Mama Bear

పూల లేఖ ఇది, సుతిమెత్తనిదీ
సూత్రము లేదు, ముడులే లేవు;
చదువకుము ప్రియా, బదులివ్వలేవు.

నిదురించు నీ కోర్కె అగ్గి రగిలించు నీ పూలు
మోజులే మోసులౌ;
మొదలంట నీవు కదిలి పోయేవు,

బదులునిచ్చేవో మధురమౌ బాధౌదు
మనసునిచ్చేవో, మధువౌదు నేను
నిలువనీయవు నిన్నీ పూలు, నిలువుదోపిడి చేయు;

నా పూలలేఖను విప్పకోయీ ప్రియా!
నా పూల లేఖను విప్పబోకోయీ!

మెసేజ్ పంపిస్తూ ఉంది నిసి విక్టర్‌కు.

ఇలాటి ఉత్తరం ఆమె ఆలక్స్‌కి పంపదు. అతడు సంగీతకారుడైనా, కవి కాడు. హి హేజ్ ఎ డిఫరెంట్ ఇయర్! విక్టర్ షోపేన్‌లా పొయట్ ఆఫ్ పియానో. అతడికి కవనము తెలుస్తుంది. అతని పియానో నుండి మరొక కాంపొజిషన్ ఉదయిస్తుంది.

ఆమె అప్పుడున్న జాక్సన్ హోల్, వయోమింగ్ లోని ఫోర్ సీజన్స్ రిసార్ట్ వసారాలో వరసాగా ఫైర్‌పిట్‌లెన్నో వెలుగుతున్నాయి. ఒక్కోదాని చుట్టూ అమర్చిన అడిరాన్‌డాక్ కుర్చీలలో ఫామిలీ మెంబర్లు, ఫ్రెండ్స్ కూర్చుని ఆ సాయంత్రాన్ని అనుభవిస్తున్నారు. పక్కనే బారులు తీరి ఉన్న ఆస్పెన్ చెట్లు మిసమిసలాడుతున్నయ్యి. దగ్గరి కొండలు, ఇంకా నడుస్తున్న ఏరియల్ ట్రామ్‌లు, పక్కనే బైసికిల్ ట్రాక్‌లో రేసింగ్ చేస్తూ మెరిసే హెల్మెట్లు, అప్పడప్పుడూ చమక్కుమంటున్నాయి.

విక్టర్ నుండి నిసికి రిప్లై.

దట్ సాంగ్ ఈజ్ హాట్! యు మస్ట్ బి సిటింగ్ నెక్ట్ టు యె ఫైర్ పిట్! వాట్ ఆర్ యు డ్రింకింగ్! ఐ వాంట్ ద సేమ్! సే హాయ్ టు డోనాల్డ్ ఫ్రమ్ మి! టుమారో నైట్! మే బి నాట్! నో, స్టే అవే. హి ఈజ్ టూ హేండ్సమ్! కీప్ లవింగ్ మీ నిసీ! లవ్ యూ!

నవ్వుకుంది నిసి. జాక్సన్ హోల్, వయోమింగ్- గ్రాండ్ టీటన్ మ్యూజికల్ ఫెస్టివల్ డైరక్టర్, కండక్టర్ అయిన డోనల్డ్ రనికల్స్ నిలువెత్తు ఫొటోలు ఆమె వాక్ హాల్ ఆవరణలో చూసింది. చాలా ఆకర్షణీయమైన విగ్రహం. అతను కండక్ట్ చేస్తుంటే గుస్టాఫ్ మాలర్-థర్డ్ సింఫొనీ వింటానికి ఈసారి ఆమె పనిగట్టుకుని అక్కడకు వచ్చింది. కొన్నేళ్ళుగా నిసి షామల్‌కి అడవులలో, కొండల మధ్యలో, ప్రత్యేకంగా నిర్మించబడిన కాన్సర్ట్ హాల్స్‌లో వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ వినటం హాబీగా మారింది.


మర్రోజు కాన్సర్ట్‌కు ఒక గంట ముందే, బైట ఓపెన్ టెరేస్ మీద, మొదటి వయొలినిస్ట్ వచ్చి, టిక్కెట్లు కొనుక్కుని వచ్చి ఉన్నవారిని ఆహ్వానించి, ఆ సాయంత్రం ప్రోగ్రామ్ గురించి క్లుప్తంగా చెప్పి, ఆ తర్వాత వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. మాలర్ ఈ సింఫొనీని ఎక్కడ కూర్చాడు? ఫస్ట్ మూవ్‌మెంట్ ప్రత్యేకత ఏమిటి? కోరస్ గురించి కొంత చెప్పరూ? ఎవరి పాటలు, కంపోజర్ ఇందులోకి తీసుకున్నాడు? ఇలా ఆహ్వానితులు ప్రశ్నిస్తూ, పరిసరాల గట్టుల మీద కూర్చుని, మెట్ల మీద నిలబడి పానీయాలు సేవిస్తూ, ఆ డిస్కషన్ విన్నారు. ఆ సీనిక్ స్పాట్‌లో, ప్రియులతో, పిల్లాపాపలతో వచ్చి, సంగీత శ్రవణానికి ఎదురుచూస్తూ హాల్ లోకి వెళ్ళకముందే, వారెంతో ఉర్రూతలూగుతుంటారు.

