Mansion House Inn, Martha’s Vineyard.
ఈ శ్లోకమ్
కొక్కోకమ్
నీవే ప్రియా! నీవేనయా!
ఈ సరిగమ్
ఈ స్వర్గమ్
నీదేనయా, ఓ నా ప్రియా!
అలనాటి మన ప్రణయం అలరించెలే
చెలీ చెలీ అను నీ పలుకలరించెలే
చిడిముడి ఈ నాటికీ చెమరించెలే
సంభోగమ్
స్వారస్యమ్
నీవో ప్రియా, ఓ నా ప్రియా! ఓహో ప్రియా.
ఫైర్‌ప్లేస్ ముందు ఛెయిస్‌లో పడుకుని, అప్పుడప్పుడు కుడి చేతికి ఉన్న బుల్గారీ బేంగిల్ సవరించుకుంటూ ఆ పాటను హమ్ చేస్తున్నది నిసి. జుట్టు విరబోసుకొని చిన్నిచిన్ని లేస్ పువ్వులు కుట్టి ఉన్న లినెన్ బీచ్ డ్రెస్ వేసుకుని ఉంది. ఆమె మనసులో విక్టర్ కనిపిస్తున్నాడు. అతడి స్ఫురద్రూపం. గాలిలో ఎగిరే అతడి లేతవన్నె జుట్టు. లాంగ్ కోట్. మెడచుట్టూ సిల్క్ స్కార్ఫ్. హి మస్ట్ బి ఇన్ ట్రాన్సిట్.
నిసి న్యూయార్క్ నుండి మార్తాస్ వినెయార్డ్‌కి వచ్చింది. విక్టర్ బోస్టన్ నుండి రెండు రోజుల తర్వాత వస్తున్నాడు. అక్కడ టాన్గిల్‌ఉడ్ మ్యూజిక్ ఫెస్టివల్ ప్లానింగ్‌లో పాల్గొంటున్నాడు. ఆ సభల సమయాల్లో అతనిని డిస్టర్బ్ చెయ్యదు నిసి. అతడి పనులయ్యాక మార్తాస్ వినెయార్డ్‌లో కలుసుకుని తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవాలని, ఆ తరువాత ఇద్దరూ న్యూయార్క్ కలిసి వెళ్ళి అక్కడినుండి అతడు హంగరీ వెళ్ళేట్టు, నిసి ఫ్లారిడా వెళ్ళేట్టు లూజ్‌గా ప్లాన్ చేసుకున్నారు.
ఇప్పుడు హోటల్ బుకింగ్స్‌లో ఎవరూ మిస్టర్ అండ్ మిసెస్? అని అడగటం లేదు. సింగిల్స్ ట్రావెల్ చాలా పాప్యులర్ అయ్యింది. ఇప్పుడు ఎక్కువమంది మనుషులు వారి జీవితం వారి సొంత ఇష్టాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుని, సాగిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఫామిలీతోనే కలిసి వెళ్ళాలనో, ప్రయాణంలో ఎవరో ఒక కంపానియన్ లేకపోతే ఇతరులు ఏమనుకుంటారో అనో, ఎవరూ వారి సమయం వృథా చేసుకోటంలేదు. నిసి యాత్రాస్ధలాలలో తనకు నచ్చిన చోట్ల బుక్ చేసుకుంటుంది. ఆమె అలా సంవత్సరానికి ఒకటి రెండుసార్లయినా కొత్త ప్రదేశాలలో కొంత కాలం గడుపుతుంది.
తనను కలుసుకోవటానికి ఎవరైనా బంధువులు, స్నేహితులు వచ్చే అవకాశం ఉంటే, వారి పేర్లన్నా ఇస్తుంది. లేదా ఇంతమంది అని సంఖ్య ఇస్తుంది. తన రూమ్ రిజర్వేషన్లలో, ఖర్చులలో ఇతరుల జోక్యం ఉండనీయదు. ప్రతిదీ లెక్కలు కట్టటం, కలగాపులగం చెయ్యటం ఆమెకు ఇష్టముండదు. వచ్చే అతిథులు, తన ఫామిలీ, ఫ్రెండ్స్. అంతా మర్యాదస్తులు. ఎవరి ఇళ్ళు, ఉద్యోగాలు వారివి వారికే ఉన్నయ్యి. ఎక్కువ రోజులు గడపాలనుకున్నవారు వారి ఎకామడేషన్ వారే ఏర్పరుచుకుటారు.
నిసి ఉన్న నాలుగో అంతస్తు లక్జరీ స్వీట్‌లోనుండి వినెయార్డ్ హార్బర్ వ్యూ అందంగా అంది. రంగుల పడవలు గాలిలో అలలపై ఊగిసలాడుతున్నయి. కిటికీలోంచి చిన్న ఇళ్ళు, సైకిళ్ళు అద్దెకిచ్చే షాపు, లోకల్ విలేజ్ స్టోర్, చిన్న కట్టడాలు ఒకటీ రెండూ కనిపిస్తున్నాయి.
చిత్రపటంలా ఉన్న ఆ అందాన్ని కాసేపు ఎంజాయ్ చేసినాక, నిసి హోటల్‌లోని లైబ్రరీ తనిఖీ చెయ్యటానికి వెళ్ళింది. రాత్రికి చదువుకోటానికి, లోకల్ రైటర్ పుస్తకం ఏమైనా దొరుకుతుందని ఆశ. లైబ్రరీలో ఫైర్‌ప్లేస్ వెలిగించి ఉంది. చుట్టూ అల్మారాలలో చాలానే పుస్తకాలు అమర్చి ఉన్నయ్యి. అక్కడక్కడా బల్లలమీద ఇతర ప్రయాణీకులు కొని చదివేసి, ఇతరుల కోసం వదిలేసి వెళ్ళిన పుస్తకాలున్నాయి. నిసి నిదానంగా ఒక్కో అల్మారా చూడసాగింది, నచ్చే పుస్తకం ఏమైనా ఉండకపోతుందా అని. అంతగా లేకపోతే తను తెచ్చుకున్న రీడింగ్ ఎలాగూ ఉండనే ఉంది. రకరకాల పుస్తకాలు నిసి మనసులో రకరకాల ఆలోచనలు రేపుతున్నాయి.
