుందీ
నాకు పూల గంధాలు పూస్తుంది
ఈ వాన పలకరిస్తుందీ
నా పై పన్నీరు చిలకరిస్తుంది

మీరు చెప్పమంటే, నేను మార్లాతో మాట్లాడి ఆమె తొందరపడి కేస్ ఫైలు చెయ్యకుండా ఉండేట్లు చూస్తాను. నేను చెప్పినట్లు ఆమె చెయ్యక్కర్లేదు. అసలు నేను అలా చెప్పకూడదు కూడా. నా ఉద్దేశంలో ఆమె పనిలో పొరపాటు లేదని. ఈ కాగితాలు చూడండి. ఆమెకు తన డెస్కు దగ్గరే ఉండి, హాస్పిటల్ కంప్యూటర్ మీద ఎడిషనల్ పని చేసుకోటానికి ఆమెకు పర్మిషన్ ఇవ్వబడింది. ఇవిగో అంతకు ముందున్న చీఫ్, ఒక వైస్ ప్రెసిడెంటు సంతకాలు పెట్టిన కాగితాలు.

మధ్యాహ్నం, అతడికి తను వండిన ఇండియన్ డిష్, రొట్టె మడుపులో, స్వయంగా నోటి కందిస్తే, గోధుమ కనుపాపల, ఆశ్చర్యపు అరక్షణపు నిస్టాగ్మస్. ఆ పై ప్రతి బైట్‍కూ, సంభోగ పరాకాష్ఠాసమయపు కూజితాలు వెలువడ్డాయ్ అతని గొంతులోంచి. ‘ఎవ్రి‌ధింగ్ సీమ్డ్ ఎక్జాట్‍లీ రైట్, ఒళ్ళంతా కోన్యాక్‍లా వెచ్చగా జ్వలించింది.’ అన్నాడు. భోజనానంతర పునర్భవ కామ వాంఛలు, భోగినీ దండకాలకే ఉచితాలు.

పార్టీ ఐపోయింది, గుంపు చెదిరిపోతూంది. ఇంకో రెండు నిమిషాలు గడిస్తే, తలుపు తోసుకుని బైటపడితే చాలు, విముక్తి. ఆశ్చర్యంగా ఇద్దరం ఒకేసారి బరువు తలుపు హేండిల్‌పై మోపిన చెయ్యి, స్తంభించిన నా ఊపిరి, బైట అతడు నాకు తొడిగే కోట్, సవరించే కాలర్, మర్యాదగా తీసి పట్టుకున్న కేబ్ డోర్, తలుపులో పడకుండా సర్దే స్కర్ట్. నా చెయ్యేనా అతడిని కేబ్ లోకి లాగింది, నేనేనా కేబ్ డ్రైవర్‌కి నా హోటల్ అడ్రస్ చెప్పింది, అతనా?

నిసి అతని ఆదుర్దా చూసి, ఎవరితని కంపానియన్స్? గ్రిజ్లీ బేర్స్‌ని గాని ఇతడు ఇన్వైట్ చెయ్యలేదు కదా, అనుకుంది. అంతకు ముందే ఆమె హోటల్ వారి వార్నింగులు చదువుకుంది. ఫోర్ సీజన్స్ బైటి రోడ్డు కొంత భాగం మూసివేసినట్టు, అటవీశాఖవారు ఒక ఎలుగుబంటి ఫామిలీ కోసం వెతుకుతున్నట్టు, బైట నడవొద్దని, బేర్ స్ప్రేలు దగ్గర పెట్టుకోమని, న్యూస్ రిలీజ్‌లు ఫాలో అవ్వమని సందేశం.

నిసి క్రమేపీ వేరే రకమైన సరళ జీవన విధానం అలవరచుకుంది. ఇప్పుడు, ఇన్ని ఏళ్ళ తదనంతరం, తన సౌందర్యం గురించి కొత్త స్ఫురణ ఆమెలో కలిగింది. పొడవుగా వదిలేసిన తెల్లని మెరుపుల జుట్టు, మృదువుగా మారిన ముఖరేఖలు. కళ్ళలో జాలి, వేదన, ఆలోచనల స్థానంలో, కొత్త తరహా చురుకు చూపులు, ప్రఫుల్లమైన నవ్వు. దుస్తులు నగల ఎన్నికలో కొత్త నాజూకులు. ఏది ఇందులో తన స్వాభావికం?