తర్వాత తలుపులు తియ్యటం, ఒకరి తర్వాత ఒకరు శ్రోతలు తమ సీట్లలోకి వెళ్ళి కూర్చోటం, ఒకరినొకరు పరికించుకోటం, జరుగుతుంది. అప్పుడప్పుడే సంగీత సభలకు హాజరయ్యేవారు, అలానే పిట్ లోకి ఆర్కెస్ట్రా ప్రవేశం చూడటం, వారు ఒకరొకరూ వాయిద్యాలు సరిచూసుకోటం, శృతి చేసుకోటం, అన్నీ గమనిస్తుంటారు. అతని చేతిలోని వాయిద్యం ఏమిటి, ఆమె పట్టుకున్నది క్లారినెట్ లేక ఫ్లూట్? వయొలిన్‌కి, వయోలాకి ఏమిటి తేడా? ఏది చెల్లో, ఏది డబుల్ బేస్! ట్రంపెట్స్ ఏవి? హార్న్ ఏది? ట్రాంబోన్ ఏది? పియానో లేదేంటీ? ఇది ఫుల్ ఆర్కెస్ట్రా యేనా? – లాటి ప్రశ్నలకు వారిని తీసుకువచ్చిన మిత్రులు ఉత్సాహంతో సమాధానాలిస్తుంటారు. కొన్ని సీట్లలో కండక్టర్ గురించిన, అతని మోరల్ బిహేవియర్ గురించిన కొంత ప్రశంస, అసూయ కలగలిపిన గుసగుసలు వినిపించి, చిన్న నవ్వుల్లో ముగిసిపోతుంటయ్. ఆర్ట్ ఈజ్ ఆర్టిఫైస్. ఆ కృత్రిమలోక ప్రవేశం లోనే ఆస్వాదకుల జీవిత స్థాయి పెరుగుతూ పెద్ద విస్తీర్ణతను పొందేది.

నిసికి ఎవరూ తెలిసినవారు లేరు. ఆమె ఒక్కతే వచ్చింది. అందరు శ్రోతల లోనూ – ఒక ముగ్గురిని గమనించింది నిసి. అందులో ఇద్దరు స్త్రీలు. ఒక పొడవాటి అమెరికన్. ఆమె పక్కనే కురుచని చైనీస్ వనిత. వారు సమవయస్కులు.

పొడవాటి అమెరికన్ స్త్రీని, నిసి తను ఫోర్ సీజన్స్ లాబీలోకి రాగానే చూసింది. రీగల్ బేరింగ్! గుర్తించకపోటమెలా? చెకిన్ చెయ్యగానే, మేనేజర్ నిసిని లౌంజ్ లోని పలహార పానీయాలు ఎంజాయ్ చెయ్యమని చెప్పి, తర్వాత తీరుబడిగా ఆమెను, తన స్వీట్‌కి తీసుకువెడతానన్నాడు. ఆమె వెంటనే తనలాటి వేరే అతిథుల కేసి నడిచి, వారితో పరిచయాలు చేసుకుంటూ కాసేపు అక్కడే ఉండిపోయింది. అప్పుడు ఈ ఎత్తరి ఐన స్త్రీ, మరొక గుంపులో ఇతరులతో మాట్లాడుతుంటం చూసింది. తర్వాత మళ్ళీ ఒక వరండాలో కొందరితో నడుస్తూ. ఇప్పుడిక్కడ. ఈ స్త్రీల పక్కన కూర్చుని ఉన్న మగవ్యక్తి నిసికి కనపడలేదు.

సంగీత సభ ఎంతో వైభవంగా జరిగింది. బైటకు వచ్చాక కొందరు ఆఖరి సెగ్మెంట్‌లో గుస్టాఫ్ మాలర్ ‘గాడ్’ ‘లవ్’ గురించి ఏమంటున్నాడు, రెండూ ఒకటే అంటున్నాడా లేక వేరా? అని ఉద్విగ్నంగా చర్చించుకుంటున్నారు. వింటూ చిరునవ్వులతో మిగిలినవారు ఎవరి దోవన వారు మెట్లు దిగి పలు దిక్కుల్లో వెళ్ళిపోయారు.


నిసి, వాక్ హాల్‌కి అతి దగ్గరలోనే ఉన్న తన రిసార్ట్‌కి నడిచి పోయి, ఒక ఫైర్ పిట్ పక్కన కూర్చొని షాంపేన్ తాగుతూ చిన్న పలహారం చేస్తున్నది. ఒక అమెరికన్ యువకుడు, వచ్చి-

“హాయ్! కెన్ ఐ ఈట్ హియర్?” అన్నాడు.