ఇదివరలో కొందరు అపరాధపరిశోధక నవలలు చాలా చవకబారువని అనుకునేవారు. కొందరు రొమాన్స్ నావల్స్ ఉత్త బేవార్సు అనుకునేవారు. కాని అది చాలా తప్పుడు ఊహ. తన ఉద్దేశంలో ఇంతవరకూ అగథా క్రిస్టీ కన్నా గొప్ప ఊహాత్మక రచయిత్రి లేదు. జేన్ ఆస్టిన్ కన్నా గొప్ప రొమాన్స్ ఎవరూ రాయలేదు.
అసలు రచనా రంగంలోనే రచయిత్రులు రచయితలకన్నా చాలా ఎక్కువ శక్తిమంతులు. మొన్న మొన్నటిదాకా నిసి వాల్టేర్ రాసిన కాండీడ్ నవలకి టాప్ మార్క్స్ ఇస్తూ వచ్చింది. అది చాలా చిన్న పుస్తకం. జీవితంలో భాగోతాలని అంత వ్యంగ్యంగా అంత నవ్వుతూ తేల్చేస్తూ ఎవరూ రాయలేదని అనుకునేది. కాని ఈ మధ్య మేరీ షెల్లీ ఫ్రాంకెన్‌స్టెయిన్‌కి మొదటి రేంక్ ఇస్తున్నది. అదీ చిన్న పుస్తకమే. కేవలం బోర్‌డమ్ నుంచి తప్పించుకోటానికి చకచకా నాలుగురోజుల్లో రచయిత్రి రాసిన రచన. ఐనా అంత చిన్న వయసులో తెలిసో తెలియకో ఒక ఇమాజినేటివ్ సైంటిఫిక్ ఫిక్షన్, దాని నుండి ఎన్నో ఫిలసాఫికల్ ప్రశ్నలు ఉదయింపచేసే రచన చేసింది. ఒక సైంటిస్ట్ లెబోరెటరీలో, శవాల ముక్కల అతుకుల బొతుకుల నుండి తయారయిన, చూస్తే భయం కలిగించే అతివికారరూపుడిపై, మేరీ షెల్లీ అంతులేని జాలి కలిగించింది. పుస్తకానికి ఎవరు హీరో? సైంటిస్ట్? లేక అతడు ప్రాణం పోసి, పేరైనా పెట్టకుండా, ఇతడి గతి ఏమిటి, ఈ జీవి ఎలా తింటాడు, ఇకపై ఎలా ఉంటాడు, పర్యవసానం ఆలోచించకుండా, ప్రపంచంలో దిక్కూ మొక్కూ లేకుండా ఒంటిగా వదిలేసిన మాన్‌స్టర్!
సాహిత్య-కవితా విమర్శక లోకం ఇప్పటికీ బైరన్, కీట్స్, షెల్లీల మీద తన్మయతతో ఉంటుంది. వాళ్ళు రాసిన పొయట్రీ అంతా కట్టగట్టినా మేరీ షెల్లీ చేసిన ఈ ఒక్క రచనకు సరితూగవు. విస్తారంగా విషయాన్ని వివరించగలిగే వచనానికి, లుంగలు చుట్టుకుపోయి, ఏవో గూఢ సంకేతాలమీద, ఎన్నోసూత్రాలలో చిక్కులుపడిపోయి, అతి తక్కువ సంగతుల గురించి మాత్రమే మాట్లాడగలిగే పొయట్రీకీ, పోటీ ఎక్కడ! పొయట్రీ ఊరికే ఆవేశపరిచి, ఆలోచనను వివేకాన్ని మందగింపచేస్తుంది. వచనం వివేకాన్ని మేల్కొలుపుతుంది. పొయట్రీ ఇమోషనల్స్ కోసం. ప్రోజ్ ఇంటలెక్చుయల్స్ లాంగ్వేజ్. క్రిస్టీ, ఆస్టిన్, మేరీ, వీరు సాహిత్యంలో కొత్త జాన్ర సృష్టిస్తే ఆ దారుల్లో ఎంతోమంది రచయితలు నడిచి, తామూ రచనలు చేసి పాఠకులను మురిపించారు. టి.వి.లో, సినిమాల్లో, ఇంకా వీరి రచనలు, సృష్టించిన పాత్రలు ఎన్నో రూపాల్లో ప్రేక్షకులకు వినోదం కలిగిస్తూనే ఉన్నయ్యి.
లైబ్రరీలో బుక్ షెల్ఫ్‌లు వరసగా చూస్తున్న నిసితోపాటూ ఆమె ఆలోచనలూ నడుస్తున్నాయి.
సాహిత్యంలో అతి నాసి రచనలు ఆటోబయోగ్రఫీలు. అంతకన్నా నాసివి మెమ్‌వార్లు. కాని రాయకుండా ఉండలేరు రచయితలు. ఒకసారి జీవించటమే అతికష్టం. ఇట్ డ్రాగ్స్. ఇక ఆ జీవితాన్ని మళ్ళీ నెమరువేత కూడానా? ఈగోలు బాగా బ్లింప్స్ లాగా, ధాంక్స్ గివింగ్ పెరేడ్‌లో బెలూన్లలాగా ఉబ్బిపోయి ఉంటే తప్ప ఎందుకు ఎవరైనా మనుషులు వాళ్ళ జీవిత యాత్ర గురించి రాస్తారు అనుకుంది. అంత దరిద్రపు రచనలకు ఈ రోజుల్లో వాటిమీద కొందరి విలేఖరుల సమీక్షలు కూడాను. డియర్ గాడ్! నాట్ ఫర్ మీ!
వాట్ ఎ పిటీ! ఒక్క పి.జి. ఉడ్‌హౌస్ లేదు, ఈ అమెరికన్ లైబ్రరీలో కాసేపు కలిసి నవ్వుదామంటే. ఈ లైబ్రరీలో ఎక్కువ ప్రెసిడెంట్ బయాగ్రఫీలు, ఆటోబయాగ్రఫీలు, ఉన్నయ్యి. ఈ మార్తాస్ ఐలండ్‌కి కెనెడీ వంశపు ట్రాజెడీల కనెక్షన్ ఉంది. క్లింటన్‌ల, ఒబామాల సమ్మర్ విలాసయాత్రా స్థలమయ్యే ఈ ఐలండ్. వాట్ ఎ క్రమ్మీ గైస్ దే ఆర్! ఒకడు ఫకింగ్ లైయింగ్ ఎడల్టరర్. రెండోవాడు ఒబీడియంట్లీ మేరీడ్, స్నీకీ రేషియల్ డివైడర్. ఒబామా ఈజ్ నో నెల్సన్ మేండెలా. హి ఈజ్ ఫార్ ఫార్ ఫ్రమ్ మార్టిన్ లూథర్ కింగ్! ఎందుకు వారి పేర్లు ఎత్తుతాడో, తనకేదో వారిమీద హక్కున్నట్టు. ఓవల్ ఆఫీసులో ఇన్నేళ్ళు కూర్చుని ఒక్కటంటే ఒక్క పనికొచ్చే పని చేసిన పాపానపోలేదు. ఒబామా ఏం గిలికినా ఎవడికి పట్టె? ఐ డోంట్ కేర్. మా ఇంట్లో కాటూరు కమ్యూనిస్ట్ సూడో లిబరల్స్ చదువుకుంటారు. గివ్ మి ఏబ్ లింకన్. థామస్ జెఫర్సన్. ద థింకర్స్.