మేనత్తలు, నీల, నిసి,‍ ఇద్దరు ఒకేసారి లండన్ రావటం, అదీ తన ఇండియా ట్రిప్ ముందే జరగటం, వారి మేనకోడలికి చాలా సంతోషాన్నిచ్చింది. అదీ! వారంతా ఈ అతి చక్కని చోట ఆ రోజు కలవాలనుకోటం. జస్ట్ గ్రేట్! కొలనులో హంసలు విలాసంగా తేలుతున్నాయి, వారి కళ్ళముందు. రంగుల తుమ్మెదలు ఓడ్‍హౌస్ కథలలోలాగా ఎగురుతున్నయ్యి. గాలి తేలిక సుగంధాలు తెస్తున్నది.

అకస్మాత్తుగా ఒకాయన తన కిష్టమైన ఓ బూజీ వూజీ ట్యూన్ చెప్పి అది పియానో పై వాయిస్తే వెయ్యి డాలర్లు కేష్ ఇస్తానన్నాడట. ఆలక్స్ స్టూడెంట్లని వద్దనలేదు. అతను అసలు ఏమైనా అనే లోపలే, ఒక కుర్రాడు ఉత్సాహంతో వాయించాడు. అక్కడి నుండీ అక్కడి అతిథులందరికీ ఒక్కొక్కరికీ కిర్రెక్కి, వారి జాజ్, పాప్ మ్యూజిక్ కోర్కెలు అడగటం, వెంటనే కేష్ ప్రైజ్ ఆఫర్స్, ఆ ట్యూన్స్ వచ్చిన వాళ్ళు అవి వాయించటంలో, ఒక కొత్త ఉత్సాహం, ఒక కోలాహలం.

బైట తుఫాను హోరు. ఈదురు గాలులు, వానజల్లులు ఆ బార్న్ చుట్టూ గిరికీలు కొట్టతూనే ఉన్నాయి. సముద్రం పొంగులు తెలుస్తూనే ఉన్నాయి. పెరిగే అలలు విరిగే అలలు. ద స్టార్మ్ రేజ్డ్ ఆల్ ఎరౌండ్ దెమ్. కాని అతని చేతుల మధ్య ఆమె భద్రంగా ఉంది. శరీరంలోని బడబానలం చల్లబడింది. ఆమె పెదవుల మీద నవ్వులు పూచాయి. హి ఈజ్ సో రైట్. హిస్ ఎవిరీ టచ్ వాజ్ కంపాటిబుల్ టు హర్. ఎ గ్రేట్ లవర్. వెరీ టెండర్. అండ్ ఎ జెంటిల్మన్!

నిసికి గుర్తు ఉన్న ఒక విశేషం ఏమంటే, ఆంటీగారు గైనకాలజిస్ట్ అయివుండి, ఒక ప్రముఖ హాస్పిటల్ ప్రసిడెంట్‌గా ఉండి, ఆ సమావేశానికిగాని, అందునా బ్రస్ట్ కేన్సర్ మీద తన ప్రజెంటేషన్ వింటానికిగాని రాకపోవటం, అమ్మ ఆ సమయంలో ఆంటీగారింటికి వెళ్ళి, ఆవిడకిష్టమని కోడిగుడ్ల పులుసు, బంగాళాదుంపల వేపుడు చేసిపెట్టటం. అందువల్ల ఆంటీగారిని ఆఖరుసారి ఎప్పుడు చూడలేదో నిసికి గుర్తుంది.