“షూర్! అఫ్‌కోర్స్!”

“వై నాట్! అఫ్‌కోర్స్! ఐ ఆమ్ ఎ గ్రేట్ గై! మా వాళ్ళొస్తారు కూడా. వాళ్ళు నా అంత మంచివాళ్ళు కాదు. ఐ ఆమ్ వార్నింగ్ యూ. ఇక్కడకొచ్చి కూర్చోమననా వాళ్ళని?”

అతడి ధోరణి నిసికి ఎంతో కులాసాగా ఉంది. కుర్రాడు చూస్తానికి ఎంతో జోరుదారుగా ఉన్నాడు. చూద్దాం స్నేహితులనీ అనుకుని ‘రమ్మని చెప్పండి’ అంది. ‘నేను పోయి వాళ్ళతో చెప్పేసి వస్తా’ అని వెళ్ళి, మళ్ళీ అంత వేగంగా వచ్చి కుర్చీలో కూలబడ్డాడు.

అతడి చకచక నడకలు, ఆ పరుగులు, అతడి స్టయిలిష్ షూస్, కాళ్ళు సైడ్ టేబిల్ మీదకు జారెయ్యటాలు, ప్రతి రెండు నిమిషాలకీ పాశ్చర్ మార్చటం – ఆ నర్వస్ ఎనర్జీ, అతడి అందమైన యౌవనం ఆమెకు నవ్వు తెప్పించింది. ఆమె గ్లాసెస్ తీసేసి అతనికేసి చూసి నవ్వింది.

“హౌ సూన్ డు యూ థింక్ యు విల్ బి కంఫర్టబుల్?”

“ఇంకొంచెం వాడ్కా తాగాక, అంతే! ఓ వెయిట్ అంటిల్ యూ సీ దెమ్! మై పార్టీ!” అన్నాడు ఎరిక్! అంతకుముందే అతని పరిచయం, పనీ, ఉండే ఊరూ గట్రా ఆమెకు గలగలా చెప్పటం ఐపోయింది. అమెరికన్ కుర్రాళ్ళు కొందరు అంత కలివిడిగా మాట్లాడతారు. ఆమె కూడా ఓ రెండు ముక్కల్లో తన గురించి అతనికి చెప్పింది.

నిసి అతని ఆదుర్దా చూసి, ఎవరితని కంపానియన్స్? గ్రిజ్లీ బేర్స్‌ని గాని ఇతడు ఇన్వైట్ చెయ్యలేదు కదా, అనుకుంది. అంతకుముందే ఆమె హోటల్ వారి వార్నింగులు చదువుకుంది. ఫోర్ సీజన్స్ బైటి రోడ్డు కొంత భాగం మూసివేసినట్టు, అటవీశాఖవారు ఒక ఎలుగుబంటి ఫామిలీ కోసం వెతుకుతున్నట్టు, బైట నడవొద్దని, బేర్ స్ప్రేలు దగ్గర పెట్టుకోమని, ఒకవేళ కాని బేర్ కనిపిస్తే, పరిగెత్తవద్దు, అలా అని సమీపించి పెట్ చెయ్యనూ వద్దు. న్యూస్ రిలీజ్‌లు ఫాలో అవ్వమని సందేశం.

ఇంతకీ వారు కూర్చున్న దగ్గరికి వచ్చిందెవరా అంటే అంతకుముందు చూసిన ఆ అమెరికన్ స్త్రీ, ఆ చైనీస్ వనిత. ఇద్దరూ, ఎరిక్ నిసికి దగ్గర్లో అటుపక్క కూర్చుని ఉంటం చూసి కొంత వింతపడ్డారు. ఖాళీ సీట్లేమో అతనికి కొంచెం దూరంగా ఉన్నాయి.

నిసి లేచే ప్రయత్నం చేస్తూ, “మీ ఫామిలీ అంతా ఒక దగ్గర కూర్చో…”

మధ్యలోనే ఆమె మాట తుంచేస్తూ, “నథింగ్ డూయింగ్, యూ వర్ హియర్ ఫస్ట్, వాళ్ళవతల కూర్చుంటారులే. వాళ్ళిద్దరూ ఎప్పుడూ పక్కపక్కనే కూర్చుంటారు. దే ఆర్ హోమోస్!” అన్నాడు ఎరిక్.

వాళ్ళిద్దరూ ఒక్కసారే అతని మీద మండిపడ్డారు. ఎడాపెడా మాటల రాళ్ళ వర్షం కురిసింది.

“యూ స్టింక్! నన్ననేది చాలక, యూ ఛౌని కూడా ఎందుకవమానిస్తావ్!”

“నిజంగా ఎరిక్! నీ ఆకతాయితనం సిబిల్ కాబట్టి, సహిస్తుంది. నేనైతేనా, ఎప్పుడో నీ డిప్ప లేపి ఉందును.”