లైబ్రరీలో ఒక క్రిస్టీ, ఒక పేటర్సన్, ఒక గ్రిషామ్, కనీసం ఒక డేనియల్ స్టీల్ కనపడదేం? నాన్‌టకెట్ నుంచి రాస్తున్న ఎలిన్ హిల్డెబ్రాండ్ ఉన్నా ఈ ఐలండ్‌లో చదువుకోటానికి కాస్త సరదాగా ఉంటుంది. పుస్తకాలు వరసగా ఫ్లిప్ చేస్తూ పోతుంటే ఇంతలో సడెన్‌గా టి.వి. జర్నలిస్ట్ బార్బరా వాల్టర్స్ పుస్తకం ఆడిషన్: ఎ మెమ్‌వార్, కనిపించింది నిసికి. కొంచెం తటపటాయించి, మనసులో ఏదో ఆలోచన మెరుపులా మెరిసి, ఆ పుస్తకం తీసుకుని అక్కడే లైబ్రరీలో సోఫాలో కూర్చుని తెరవగానే, ముందు వైపూ, పుస్తకం చివరా, పేర్లే పేర్లు. ఇంకా చెప్పేదేముంది. అవన్నీ జర్నలిస్ట్ బార్బరా, బ్రాడ్‌కాస్టింగ్ కెరియర్లో ఇంటర్‌వ్యూ చేసిన ప్రముఖుల పేర్లు. జోర్డాన్ కింగ్ అబ్దుల్లా, ప్రెసిడెంట్ ఆయూబ్ ఖాన్, యాసిర్ అరాఫత్, ఫిడెల్ కాస్ట్రో, ప్రెసిడెంట్ జార్జ్ బుష్, ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్, ఇందిరా గాంధీ, ఇంకా సెనెటర్ హిలరీ క్లింటన్, సెనెటర్ ఎడ్వర్డ్ కెనెడీ, ప్రెసిడెంట్ షావెజ్ ఆఫ్ వెనిసువేలా, ఇలా ఆ లిస్ట్ అంతా పఠించటంలోనే ప్రపంచ చరిత్ర తెలిసేట్టుంది అనుకుంది.
‘కారే రాజులు, రాజ్యముల్ కల్గవే, గర్వోన్నతిం చెందరే! వారేరీ? సిరి మూటగట్టుకొని పోవంజాలిరే. భూమిపై పేరైనన్ కలదే!’ పైకే అనుకుంది నిసి.
బార్బరా వాల్టర్స్ పుస్తకం వచనంలో ఫిర్‌దౌస్ షానామానా? వెనకటి రాజుల పేర్లు కవులు నిలిపినట్టు, ఇటీవల పాలిటీషియన్లు, సినిమా తారల పేర్లు జర్నలిస్ట్ బ్రాడ్కేస్టర్లు నిలుపుతున్నారు. నిసి అమెరికా 1970లలో వచ్చిన దగ్గరనుండీ బార్బరాని, ఆమె టి.వి. కెరియర్‌ని ఫాలో అవుతూనే ఉంది, టీవీషోలలో పార్టిసిపెంట్ నుంచి ఆంకర్ దాకా. ఆలోచిస్తూ, పుస్తకంలో ముందూ వెనక అట్టల లోపలి పేజీల్లో, వరసాగ్గా చూపుడువేలు ప్రతి పేరు మీద కదిలిస్తూ పోతూ, గమనిస్తూ ఉంది. స్పోర్ట్స్‌మెన్ ఉన్నారు, ఏక్టర్లున్నారు, టి.వి సీరియల్స్‌లో వచ్చే దొంగ డాక్టర్లున్నారు. అన్ని పేర్లు పరిశీలించింది. లేరు. ఆ ముందు వెనక అట్టల లోపలి కాగితంలో ముద్రించిన పేర్లలో సైంటిస్టులు లేరు. డాక్టర్లు లేరు. నెమ్ హుస్సేన్ పేరు, నిసి షామల్ పేరు లేదు. ఈ పేర్లు ఎందుకు లేవు? బార్బరా పరుగులు తీసుకుంటూ వెళ్ళి ఇంతమందితో ఫొటోలు తీసుకుంది. బార్బరా తనతో ఒక్క ఫొటో దిగలేదేం? తనను ఇంతమట్టుకూ ‘వ్యూ’లో ఇంటర్వూ చెయ్యలేదేం?
పుస్తకం లోపలి పేజీలు తిప్పింది. ఛాప్టర్లు చూసింది. ఆహా! న్యూయార్క్ హాస్పిటల్లో షా ఆఫ్ ఇరాన్, జబ్బుతో ఉన్నాడని, అప్పుటికప్పుడు ఫొటోగ్రాఫర్ని వెంటేసుకుని పరిగెట్టి, ఆ జబ్బుగా ఉన్నవాడితో ఒక పోలరాయిడ్ ఫొటో దిగి, నా దగ్గర ప్రూఫ్ ఉంది. అని టాం టాం, చేస్తే అది బ్రేకింగ్ న్యూస్. అది గ్లోరియస్ జర్నలిస్టిక్ కెరియర్. ఎవరన్నాగాని, జబ్బుతో, మరణాసన్నుడై ఉన్నవాడిని పూర్వ పరిచయం అదునుగా తీసుకుని, గుడ్డలూడేలా పరిగెత్తుకు వెళ్ళి, ఫొటోలు తీసుకు వస్తారా! అలాటి పనికిమాలిన పనులు జర్నలిస్టులకే తగును. పుస్తకం లోపల ఒక చాప్టర్‌లో, బార్బరా తన జీవితంలో చాలా ప్రేమించినవారిగానూ కానీ చాలా కష్టం కలిగించినవారిగా ఇద్దరు జాకీలను పేర్కొంది. ఒక జాకీ తన మెంటల్లీ రిటార్డెడ్ సిస్టర్. మరొకరు పెంచుకున్న కూతురు. ఎందుకో అక్క పేరే తను పెంచుకున్న కూతురికి కూడా ఇచ్చింది.