నిసి ఒక్కసారిగా లేచి, విక్టర్‌కి ఎదురుగా పరుగెట్టింది. టెరేస్ మీదకు కాలు పెట్టబోతున్న వాడిని ఆ ఆఖరు మెట్టు మీదే నిలబెట్టి, గాఢంగా కౌగిలించుకుంది. వారి ఎత్తులు సమాన మయ్యాయి. ఆమె అతని ముఖం చేతుల్లోకి తీసుకుని, అతని స్ఫుటమైన, ముద్దుల కాహ్వానిస్తున్నట్టుగా ఉండే విలువంపుల పెదవుల మీద తన గులాబీ పెదవుల ముద్దు ఉంచి, అలాగే నిలిపి ఉంచింది. దీర్ఘంగా అతని శరీరపు పరిమళాన్ని ఆఘ్రాణించింది. విక్టర్ అప్రయత్నంగా, ఆమెను చుట్టివేశాడు.

“ఆర్మీలో పని చేశాక అంతో ఇంతో నట్ కాకుండా ఎలా ఉంటారు? పిటిఎస్‌డి – పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిౙార్డర్. రామాయణంలో రాముడికి అదే జరిగింది. లేకపోతే యుద్ధం ముందు భార్య నెత్తుకుపోయారని అంత ఏడ్చిన వాడు యుద్ధం గెలిచాక, ఆమెను నిప్పుల్లోకి ఎందుకు దూకమంటాడు? కాంబాట్ స్ట్రెస్. టెంపరరీ ఇన్సేనిటీ. ఐ హోప్, నీ విద్యార్థినికి సైకియాట్రిక్ హెల్ప్ ఉందని.”

అరూబా, ఆ కరీబియన్ ద్వీపం ఎంత అందమైంది. వారి హోటెల్ రూమ్ లోనుండి అనంతంగా కనిపిస్తున్న నియాన్ ఆకుపచ్చ, ప్రష్యన్ నీలం కలబోతల సముద్రం నిసికి మానసిక ప్రశాంతతనూ, విశాలతనూ, లోతునూ కలిగిస్తే, శ్యాంలో అవి ఉద్రిక్తతనూ, పొంగే పురుషత్వాన్ని సంతరించాయి. కామకేళిలో ఆమె శరీరపు స్పర్శలు, తనను హత్తుకునే తీరు, ఆమెను ముద్దాడినప్పుడు తిరుగు కౌగిలింతలు, అతనికి ఎంతో ఇష్టం. వారికి ఇతరుల గురించిన ఆలోచనలూ, వ్యగ్రతలూ నశించాయి.

పియానో వద్ద కూర్చోటం దగ్గర్నుంచి, ఆ పోశ్చర్‌లో, ఆ చేతులు కదలించటంలో ఎంత గ్రేస్ ఉంది. ఎంత పధ్దతి, ఎంత సైన్స్, ఎంత ఆర్ట్. ఆమెకు పాఠం గంట నిమిషంలాగా గడిచి పోయింది. మొదట్లోనే ఇన్ని నేర్చుకోవాల్సినవి ఉంటే, పోను పోనూ, ఇంకా ఎంత కాంప్లెక్సిటీ పెరుగుతుందో. నా మెదడుకూ నా చేతులకూ కావాల్సినంత పని…

మూసి ఉన్న ఆ తలుపుల కేసి చూస్తూ, నిసి ఒకలాటి విచిత్రమైన ఆలోచనలకు లోనయ్యింది. చచ్చి స్వర్గంలో వేశ్యా వాటికలోకి వచ్చి పడ్డట్టున్నా. లేకుంటే పాకీజా కోఠీ లోనైనా ఉండి ఉంటా. లేకపోతే నేనేంటి, ఈ బిల్డింగ్‌లో ఈ పడిగాపులేంటీ, అనుకుంది, తన పాఠం పుస్తకం తిరగేస్తూ.

ఆమె ఒక గులాబీ రంగు జరీ పని చేసిన చీర కట్టి, అదే రంగు జాకెట్టు వేసుకుంది. చేతికి ముత్యాలు, రవ్వల గాజులు. ఒక చేతికి వరుస వరసల ముత్యాల బ్రేస్ లెట్. ఆమె ముఖం కోలగా, ఎంతో ముద్దుగా ఉంది. ఇంత వంక పెట్టలేని కనుముక్కు తీరు.