“ఒకే మంచంలో పడుకుని, ఒకే కంచంలో తింటారు. ఒకటే హోటల్ రూమ్! రియల్ లెస్బియన్స్! కలిసి జంటగా ప్రపంచ యాత్రలు చేస్తున్నారు.” అనేది వాళ్ళనైనా అతడు నిసి వంక చూసే, వారి గురించి ఎన్నో ఇన్సల్టింగ్ మాటలు వదులుతున్నాడు. చేతిలో వాడ్కా గ్లాస్! ఒక కాలు సోఫా ఆర్మ్ మీదుగా ఊగుతూంది.

నిసి లేచే ప్రయత్నం చెయ్యబోతే ఎరిక్ “కమాన్! యూ ఆర్ ఎ డాక్టర్! మిమ్మల్నేం బాదర్ చేస్తయ్ ఈ విషయాలు. ప్లీజ్ డోంట్ లీవ్!” అన్నాడు.

ఇంతలోకి, వెయిటర్ వాళ్ళ ఆర్డర్ తీసుకోటానికి వచ్చాడు. మెనూ గురించి కొంత వారిలో వారి వాదులాటల తర్వాత అందరి ఆర్డర్ తీసుకున్నాడు. అమెరికన్ లేడీ సందేహించకుండా, ఆ కుర్రాడి బిల్ తనదాంతో కలపటానికి వీల్లేదని వెయిటర్‌తో చెప్పింది. ఎరిక్ లోగొంతులో నిసికి మాత్రమే వినిపించేట్టు “పిసినిగొట్టు బిచ్, డోంట్ లీవ్ మీ. ఈ ఆడతోడేళ్ళు నా మాంసం పీకటానికి రెడీగా ఉన్నారు. నన్ను తినేస్తారు” అన్నాడు.

నిసి తనకు ఇంకో షాంపేన్ పట్టుకురమ్మని చెప్పింది వెయిటర్‌తో!

వెయిటర్ వెళ్ళగానే, “ఎరిక్ మీకు ముందే తెలుసా! ఆర్ యూ టుగెదర్?” అని అడిగింది అమెరికన్ వనిత నిసిని.

“నెవర్ మెట్ బిఫోర్! ఇక్కడే ఇప్పుడే చూస్తం.”

“ఎక్కడి నుండి మీరు?”

ఆ అమెరికన్ లేడీ (సిబిల్) తను ఇండియా నుండి-అన్న జవాబు వినాలనుకుంటున్నట్టు నిసికి అనిపించింది. అందుకని, పంతానికి, “ఐ యామ్ ఫ్రమ్ నేపుల్స్, ఫ్లారిడా” అంది నిసి. మామూలుగా ఐతే, నేను దక్షిణ భారతదేశం నుండి వచ్చాను. తెలుగు అనే భాష మాట్లాడతాం. నేనిప్పుడు యుఎస్ సిటిజెన్‌ని అని చెప్పి ఉండేది.

“నేనూ ఫ్లారిడా నుంచే. వెస్ట్ పామ్ బీచ్‌లో ఉంటాను. ఫైనాన్షియల్ టైమ్స్ వాళ్ళు, మా మ్యూచ్యుయల్ ఫండ్ మేనేజర్లకు నేషన్ వైడ్ సమ్మిట్ ఎరేంజ్ చేస్తే వచ్చాం.” అని మళ్ళీ “ఫ్లారిడా ముందెక్కడా నివాసం?” అని నిసిని అడిగింది.

మళ్ళీ నిసి – ‘ఇండియా నుండి’ అన్న సమాధానం కోసం ఎదురు చూస్తున్నదని – “ఓ! అంతకు ముందు న్యూయార్క్. ఐ లైక్ ఫైనాన్షియల్ టైమ్స్! ద పింక్ న్యూస్ పేపర్! సంవత్సరాలుగా సబ్‌స్క్రైబ్ చేస్తున్నాను!” అంది.

“మానెయ్యండి వెంటనే. న్యూస్‌పేపర్స్ అన్నీ జంక్ ఐపోయాయి. ముఖ్యంగా న్యూయార్క్ టైమ్స్. ఛక్ దెమ్!” అన్నాడు ఎరిక్.

“నైస్! ఈయన ఎంప్లాయర్ ఈ నెలెవరో? తన వయసు అమ్మాయిని ఒకదాన్ని పెళ్ళాడి ఈ స్కంక్ కుదురుగా ఉద్యోగం చేసుకుంటాడేమో అని కొన్నాళ్ళుగా ఆశపడుతున్నాం. మీ ఇండియా దేశపు కుర్రాళ్ళెవరైనా ఆడవారిని, అందునా తల్లిని అసభ్యంగా మాట్లాడతారా!