ఏమి రాసింది బార్బరా, జాకీ బ్రెస్ట్ కాన్సర్ గురించి? అని నిసి చదివింది. నిసి ఆలోచన జాకీకి తను వైద్యం చేసిన సందర్భం, 1983-84 ప్రాంతంలో, బ్రాంక్స్‌లోని ఒక ప్రైవెట్ రేడియేషన్ ఆంకాలజీ ఆఫీస్ వద్దకు వెళ్ళింది.
ఆ బ్రాంక్స్ ప్రైవెట్ ప్రాక్టీస్ రోజుల్లో, ఆఫీసు స్టాఫ్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఒకరోజు ఆమె ఏజెంట్ ఒకతనిని వెంటబెట్టుకొని, బార్బరా వారి ఆఫీసుకి వచ్చింది. నెమ్ హుస్సేన్ కేన్సర్ కేర్‌లో చాలా నిపుణుడు. ఆ సమయానికి అతడు పబ్లిక్ దృష్టి అంతగా పడని, ప్రైవైట్ ఆఫీసులో తన ప్రాక్టీస్ సాగిస్తున్నాడు. కాబట్టే, వారు అక్కడికి వచ్చింది. ఆపైన ఉమన్ ఫిజిషియన్ గాబట్టి, హుస్సేన్ రికమెండేషన్ మీద, బార్బరా సిస్టర్, మెంటల్లీ రిటార్డెడ్ జాకీ వైద్యం, నిసికి అప్పచెప్పబడింది. ఆ ఒక్కసారి తప్పించి మళ్ళీ బార్బరాను నిసి ఎప్పుడూ కలవలేదు. స్టేజ్ మీద రెండే కుర్చీలుంచి, వ్యక్తితో ఎదురూబొదురూగా సంభాషణ చేస్తూ, ఎంతో సున్నితంగా కళ్ళార్పుకుంటూ, అప్పుడో ప్రశ్న అప్పుడో ప్రశ్న అడుగుతూ, సెలెబ్రిటీల జీవిత చరిత్రలు వాళ్ళ ఇంటిమేట్ సీక్రెట్స్ అన్నీ పరిచయం చేసి, పేరు తెచ్చుకున్న బార్బరాకి, తన అప్పగారు జాకీ మీద ఎంత ప్రేమ ఉన్నా, ఆమె బ్రెస్ట్ కేన్సర్ అంత ఆందోళన కలిగించినా, వైద్యం చేసిన డాక్టర్ల పేర్లు ఆ పుస్తకంలో లేవు. వైద్యులు ఇంటర్యూ చెయ్యాల్సిన మెటీరియల్ కారు. ప్రపంచానికి పరిచయం చెయ్యవలసినవారు కారు. డాక్టర్లు సెలబ్రిటీలు కారు. ఏక్టర్లు, ఆంకర్లే సెలబ్రిటీలు. వారివే మెమ్‌వార్లు. బార్బరా ఆడిషన్ లైబ్రరీ రేక్‌లో భద్రంగా పెట్టేసి, మళ్ళీ మెమ్‌వార్ అనేది చదవను గాక చదవను అని ఒట్టు పెట్టుకుంది నిసి.
తన రూమ్‌లోకి వెళ్ళబోతుంటే హోటల్ మేనేజర్ మేక్స్, నిసితో “మీరు వెదర్ ఫోర్‌కాస్ట్ విన్నారో లేదో, ప్రెట్టీ సివియర్ స్టార్మ్ ఈజ్ బియింగ్ ప్రిడిక్టెడ్,” అన్నాడు.
“ఓ! నేను విననేలేదు.”
“మోస్ట్‌లీ ట్రావెల్ ఇంటరప్షన్స్. ఐలండ్‌లో మనకేం ఇబ్బంది ఉండదు. ఫుడ్ సప్లయ్ ఉంది. ఉయ్ హావ్ జెనరేటర్స్. వెదర్ బాగుంది. బైట ఇవ్వాళే తిరిగి రండి. ఈ రోడ్ ఒక లూప్. ఇది తీసుకుంటే మళ్ళీ తిరిగి నేరుగా హోటల్‌కే తీసుకొస్తుంది. చాలా సీనిక్ రోడ్. చక్కని ఇళ్ళు చూడొచ్చు. కొంత దూరం ఓషన్ పక్కన నడక. లైట్‌హౌస్‌కు కూడా వెళ్ళొచ్చు,” అన్నాడు మాప్ చూపిస్తూ.
“థాంక్యూ. నా పర్సనల్ ఫుడ్, డ్రింక్ సప్లయ్‌లు ఇప్పుడే కొంచెం పెంచుతాను. ఐనా ఎదురుగా ఉన్న మెక్సికన్ ఫుడ్ తెరిచే ఉంటుండి కదా. తాకోలు, బురితోలు ఉన్నంతవరకూ నాకేం పర్వాలేదు. మేక్స్! ఎక్కడైనా కాసేపు పియానో వాయించుకోటానికి వీలవుతుందా? మీకు వింతగా ఉండొచ్చుగాని, ఐ మిస్ మై పియానో. ఇల్లు విడిచిపెట్టి చానాళ్ళు ఐనట్టు అనిపిస్తున్నది. పియానో కియాస్క్ లాటివి ఉన్నయ్యా?”
“స్ట్రేంజ్ రిక్వెస్ట్!” హోటెల్ మానేజర్ నవ్వాడు. “గెస్ట్స్ దగ్గరనుండి రకరకాల కోరికలు వింటుంటా నేను. పియానో స్టోర్స్ కూడా లేవు. కానీ, మార్గం ఉంది. లోకల్ హాస్పిటల్ లౌంజ్‌లో గ్రాండ్ పియానో ఉంది. మీరు అడిగితే వాళ్ళు కాదరనుకుంటా.”