“క్రైం బ్రాంచ్ ఛీఫ్ మనకు బాగా తెలిసినవాడే కదా. విషయం చెప్పి, 48 -72 గంటల వ్యవధి అడుగు. ఆటాప్సీ ఈ హాస్పిటల్లోనే చెయ్యనీ. ఇచ్చిన గడువు లోపల నేను హంతకుడెవరో చెప్పలేకపోతే, ఆ తర్వాత కథ వాళ్ళిష్టమైనట్లు నడిపించవచ్చు.”

అతనికి తెలుసు. ఆమె భౌతికంగా ఈ ఇంట్లో ఉంటుంది. ఇన్ని దేశాల కథలు చదివిన ఆమె మానసికంగా ఎక్కడ ఉంటుందో, కట్టడులు సంకెళ్ళు వేసుకునే ఆ ఇంటిలోని వారికి తెలియదు. ఆమె ఎందుకు ఏడుస్తున్నదీ వారికి తెలియదు.

నిసికి ఒక్క సారి చిరపరిచితుడయిన శత్రువు ముఖంలో ముఖం పెట్టినట్లయ్యింది. షెర్లాక్ హోమ్స్‌కి గాని హంతకుడు అనుకోని ప్రదేశంలో, ఆకస్మికంగా వచ్చి ఎదురు నిలిస్తే…

అతన్ని చూస్తే నిసి గుండె లయ తప్పింది. అతను అతి సుందరుడు. పసుపు రంగా అంటే కాదు. తెలుపా అంటే అది కాదు. గులాబీ వర్ణమా మరి. అతి నాజూకుగా సున్నితంగా ఉన్న ముఖ రేఖలు. కొద్దిగా పొడవాటి మెత్తని జుట్టు. గంభీరమైన సోగ కన్నులు.ఓ! మై గాడ్! హాడ్జ్కిన్స్ ఉన్న ఇతనికేమో కాని నాకు చెమటలు పడుతున్నాయ్. ఎంత మన్మధుడు! మన్మథుడికి జబ్బులు రావచ్చునా దేవా! అనుకుంది నిసి.

ఎంత సేపూ ఏదో పుస్తకాలమీద ఎక్కువ ధ్యాస. చిన్నప్పుటినుంచీ ఏర్పడిపోయిన అలవాటు. మళ్ళీ మేఘసందేశం తియ్యబోతుంటే , గబుక్కున ఆమెకు మధ్యాహ్నం మూడు గంటలకు టెన్నిస్ లెసన్ ఉన్న సంగతి గుర్తొచ్చింది.

నేను ఎన్ని సంవత్సరాలు కస్టపడి ఈ కంపెనీకి పని చేశాను. ఈ స్థాయికి చేరుకున్నాను. మా వంటి వాళ్ళ వల్లే గదా కంపెనీ ఇంత మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఊరికి కూడా పేరు వచ్చింది. ఇప్పుడు ఈ కంపెనీ తో కొంచెం కూడా సంబంధం లేని ఎవరో ఒకతను — వెధవ , వేరే ఊరి నుండి వచ్చి, ఈ ఊరిలో ఇన్నాళ్ళుగా పని చేసి పేరు తెచ్చుకున్న నన్ను ఉద్యోగం నుండి తీసి వేశాడు. ఎంత ధైర్యం!

నేను “రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదా? అమెరికా వచ్చినా ఐరిష్ స్ట్యూ తింటానికి లేదా? ఇండియాలో పుట్టినందుకు, అక్కడి నుండి వచ్చినందుకు బూడిద పూసుకొని గాలి భోంచెయ్యాలని అనుకుంటున్నారో? అమెరికా నుండి అమర లోకం వెళ్ళినా ఈ మతం నుండి నాకు విముక్తి లేదో. ముక్తి రాదో” అని మరొక్క సారి మండిపడ్డాను.