యూ ఛౌ- “ఇండియన్స్ ఎంతో ట్రడిషనల్ అప్ బ్రింగింగ్. చైనీస్ లాగానే. వాళ్ళు ఇలాటి కూతలు వినే సందర్భం, పరిస్థితి అసలు రానే రావు.”

నిసి వెంటనే ‘అమ్మ’ టైటిల్ పుచ్చేసుకుని, స్త్రీల మర్యాద విషయంలో భారతీయ యువకుల ప్రవర్తన లోని ఔన్నత్యం గురించి ఏకీభావం వ్యక్తపరిచి, ఎరిక్‌కి వెంటనే ‘ఏమిటీ మాటలు? సరిగ్గా మాట్లాడు?’ అని హితబోధ చేస్తుందని, వారు ఎదురు చూస్తున్నారు.

నిసి మౌనమే సమాధానంగా ఉంది.

“నేనూ, యూ ఛౌ ఈ మధ్యే ముంబయ్ వెళ్ళొచ్చాం. గాడ్! అన్‌బిలీవబుల్ డర్టీనెస్! మళ్ళీ చస్తే వెళ్ళను. ఆర్ యూ ఫ్రమ్ ముంబయ్?” అంది సిబిల్.

“ముంబయ్! ఫుల్ ఆఫ్ థగ్స్. ఐ విష్ సమ్ వన్ పుష్డ్ యూ టూ హేగ్స్ అండర్ ఎ ట్రెయిన్ దేర్!” అన్నాడు ఎరిక్.

అతను అన్న తీరుకు నిసి గట్టిగా నవ్వేసింది. ఈ మాటలు అంటున్నంతసేపూ అతని ముఖంలో సరళత తరగలేదు. అందం వన్నె వాడలేదు. కానీ ఆ స్త్రీలిద్దరికీ కోపం పెట్రేగిపోతున్నది. వారి ముఖాలు వంకర్లు తిరిగిపోతున్నయ్!

“యూ ఆర్ లాఫింగ్! అన్‌బిలీవబుల్! షి ఈజ్ లాఫింగ్!” అన్నారిద్దరూ, ఒకరివైపొకరు చూస్తూ.

“మై సన్ టాక్స్ జస్ట్ లైక్ ఎరిక్! హి ఈజ్ ఎ సైకయాట్రిస్ట్. కానీ నా గ్రాండ్ ఛైల్డ్ ఎంతో మర్యాదగా, ఆప్యాయతతో మాట్లాడుతుంది. షి టేక్స్ ఆఫ్టర్ హర్ మదర్” అందప్పుడు నిసి.

“యూ హేవ్ ఎ గ్రాండ్ ఛైల్డ్! యూ మస్ట్ బి ఎనదర్ టీన్ ఏజ్ మదర్. లైక్ మోస్ట్ ఇండియన్స్!”

“మోర్ ఆర్ లెస్. ఐ యామ్ కాంపెన్సేటింగ్ నౌ.”

రేటిల్ స్నేక్‌లా మోగుతూ, విషం మాటలు మరి కొన్ని కక్కాక, సిబిల్ ఎరిక్‌తో “పొద్దున్నే ఫ్లైట్‌లో నాకు ఫస్ట్ క్లాస్‌లో రిజర్వేషన్ ఉంది. నువ్వెప్పుడు వెనక్కి వెళ్ళేది?”

“వెనెవర్!” ఎరిక్.

“ఇంటికి రామాకు.”

“నాకేం పని! నాకు ట్రస్ట్ ఫండ్ లోంచి రావాల్సిన డబ్బు రెండు నెలలుగా నువ్వు పంపటం లేదు. జాక్సన్ హోల్‌కి వస్తున్నా ఈ తేదీల్లో. ఇక్కడికి వచ్చి తీసుకో, అన్నావు. వచ్చాను. చెక్ ఇచ్చేస్తే, నా దోవన నేను పోతాను. నీ పర్యటనలు నువ్వు చేసుకో.” అతనికి అమ్మా! అని కూడా ససేమిరా అనాలని లేదు. (ఆమె స్టెప్ మదర్? లేక సొంత తల్లి?)

“ఇదే హోటల్‌లో ఉన్నావా?”

“నా ఫ్రెండ్స్‌తో ‘అమన్గానీ’లో చెకిన్ చేశా. నీకెందుకా విషయం?”

“కాన్ఫరెన్స్ గురించి ఇక్కడ నాకో స్వీట్ ఇచ్చారు. నువ్వు మాతో ఉండొచ్చు గదా? ఫ్రీ బోర్డింగ్. ఎంతమంది వాల్‌స్ట్రీట్ బేంకర్లని, ఫైనాన్స్ మేనేజర్లని, ఎంతమందిని కలిసే అవకాశం. నీకది పనికిరాదు. రోజుకి రెండో మూడో వేల డాలర్లు కట్టి మరో రిసార్ట్! ఫోర్ సీజన్స్ చాలదా, నువ్వు చేసే ఆ రీసర్చ్ డేటా కలెక్షన్ డబ్బా స్టార్ట్ అప్ ఉద్యోగానికి? నిజం ఉద్యోగం ఎప్పుడు చేస్తావూ? ఎందుకు అంత ట్యూషన్ కట్టి నిన్ను యేల్‌కు పంపిందీ!”