ఆమె మేప్ తీసుకుని, డ్రెస్ మార్చుకోటానికి వెళ్ళింది. అకస్మాత్తుగా నిసిని ఒంటరితనం ఆవరించింది. ఇంకా విక్టర్ దగ్గరనుండి ఏ కబురూ లేదు. బహుశా అతని ట్రిప్ కేన్సిల్ అవ్వచ్చు. ఐతే గాని ఇక్కడ కలవకుండానే అతడు బోస్టన్ నుండే హంగరీ వెళ్ళిపోవాల్సి రావచ్చు. ఆమె అతనికై తపిస్తున్నది. అతని కౌగిలిలో వెచ్చగా, ఉండాలనిపిస్తున్నది. ‘హి ఈజ్ సచ్ ఎ గుడ్ కిసర్! ఐ లవ్ హిస్ బాడీ స్మెల్. ఉయ్ బోత్ ఆర్ సో కంపాటిబుల్. స్టార్మ్ మే బి జస్ట్ ఎ ఫాల్స్ అలార్మ్! హి విల్ బి హియర్ టుమారో. మరి విక్టర్ వచ్చేలోపు హాయిగా ఊళ్ళోకి పోయిరాక, అర్దంతరంగా ఈ పియానో బెంగ ఏమిటి? జస్ట్ రిడిక్యులస్! వాట్ ఈజ్ రాంగ్ విత్ మి!’
కాని ఆమె ఇన్ నుంచి బైటకు వచ్చాక, హాస్పిటల్ వైపుకే నడిచింది. కొద్దిగా మబ్బు కమ్మి సన్నగా చినుకుపడుతూ, నడవటానికి అతి ఆహ్లాదంగా ఉంది. మధ్యమధ్య ఫొటోలు తీస్తూ నడిచి దారిలో ఒక బోటింగ్, ఫిషింగ్ ట్రిప్స్ అరేంజ్‌చేసే ఒక షాప్‌లోకి వెళ్ళింది. తనను సముద్రంలోకి ఓ రెండు గంటలపాటు తిప్పి చూపేట్టు మర్నాటికి బోట్ బుక్ చేసుకుంది. వెదర్ బాగోక ట్రిప్ నడిపేవారు కేన్సెల్ చేస్తే తప్ప, ఆమె కట్టిన డబ్బు మాత్రం రిఫండ్ ఇవ్వబడదు. అక్కడ కొన్న బట్టలు, ఇతర వస్తువులు కావాలంటే మార్చుకోవచ్చు, అదే ఖరీదుకి మళ్ళీ ఏవైనా కొనవలసిందే కాని, డబ్బు వాపస్ ఇవ్వబడదు. స్ట్రిక్ట్ రూల్స్ ఈ షాప్ ఓనర్‌కు!
ఆ ఓనర్ తెలిసినట్టుగా అనిపించాడు నిసికి. పొడవుగా, తేలిక శరీరం. సన్నని నడుము. గిరజాల జుట్టు, కొద్దిగా గ్రే హెయిర్. ముఖం ఎక్కడో చూశాను, చూశాను, అనుకుంది. తర్వాత తట్టింది క్లింట్ ఈస్ట్‌ఉడ్‌లా ఉన్నాడని. అండ్, హి ఈజ్ సో నైస్‌లీ టాన్‌డ్.
“ఒకవేళ పడవమీద వెడితే వేసుకోటానికి సరైన దుస్తులున్నట్టు లేవు. పైగా రేపెల్లుండి స్టార్మ్ అంటున్నారు. నాకు కనీసం రెయిన్ కోట్, రెండు మూడు వాటర్ రిపెల్లెంట్ షర్ట్స్, షార్ట్స్ కావాలి.”
అతడు ఆమె మామూలుగా వేసుకునే సైజ్ గురించి అడిగాడు. ఆమెకసలు ఏమీ తెలియదు. ఎప్పుడు బట్టల షాపుకెళ్ళినా ఆమె ఏమీ ఎంచుకోలేదు. ప్రతిసారీ డ్రెస్సింగ్ రూమ్ బైట నుంచుని ఫీమేల్ ఎటెండెంట్స్, ఒక్కొక్క రకం దుస్తులు ఆమెతో ధరింపచేసి, ఆమెకు సరిపోయినవి వాళ్ళే సెలక్ట్ చేసి పేక్ చేస్తారు. నిసి నోటికొచ్చిన నంబర్లేవో చెప్పింది. అతడు నవ్వాడు. అతను వేసుకున్న షార్ట్స్‌కి పొట్టకి మధ్య చెయ్యుంచి లాగి చూపిస్తూ అన్నాడు, “అది నేను వేసుకునే సైజ్. మీకెందుకు అంత సైజ్!” ఆమె అతని చక్కని సన్నని నడుము చూసి లోలో ఆశ్చర్యపోయింది. ‘ఈ వయసులో ఎంత సన్నగా, ఐనా ఎంత ధృడంగా ఉన్నాడు. పడవల తెడ్లు వెయ్యటం, పడవలు ఒడ్డుకి, నీళ్ళలోకి లాగటం, ఆ మోకులు, తెరచాపలు లాగటంలో ఎంత శక్తి వస్తుంది. అందుకే చకచకా నడుస్తారు. కుర్రవాళ్ళలా పరుగెత్తుతారు. ఏదో నాలుగు టెన్నిస్ బాల్స్ పూల చెండుల్లాగా కొట్టటం, పాటికి పది మాట్లు, షోగ్గా లాగూ చొక్కాలు మార్చటం, కార్లు ఎక్కీ దిగటమే కాని తనకు శరీరంలో గట్టిపనులు చేసే శక్తి ఏదీ!’
అతడు ఇచ్చిన బట్టలు తీసుకుని డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళి కర్టెన్ లాగి ఒకటి తర్వాత ఒకటి ట్రై చెయ్యసాగింది. మధ్య మధ్య అతను “ఎనీ లక్! ఎనీ ధింగ్ వర్క్స్?” అని అడుగుతున్నాడు దూరంనుండే. మర్యాద నిండిన స్వరం. “నాట్ రియల్లీ” అంటూ తీరుబాటుగా బట్టలు ట్రై చేసింది. ఎందుకో ఆమెకు మధ్య మధ్యలో అతడి చక్కటి నడుము, బొడ్డు కిందుగా కనిపించిన ఒత్తు వెంట్రుకల బారు గుర్తు వస్తూంది.