“లుక్ హు ఈజ్ టాకింగ్! నువ్వూ, యూ ఛౌ, రాజస్థాన్ ఎడారుల్లో ఒంటెలెక్కి తిరిగిన ఆ ఫేస్‌బుక్ ఫొటోల సంగతేంటి? ఇక్కడి ఎడార్లు చాలవా? ఇక్కడి కార్లు సరిపోటల్లేదా మీకు? ఎక్కడో ఒంటెలెందుకు? ఛీఫ్ జస్టిస్ స్కలియా, ఛీఫ్ జస్టిస్ రూత్ దగ్గర నుండీ, చీప్ చీప్ హస్సీలు మీరందరికీ ఇండియా పోయి సఫారీలు. ఒంటెలమీద, ఏనుగుల మీద సవారీ! మీరిద్దరూ ఆ నార్త్ ఇండియా లేక్ పాలస్‌లలోలో, రంగురంగుల బ్రైడల్ డ్రెస్సుల్లో, ఫేస్‌బుక్ ఫొటోల్లో కోలాటాలాడేప్పుడు, మీలో గ్రూమ్ ఎవరూ, బ్రైడ్ ఎవరూ! ఇండియన్ ఫాన్సీ వేన్సీ ఫేక్ వెడ్డింగ్ సెరిమొనీలు ఊరికే షో చూసి వచ్చారా? లేకపోతే మీ పెళ్ళి నిజంగా అక్కడ చేసుకున్నారా? వెన్ ఆర్ యూ గోయింగ్ టు కమ్ ఔట్ ఆఫ్ క్లాజెట్? యూ బిచెస్! ఐ యామ్ సిక్ అండ్ టయర్డ్ ఆఫ్ ఎవర్ గ్రోయింగ్ ఎల్‌జిబిటి ఆల్ఫబెట్. సిక్ ఆఫ్ ఏండర్సన్. అండ్ సిక్ ఆఫ్ డాన్ లెమన్ సిన్ సిటీ ప్రీచింగ్స్! కెన్ యూ డిసపియర్ ఆఫ్ ఆఫ్ ది ప్లానెట్? యూ లేడీస్!”

వెయిటర్ వారి లైట్ లేట్ మీల్ తీసుకొచ్చేసరికి వారెవరూ కలిసి కూర్చుని కుడిచే స్థితిలో లేరు. నిసి, తన షాంపేన్ గ్లాస్ మటుకు రక్షించుకుంది. కొంచెం దూరంలో ఫైర్ పిట్ పక్కన సీట్లు కాళీ అవటం, గమనించిన ఆ ఇద్దరు స్త్రీలూ వారి భోజనం అక్కడ సర్వ్ చెయ్యమని వెయిటర్‌కి చెపుతూ, దూకుడుగా లేచిపోయారు.

“గుడ్ రిడెన్స్! బిచ్ ఈజ్ హాగింగ్ మై మనీ, ఇన్ ద గైజ్ ఆఫ్ మదర్ అండ్ ట్రస్టీ! ఇలాటి తల్లి ఉంటే ఇంకా శత్రువెందుకు!” అన్నాడు ఎరిక్.

“వెల్! దట్స్ లాట్ ఆఫ్ లిక్కర్ టాకింగ్!” అని తన పాకెట్ బుక్ లోంచి ఒక కీ-కార్డ్ తీసి అతనికి ఇచ్చి, నిసి-

“నీ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి, నీ మదర్‌తో ఫోర్ సీజన్స్‌లో ఉండిపోతున్నానని చెప్పు. ఈ పొగమంచులో, కొండల్లో ఐ డోంట్ వాంట్ యూ టు డ్రైవ్ నౌ! యూ వోంట్ మేక్ ఇట్! రూమ్‌కి పంపిస్తా నీ భోజనం. రెస్ట్ అప్! నో వన్ విల్ డిస్టర్బ్ యూ. మై రూమ్స్ ఆర్ వెరీ ప్రైవెట్. నాకు లివింగ్ రూమ్‌లో బెడ్ ప్రిపేర్ చెయ్యమని హౌస్ కీపింగ్‌కి చెపుతాను. నీ ఫుడ్ బిల్ నే పే చేస్తాలే. నో బిగ్ డీల్! గో, వైల్ యూ కెన్ స్టిల్ వాక్!”

ఎరిక్ వెళ్ళిపోయాడు. నిసి పక్కన పెట్టేసిన పుస్తకం తీసింది చదువుదామని.

సెల్‌లో టెక్స్ట్: హౌ ఈజ్ మాలర్స్ థర్డ్ సింఫొనీ? – ఆలక్స్.