నిసి నవ్వుకుంది. ఎన్ని వందల శరీరాలు ఎంత అధోగతిలో, ఎన్ని స్ధితులలో చూసినా, ఆమెకు ఈ నాటికీ శరీర సౌందర్యం మీద వ్యామోహం తీరదు. ముఖ్యంగా ఆమెకు మగవారి కళ్ళు, పెదవులు, పొట్ట, చేతుల వేళ్ళు గమనిక ఎక్కువ. ఎవరు తన శరీరాన్ని తాకితే తనకు హాయిగా ఉంటుందో ఉండదో ఆమె గమనిస్తూనే ఉంటుంది. నచ్చితే వాళ్ళు చొరవ తీసుకున్నా ఏమనుకోదు. స్పర్శ నచ్చలేదో కథ సమాప్తి. ‘ఐ యామ్ ఎ స్లట్! యామ్ ఐ! ఇది వంశపు బుద్ధి. పుట్టుకతో వచ్చింది. పోదు.’ అనుకుంది నిసి. ‘ద్రౌపది తనకన్నా చాలా మెరుగు. ఐదుగురితో సరిపుచ్చుకుంది. ఎలిజబెత్ టేలర్ కూడా మెరుగే అనుకుంది. ఏడుగురితో ముగించింది. మరి తను?’
రెండు మూడు రకాల జతల బట్టలు ఎంచుకుని, “ఒక్క రెయిన్ కోట్ గొడుగు మాత్రమే ఇప్పుడు తీసుకువెళతాను, మిగతావి ఇక్కడే ఉంచుతారా, నేను తిరిగి హోటల్‌కి వెళ్ళేప్పుడు తీసుకుంటా,” అన్నది. బిల్ కట్టాక, “ఐ విల్ హోల్డ్ దీస్ ఫర్ యూ. మీకు వీలైనప్పుడు వచ్చి తీసుకోండి.” అని చెప్పాడు.
ఆమె అక్కడి నుండి నిదానంగా నడుస్తూ హాస్పిటల్‌కి వెళ్ళింది. తన ఐ.డి. చూపించి “మేన్షన్ హౌస్ ఇన్ మేనేజర్, ఇక్కడ పియానో ఉన్నట్టు చెప్పారు. కొంచెంసేపు పియానో వాయించుకోనివ్వరూ?” అని అడిగింది. రిసెప్షనిస్ట్ ఆమెతో కాసేపు డాక్టర్, వైద్యాల పిచ్చాపాటీ చేసి, నేపుల్స్ గురించి కాసిని కబుర్లడిగి, పియానో దిక్కు చూపింది. అక్కడ ఏ మ్యూజిక్ పుస్తకాలూ లేవు. తనే తోచిన స్కేల్లో, కాసేపు మెలడీ, హార్మొనీ కల్పన చేసుకుంటూ వాయించింది. ఇంటరెస్టింగ్‌లీ ఆమెకు ఇప్పుడు పియానో అంటే ఆలెక్స్. ఎవరి సంగీతం వింటున్నా ఆమెకు పియానో ముందు కనిపించేది ఆలెక్స్. తను తప్పులు చేసినప్పుడల్లా, అతడి వెక్కిరింతలు ఆమె చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. పియానో ఒంటరిగా వాయించుకునేది కాదు. ఎప్పుడూ ఆడియన్స్ ఉన్నట్టే భావించుకోవాలి. ఉన్నాగాని, మనసు చెదరకుండా వాయించాలి అంటాడు ఆలెక్స్. అతడిని తలవకుండా తనకు రోజు గడవదా? ఆలెక్స్ పర్ఫెక్ట్ టీచర్. అతడిని ఏ ప్రశ్న ఐనా వెయ్యి వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ గురించి. విడమర్చి సమాధానమివ్వగలడు. ఆలెక్స్! ఆలెక్స్! వాయించినంతసేపూ తప్పులుపడుతూ వేధించే ఆలెక్స్! ఎప్పుడూ, ‘ఐ లైక్ యువర్ షూస్, నీ బేగ్ బాగుంది. లవ్ యువర్ గ్లాసెస్!’ అంటూ ఇంపర్సనల్ థింగ్స్ గురించి మాట్లాడే ఆలెక్స్. ఈ ఐలండ్‌లోనూ అతని ఆలోచన.
కొంచెం సేపయ్యాక ఆమెకు పియానో మీద బెంగ తీరింది. రిసెప్షనిస్టుకు థేంక్స్ చెప్పి మధ్యలో ఎక్కడా ఆగకుండా ఇన్‌కు వెళ్ళిపోయింది.
ఆమె నిద్రలో ఉండగానే మెరుపులూ, ఉరుములూ, తుఫాన్ బ్రేక్ అవటం తెలిసింది. కరెంట్ పోయింది కాసేపు.
“స్వీటీ! ఐ యామ్ సో సారీ! దేర్ ఈజ్ నో వే ఐ కెన్ గెట్ టు వేర్ యూ ఆర్. ఐ ఫీల్ టెరిబుల్! నాకు నిన్ను కౌగిలించుకోవాలని ఉంది. ఐ జస్ట్ నీడ్ యు ఇన్ మై ఆర్మ్స్. ఐ హేట్ టు రిటర్న్ టు యూరప్ వితౌంట్ సీయింగ్ యూ. బట్ లుక్స్ లైక్ ఐ హావ్ టు.”
ఫోన్‌లో మాటల్లో ఆలెక్స్ ప్రసక్తి నిసినే తీసుకు వచ్చింది. “విక్! ఐ థింక్ ఆలక్స్ ఈజ్ ఎ ష్మక్. నా మీద పొసెసివ్‌నెస్ చూపిస్తున్నాడు. ఐ హేవ్ టు గెట్ సమ్ సెన్స్ ఇన్ టు హిమ్.”
విక్టర్ పెద్దగా నవ్వాడు. “నిసీ! నీకు పాఠం చెప్పటానికి ఒప్పుకునేసరికి ఆలక్స్ చవకైపోయాడా? వాట్ ఈజ్ ది ప్రాబ్లమ్! ఆలెక్స్ ఈజ్ ఏన్ ఇంటర్నేషనల్లీ రెప్యూటెడ్ టీచర్. చాలా ఓర్పున్న టీచర్. యూ ఆర్ సో లక్కీ.”
“విక్! ఐ థింక్ హి హేజ్ ఎ క్రష్ ఆన్ మి!”
“సో! నీ మీద ఎలిమెంటరీ స్కూల్ నుండీ ఎవరో ఒకరికి క్రష్ ఉంటూనే ఉంది అని చెప్పావుగా. గర్ల్స్ ఇంక్లూడెడ్! యూ సీమ్ టు బి హేండ్లింగ్ ఇట్ టూ వెల్! కేరీ ఆన్! స్వీటీ, కేరీ ఆన్!”
విక్టర్‌తో స్వీట్ నథింగ్స్ చాలా చెప్పుకున్నాక, ఆమెకు ఒంట్లో కాక ఇంకా ఎక్కువయింది. తుఫాను రెండు రోజులదాకా తగ్గలేదు. సముద్రపు పొంగులతో పాటు ఆమెకు విక్టర్ మీద కోరిక ఎక్కువవుతూ వచ్చింది. హి ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్, అండ్ సెన్స్యుయస్ లవర్. నిసి వాంటెడ్ హిమ్ టు బి క్లోజ్ టు హర్, బేడ్ లీ.
ఆ రోజు పొద్దున్నుండీ ఆమెకు ఎన్నో ఫోన్ కాల్స్. నిసి తన బర్త్‌డే అప్పుడు ఏదో ఒక విహారయాత్ర చేయటం, అది చిన్నప్పటి నుండీ కొనసాగుతూనే ఉంది. వయసును బట్టి, కంపానియన్స్ మారుతున్నారు. ఆ సమయంలో వీలుపడినవాళ్ళు ఆమెతో ఉన్నవాళ్ళు ఉంటారు. లేనివాళ్ళు దూరంనుండీ మాట్లాడుతారు. ఆ రోజు తనతో మాట్లాడిన అందరికీ ఎంతో కొంత మార్తాస్ వినెయార్డ్ గురించి, ఆ రోజు తన నగలు దుస్తుల గురించీ, చెపుతూనే ఉంది. శ్యామ్ చెల్లెళ్ళు ఫోన్లు. ‘వదినగారూ! ఎలా ఉన్నారు? ఎక్కడ గడుపుతున్నారు ఈ సంవత్సరం మీ పుట్టిన రోజు?’ అని. నిసి చక్కగా తన సరౌండింగ్స్ వర్ణించి చెప్పింది. “మీ అన్నయ్యా నేనూ ఎన్ని ఐలండ్స్ వెళ్ళాం, కాని, దగ్గర్లో ఉన్న ఈ ఐలండ్ మాత్రం ఎప్పుడూ రాలేదు. మీ అన్నయ్య ఇచ్చిన సాలిటరీ డైమండ్ చెవి పోగులు గుర్తున్నాయి కదా, అవి పెట్టుకున్నా ఈ వేళ.” తన కుడిచేతినున్న ఇప్పటి బుల్గారీ బేంగిల్ గురించి చెప్పలేదు.
వాళ్ళు నిసి ఏం చెప్పినా తృప్తిగా వింటారు. నిసి శ్యామ్ కలిసి జీవించిన సమయాలు, శ్యామ్ ఆరోగ్యంగా అందంగా ఉన్న సమయాలు గురించి వారు మనసారా వింటారు. మధ్య మధ్య తన సెల్ఫీలు పంపుతుంటుంది. ఆమె దుస్తుల్లో మార్పులు, హెయిర్ స్టయిల్లో మార్పులు చూశామంటూ వారి కొన్ని బొమ్మలు పంపిస్తూ, వారి ఇళ్ళలోని విశేషాలు చెపుతుంటారు. ‘వదినగారు, వదినగారు,’ అని వీలైనన్నిసార్లు అంటారు. ఆ అనటంలో, ఆమెతో సంబంధం ఉంచుకోటంలో వారికి శాంతి, ఆనందం ఉన్నయ్యి. అందులో నిసికి ఏమీ ప్రతిబంధకాలు లేవు. జరిగిపోయినవి, జరగబోయేవి, జరుగుతున్నవీ, అన్నీ ఒకటే. తన జీవితంలో ఒకసారి చోటు ఏర్పరుచుకున్నవారిని ఎవరినీ, ఏదీ, బలవంతాన మర్చిపోనవసరం లేదు. పనిమాలా జ్ఞాపకం చేసుకోనవసరమూ లేదు. కాలం ఎంత చకచకా గడిచిపోతున్నదో గమనిస్తూ వారంతా విస్మయంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు.
ఆ రోజు సాయంత్రం ఇంకా వానగా ఉండగానే బోట్లు అద్దెకిచ్చే చోటుకు వెళ్ళింది. అతడు ఆ ముసురులో నిసిని చూసి ఆశ్చర్య పోయాడు. “సముద్రం మీద ఇంకా వెళ్ళటం సేఫ్ కాదు. మీకు సెల్ మీద ఎప్పడు వెళ్ళవచ్చో నేనే మెసేజ్ వదులుతాను గదా. బట్టలు మీ ఇన్‌కి పంపుతాను. మీరు ఎందుకు ఈ బేగ్స్ మోయటం. అసలెందుకు? మీది ప్రైవేట్ బోట్ ట్రిప్! ఎవరూ ఉండరు సరంగు మీరూ తప్పించి. బోట్ మీద వెళ్ళేముందు బట్టలు ఇక్కడే మార్చుకోవచ్చు.” అన్నాడు.
“ఈ రోజు వెళ్ళకూడదా మనం? ఏమీ తోచటంలేదు. ఐ విష్ యూ కెన్ టేక్ మీ ఆన్ యువర్ బోట్!” నిసి.
“నో వే. ఇట్ ఈజ్ నాట్ సేఫ్! యూ డోంట్ వాంట్ మీ టు లూజ్ మై లైసెన్స్! డూ యూ!” అన్నాడతడు.
‘నో క్లింట్! నువ్వు చూస్తానికి క్లింట్ లాగా ఉన్నావేమో గాని అతడి మగతనం నీకెక్కడిది!’ అనుకుంది మనసులో నిసి.
నిసి చాలా రెస్ట్‌లెస్‌గా ఉంది. కాసేపు ఆ బట్టల రేక్ చుట్టూ తిరిగింది. ఫిషింగ్ రాడ్స్, బెయిట్స్, స్విమ్ సూట్స్, గొలాషెస్, లైఫ్ వెస్ట్స్, ఊరికే అన్యమనస్కంగా చూస్తూనే ఉంది. ఆమె లోపల ఏదో అశాంతి. ఆందోళన. అట్లాంటిక్ ఓషన్‌లో లాంటి అలజడి. మళ్ళీ కొంచెంసేపు అతనితో ఏవో ఐలండ్ గురించిన సమాచారం అడిగింది. అంతసేపూ ఆమె అతన్ని చూసీ చూడనట్టు చూస్తూ, మనసులో ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది. షాప్‌లో ఇంకెవరూ లేరు.