చాలా బాగుంది ఆలక్స్! డూ యూ నో! థామస్ మేన్ తన “డెత్ ఆఫ్ వెనిస్” నవెల్లా లో గుస్టాఫ్ మాలర్ ని ప్రొటాగనిస్ట్ ప్లేస్ లో వర్ణించాడని? – నిసి.

నిసీ! ఇంత రాత్రిలో ఇంత మెలుకువగా ఎట్లా ఉంటావు? ఆహ్! దట్ బుక్! నువ్వు నేపుల్స్ వెనీషియన్ విలేజ్‌లో నన్ను డిన్నర్‌కి పిలిచినపుడు, నీకిచ్చాను. అసలు ఇటలీలో నేపుల్స్, వెనిస్ నువ్వింకా వెళ్ళలేదుగా. పూర్ సోల్! ఇప్పుడు జాక్సన్ హోల్‌లో థామస్ మన్‌ని చదువుతున్నావా? ఎందుకూ?

హియర్! ఆలక్స్! రీడ్ ఇట్!

నిసి పుస్తకం లోని పేరా ఫొటో తీసి, ఆలెక్స్ టెక్స్ట్‌కి ఎటాచ్ చేసింది.

Gustav Aschenbach was a man of slightly less than middle height, dark haired and clean shaven. His head seemed a little too big for a body that was almost dainty. His hair, combed back, receding at the top, still very full at the temples, though quite gray, framed a high, furrowed, and almost embossed-looking brow. The gold frame of his rimless glasses cut into the bridge of his full, nobly curved nose. His mouth was large, sometimes relaxed and full, sometimes thin and tense; his cheeks were lean and hollow and his well-proportioned chin was marked by a slight cleft. Important destinies seemed to have played themselves out on this long suffering face, which he often held tilted somewhat to one side. And yet it was art alone, not a difficult and troubled life that had taken over the task of chiseling these features.

నిసి ఫోన్ మోగిందీసారి. ఆలెక్స్ కాల్ తీసుకుందామె.

“యా! అది మాలర్ రూపమే! చక్కగా సరిపోయింది. గుస్టాఫ్ అని కూడా పేరులోకి అందుకే తీసుకున్నాడు, థామస్ మన్.”

“ఆలక్స్! నువ్వు కూడా మాలర్ లాగేనా? నీ ఆర్ట్ ప్రాక్టీస్ నీ ముఖాన్ని కూడా మలుస్తూందా? ఐ డౌట్ ఇట్!”

“యూ ఆర్ కరెక్ట్! నాది నా ఓన్ జ్యూయిష్ ఫేస్. లాంగ్ ష్లాంగ్! ఆర్ట్ నన్ను మార్చదు. నేనే ఆర్ట్‌ని మార్చేది. నేర్పేదీ.”

“యూ ఆర్ సో మాడెస్ట్! ఆలక్స్! నేను డాక్టర్ని. డాక్టర్లకి నైట్ కాల్స్ ఉంటాయి. పాత అలవాటు. నువ్వెందుకు నిద్రపోవూ? నింగి నిదురపోయే, నేల నిదురపోయే, గాలి నిదురపోయే, లోకాలు నిదురపోయే – ఐనా ఆలక్స్ నువ్వు నిద్రపోవు. సైలెంట్‌గా రాత్రిలో చదువుతుంటావు. ఈ నోర్టన్ క్రిటికల్ ఎడిషన్లో ‘డెత్ ఇన్ వెనిస్’ నవెల్లా మీద క్రిటిక్స్ ఎస్సేలు ఎంత బాగున్నయ్యో! నీకు తెలియకపోతే కదా!”

“యూ స్నీకీ ఉమన్! యూ ఆర్ లీడింగ్ అప్ టు థామస్ మన్, హిజ్ హోమో సెక్సువాలిటీ, హిజ్ డిజైర్ ఫర్ యంగ్ గుడ్ లుకింగ్ మెన్! యూ స్నీకీ నిసీ! ఐ యామ్ ఎ యూనివర్సిటీ ప్రొఫెసర్! ఐ ఆమ్ నాట్ గివింగ్ ఎనీ ఇంటర్‌వ్యూస్ ఆన్ దిస్ సబ్జెక్ట్ టు యూ! నువ్వు నాకు పూర్తిగా తెలుసు…

సంభాషణ మారుద్దాం. ఆర్ యూ గోయింగ్ టు సీ టీటాన్ నేషనల్ పార్క్ టుమారో? డోంట్ లెట్ బైసన్ ట్రాంపుల్ యూ. డోంట్ లెట్ బేర్ మాల్ యూ!”

“ఆలెక్స్! ఎప్పుడూ శుభం పలుకుతావు. నీ అంత వెల్ విషర్ నాకు స్నేహితుడౌటం కన్నా సౌఖ్యముందా? యా! రేపు మద్యాహ్నానికి నెట్టించాలే ట్రిప్! కాసేపు కామ్‌గా చదువుకోనీ నన్ను. బై.”
ఫోన్ సంభాషణ తెంచేసి పుస్తకం చదువుకోసాగింది.

Softness and tenderness were the obvious conditions of the boy’s existence. No one has yet been so bold to take the scissors to his lovely hair, which curled above his brows, over his ears, and even further down the back of his neck- as it does on the statue of the “Boy pulling a thorn from his foot…

ఇంటర్నెట్‌లో ఆ ఒక్క స్కల్ప్‌చర్ కాసేపు స్టడీ చేసింది. ఎన్నో సంభాషణలు ఏకకాలంలో నడిపే ఆమె మనసుకు కుదురేది?

ఎరిక్‌కి తన రూమ్ కీ ఎందుకిచ్చింది? ఎందుకీ ఇంపల్సివ్ చర్యలు? Is he my Tadzio? ద లవ్లీ బాయ్! ఇప్పడు నా రూమ్‌లో ముక్కూ మొఖం తెలియని ఒక యంగ్ ఫెలో ఉన్నాడని ఆలెక్స్‌కి చెపితే ఏమంటాడు? అతనికిష్టముండదు. ఐ కెన్ టెల్ విక్టర్. నేనతనికి ఏమైనా చెప్పగలను. విక్టర్ హాయిగా యూరప్‌లో ‘లేక్ కోమో’ దగ్గర ఒక విల్లాలో ఉన్నాడు. వై నాట్ గో దేర్? తనకు స్టాండింగ్ ఇన్విటేషన్ ఉంది గదా.

ఆమెకింతలో రిసార్ట్ మేనేజర్-కాన్సియెర్జ్ నుండి ఫోర్ సీజన్స్ ఆప్‌లో మెసేజ్!

డా. షామల్! మీరు ఎరిక్‌కి సహృదయితతో చేసిన ఏర్పాటు మేము గమనించాము. వి ఆర్ ఫైన్ విత్ ఇట్. వి ఆర్ ఆల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ దట్ యంగ్ మాన్! సంవత్సరాలుగా అతని ఫేమిలీ ఈ ఫోర్ సీజన్స్‌కి అతిథులుగా వస్తున్నారు. ఎరిక్ ఫాదర్, జాక్సన్ హోల్ గ్రాండ్ టీటాన్ మ్యూజిక్ సమ్మర్ ఫెస్టివల్‌కి పెద్ద సపోర్టర్! ఈ ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ స్టడీగా పెరుగుతూ వస్తూ, అమెరికాలోనూ, అంతర్జాతీయంగానూ ఖ్యాతిని సంపాదిస్తున్నవి. ఎరిక్ లాస్ట్ హిజ్ ఫాదర్ రీసెంట్‌లీ. వి మిస్ హిమ్!

అండ్, తప్పిపోయిన ఎలుగుబంటి కుటుంబం అంతా దొరికింది. మీ రేపటి ట్రిప్‌కి అడ్డంకులేం లేవు. ఎ వన్ ఆన్ వన్ జీప్ రైడ్. యువర్ గైడ్’స్ క్రెడెన్షియల్స్ ఎండ్ ఎడ్యుకేషనల్ బేక్ గ్రౌండ్, ఫోటో, ఈజ్ ఎటాచ్‌డ్. సూటబుల్ ఎటైర్ ఈజ్ సజెస్టెడ్ హియర్. లంచ్ ప్రిపేర్డ్ బై అవర్ షెఫ్ విల్ బి పేక్డ్ ఇన్ ఎ పిక్నిక్ బాస్కెట్. ఫుడ్ ఎలర్జీస్ ఆర్ టేకెన్ ఇన్ టు ఎకౌంట్. నో వర్రీస్. ఎంజాయ్!

ఆ గైడ్ ఫొటో చూస్తే హి ఈజ్ అపోలో! హా! నా డయొనీసియన్ స్పిరిట్‌కి, హై ఆల్టిట్ట్యూడ్‌లో అడవుల్లో రేపు విచ్చలవిడి వినోదం. బ్రింగ్ ఇట్ ఆన్ గాడ్, ఆల్ యువర్ టెంప్టేషన్స్, అండ్ సమ్ మోర్! హు ఈజ్ కంప్లెయినింగ్! అనుకుంది నిసి.

(డా. నిసి షామల్ డైరీనుండి. తేదీ, అస్పష్టం. 2018?)

తర్వాత అదే పేజీలలో ఎక్కడినుండో ఈ రెండు ఎంట్రీలు పేస్ట్ చేసి ఉన్నయ్యి.

1. In 2020, Donald Runnicles was knighted for his service to music, as part of the Queen’s Birthday Honours.
2. “I attest to having fallen completely under the spell of the sights and sounds of the Grand Teton Music Festival and of this natural paradise. I return to Jackson and am restored and renewed.” Sir Donald Runnicles, OBE.)