“ఐ విల్ బి క్లోజింగ్ అప్ ప్రెట్టీ సూన్.”
“ఈజ్ ఇట్!” అంది అన్యమనస్కంగా.
“ఐ హావ్ ఎ బార్న్ హియర్. దగ్గరలోనే.”
“డు యూ?”
“ఉయ్ కెన్ గో దేర్. యూ విల్ బి ఫైన్. ఐ విల్ బ్రింగ్ యూ బేక్ హియర్.”
ఆమె స్వెటర్ స్లీవ్స్ కిందిదాకా లాక్కుని చేతులతో నలిపింది. “యూ మీన్…!”
“యా! ఐ మీన్ దట్!” మధురంగా నవ్వాడు. క్లింట్ ఈస్ట్‌ఉడ్ నవ్వుతాడా అసలు. పెదవుల పక్కన పుట్టుమచ్చ లేదు కాని, ఇతని ముఖంలోనూ సన్నని ముడతలు. కళ్ళలో స్టీల్ గ్లింట్.
“యూ డూ!”
అతడు ఆమెను చులాగ్గా ఎత్తి కౌగిలించి ఒక ముద్దు పెట్టాడు. “ఫీల్స్ ఓకే?”
“ఊఁ! ఫీల్స్ గ్రేట్!”
ఆమె స్వెటర్ లోనుండి చేతులు పోనిచ్చి, రెండు చన్నుల మీద చేతులుంచాడు. “బెటర్?”
“ఇట్స్ వెరీ వెరీ గుడ్!” అంది నిసి మగతగా.
“దెన్ ద రెస్ట్ విల్ బి ఫైన్. యు విల్ లైక్ మై బార్న్, బిగ్ ఫైర్ ప్లేస్. కంఫర్టర్స్…”
“యూ షూర్!”
“అడ్మిట్ ఇట్! యు హావ్ హాట్స్ ఫర్ మి!”
“యామ్ ఐ సో ఆబ్వియస్!?”
“వెల్! ఏజ్ ఆబ్వియస్ ఏజ్ ఎ సల్ట్రీ సైరన్! ఐ యామ్ ఎ విలేజర్ బట్ నాట్ ఔట్ ఆఫ్ టచ్ విత్ మై అర్జెస్. ఐ లైక్ యూ! ఐ హావ్ నాట్ స్లెప్ట్ విత్ ఏన్ ఇండియన్ ఉమన్ సో ఫార్.”
“ఆహ్! అది సవరించాల్సిన లోపమే. ముందు ముందు మీ బయోగ్రఫీ రాస్తే అదెంత చిన్నతనం. అండ్, ఐ నెవర్ డిడ్ ఇట్ ఇన్ ఎ బార్న్. మా తండ్రులు తాతలు తప్పకుండా గడ్డివాముల్లో దొర్లినవారే. ఐ షుడ్ డూ ఇట్ టూ. నేనూ వారిలాటి దాన్నే.”
ఇద్దరూ కలిసి నవ్వారు గలగలా. మాటలతో పాటూ చేతులూ చురుగ్గా పనిచేశాయి ఇద్దరివీ.
ఆమె కలలోలా కదులుతూ, ఏమీ కలవరం లేకుండా అతనితో కలిసి అతని పికప్ ట్రక్ ఎక్కి అతని బార్న్‌కి వెళ్ళింది.
బైట తుఫాను హోరు. ఈదురు గాలులు, వానజల్లులు ఆ బార్న్ చుట్టూ గిరికీలు కొడుతూనే ఉన్నాయి. సముద్రం పొంగులు తెలుస్తూనే ఉన్నాయి. పెరిగే అలలు విరిగే అలలు. ద స్టార్మ్ రేజ్డ్ ఆల్ ఎరౌండ్ దెమ్. కాని అతని చేతుల మధ్య ఆమె భద్రంగా ఉంది. శరీరంలోని బడబానలం చల్లబడింది. ఆమె పెదవుల మీద నవ్వులు పూచాయి. హి ఈజ్ సో రైట్. హిస్ ఎవిరీ టచ్ వాజ్ కంపాటిబుల్ టు హర్. ఎ గ్రేట్ లవర్. వెరీ టెండర్. అండ్ ఎ జెంటిల్మన్!
కొంచెం సేపటికి అతడు ఆమెను విడిచి లేచి రిమోట్‌లో ఒక బటన్ నొక్కాడు. రెండు గ్లాస్ పానెల్స్ తెరుచుకుని అవతల కిచెన్ కనిపించింది. అతడు కిచెన్‌లోకీ, నిసీ షవర్‌లోకీ వెళ్ళారు. ఆమె టీ షర్ట్, షార్ట్స్ లోకి మారి, జుట్టు బ్రష్ చేసుకుని కిచెన్‌లోకి వచ్చేసరికి అతను కొన్ని ఫ్రూట్స్ కట్ చేసి ఉంచాడు. ఫ్రిజ్ లోంచి ఒక కార్న్ మఫిన్ తీసి ఒక సెరామిక్ ప్లేట్లో ఉంచాడు. అందులో ఒక చిన్న కేండిల్ గుచ్చాడు. ఒక ప్రొసెక్కో బాటిల్ ఓపెన్ చేసి, రెండు షాంపేన్ ఫ్లూట్లు నింపి ఒకటి ఆమెకిచ్చి, కేండిల్ వెలిగించి, ఆమెతో అన్నాడు.
“గో ఆన్! బ్లో ద కాండిల్! హేపీ బర్త్ డే! ఛీర్స్!”
నిసి ఎంతో ఆశ్చర్యపోయింది. హౌ పర్సెప్టివ్ ఈజ్ దిస్ గై! హౌ వెరీ హ్యూమన్!
మార్తాస్ ఐలండ్ నిసి మర్చిపోనూ లేదు. మళ్ళీ వెళ్ళనూ లేదు. కానీ ఇప్పుడు ఆమెకు నేపుల్స్ తుఫానులు అంత భయంకరంగా ఆందోళనకరంగా లేవు. అవి ఒక మధురత, ఒక తీరిన కాంక్ష తీపిదనంతో ముడిపడి ఉన్నయి.
(నిసి షామల్ డైరీ. 2016.)